Tuesday 31 January 2023

భీష్మ ఏకాదశి (01--Feb-23,Enlightenment Story)

 *భీష్మ ఏకాదశి (01/02/2023)*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతికరమైన మహాపర్వం. ఈరోజున నారాయణార్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని 'భీష్మ ఏకాదశి" అని పిలుస్తారు.

గంగామాత స్త్రీరూపంలో గర్భధారిణియై వసువులను కుమారులుగా కన్నది. అలా వాళ్ళు మనుష్యులై జన్మించారు. జలరూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసేసుకున్నది. అంటే గంగాదేవి జగన్మాత్రు స్వరూపిణి కాబట్టి ఆమె గర్భవాసాన జన్మించిన తరువాత ఎవరికీ పాపం ఉండదు. అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భాన ఎనిమిదవవాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ఆమెను వారించాడు. అందుకని ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్ళిపోయింది. అలా శంతనుడి చేత శాపవిముక్తుడు కాకుండా నివారింపబడిన భీష్ముడు పెరిగి పెద్దవాడయినాడు. ఆయన బోధించిన విజ్ఞాన సంపద, ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాదికాలం నుంచీ వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది. సత్యాన్ని అది ధరించి ఉంటుంది.                                                                                                          

*భీష్మ ప్రతిజ్ఞ*

గంగాదేవి తనను వీడి వెళ్ళినప్పటినుండి శంతన మహారాజు వైరాగ్యంతో ఉన్నాడు. కాని ఒక రోజు యమునాతీరానికి వాహ్యాళికని వెళ్ళి అక్కడ జగన్మోహినినా ఉన్న ఓ అమ్మాయిని చూసి ఆ పిల్లను తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు.తనను పెళ్ళి చేసుకోమని ఆ అమ్మాయిని అడిగాడు. " నా తండ్రి దాశరాజు. బెస్త్ల్లందరికీ నాయకడు. మీరు ఆయనతో మాట్లాడి ఆయన అనుమతి తీసుకోండి. అది మీకూ నాకూ మంచిది " అని బదులు చెప్పిందాపిల్ల.

శంతనుడు వెళ్ళి దాశరాజును కలిశాడు. ఆయన నవ్వుతూ " మా అమ్మాయిని మీ చేతుల్ల్లో పెడతాను కాని నా కూతురి వల్ల మీకు కలగబోయే పిల్లవాడే మీ తరువాత రాజు కావాలి " అన్నాడు.

శంతనుడు ఒప్పుకోలేదు. దేవవ్రతుణ్ణి తోసేసి మరొకరికి పట్టాభిషేకం చేయడం కుదరదన్నాడు.అయితే ఈ పెళ్ళే జరగదన్నాడు దాశరాజు.

దిగులుతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు శంతనుడు. దేవవ్రతుడు తండ్రి మనసులోని విచారాన్ని ఆయన రధసారధి ద్వారా తెలుసుకొని వెంటనే దాశరాజు దగ్గరకు వెళ్ళి " నీ కూతురుకు పుట్టబోయే బిడ్డే రాజవుతాడు. నాకు రాజ్యం అక్కర్లేదు. నా పట్టాభిషేకాన్ని ఇప్పుడే పరిత్యాగం చేస్తున్నాను " అని శపధం చేశాడు. అయినా దాశరాజు భయం పోలేదు. దేవవ్రతుడు కాకపోయినా అతని సంతతివారెవరైనా ముందు ముందు అవరోధాలు కలిగించవచ్చు కదా అని సందేహించాడు. దేవవ్రతుడు అది గ్రహించి తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేశాడు. దీనినే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. అప్పుడాపల్లెరాజు సంతోషించి తన కూతుర్ని శంతనుడికిచ్చి పెళ్ళిచేసాడు.j

ఆ అమ్మాయి పేరు సత్యవతి. శంతనుని వల్ల ఆమెకు చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు పిల్లలు కలిగారు

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Monday 30 January 2023

శ్రీ రామ దూతం శిరసా నమామి (31-Jan-23,,Enlightenment Story)

 🙏🌹 శ్రీ రామ దూతం శిరసా నమామి 🙏🌹

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

*ఆంజనేయస్వామికి మనం పూజ చేసేటప్పుడు ఏదో ఒకటి రెండు రకాల పుష్పాలతో పూజ చేస్తాము కానీ ఆయనకు రకరకాల పూలతో పూజ చేస్తే చాలా ఇష్టం దాని గురించి చిన్న వివరణ

ఆంజనేయుడు సముద్రాన్ని దాట పోతూ మహేంద్ర పర్వతం మీద నిలబడి ఓ అదుము అదిమి. రివ్వున గాలిలోకి ఎగిరాడు ఆ గాలి వేగానికి (వాయుపుత్రుడు కదా) ఎక్కడెక్కడ చెట్లు పూలనే అలా ఆంజనేయుని మీద పుష్ప వర్షం కురిసినట్టు గా కురిపించాయి లంకకు ఎగిరి వెళ్లాలనే ధ్యాసలో తాను తన రూపాన్ని గమనించుకో లేదు కానీ లంక సముద్రపు ఒడ్డున దిగాక తన ఒంటి చూసుకున్నాడు

తెల్లని నల్లని పచ్చని ఎర్రని.,.. ఇలా చిత్రవిచిత్రాలు అయినా రంగురంగుల రేకల శరీరాలు పొడుగు వెడల్పు ఉన్న పూలతో శరీరం అంతా నిండిపోయి తన రోమాల్లోకి పూలన్నీ దిగబడి పూలతో అలంకరించబడిన ఎత్తయిన ఓ పర్వతము లాగా తనకి అనిపించడమే కాదు ఎంతో అందంగా కనిపించాడు

అందుకని ఆంజనేయుని పుష్పాలతో (చిత్రవిచిత్ర వర్ణాల కల) పూజించి శరీరమంతా పూల తో నిండిన రూపాన్ని చూస్తూ అలనాడు లంక కు చేరినఆంజనేయుని రూపముగా భావిస్తూ ఈ ఆంజనేయునిలో ఆ ఆంజనేయునిచూస్తే అది ఆయన ఇష్టం

ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది పుష్పాలన్నీ భూమినుంచి పుట్టిన ఆయా జాతి చెట్ల నుంచి వచ్చినవే కాబట్టి ఆ అన్నిటిలోనూ ఆంజనేయుడు భూమి పుత్రిక అయిన సీతమ్మని చూసుకుంటడుట

ఇక చెట్టు నుంచి పుష్పం వస్తుంది కదా ఒకప్పటి మొగ్గ అయిన ఈ పుష్పం ఇలా పుష్పంగా మారటానికి సూర్యుని కిరణం సహాయ పడింది కాబట్టి ఆ సూర్య కిరణాల్ని రాముని వంశం వారి సహాయం గా భావించి ఆ పుష్పము లో తన రాముని స్మరిస్తాడుట హనుమ

ఇలా తన ఒంటి నిండుగా ఉన్న పుష్పాల్లో సీతారాములాయనకి దర్శనమిస్తే ఆ పూలతో ఉన్న ఆంజనేయునిలో మనం సీతారాముని దర్శనం చేసుకుందాం*🙏🙏

🌹సర్వేజనాః సుఖినోభవంతు 🌹

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

🚩ఆదిశంకరులు – తన శిష్యులకు నేర్పిన గుణపాఠం (30-Jan-23,Enlightenment Story)

 🚩ఆదిశంకరులు – తన శిష్యులకు నేర్పిన గుణపాఠం.

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

♦️ఒకసారి, ఆదిశంకరులు వడి వడిగా నడుస్తూ ఉంటే, ఆయనను వెంబడిస్తూ శిష్యగణం పరుగు పరుగున నడుస్తూ, వారు ఒక గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి వెలుపలి శివార్లలో, ఆయన కొంతమంది మద్యపానం చేయడం చూశాడు. అది ఇంట్లో తయారు చేసిన సారాయి లేదా కల్లు లాంటి మద్యం. భారతదేశంలో ఆ రోజుల్లో …. ఓ పాతిక-ముప్పై ఏళ్ల క్రితం వరకు కూడా, మద్యం దుకాణాలు ఎప్పుడూ గ్రామానికి వెలుపలనే ఉండేవి. వాటిని ఎప్పుడూ గ్రామ శివారు దాటి లోపలికి తెచ్చేవారు కాదు. ఈరోజుల్లో, గ్రామంలోనే మద్యం అమ్ముతున్నారు, మీ ఇంటి పక్కనో, మీ పిల్లాడు చదివే స్కూల్ పక్కనో ఉంటున్నాయి. ఆ రోజుల్లో, ఎప్పుడూ ఊరికి బయటే ఉండేవి.

♦️ఆది శంకరులు వారిలో కొందరు మత్తులో తూలుతుండడం చూశాడు. మీకు తెలుసా, తాగుబోతులు ఎల్లప్పుడూ వాళ్ళు తమ జీవితంలోనే ఉత్తమ దశలో ఉన్నామని, మిగతావాళ్ళందరూ దానిని కోల్పోతున్నారని అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఆయన్ని చూసి కొన్ని విమర్శలు చేశారు. మారుమాట్లాడకుండా, ఆదిశంకరులు దుకాణంలోకి వెళ్లి, ఒక ముంత తీసుకుని, అందులోని కల్లు తాగేసి నడుచుకుంటూ వెళ్ళాడు.

♦️ఆయన వెనుక ఆయన శిష్యులు పరుగు పరుగున నడుస్తూ తమలో తాము “మన గురువు మద్యం తాగినపుడు, మనం మాత్రం ఎందుకు తాగకూడదు?” అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఆదిశంకరులకు ఏం జరుగుతోందో అర్థమైంది. తరువాతి గ్రామానికి చేరుకున్నప్పుడు, అక్కడ ఒక కమ్మరి పనిచేస్తున్నాడు. శంకరులు లోపలికి వెళ్లి, ఇనుము కరిగించిన ద్రవం ఉన్నఒక కుండను తీసుకుని తాగి, నడుచుకుంటూ వెళ్ళాడు. ఇక ఇప్పుడు మీరు ఆయన్ని అనుకరిద్దాం అనుకోరు కదూ...!

