Saturday 3 February 2024

జ్ఞానంవల్లనే దుఃఖనాశనం -3 (06-Feb-24, Enlightenment Story)

 జ్ఞానంవల్లనే దుఃఖనాశనం -3

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺

కావున జ్ఞానమే సకల దుఃఖ నివారకం. ఎవరయ్యా జ్ఞాని? అంటే, తన దుఃఖములను తృణీకరించేవాడే అని చెప్పాలి. శ్రీ భగవత్పాదులు సెలవిచ్చినట్టు అట్టి జ్ఞానులు సకృత్తుగా వుంటారు.


''జంతూనాం నరజన్మ దుర్లభమతః
పుంస్త్వం తతో విప్రతా
తస్మాద్వైదిక ధర్మమార్గపరతా
విద్వత్వ మస్మాత్పరం -''


జంతువులందు నరుడు, వారిలో పురుషుడు, అందు విప్రుడు, వారిలో వైదిక ధర్మపరుడు, అందు విద్వాంసుడు దుర్లభులన్నారు.

అట్టి విద్వత్తకు వైదికధర్మమార్గ పర్వతము, ఈశ్వర భక్తీ కారణములవుతవి. ఈ రెంటిలో ఏది లోపించినా రెండవది వ్యర్థమే. ఈ రెంటి సమ్మేళనముచే సకలదుఃఖ నివారకమైన జ్ఞానం కలుగుతుంది. పరమేశ్వరి అట్టిజ్ఞానమును మనకు ప్రసాదించుగాక!         

విషయస్వరూపాన్ని ఏమాత్రం గ్రహించినా కొంత దుఃఖం నివారణ మవుతుంది. కొందరు కష్టాలను బొత్తిగా సహించలేరు. మరికొందరు ఆ కష్టాలనే అంతగా లక్ష్యపెట్టక తిరుగుతూవుంటారు. అట్టివారిని మనం ఓదార్చబోతే కష్టాలకేమిలెండి. ఏవో వస్తవి. పోతవి. అని త్రోసిపుచ్చుతారు. ఆ నిబ్బరమే కష్టకాలమందు వారికి ధైర్యాన్ని, సహనాన్ని ఇస్తూవుంటుంది...

ఆత్మ శరీరంలో వుండి ఏమి చేస్తునట్టు?


శరీరం పుడుతుంది. మనసు కలుగుతుంది. మరి ఆత్మ... ఉంటుంది?... శరీరంలోనే ఎక్కడ ఉంటుంది, ఏమిటి ఉంటుంది అనేది వేరే సంగతి. అయితే ఉండీ, అది అనిపించదు, కనిపించదు, అనేటువంటి పరిస్ధితులున్నప్పుడు, అది ఏం చేస్తున్నట్టు? అదృశ్యరీతిలో ఆ ఆత్మ అనేటువంటిది, అంతరాత్మ రూపంగా వాస్తవాన్ని వినిపిస్తూనే ఉంటుంది. ధ్వని చేస్తూనే ఉంటుంది. నాదం చేస్తూనే ఉంటుంది. అయితే, దానిని గ్రహించే స్థితిలో ఇంద్రియ మనసు లేదు. అందుచేత అది మనకి వినిపించడం కాని, లేక ఇంకొక రకంగా అర్ధం కావడంకాని, సాధ్యం కావడం లేదు.

అందుకే మనసుతో సాధ్యం కానటువంటి విషయాన్ని, అంటే ఆ ఆత్మను గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం 'ఆధ్యాత్మికం'.

మానవ శరీరానికి, మనసుకు సంబంధించి, త్రిదోషాలు  - త్రిగుణాలు కూడ భిన్నమైనవే? వాటి స్వరూప స్వభావ, క్రియా విధాన, ఫలితాలలో కూడ సమానతకు అవకాశం లేదు. కనుక, శరీర మానసిక, ఆరోగ్య  - అనారోగ్య సంబంధం, అలాగే, రోగం - వైద్యం  విషయంలోనూ, భిన్నత వుంటుంది. అందుకే, రోగం - ఔషదం  ఒకటే అయినా, వాటి క్రియా ఫలితం, భిన్నతే! అందుకే, రోగ నిర్ధారణ, వైద్యానికి ముఖ్యమైనది. అలాగే మనసు దాని గుణ విశ్లేషణం, వ్యక్తిత్వం, వ్యక్తిగత భిన్నతను అనుసరించే, వాటికి సంబందించిన  మార్పుకు ప్రయత్నించాలి. అందుకే, అన్ని అందరికీ కాదు, కొన్ని కొందరికే, అనడంలోని వాస్తవం. 

రీరం మనసు  సంబంధంగా, యోగా, యోగాసన - ప్రణాయామ - మెడిటేషన్, వగైరా భౌతిక ఆధ్యాత్మిక, విభజనగ, అవగాహనా విధానంలోనే, సాధనకు ప్రయత్నించాలి అని మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకునే మార్గదర్శ  నియమావాళిని మానవాళికి ప్రసాధించిన మానవ జీవిత లక్ష్య సాధనలో భాగంగా ఉండాలి...

విత్తనం (బీజం) చెట్టుగా విస్తరించి దరిమిలా దాని వారసత్వ నకలుగా గింజను రూపొందించి, దానిలో అత్యంత సూక్ష్మతగా నిక్షిప్తమై పోయినట్లు... అలాగే, అండం పిండమై పెరిగి, జీవిగా బ్రతకడంతోపాటు, తన వారసత్వంగా, తనను తాను అండంలో యిమిడి పోయినట్లు పరమాత్మ/విశ్వాత్మ..., జీవాత్మగా రూపాంతర సూక్ష్మతను చెందినా, అది విశ్వవ్యాప్త పరమాత్మలో పరమాణు సూక్ష్మతకు పరమ సూక్ష్మతే సుమా!ఆదిత్యయోగీ..