భజ గోవిందం (మోహ ముద్గరం)

భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే ।
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృంకరణే ॥ 1 ॥

మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్ ।
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తమ్ ॥ 2 ॥

నారీస్తనభర-నాభీదేశం
దృష్ట్వా మా గా మోహావేశమ్ ।
ఏతన్మాంసవసాదివికారం
మనసి విచింతయ వారం వారమ్ ॥ 3 ॥

నలినీదల-గతజలమతితరలం
తద్వజ్జీవితమతిశయ-చపలమ్ ।
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తమ్ ॥ 4 ॥

యావద్విత్తోపార్జనసక్తః
తావన్నిజపరివారో రక్తః ।
పశ్చాజ్జీవతి జర్జరదేహే
వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే ॥ 5 ॥

యావత్పవనో నివసతి దేహే
తావత్పృచ్ఛతి కుశలం గేహే ।
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే ॥ 6 ॥

బాలస్తావత్క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీసక్తః ।
వృద్ధస్తావచ్చింతాసక్తః
పరమే బ్రహ్మణి కోఽపి న సక్తః ॥ 7 ॥

కా తే కాంతా కస్తే పుత్రః
సంసారోఽయమతీవ విచిత్రః ।
కస్య త్వం కః కుత ఆయాతః
తత్త్వం చింతయ తదిహ భ్రాతః ॥ 8 ॥

సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ ।
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ॥ 9 ॥

వయసి గతే కః కామవికారః
శుష్కే నీరే కః కాసారః ।
క్షీణే విత్తే కః పరివారః
జ్ఞాతే తత్త్వే కః సంసారః ॥ 10 ॥

మా కురు ధన-జన-యౌవన-గర్వం
హరతి నిమేషాత్కాలః సర్వమ్ ।
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ॥ 11 ॥

దినయామిన్యౌ సాయం ప్రాతః
శిశిరవసంతౌ పునరాయాతః ।
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః
తదపి న ముంచత్యాశావాయుః ॥ 12 ॥

కా తే కాంతా ధనగతచింతా
వాతుల కిం తవ నాస్తి నియంతా ।
త్రిజగతి సజ్జనసంగతిరేకా
భవతి భవార్ణవతరణే నౌకా ॥ 13 ॥

ద్వాదశ-మంజరికాభిరశేషః
కథితో వైయాకరణస్యైషః ।
ఉపదేశోఽభూద్విద్యా-నిపుణైః
శ్రీమచ్ఛంకర-భగవచ్ఛరణైః ॥ 14 ॥

జటిలో ముండీ లుంఛితకేశః
కాషాయాంబర-బహుకృతవేషః ।
పశ్యన్నపి చ న పశ్యతి మూఢః
ఉదరనిమిత్తం బహుకృతవేషః ॥ 15 ॥

అంగం గలితం పలితం ముండం
దశనవిహీనం జాతం తుండమ్ ।
వృద్ధో యాతి గృహీత్వా దండం
తదపి న ముంచత్యాశాపిండమ్ ॥ 16 ॥

అగ్రే వహ్నిః పృష్ఠే భానుః
రాత్రౌ చుబుక-సమర్పిత-జానుః ।
కరతల-భిక్షస్తరుతలవాసః
తదపి న ముంచత్యాశాపాశః ॥ 17 ॥

కురుతే గంగాసాగరగమనం
వ్రత-పరిపాలనమథవా దానమ్ ।
జ్ఞానవిహీనః సర్వమతేన
భజతి న ముక్తిం జన్మశతేన ॥ 18 ॥

సురమందిర-తరు-మూల-నివాసః
శయ్యా భూతలమజినం వాసః ।
సర్వ-పరిగ్రహ-భోగత్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః ॥ 19 ॥

యోగరతో వా భోగరతో వా
సంగరతో వా సంగవిహీనః ।
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ ॥ 20 ॥

భగవద్గీతా కించిదధీతా
గంగాజల-లవకణికా పీతా ।
సకృదపి యేన మురారిసమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా ॥ 21 ॥

పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీజఠరే శయనమ్ ।
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాఽపారే పాహి మురారే ॥ 22 ॥

రథ్యాచర్పట-విరచిత-కంథః
పుణ్యాపుణ్య-వివర్జిత-పంథః ।
యోగీ యోగనియోజిత-చిత్తః
రమతే బాలోన్మత్తవదేవ ॥ 23 ॥

కస్త్వం కోఽహం కుత ఆయాతః
కా మే జననీ కో మే తాతః ।
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్నవిచారమ్ ॥ 24 ॥

త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః ।
భవ సమచిత్తః సర్వత్ర త్వం
వాంఛస్యచిరాద్యది విష్ణుత్వమ్ ॥ 25 ॥

శత్రౌ మిత్రే పుత్రే బంధౌ
మా కురు యత్నం విగ్రహసంధౌ ।
సర్వస్మిన్నపి పశ్యాత్మానం
సర్వత్రోత్సృజ భేదాజ్ఞానమ్ ॥ 26 ॥

కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వాఽఽత్మానం పశ్యతి సోఽహమ్ ।
ఆత్మజ్ఞానవిహీనా మూఢాః
తే పచ్యంతే నరకనిగూఢాః ॥ 27 ॥

గేయం గీతా-నామసహస్రం
ధ్యేయం శ్రీపతి-రూపమజస్రమ్ ।
నేయం సజ్జన-సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తమ్ ॥ 28 ॥

సుఖతః క్రియతే కామాభోగః
పశ్చాదంత శరీరే రోగః ।
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణమ్ ॥ 29 ॥

అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశః సత్యమ్ ।
పుత్రాదపి ధనభాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః ॥ 30 ॥

ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేకవిచారమ్ ।
జాప్యసమేతసమాధివిధానం
కుర్వవధానం మహదవధానమ్ ॥ 31 ॥

గురుచరణాంబుజ-నిర్భరభక్తః
సంసారాదచిరాద్భవ ముక్తః ।
సేంద్రియమానస-నియమాదేవం
ద్రక్ష్యసి నిజహృదయస్థం దేవమ్ ॥ 32 ॥

మూఢః కశ్చన వైయాకరణో
డుఃకృంకరణాధ్యయనధురీణః ।
శ్రీమచ్ఛంకర-భగవచ్ఛిష్యైః
బోధిత ఆసీచ్ఛోధిత-కరణః ॥ 33 ॥

భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే ।
నామస్మరణాదన్యముపాయం
నహి పశ్యామో భవతరణే ॥ 34 ॥

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Friday 27 January 2023

శనివారం రథ సప్తమి సందర్భంగా (28-Jan-23,Enlightenment Story)

 🌞 *శనివారం రథ సప్తమి సందర్భంగా, 28-Jan-23*🌞

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

!!మాఘ మాసే శుక్ల పక్షే సప్తమ న్యాద్ర దస్యతు!!తత్ర స్కానాంచ దానాంచ తత్పర్యం చాక్టయ మబ్రవీత్!!

మాఘమాసం శుక్ల పక్ష సప్తమినే రథ సప్తమి అంటారు. సూర్యభగవానుడు రథాన్ని అధిరోహించి భూమికి దగ్గరగా వస్తాడు. అంతకు ముందు కొద్ది రోజుల నుండే, అంటే మకర సంక్రమణం నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ మవుతుంది.

ఉత్తరాయణం ప్రవేశించగానే మొట్ట మొదట వచ్చే శుద్ధ సప్తమే రథసప్తమి. సూర్యుడు ఉత్తరదిశగా ప్రయాణిస్తాడు. ఈ రథసప్తమినుండే ఆయన శక్తి సంపూర్ణంగా భూమిపై విస్తరించి ఉంటుంది. సూర్యుడు జన్మించిన రోజును రథ సప్తమిగా ఆచరిస్తున్నారు. ఆయన ప్రత్యక్ష నారాయణుడు రథం మీదే లోక సంచారం చేస్తూ భూమిపై ప్రజలందరకీ ఆరోగ్య ప్రదాతగా, ఐశ్వర్య ప్రదాతగా గోచరిస్తున్నాడు.

నమో రుద్ర రూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే యద్యజ్జన్మకృతం పాపం మయా జన్మను సప్తమ తన్మే రోగం, శోకం, మాకరీ హంతు సప్తమీ ఏత జ్జన్మ కృతం పాపం, యజ్జన్మాంత రార్జితమ్ మనో వాక్కాయజం, యచ్చజ్ఞాతా జ్ఞాతేచ యే పునః ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్త కే సప్త వ్యాధ సమాయుక్తం, హరమాకరీ సప్తమీ

రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు శిరస్సుపై ఏడు జిల్లేడు. ఆకులను, రేగి పళ్ళను పెట్టుకొని ఈ శ్లోకం చదవాలి. అలా చేయడం వల్ల సకల పాపాలు పోయి, ఆరోగ్యంసిద్దింస్తుంది. రథానికి ఉన్న ఏడు గుర్రాలు ఏడు రోజులకు సంకేతంగా చెపుతున్నారు. యోగ శాస్త్ర ప్రకారం మనశరీరమే రథం. అశ్వాలు ఇంద్రియాలు. బుద్ధి రథసారథి. మనస్సు పగ్గాలు. మాఘమాసంలో ప్రతీ ఆదివారం మన ఇళ్ళల్లో సూర్య కిరణాలు పడేటట్లుగా, బియ్యంతో పరమాన్నం వండి ఆర్పిస్తారు. మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. ఎంతో మహిమాన్వితమైన ప్రసాదం ఆయువు వృద్ధి, సకల సౌభాగ్యాన్ని సమకూరుస్తుందని పురాణాలు విశదీకరిస్తున్నాయి.

సూర్యుడు త్రిశక్తి స్వరూపుడు. శ్రీఆదిత్య స్తోత్రంలో  

బ్రహ్మ స్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరః

సంధ్యా కాలే స్వయం విష్ణుః స్త్రయీమూర్తి దివాకరః

అని మూడు సమయాలలో తన తేజస్సుతో ప్రత్యక్షమవుతున్నాడు. ప్రత్యేకంగా రథ సప్తమి రోజున కూడా ఆదివారంలో లాగానే పరమాన్నం తయారుచేసి, చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి, ఆ సూర్య భగవానుని ఊరేగిస్తారు. సూర్య స్తుతి చేస్తారు. ఇంత ప్రాధాన్యత రథసప్తమికి ఉంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాతే కాదు. ఏది కోరితే అది ఇవ్వగల సమర్థుడు. పంచ పాండవులు అరణ్య వాసానికి వెళుతున్నప్పుడు పురజనులు, హితులు, మహర్షులు వెంట వస్తున్నప్పుడు, వారికి అతిథి మర్యాదలు, ఆహారం సమకూర్చడానికి మానసికంగా ఆలోచిస్తుంటే, వాళ్ళ పురోహితుడు, బోధించిన సూర్య అష్టోత్తర శతనామావళి చెప్పగానే ధర్మరాజు సూర్యుని ప్రార్థించగా "అక్షయపాత్ర" ఇచ్చిన సంగతి మనకు తెలుసు. సత్రాజిత్తు సూర్యోపాసన చేస్తే శమంతకమణిని ప్రసాదించినట్లుగా, వినాయక చవితి కథలో మనం చదువుకుంటాం. కర్ణుడుకి సహజ కవచ కుండలాలను ప్రసాదించాడు. శ్రీరాముడికి అగస్త్య మహర్షి సూర్యుని స్తుతి "ఆదిత్య హృదయం" బోధించడం వల్ల, శ్రీరాముడు శక్తిమంతుడై, రావణాసురుని యుద్ధంలో ఓడించాడు. ఆదిత్య హృదయం చాలా శక్తివంతమైనది. ఆరోగ్యాన్ని సమకూర్చేది. ఒక సారి ఆంధ్రప్రదేశ్ నుండి శృంగేరి పీఠాధిపతి దర్శనానికి వెళ్ళిన భక్తుడు, స్వామి ని దర్శించి, "తనకు చాలా రోజులనుండి అనారోగ్యంగా ఉంటోంది. వైద్యం చేయిస్తున్నా, కుదుట పడుటలేదు. తమరు ఏదైనా మంత్రోపాసన కాని, దీక్ష కాని చెపుతారని" అనగానే పీఠాధిపతి శ్రీశ్రీభారతీ తీర్థ మహా స్వామిజీ భక్తునితో “నిర్మల భక్తితో ప్రతీరోజూ ఆదిత్య హృదయం పదకొండు సార్లు, మండలం ( 40 రోజులు) పారాయణ చేయమని చెప్పారు. సంవరానికి ఆభక్తుడు సంతోషంగా స్వామిని దర్శించి, తనకు పూర్తి స్వస్థత చేకూరినట్లు తెలిపాడు.

ఒకసారి నారద మహర్షి యాదవులను సందర్శించిన సందర్భంలో, వారంతా లేచి, మహర్షిని గౌరవించారు. అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు, జాంబవతిలపుత్రుడు సాంబుడు, మహర్షిని గౌరవించలేదు. దాంతో నారదుల వారికి కోపం వచ్చి "నువ్వు కుష్టు రోగంతో బాధపడతావు" అని శపించాడు. కొద్ది కాలానికి, సాంబుడు కుష్ఠురోగంతో బాధపడలేక, తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు మధ్య భారత దేశంలోని చంద్రభాగ నదీ ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని సూర్యోపాసన నిష్ఠగా భక్తితో చేయగా రోగం మాయమైంది. ఆయన ద్వారా నే మనకు ద్వాదశాదిత్యుల స్థుతి, సూర్య నమస్కారాలు వంటివి ఎన్నో లభించాయి. ఆంజనేయునికి వేదవిద్యను బోధించాడు. గాయత్రీ మంత్రానికి అధి దేవత సూర్యుడే. అందుకే సంధ్యా వందనం చేస్తారు. సూర్యభగవానుడి కిరణాలు వల్ల చర్మరోగాలు నయమవుతాయి. కంటి జబ్బులు, గుండె జబ్బులకు సూర్యోపాసన పరిష్కారం చేస్తుంది.

మధ్య భారత దేశంలో భద్రేశ్వరుడు అనే రాజు అందగాడు. రాజ్యపాలన సమర్థవంతంగా చేస్తున్నాడు. ధర్మాత్ముడు. అయినా ఆయనకు శ్వేత కుష్టు రోగం (బొల్లి ) శరీరం అంతా వ్యాపించింది. మనోవ్యధతో రాజ్యాన్ని కుమారులకు అప్పగించి, తన పురోహితుల సూచన మేరకు కాశీ క్షేత్రం వెళ్ళి, సూర్యోపాసన గురువుల ద్వారా ఉపదేశం పొంది, బీజాక్షర మంత్ర సహితంగా సూర్యుడిని ఆరాధించాడు. సూర్యుడు ప్రత్యక్షమై సంపూర్ణ ఆరోగ్యంతోబాటు తదనంతరం సూర్య లోకానికి వస్తావని వరమిచ్చి అంతర్థానమయ్యాడు. భగవద్గీత లో శ్రీ కృష్ణ పరమాత్మ 

ఆదిత్యానా మహం విష్ణుః జ్యోతిషాం రవి రంశుమాన్

మరీచి రతామస్మి నక్షత్రాణాం మహం శశీ

ద్వాదశాదిత్యులలో విష్ణువు అనే ఆదిత్యుడను నేనే అనిచెప్పాడు. భాగవతం 12వ స్కంధంలో ద్వాదశాదిత్యుల గురించి వివరణ ఉంది. ఒక్కోనెలలో ఒక్కో పేరుతో సూర్యుడిని ఆరాధిస్తారు.

ఆ పన్నెండు నెలలలో ఉండే వారే ద్వాదశాదిత్యులు. 

1. ధాత (చైత్రం) 2. ఆర్యముడు ( వైశాఖం ) 3. మిత్రుడు (జ్యేష్ఠ) 4. వరుణుడు. (ఆషాఢం) 5. ఇంద్రుడు (శ్రావణం) 6. వివస్వంతుడు (భాధ్రపదం) 7. త్వష్ట (ఆశ్వీయుజం) 8. విష్ణువు (కార్తీకం) 9. అంశుమంతుడు (మార్గశిరం ) 10. భగుడు (పుష్యమాసం) 11. పూషుడు (మాఘమాసం) 12. క్రతువు ( పాల్గుణం) ఇలా భవిష్యత్ పూరాణం, పద్మపురాణం, సాంబుడు ఉప పురాణం చదివితే సూర్యోపాసన గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి.

సప్తాశ్వరథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్

శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


🌞 శ్రీ సూర్య నారాయణ దండకం 🌞

శ్రీసూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ  || 2 సార్లు

ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా

నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా 

మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా ||

పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా

మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య

దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార

గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి

ఏకాకినై చిక్కి ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి ||

జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు

వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు

సారథ్యమన్ గొంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగ

మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి

కర్మానుసారాగ్ర దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ మించి

నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో ||

దృష్టి వేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబభారంబుగానీక

శూరోత్తమా యొప్పులందప్పులున్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీకీర్తి కీర్తింప

నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మ

భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు

ఆ శేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు గానంగ నేనెంత

నెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్ మహా కష్టుడన్ నిష్టయున్లేదు

నీపాద పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ జేయవే కామితార్ధప్రదా ||

శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్

స్వరూపంబు నీ దండకంబిమ్మహిన్ రాయ కీర్తించి

విన్నన్ మహాజన్మజన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్

కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్ మహా దేవ దేవా

నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః ||

Thursday 26 January 2023

అనాయాసేన మరణం (27-Jan-23,Enlightenment Story)

🌷*అనాయాసేన మరణం*🌷

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారంలో కానీ కాసేపు కూర్చుని చిన్న ప్రార్ధనచేసేవారిలా:~

!! అనాయాసేన మరణం  !! వినా దైన్యేన జీవనం !!

!!దేహాంతే తవ సాన్నిధ్యం !!దేహిమే పరమేశ్వరం!!

మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.

 *అనాయాసేన మరణం*

నాకు నొప్పీ, బాధా లేని మరణాన్ని ప్రసాదించు.

 *వినా ధైన్యేన జీవనం*

నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.

*దేహాంతే తవ సాన్నిధ్యం*

మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.

*దేహిమే పరమేశ్వరం*

 ఓ ప్రభూ నాకు ఈ మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.

అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.*ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ ....నా బిడ్డలకు కానీ ...సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.*

నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు. ఇలా మనం ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాదిస్తాడని మరువకండి.

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀















































































































































Wednesday 25 January 2023

గణతంత్ర దినోత్సవంగా (26-Jan-23,Enlightenment Story)

 *August 15 నాడు జెండా ఎగరవేయడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..?*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రాగా.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం.

 అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. ఆ తేడా ఏమిటో  తెలుసుకుందాము👇

👉ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం  వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. 

👉గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు.  జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు. ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు.

 ( గమనిక:  ఇక్కడ  జనవరి 26 నాడు జెండాను already కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి ).

దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది.