జీవిలోని మనసులో, ముఖ్యంగా జీవ పరిణామ ప్రత్యేక జీవి అయిన మానవ మనసులో జీవాత్మ (Self)గా సూక్ష్మాతి సూక్ష్మస్థితిగా నిగూఢ నిక్షిప్తతను కలిగియున్న ఆ పరమాత్మ సూక్ష్మతను... ధ్యానసాధన ద్వారా, మనసును సూక్ష్మీకరించి తద్వారా పరమాత్మ సూక్ష్మతను, వ్యాప్తత స్థితిని, దర్శించవచ్చు. అదే ఆత్మదర్శనం! పదార్ధ గుణ తత్వానికి అతీతంగా భౌతిక ఇంద్రియ ప్రభావిత మనసును, ఆత్మీకరించడం పై యిది ఆధారపడి వుంది. భావాతీత స్థితి యీ ధ్యాన మనో ప్రస్థానంలో ఒక ముఖ్యభాగం,

చెట్టుకి - విత్తనంలా, జీవికి - అండంలా, మనిషిలో ఉన్న పరమాత్మ సూక్ష్మత - జీవాత్మ అని, దానిని ధ్యానమనోప్రస్థాన సాధన ద్వారా సాధించుకుని చేరుకోవచ్చని తెలియచేసి; భౌతిక - ఆధ్యాత్మికతలు, ఆకార - నిరాకారతలుగా, మనిషిలో ఎలా అంతర్భాగంగా ఉన్నాయో తెలిపి; మనిషికి - మనో జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞాన ఎరుకను, మార్గాన్ని తెలియజేసి, *మనిషిని జ్ఞాన శిఖర ఉన్నతికి చేరుకోమని స్ఫూర్తి నందిస్తున్న దివ్య జ్ఞాన దీప్తి; ఏకైక పరిపూర్ణ - స్వయంభువు తత్వమూర్తి గురూ దేవుళ్లు.

మనం కోరుకునేది ఏదీ మనకు మంచి చేయదు.ఏందుకంటే మనకు ఏమి కావాలో మనకు తెలియదు.భంగపడిన ఓక భక్తుడు భగవంతునిపై ఆగ్రహంతో,"నాజీవితమంతా నిన్నే ప్రార్ధించాను.జీవితమంతా నీ సేవలో గడిపాను.మరి నేను ఏం పోందాను"అని కేకలు వేసి అరుస్తాడు.దానికి భగవంతుడు"నేను ఏమి చేసినా అది నీమేలుకోసమే.నీకోసం నువ్వు కోరుతున్నదంతా,నీకు శ్రేయస్కరం కాదు.అందుకనే అది జరుగకుండా వారంచాను".

అనుభూత విషయా సంప్రమోష: స్మృతి: మనికి జ్ఞాపకం వచ్చే విషయమేదైనా దానిని ప్రత్యక్షానుభవము ద్వారా నిర్ధారించుడి. ఆ తర్వాత అది జ్ఞాపకం రావడమే స్మృతి వృత్తి అనబడుతుంది.

అంటే ప్రత్యక్షానుభవం వల్ల గానీ, భ్రమ పడటం క్షేత మిద్యాజ్ఞానం వల్లగానీ, ఉట్టాన్ని వినడం చేత మన మనస్సులో ఏర్పడే భయం యిత్యాది అనుభూతుల ఏకల్పము పబ్బగొన్న అదే విషయాన్ని నిద్రలో కలగనడం ద్వారా గానీ మనం జ్ఞప్తికి తెచ్చుకుంటాం.

అదెలాగంటే- -

మనం ఒక సర్పాన్ని ప్రత్యక్షంగా చూస్తాము. దాని కదలికలు, అందుదేశ వచ్చే శబ్దాన్ని పరిశీలించి దాన్ని మనస్సులో పదిలం చేసుకుంటాం. అ అనుభవం మనకి వుండటం చేత చీకట్లోతాడుని చూసి పాము అని భ్రమపడతాం.
ఇది మిధ్యా జ్ఞాన విపర్యయ వృత్తి అలాగే గాలికి పాదలు కదులుతుంటే ఆ శబ్దాన్ని బట్టి పాము సంచరిస్తోందన్న చిత్త భ్రమతో భయానికి లోనవుతాం ఇది వికల్పవృత్తి.

అలాగే మనం నిద్రపోయినప్పుడు మనకో కలవచ్చి ఆ స్వప్నంలో పాము కనిపిస్తుంది. అందుచేత నిద్రలేచాక మనకి నిద్రలో కూడా 'మనకు కనిపించింది. పాము' అన్ని స్మృతి మనకి వుంటుంది.

అంటే జాగ్రదావస్తలో వుండగా మనం కళ్లతో ప్రత్యక్షంగా చూసినది. చీకట్లో మనకి భ్రమ కలిగించినదే. ఒంటరిగా వున్న మన మనోనిగ్రహాన్ని సడలింపజేసినదే నిద్రావస్తలో కలరూపము పొందుతున్నది. కానీ, వేరుకాదు. నిజంగా ఏ సర్పమూ మన నిద్రావస్థలోకి ప్రవేశించలేదు......*

సంపూర్ణం


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...