స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు.అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. 

అయితే ఇక్కడ గమనించాల్సిన  వ్యత్యాసం ఏమిటంటే..

👉 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting).                             👉గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను  ఆవిష్కరిస్తారు(Flag Unfurling) .

ఇంకొక వ్యత్యాసం  ఏమిటంటే .. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. 

👉స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది.

👉 గణతంత్ర దినోత్సవం జనవరి 26  నాడు రాజ్‌పథ్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.

ఈ విషయం ఇప్పటికీ చాలా మంది ఈ దేశ పౌరులకు తెలియదు.(చదువుకున్న వాళ్లకు కూడా చాలా వరకుతెలియదు).

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

వసంత పంచమి/శ్రీ పంచమి (26-Jan-23,Enlightenment Story)

  *వసంత పంచమి, శ్రీ పంచమి*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

వసంత పంచమి పర్వదినం మాఘ శుద్ధ పంచమి రోజున వస్తుంది. శ్రీ పంచమి అని కూడా దీన్ని అంటారు. ఈ పర్వదినాన్ని ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున లక్ష్మీదేవిని పూజచేస్తే సర్వ శుభాలు కలుగుతుంది. రతీ మన్మథులను పూజించి మహోత్సవం నిర్వహించాలని, దానం చేయాలని, దీని వల్ల వసంతుడు సంతోషిస్తాడని నిర్ణయాత్మకారుడు తెలిపాడు. అందువల్ల దీనిని *వసంతోత్సవం* అని కూడా అంటారు. ‘మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఆ రోజున విష్ణువును పూజించాలి.

 వసంత ఋతువు రాకను భారతదేశమంతటా వసంతపంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ మాఘ శుక్ల పంచమినాడు వస్తుంది. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువులతల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం.

సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్‌ !! కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్‌

వహ్ని శుధ్ధాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్‌!! రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్‌

జ్ఞానశక్తికి అధిష్టాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలం తదితరాలను శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు. సత్వ రజస్తమో గుణాలను బట్టి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. అహింసాదేవి. ఆమెకు యుద్ధంచేసే ఆయుధాలు ఏమీ ఉండవు.

బ్రహ్మ వ్కెవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాల్కె ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, మదన పంచమిగా, వసంత పంచమిగా, సరస్వతీ జయంతిగా జరుపుకొంటారు. వసంత పంచమి నామాన్ని బట్టి దీన్ని ఋతు సంబంధమైన పర్వదినంగా భావించాలి.

మకర సంక్రమణం తరవాత, క్రమక్రమంగా వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. మాఘమాసం వసంత ఋతువుకు స్వాగత గీతం ఆలపిస్తుంది. ఆ వసంత ఋతువు శోభకు ‘వసంత పంచమి’ వేడుక శ్రీకారం చుడుతుంది. సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చ్కెతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది.

ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడ్కెన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని.ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడ్కెన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని.

కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే, ఈ రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకం. శ్రీ అంటే సంపద. జ్ఞాన సంపత్ప్రద అయిన సరస్వతిని ఈ రోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు. అందుకే ఈ పర్వదినానికి శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ పంచమినే రతి కామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు.

ఋతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగదేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమినాడు పూజించడం వల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరఢవిల్లుతాయని లోకోక్తి. ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం- వసంత పంచమి పర్వదినం.

చదువులతల్లి సరస్వతి పుట్టిన రోజైన వసంత పంచమి వేడుకలను ఆదిలాబాద్‌ జిల్లాలోని బాసరలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో ప్రతి ఏటా జరుపుతారు. వేకువజాము నుండే మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, హారతి ఉంటాయి. రోజంతా చండీవాహనం, వేదపారాయణం, అమ్మవారికి మహాపూజ జరుగుతుంది. సాయంత్రం పల్లకీలో అమ్మవారిని ఊరేగిస్తారు. వసంత పంచమి రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి శ్రేష్టమైన దినంగా భక్తులు భావిస్తారు. మన రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు.🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Tuesday 24 January 2023

భద్రాద్రి రామదాసు జయంతి (25-Jan-23,Enlightenment Story)

 *భద్రాద్రి రామదాసు జయంతి*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

వాల్మీకి శోకమే నాడు రామాయణ కావ్యానికి కారణమైంది. ప్రభుత్వం సొమ్ముతో గుడి కట్టించినందుకు జైలు జీవితం గడిపిన రామదాసు శోకం నుంచి బయటకు వచ్చిన కీర్తన భద్రాచల సీతారామలక్ష్మణులు తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా ఉండేందుకు తోడ్పడ్డాయి. నిరుపమాన భక్తులు లౌకిక వాసనలతో ఉన్న ఈ ప్రపంచం దృష్టిలో పిచ్చివారిగా కనిపిస్తారు. కోపంతో ఉగిపోతారు. నింది స్తారు, అద్భుతంగా స్తోత్రం చేస్తారు. చిత్రాతిచిత్రంగా ఉంటారువారు. అలాంటివారిలో ఒకడు కంచర్ల గోపన్న, భగవంతుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ, పలవరిస్తూ పాడిన ప్రతి తెలుగు పలుకు ఒక అమృత గుళిక.

శ్రీరాముడు హిందువులందరికీ ఆరాధ్యదైవం. అందులో సందేహం లేదు. అయితే సీతారామలక్ష్మణులను తెలుగు ముంగిళ్లలోకి తీసుకొచ్చి మరింత దగ్గర చేసిన ఘనత రామదాసుగా ప్రసిద్ధులైన కంచర్ల గోపన్నదే.

రామనామ మహిమ వల్ల మరి జన్మం డదు అని నమ్మినవాడు గోపన్న. 'శ్రీరామ నీ నామమేమిరుచిరా! ఓరామ నీనామమెంత రుచిరా! అని ప్రేమరూపమైన భక్తి ముక్తి రూప మైన బ్రహ్మానందంగా భావించి తాదాత్మ్యం చెందాడు. తాను శ్రీరామచంద్రుని కాలంలో పుట్టకపోతినే అని బాధపడ్డాడు. అప్పుడే నేను ఉంటే రామునికి జానకికి వివాహంలో శేషబి య్యం తెచ్చి ఉండేవాడిని. వారికి అడపకాడుగా ఆకులు మడచి తాంబూలాలిచ్చేవాడిని. కైకేయిని అడ్డుకునేవాడిని. అమ్మనెత్తుకుపోతే ఆమె జాడ తెలిపి అయ్య దుఃఖం మాన్పేవాడిని కదా అని పలవరిస్తూ పరితపించాడు. గోపన్న భక్తి, జ్ఞానా , కాల, స్థితి భేదం లేనివి. తన భక్తిని లు అవస్థా! సాధారణీకరించారు రామదాసులవారు.

చెరసాలలో ఉన్నా నాకేం తక్కువ అంటూ 'చక్రధారియే చెంతను ఉండగా' అంటూ ధైర్యం ప్రకటించాడు. మోక్షమివ్వకుండా ఎన్నాళ్లు నన్ను పట్టించుకోకుండా ఉంటాడా అని అసహ నం ప్రదర్శించాడు. అంతేకాదు 'పలుకే బంగా రమైందే ఎంత వేడినగాని సుంతైనా దయరాదు. పంతము చేయనేనెంతవాడను తండ్రీ!' అని విన్నవిస్తాడు. నేచేసిన నేరములేమి నీకు గుడి కట్టించటమే నేను చేసిన తప్పా సరేగాని నా తప్పులన్నీ క్షమించు ఓ జగన్నాథా నన్ను రక్షించు అన్నాడు. కడుపున పుట్టిన కొడుకు ఏవో దుడుకు పనులు చేసాడని తండ్రి కోప్పడతా. డంతేగా ‘కొడుకా రమ్మని చేకొను గాని నూతిలో పడవేయునా ఎంత పాపాత్మ కుండైన ' అంటాడు. 

ఇంతకీ ఎక్కడికెళ్లాడో ఆ భద్రాద్రి వాసుడు. ఎక్కడ ఉన్నాడో నా పాలిదేవుడు అసలు జాడేమి తెలియడంలేదు. 'నాడు గజేంద్రుని కీడు బాపినవాడు' ఆ భద్రాద్రి యందు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనపడడు, ఉన్నాడోలేదో భద్రాద్రియందు. ఎలా భరించనయ్యా ఈ బాధలెలా తట్టుకునేది ఒక్కసారి కనపడ వయ్యా ఎందుకు నన్ను మోసం చేస్తావు వంచన చేయక నన్ను రక్షింపవే వారిజదళ లోచన స్వామి' అన్నాడు. నేనంత ద్రోహినా 'నీకు శర చాపశక్తులు దప్పెనా, నీ ధైర్యము జలధిలో జొచ్చెనా చక్రం. పట్టిందెందుకు దాస జనుల రక్షించడానికే కదా. 'ఎందుకు నాపై దయ చూపవు అన్నాడు. మరో చోట ఈ భవసాగరాన్ని ఈదలేకపోతున్నాను ఏతీరుగ నను దయ జూచెదవో' అని రాముని పరిపరి విధాల వేడుకుని విసిగి వేసారి పోయా డా రామ భక్తుడు. మరో సందర్భంలో ఇదిగో నిన్ను పూజించిన ఈ చేతుల్ని కట్టేసి కొట్టారు. ఎంతసేపని ఓర్చుకు నేది. ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నా వంటే నేనెవరివాడను నువ్వే చెప్పు. నీ వాడినా కాదా? నిన్న రాత్రి చిటికెన వేలికి తేలు కుట్టింది 'పాహిమాం శ్రీరామా' అంటే అసలు ఉలకూ పలుకూ లేదు. అని ఉక్రోషంతో అంటాడు. 'నిందలనెడబాప వయ్యా' అంటూ నా అప్పులు నీవు కడితే అప్పులోళ్లు నీ వెంట పడతారని దాక్కున్నావా దొరా! అంటూ మనం మన సన్ని హితునితో అబ్బ ఈ దెబ్బలను తాళలేనురా తండ్రీ అంటూ తాను సీతారామలక్ష్మణులకు చేయించిన ఆభరణాల చిట్టా కూడా చదివాడు 'నీ గుడికి ప్రాకారం కట్టిచ్చా, సీతమ్మకు చింతాకు పతకం, నీకు కలికితురాయి, లక్ష్మణునికి బంగారు మొలత్రాడు అని లెక్క చెప్పాడు. ఇవన్నీ ఎవరిచ్చారు నీ అబ్బ ఇచ్చాడా, లేక నీకు పిల్లనిచ్చిన మామిచ్చాడా! నేనే కదా ఇచ్చింది? అని గద్దించాడు. మరు నిముషంలో 'అబ్బా. అని తిట్టానని కోపమా స్వామి ఈ దెబ్బలకోర్వ లేక అబ్బ తిట్టితినయ్యా ఏమనుకోకు' అంటాడు. ఒక సందర్భంలో 'నీతో మోహమాటమేమిటి? అడుగుదాటి కదలనియ్యను అంటాడు. నాకభయమియ్యక ఎలా వెళతావో చూస్తాను అంటాడు. అయితే చివరి కంటాడు 'నీచేతేమి కాదుగా సీత భామకైనా చెప్పరాదుగా అమ్మకే. చెబుతాను అంటాడు. అమ్మవారిని వేడాడు. ఆమె హృదయం నవనీతం కదా. అయ్యగారి వద్ద పని కాకపోతే అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించడంలోకరీతి. 'నాదు మనవి గైకొని జగజ్జనకునితో తెల్పవే ఓ జననీ' అని వేడుకున్నాడు. అమ్మా! రామచం ద్రుల వారు, మీ ఆయన గారు నా గురించి అసలు పట్టించుకోవటం లేదు నువ్వెనా చెప్పవమ్మా అంటూ 'నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, వారు నీ పక్కన కూచుని 'ఏకాంతమయున ఏక శయ్యపై నుండు వేళ్ళ నెలతరో నాబాధలు ఆయన తలకెక్కేలా చెప్పు తల్లి” అంటాడు. మా అమ్మవని కదా. నిన్నడుగుతున్నాను అంటాడు. నిజంగా రామదాసు వేసిన ఎత్తు ఫలించినట్టయింది. సీతమ్మ రాముల వారికి రామదాసు గురించి చెప్పే ఉంటుంది. సాక్షాత్తు రామలక్ష్మణులే బంట్లుగా వచ్చి పైకం చెల్లించి తానీషాకు చెల్లించి రామదాసును చెర నుంచి విడిపించారు.

సీతారాములను తన పదాలతో ప్రతి తెలుగింటా ప్రతిష్ఠ చేశాడు గోపన్న. రామచం ద్రునితో మొర పెట్టుకున్నా,మాట్లాడినా, పోట్లా డినా, రామదాసు ప్రజల బాషనే వాడాడు. ఆయనది ప్రజా సంగీతం. పండితపామరు లను రంజింపజేసే ఆయన భక్తి బావనలు తెలుగు ప్రజలు ఊరూరా అమృతగానంతో నేటికీ స్మరించుకుంటున్నారు.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


Monday 23 January 2023

అంతా రామమయం !. మన బతుకంతా రామమయం !! (24-Jan-23,Enlightenment Story)

 ఒకసారి శ్రద్దగా చదవండి... చదివిన తరువాత ఆనందంతో ఆశ్చర్యపోతారు

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

అంతా రామమయం !. మన బతుకంతా రామమయం !!ఒక దేశానికి, జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి. మనకు అలాంటిదే - రామాయణం.ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ - రాముడు మనవెంట నడిచిన దేవుడు !

మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన - ఆదర్శ పురుషుడు.మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన - అద్దం రాముడు.ధర్మం పోత పోస్తే - రాముడు !ఆదర్శాలు రూపుకడితే - రాముడు !అందం పోగుపోస్తే - రాముడు !ఆనందం నడిస్తే - రాముడు !వేదోపనిషత్తులకు అర్థం - రాముడు !మంత్రమూర్తి - రాముడు !పరబ్రహ్మం - రాముడు !లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు - రాముడు !

ఎప్పటి త్రేతాయుగ రాముడు ? ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ? అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా - రాముడే.చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట - శ్రీరామరక్ష సర్వజగద్రక్ష !బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట - రామాలాలి - మేఘశ్యామా లాలి.మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వ జగద్రక్ష.మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా.వినకూడని మాట వింటే అనాల్సిన మాట - రామ రామ.భరించలేని కష్టానికి పర్యాయపదం - రాముడి కష్టం.తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు.కష్టం గట్టెక్కే తారక మంత్రం - శ్రీరామ.విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ.అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా !వయసుడిగిన వేళ అనాల్సిన మాట - కృష్ణా రామా !

తిరుగులేని మాటకు - రామబాణం.సకల సుఖశాంతులకు - రామరాజ్యం.ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన.ఆజానుబాహుడి పోలికకు - రాముడు.అన్నిప్రాణులను సమంగా చూసేవాడు - రాముడు.రాముడు - ఎప్పుడూ మంచి బాలుడే.చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా - రామా కిల్డ్ రావణ ; రావణ వాజ్ కిల్డ్ బై రామా.ఆదర్శ దాంపత్యానికి - సీతారాములు.గొప్ప కొడుకు - రాముడు.అన్నదమ్ముల అనుబంధానికి - రామలక్ష్మణులు.గొప్ప విద్యార్ధి - రాముడు (వసిష్ఠ , విశ్వామిత్రలు చెప్పారు).మంచి మిత్రుడు - రాముడు (గుహుడు చెప్పాడు).మంచి స్వామి - రాముడు (హనుమ చెప్పారు).సంగీత సారం - రాముడు (రామదాసు, త్యాగయ్య చెప్పారు).నాలుకమీదుగా తాగాల్సిన నామం - రాముడు ( పిబరే రామ రసం - సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు).కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు.నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు.చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు.చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు.జన్మ తరించడానికి - రాముడు, రాముడు, రాముడు.

రామాయణం పలుకుబళ్లు

మనం గమనించంగానీ, భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే.ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లే ఉంటుంది.చెప్పడానికి వీలుకాకపోతే - అబ్బో అదొక రామాయణం.జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే - సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ.ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే - అదొక పుష్పకవిమానం.కబళించే చేతులు, చేష్ఠలు - కబంధ హస్తాలు.వికారంగా ఉంటే - శూర్పణఖ.చూసిరమ్మంటే కాల్చి రావడం - హనుమ.పెద్ద పెద్ద అడుగులు వేస్తే - అంగదుడి అంగలు.మెలకువలేని నిద్ర - కుంభకర్ణ నిద్ర.పెద్ద ఇల్లు - లంకంత ఇల్లు.ఎంగిలిచేసి పెడితే - శబరి.ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు.అల్లరి మూకలకు నిలయం - కిష్కింధ కాండ.విషమ పరీక్షలన్నీ మనకు రోజూ - అగ్ని పరీక్షలే.పితూరీలు చెప్పేవారందరూ - మంథరలే.యుద్ధమంటే - రామరావణ యుద్ధమే.ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ - రావణ కాష్ఠాలే !కొడితే బుర్ర - రామకీర్తన - పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం).సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు.బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు.ఒక ఊళ్లో పడుకుని ఉంటారు.ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు.ఒక ఊళ్లో నీళ్ళు తాగి ఉంటారు.

ఒంటిమిట్టది ఒక కథ.. భద్రాద్రిది ఒక కథ...అసలు రామాయణమే మన కథ. అది రాస్తే రామాయణం చెబితే మన భారతం మహ భారతం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.

!!! జై శ్రీ సీతారామ చంద్ర హనుమాన్ కీ జై!!!

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


Sunday 22 January 2023

జీవితంలో డబ్బే ముఖ్యము కాదు (23-Jan-23,Enlightenment Story)

 🍀*జీవితంలో డబ్బే ముఖ్యము కాదు అనడానికి చిన్న ఉదాహరణ* 🍀

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺

ఒకతను వున్నంతలో భార్యా పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు..ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ వుంటే ఒక నాణెం దొరుకుతుంది..మకిలి పట్టి మధ్యలో చిల్లు వున్న రాగి నాణెం..అది...!!అతడు దాన్ని రుద్ది చూస్తాడు..ఆశ్చర్యం..!! ఇంకో రాగి నాణెం వస్తుంది.. మళ్ళీ రుద్దుతాడు..మరోటి వస్తుంది..మళ్ళీ రుద్దితే మళ్ళీ ఒకటి..!!

అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది.. ఓ మనిషీ..! ఇది మాయానాణెం..దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణేలు ఇస్తుందీ..అయితే మధ్యలో ఒక్కసారి ఆపినా ఆమాయ పోతుందీ...!!అని చెప్తుంది..అంతే ఆ మనిషి తన ఇంటిలో వున్న నేలమాళిగలోకి వెళ్ళి నాణేన్నిరుద్దటం మొదలు పెడతాడు..తనను తాను మర్చిపోతాడు.. కుటుంబాన్ని మర్చిపోతాడు.. పిల్లల్ని మర్చిపోతాడు.. ప్రపంచాన్ని మర్చిపోతాడు. అలా రుద్దుతునే వుంటాడు..

గుట్టలుగా సంపదను పోగెస్తునే వుంటాడు..!!ఒకరోజు అతడికి ఇక చాలనిపిస్తుంది..రాగినాణేన్ని పక్కన పడేసి..బయటికి వస్తాడు..అతడిని ఎవ్వరూ గుర్తు పట్టరు..పిల్లలకు పిల్లలు పుట్టి వుంటారు..కొత్త భవనాలు వెలసి వుంటాయి..కొత్త సంగీతాలు వినిపిస్తుంటాయి..

స్నేహితులు..చుట్టాలు..పుస్తకాలు..ప్రేమ,పెళ్ళి...జీవితం ప్రసాదించిన అన్ని సంతోషాలనూ అనుభవిస్తుంటారు..ఆ మనిషికి ఏడుపు వస్తుంది. ఇంతకాలం ఇవన్నీ వదిలెసి నేను చేసింది ఏమిటా అని కుప్పకూలుతాడు..!!ఒక్కోసారి మనం కూడా చేతిలో ఇలాంటి మాయానాణెం పట్టుకొని వుంటున్నామా అనిపిస్తుంది...

*సంపాదనలో పడి ..కెరీర్ లో పడి..కీర్తి కాంక్షలో పడి..లక్ష్య చేధనలో పడి,బంగారు నాణెం వంటి జీవితాన్ని..మకిలి రాగినాణెం తో జీవితాన్ని మార్చుకుంటున్నామా అనిపిస్తుంది..!!అమ్మ చేతి ముద్ద..తండ్రి మన కోసం ఎదురు చూపులు..భార్య ప్రేమ..పిల్లల అల్లారు ముద్దు..స్నేహితుడి మందలింపు..ఆత్మీయుడి ఆలింగనం.*

ఇలాంటి బంగారు నాణేలు మన జేబులో తగినన్ని వుండాలి....ఈ బంగారు ముచ్చట్లు గుండె అంతా నిండాలి, అదే జీవితం.ఒక్కసారి ఆలోచించండి

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺

Saturday 21 January 2023

తాత - మనుమడు - తండ్రి (22-Jan-23,Enlightenment Story)

తాత - మనుమడు - తండ్రి (మంచి కుటుంబ సందేసం)

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

👉ఆ రోజు ఒక పేరున్న రెష్టారెంట్ ముందు కారు లో సుమారు తొంబై దాటిన  తాతగార్ని ఓ మనవడు నెమ్మదిగా చెయూత నిచ్చి నడిపించుకొని తీసుకు వచ్చాడు. ఓ మూల ఉన్న టూ సిట్టర్ టేబుల్ దగ్గరకు నడిపించుకుని జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. చెప్పండి తాతగారు ! ఏంటి తింటారు ? అని అడిగాడు మనవడు.

👉నాకు వడలు చాలా ఇష్టం, కాని పళ్లు లేవుగా! ఎలా తింటాను అన్నాడు.

ఓస్ ! ఇంతే కదా ! అని బేరర్ ను పిలిచి, ఓ ప్లేట్  చాల మెత్తని మృదువైన వడ సాంబారుతో, బాగుండాలని ఆర్డర్ పెట్టాడు. ఇదిగో! అది అయ్యేలోపు టమోటా సూప్ ఫ్రెష్ గా పట్టుకు రా ! అని చెప్పాడు. ఐదు నిమిషాల్లో టమోటా సూప్వచ్చింది!

👉ఆ మనుమడు ఒక తెల్లటి టవల్ ను తాతయ్య మెడ ముందు అమర్చి... సూప్ నెమ్మదిగా స్పూన్ తో త్రాపిస్తున్నాడు. అయినా అది ఆ బోసి నోరు చుట్టూ అంటుకుంది.  కర్చిఫ్ తో మూతి శుభ్రం చేసాడు. ఈ లోగామృదువైన వడ వచ్చింది. తాతయ్యకు నెమ్మదిగా స్పూన్ తో తినడం వలన చాలా సమయం పట్టింది...! 

👉ఐనా విసుగు చెందకుండా నెమ్మదిగా తాతయ్యతో కబుర్లు చెబుతూ... నానమ్మ పై జోకులు వేస్తూ తినిపించాడు. చనిపోయిన భార్య జ్ఞాపకాలు అంత అందంగా మనవడు గుర్తు చేసినందుకు, ఆ తాతయ్య కళ్లలో ఆనందం.. ఓ పక్క కంటనీరు.

👉రెష్టారెంట్ లో అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఆ కుర్రాడు ఏమాత్రం పట్టించుకోలేదు. బిల్ పే చేసి నెమ్మదిగా మరలా నడపించుకొని తీసుకు వెళ్లిపోయాడు. కొడుకు, కోడలు చాలా మంచి వాళ్లు, జాగ్రత్తగా చూసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుందని ఏది పడితే అది పెట్టరు. మనవడు అలా కాదు. వచ్చిన ప్రతీ సారి తాతయ్యను కార్లో వేసుకుని షికారు తిప్పడమే కాకుండా, చిన్న పిల్లలకు తినిపించినట్లు, ఐస్ క్రీమ్స్, రక రకాల చిరుతిండి తినిపిస్తాడు. తండ్రి చెప్పినా వినడు!

ఒక్కరోజుకు ఏం కాదు డాడీ... నేను చూసుకుంటాను కదా అని... రాత్రి పడుకునే ముందు జీర్ణం కావడానికి పళ్ల రసం, టాబ్లెట్ వేసేస్తాడు.

👉మామూలు సమయంలో చాలాఇబ్బంది పడే పెద్దాయన... చిత్రంగా మనవడు వచ్చినపుడు హుషారుగా ఉంటారు. ఒక్క కంప్లైంట్ కూడ ఉండదు. కొడుకు ముసి ముసిగా నవ్వుకుంటాడు.

ఓసారి ఉండలేక కొడుకుని అడిగాడు.., ఏరా! వచ్చినపుడల్లా తాతయ్యను కుషీ చేస్తావ్! తాతయ్య అంటే అంత ఇష్షమా?

👉దానికి కొడుకు చెప్పిన సమాధానం... డాడీ! నా చిన్నతనంలో అమ్మా, మీరు క్షణం తీరిక లేకుండా ఉద్యోగాల వలన బిజీగా ఉండేవారు. ఇంట్లో నాన్నమ్మ తాతయ్య, నా విషయంలో చాలా శ్రద్ధ చూపేవాళ్లు. తాతయ్యా !... నన్ను స్కూల్ నుండి తీసుకొని వస్తూ... నేను ఏది అడిగితే అది కొనిచ్చి ముద్దు చేసేవారు.

 ఒక్కోసారి నా బట్టలు పాడు చెసేవాడిని. తాతయ్య నాన్నమ్మ ఆ రోజులలో నాకు చేసిన సేవలు గుర్తున్నాయి. నేను ఏమిచ్చి వాళ్లను ఆనంద పరచగలను. నానమ్మ ఇప్పుడు లేదుగా. అందుకే వచ్చిన  ప్రతిసారీ కనీసం తాతయ్య తో ఒక్కరోజైనా గడపి నా జ్ఞాపకాలు సజీవం గా ఉంచుకుంటాను అని చెప్పాడు.

👉సమాధానం విన్న తండ్రి కళ్లలో నీళ్లు... నీ జ్ఞాపకాల మాటేమో గాని... నీవు వచ్చిన వెంటనే తాతయ్య కళ్లలో ఉత్సాహం... చూస్తుంటే నేను ఆయనకు ఎంత రుణపడి ఉన్నానో అర్ధం అవుతుంది. నాకు మీ అమ్మకు అందమైన వార్ధక్యం కళ్ల ముందు కనిపిస్తూంది...! యు ఆర్ గ్రేట్ మై సన్.

*గమనిక :-   డబ్బు వెనుక పరుగులుపెట్టే ఈ కాలంలో ఇలాంటి సంబంధ బాంధవ్యాలు కాపాడుకునే కుటుంబాలు మాత్రం నిజంగా స్వర్గధామాలే... !*

*అన్ని కుటుంబాలు కూడా ఇలాగే ఉండాలని ఆశిస్తూ...!*

*కుటుంబ వ్యవస్థ ఇలా ఉంటే సమాజం   కూడా బాగుంటుందని భావిస్తూ*...🙏

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Friday 20 January 2023

దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది (21-Jan-23,Enlightenment Story)

🌺 *దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది* 🌺

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

అదృష్టవంతులు మాత్రమే దైవాన్ని ఆశ్రయిస్తారు.అదృష్ట వంతున్ని ఎవరు చెడ గొట్ట లేరు. మనవులను పొగుడుతూ దైవాన్ని తక్కువగా చూచే దురదృష్ట వంతున్ని బాగూ చేయ లేరు. ఉదాహరణగా ఈ కథ..

ఒక రాజు గారి కొలువు లో ఇద్దరు పురోహితులున్నారు . అందులో ఒకనిపేరు #దైవాధీనం. ‘’దైవా దీనం జగత్ సర్వం ‘’అని నమ్మిన వాడు . జగత్తు అంతా దేవుని అధీనమై ఆయన సంకల్పం చేత నడుస్తున్నది అని నమ్మేవాడు కనక ఆపేరు వచ్చింది ఆయనకు.

రెండో వానిపేరు #రాజాధీనం. రాజు గారి పరిపాలన బాగా ఉందని అందుకే ప్రజలంతా సుఖం గా ఉన్నారని నమ్మే వాడు కనుక ఇతనికి రాజాధీనం అనే పేరు వచ్చింది. .రాజు గారి మెప్పు పొంది ఇతను అప్పుడప్పుడు రాజ బహుమానం అందు కునే వాడు .

ఒక రోజు రాజు గారికి రాజాదీనం గారిని సువర్ణ ,వజ్ర వైదూర్యాలతో సత్క రించాలని కోరిక కలిగింది .అదీ ఎవరికీ తెలీకుండా రహస్యం గా చేయాలని భావించాడు .ఒక గుమ్మడి కాయ ను తెప్పించి దానికి కన్నం పెట్టించి అందులో వజ్ర వైదూర్య రత్న మాణిక్య సువర్నాలను నిక్షేపం చేసి రాజాదీనం గారికి స దక్షిణం గా దానం చేశాడు .ఆయన దాన్ని ఇంటికి మోసుకు పోతూ ఆలోచించాడు. " దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకుంటే మంచిది" అని. ఆలోచన వచ్చిన వెంటనే ఒక వర్తకుడు గారికి అమ్మి ఆయన ఇచ్చిన పావలా డబ్బులు తీసు కొని ఇంటికి వెళ్లాడు .

వర్తకుడు గారికి ఒక ఆలోచన వచ్చింది . "గుమ్మడి కాయ దొరికింది పితృదేవతల పేరు తో దాన్ని దానం చేస్తే పుణ్యం అని పెద్దలు అంటారు. ఎవరైనా భగవద్భక్తిపరాయణులైన వారికి దానం చేస్తాను." అను కొన్నాడు .అప్పుడే అనుకోకుండా #దైవాధీనం గారు అటు వెళ్తూ కని పించారు . వర్తకుడు గారు ఆయనను ఇంటికి ఆహ్వానించి దక్షిణ తో సహా కూష్మాండ దానం (గుమ్మడికాయ దానం) చేశారు . దైవాధీనం గారి భార్య .... భర్త తెచ్చిన గుమ్మడి కాయను పగుల గొట్టించింది భర్త చేత .ఆడ వాళ్ళు గుమ్మడి కాయ పగుల గొట్ట రాదనీ ఆచారం కదా అందుచేత .అందులో వజ్రవైదూర్య మరకత మాణిక్య సువర్నాలు కని పించాయి .ఇదంతా దైవ లీల గా ఆయన భావించి పరమేశ్వరునికి కృతజ్ఞత తెలిపాడు

మర్నాడు రాజాదీనం రాజ దర్శనానికి వెళ్లాడు ."గుమ్మడి కాయ కూర తిన్నారా..." అని రాజు అడిగాడు . ఆహా ,ఓహో అద్భుతం అని బొంకారు రాజాధీనంగారు. .రాజు గారికి అర్ధమైంది .... గుమ్మడి కాయ ఆయన ఇంటికిచేర లేదని . ఒల్లుమండింది. భటులను పిలిపించి కొరడా తో ఝాలిపించి నిజం కక్కించాడు .

వర్తకుడు ని పిలిచి అడిగితె డబ్బు ఇచ్చి దాన్ని దాన్ని కొన్నాననీ... దైవాధీనం గారికి దానం చేశాననీ.. చెప్పాడు .తాను ఒకటి తలిస్తే దైవం ఇంకో లాగా చేశాడేమిటి అని వితర్కించు కొన్నాడు రాజు .

మరోసారి ఒక సంచి లో ధనాన్ని మూట కట్టించి #రాజాధీనం గారు వచ్చే దారిలో పెట్టి ... భటుడి ని కని పించ కుండా ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నాడు. రాజదీనం నడచి వస్తు ,దాన్ని గమనించ కుండా వెళ్లి పోయాడు .భటుడు రాజుగారికి విషయం తెలిపాడు .ఆయన మళ్ళీ ఆశ్చరయం లో మునిగాడు . రాజాదీనాన్ని పిలిపించి ఆ మూటను ఎందుకు చూడ లేదని అడిగాడు దానికి అతడు రోజు వెళ్ళే దారే కదా కళ్ళు మూసు కొని వెళ్ళ లేనా అని అక్కడికి రాగానే అని పించిందని అందుకని కళ్ళు మూసుకొని వెళ్ళా.అని బదులు చెప్పాడు.

రాజుకి అర్థమైంది... *తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది అని*

"దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది "అని ఇందులో ఉన్న సారాంశం.

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


Thursday 19 January 2023

సర్వరోగ నివారిని ప్రాణాయామం (20-Jan-23,Enlightenment Story)

 🌷సర్వరోగ నివారిని ప్రాణాయామం🌷

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

తరచూ అనారోగ్యాలకు గురయ్యే మహిళలు నిత్యం యోగా చేయడం మూలంగా ఆరోగ్యం కుదుటపడు తుందని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ రకాల యోగ మూలంగా శరీరం, మనసు రెండు కూడా ప్రశాంతంగా ఉంటాయని వారంటున్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఎంతో గానో ఉపయోగపడుతుందని, మహిళలు ఇంటి పట్టునే ఉండి ప్రతిరోజు యోగాను చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని వారంటు న్నారు. యోగాలో భాగంగా ప్రాణాయామం గురించి  తెలుసుకుందాం.

1.ప్రాణాయామ విశేషాలు

ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, ప్రశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు.శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు.నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటి యందు ప్రాణం సంచ రిస్తూ ఉంటుంది. 

ప్రాణాయామం వల్ల వాటన్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే *ప్రాణాయా మేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్‌* అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అను సూత్రం ప్రచలితం అయింది.

ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన; ఉదాన, వ్యానమను 5 రూపాలు ఉన్నాయి. ప్రాణానికి స్థానం హృదయం. అపానానికి స్థానం గుదం. సమానానికి స్థానం నాభి. ఉదనానికి స్థానం కంఠం. వ్యానానికి స్థానం శరీరమంతా. శ్వాసక్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్తప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి. శ్వాసను బయటకు వదిలే క్రియను రేచకం అని, లోపలకి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని ఉంచడాన్ని అంతర్‌ పూరకం అని, తిరిగి బయటకి వదిలి ఆపి ఉంచడాన్ని బాహ్యకుంభకం అని అంటారు. ఈ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.మెడికల్‌ సైన్స్‌ ప్రకారం రెండు ముక్కు రంధ్రాల ప్రయోజనం ఒక్కటే. కాని యోగులు ఈ రెండింటికి మధ్య గల భేదం గ్రహించారు. 

వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధ్రాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందు వల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్రం ప్రభావం వల్ల చల్లని దనం అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. ఈ రెండిటికి మధ్య సమన్వయం సాదించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం ఇవ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ట అను అక్షరం సూర్యుడికి గుర్తుగా నిర్ధారించారు. అందువల్ల హఠ యోగం వెలువడింది. హఠ యోగమంటే చంద్ర సూర్య నాడులకు సంబంధించిన విజ్ఞానం అన్నమాట. హఠం అనగాబలవంతం అనికాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్ర, సూర్య స్వరాలకు సంబంధించినదే.

2. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు

ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది. రక్త శుద్ధి జరిగి అందలి చెడు అంతా బయటికి వెళ్లి పోతుంది. గుండెకు సత్తువ లభిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.ప్రేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి. జఠరాగ్ని పెరుగుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఇది అన్నిటికంటే మించిన విశేషం.

3. తీసుకోవలసిన జాగ్రత్తలు

మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని, కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి. గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు. మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు. పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు. ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు. అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి. పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువెైన ఆసనాలు.నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు. నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణా యామం చేయాలి. ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి.

ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది. ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపెై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.

🌷 శ్రీ మాత్రే నమః 🌷

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Sunday 15 January 2023

అరుణాచలం ఈ పేరే ఒక మాయ (17-Jan-23,Enlightenment Story)

అరుణాచలం ఈ పేరే ఒక మాయ 

అరుణాచలం ఈ పేరే ఒక మాయ ఒక అద్భుతం అక్కడికి వెళ్లినవారికి ఏమవుతుందనేది తెలియదు కానీ ఆ కొండ అయస్కాంత శక్తిలాగా లాగేస్తుంది అక్కడే ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది. మనసు అరుణాచలశివ అంటూ ధ్యానం చేస్తుంటుంది, ఆ గిరి 260 కోట్ల సంవత్సరములుగా ఉంది అని పురావాస్తు శాఖ వారు నిర్ధారించారు.. ఆ కొండ రూపంలో దక్షిణామూర్తి ఉంటారు సాక్షాత్తు స్వామి అమ్మవారు అర్ధనారీశ్వరరూపంలో ఉన్నారు అక్కడ, మనం అక్కడ అప్రయత్నంగానే ధ్యానంలోకి  వెళ్లిపోతాము సమయం తెలియకుండా ఎంత సేపయినా అలా ధ్యానంలో ఉండిపోవచ్చు, భవబంధాలు గుర్తుకు రావు, బాహ్యసృహా ఉండదు. అలా ధ్యానంలో ఉన్న సమయంలో ఎందరో సిద్ధులు, అక్కడ సంచరిస్తున్న ఆశరీరుల దర్శనం, వారి వాక్కు కూడా మన మనో చక్షువులచే వినవచ్చు .

 ఆ స్థలంకి ఉన్న శక్తి అలాంటిది. మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు, మనస్సును ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లిపోతుంది అక్కడి వాతావరణం, అన్నీ మర్చిపోయి అరుణాచల శివ అనే మాయలోకి మునిగిపోతాము.. ఆ మాయ ఎప్పటికి వదలదు , మాయ అని ఎందుకు అంటున్నాను అంటే అప్పటి వరకు గడిచిన జీవితాన్ని అక్కడ అడుగు పెట్టాక మర్చిపోతాము, అరుణాచలంలో అడుగు పెట్టాక అక్కడి నుండి జీవితం కొత్తగా మొదలు అవుతుంది అదే మెదలు అదే చివర అనే ధ్యాసకు లోనవుతుంది మనసు, అంతే ఆ మాయలో జీవితకాలం మొత్తం కూడా గడిచిపోవచ్చు.. 

ఎందరో నాస్తికులు కూడా కుతూహలంతో ఆ గిరి ప్రదక్షిణ చేసి అక్కడ ఏదో మాయ ఒక మహా శక్తిలాగా మనసులాగేస్తుందని అని కారణం తెలియని ఆనందాన్ని పొందుతామని చెప్పిన సంఘటనలు ఉన్నాయి , దేవుడికి దండం పెట్టని వారు కూడా దాసోహం అంటూ ఆ కొండ చుట్టూ పడి దొర్లేస్తారు ఆ స్వామి కరుణామయుడు నాస్తికులకే అంత అనుభూతి కలిగితే భక్తుల పరిస్థితి ఎలా ఉంటుంది అడుగడుగునా శివ దర్శనం నిదర్శనం కనపడుతూనే ఉంటుంది.. 

‘అరుణాచలం’ అనే పదానికి ఎవరి అవగాహనను బట్టి వారు అనేక అర్ధాలను చెప్పుకున్నారు.అరుణాచలం అంటే ఆగమ ప్రధానులు అరుణాచలేశ్వర దేవాలయములో ప్రతిష్ఠింపబడిన శివలింగం. పౌరాణికులకు అరుణాచల పర్వతం భక్తులకు శివ స్వరూపం.యోగులకు పరంజ్యోతి దానికి అతీతం కూడా. జ్ఞానోపాసకులకు హృదయస్తుడైన పురుషుడు. నిర్గుణ అభిమానులకు నిష్కల జ్యోతి. భూతత్వ పరిశోధకులకు అతి ప్రాచీన మైన కొండ ఇలా ఎన్నో… ఎన్నెన్నో అర్థాలను చెబుతున్నారు.

 కానీ…

భగవాన్‌ శ్రీ రమణ మహర్షి వాక్కుల కు వేరే ప్రమాణముల ఆవశ్యకత లేదు. వారు అనేక పర్యాయములు అరుణాచలం గురించి ప్రస్తావించడం జరిగింది. అరుణాచలం సాక్షాత్తు కైలాసమే అన్నారు. ఈ క్షేత్రములో ప్రతి శిలా శివలింగమే. ఈ క్షేత్రములో తీసుకొన్న ఆహారము, నీరు అమృతమే. ఈ క్షేత్రములో ఏమి మాట్లాడుకున్నా శివ స్తోత్రమే. ఈ క్షేత్రంలో ఏ కర్మ చేసినా అది శివ పూజయే. గిరి ప్రద క్షిణ చేస్తే మొత్తం సృష్టిని చుట్టి వచ్చినట్లే. గిరిచుట్టూ ఉన్న 24 మైళ్ళలోపు ఎక్కడ మరణించినా వారికి ముక్తి కలుగుతుంది. కమలాలయమును తిరువారూర్‌ నందు జన్మించినచో ముక్తి కలుగుతుంది. అలాగే కాశీ క్షేత్రములో మరణిస్తే ముక్తి కలుగుతుంది. కానీ అరుణాచలములో పుట్టడం, మరణిం చడం జరిగితే ముక్తి కలగడంతోపాటు అరుణాచలమును స్మరిస్తే చాలు ముక్తి కలుగుతుంది. దీనిని బట్టి అరుణాచలం ఎంత గొప్ప విశిష్టత కలిగిన క్షేత్రమో తెలుస్తున్నది. మిగిలిన అన్ని గిరులను ఒక దేవతకు నివాస స్థానాలుగా వర్ణించారు.

 అరుణాచలాన్ని మాత్రం గిరి రూపంలో నున్న దేవుడే అంటారు. మనం దేహంతో తాదాత్మ్యం చెందినట్లే పరమ శివుడు ఈ కొండతో తాదాత్యము చెందాడు. అందువల్ల ఈ కొండ పరమశివుడే. తనను అన్వేషించే భక్తులపై కరుణతో వాళ్లకు కనపడాలని శివుడు కొండ రూపం దాల్చాడు.

ఎంతో మంది అక్కడి నుండి రాలేక అరుణగిరికి దూరంగా ఉండలేక అక్కడే స్థిరపడిపోయారు.. ఒక మైనింగ్ వ్యాపారం చేసే ఆవిడ యిరువది సంవత్సరములుగా అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ నుండే తన వ్యాపార పనులు చేసుకుంటూ ప్రతి రోజూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఇంకొకరు పన్నెండు  సంవత్సరములుగా అక్కడే నివాసం ఉంటున్నారుడు, అక్కడి వాస్తవ్యులు కొందరు ప్రతిరోజూ గిరి ప్రదక్షిణ దీక్షగా చేస్తున్నారు.. ఎందరో అక్కడ స్థిరపడ్డారు నిత్యం ఆ కొండను దర్శించి పునీతులవుతున్నారు, వారి లక్ష్యం ఒక్కటే బతికి ఉన్నంత కాలం అలా ప్రదక్షిణ చేసుకుంటూ అక్కడే ప్రాణం వదిలేయడం శివైక్యం పొందటం.. 

 గిరి ప్రదక్షిణ శ్రద్ధగా చేయాలి భక్తితో ఆనందిస్తూ చేయాలి అడుగడుగునా మహమాయని అనుభూతి చెందుతూ చేయాలి, వ్యర్ధప్రేలాపన చేయకూడదు సమయం వినియోగించుకోవాలి. ఇది అక్కడ ఉండే వారి కోరిక.🙏

🌹సర్వేజనాసుఖినోభవంతు 🌹

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Saturday 14 January 2023

భోగి అంటే ఏమిటి ? | ఈ భోగి పండుగ ఎలా వచ్చింది ? (15-Jan-23,Enlightenment Story)

 *భోగి పండుగ - మకర సంక్రమణం & ఉత్తరాయణ పుణ్యకాలం - రా2.02 నుండి*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

1) "భుగ్" అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది, భోగం అంటే సుఖం                                             

2) *శ్రీ రంగనధాస్వామి లో గోదాదేవి లీనమై భొగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది*                                                                                                                                                      

3) *బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది*                       

4) *కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు*                                          

5) *శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రొజు*                                                                                                                                                    

6) భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా,ఔషదంగా ఇది పని చేస్తుంది.గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మ క్రీములు నశిస్తాయి, ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది.                                                                                                                                       

7) భోగి పళ్ళు తల పై పోయడం వలన శ్రీ లక్ష్మి నారాయణుల అనుగ్రహం మన పిల్లల ఫై ఉంటుంది.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. 

ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు, దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికి తెలిసింది. 

మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు "శాస్త్రీయ కారణాలు" తెలుసుకుందాం!!..

"భుగ్" అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది, భోగం అంటే సుఖం

పూర్వం ఈ దినమే *శ్రీ రంగనధాస్వామి లో గోదాదేవి లీనమై భొగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది* మన పురాణ గాద.. 

శ్రీ మహా విష్ణువు వామన అవతారం లో బలి చక్రవర్తిని పాతాళం లోకి తొక్కిన పురాణ గాద మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందట. *బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది*

*కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు* ఇదే...

శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రొజు ఇదే అనేవి కూడా పురాణాల గాద.సాదారణంగా అందరు చెప్పేది, ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. 

కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా, ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మ క్రీములు నశిస్తాయి, ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది, చలికాలం లో అనేక వ్యాదులు వ్యాపిస్తాయి. 

ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పిడిస్తాయి. వాటికి ఔషదంగా ఇది పని చేస్తుంది, భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు.అవి కాలడానికి ఆవు నెయ్యని వేస్తారు. 

అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశి ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు (oxygen) ను విడుదల చేస్తుంది. ఈ ఔషద మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరం లోని 72,000 నడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషదం ఇవ్వవచ్చు, అదే అందరికి వస్తే అందరికి ఔషదం సమకూర్చడం దాదాపు అసాధ్యం. 

అందులో కొందరు వైద్యం చెయించుకొలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మద్యన దూరాలను తగ్గిస్తుంది, ఐక్యమత్యాని పెంచుతుంది. 

ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధనా, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని వింటుంటాం. పనికి రాణి వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు. ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచుకోవాలి. 

మన భారతదేశం లో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కాని భారతదేశాని ఆక్రమించుకోలేమనుకున్న బ్రిటిషు దండుగులు, భోగి మంటల్లో పాత సామాన్లు తగల బెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్నఅతి ప్రాచిన తాళపత్ర గ్రంధాలను భోగి మంటల్లో వేసి కల్పించేసారు. నిజానికి భోగి మంటల్లో కచాల్సింది పాత వస్తువులని కాదు , మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి.

*భోగి పళ్ళను పోయడంలోని అంతరార్దం తెలుస్సుకుందాం.*

భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరు. రేగి చెట్లు, రాగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతి రూపం . ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం, సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. 

వాటిని తల పై పోయడం వలన శ్రీ లక్ష్మి నారాయణుల అనుగ్రహం మన పిల్లల ఫై ఉంటుంది అని, పిల్లలకి ఉన్న దిష్టి తొలగి పోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం. మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మ రంద్రం మన తల పై భాగంలో ఉంటుంది.  ఈ భోగి పండ్లను పోయి ఆ బ్రహ్మరంద్రాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లలలు జ్ఞానవంతులు అవుతారు. రేగు పండ్లు సూర్య కిరణలలోని ప్రాణశక్తి ని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుచ్చక్తి, శరీరం ఫై, ఆరోగ్యం ఫై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి.

అందువలనే పిల్లలకి భోగి పండ్లు పోసి అసిర్వాదిస్తారు.మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్దాలు, అంతర్దాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచార, సాంప్రదాయాలను ముఢనమ్మకలు అనుకోవడం మూర్ఖత్వం. వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకులు అవుతాయి.

స్వస్తి...🙏  🌿శుభమస్తు🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సంక్రాంతి నాడు గంగా నదిలో స్నానం చేయాలని

  సంక్రాంతి నాడు గంగా నదిలో స్నానం చేయాలని చెప్పడం వెనుక పురాణ గాథ ఇదే..


🔆 మకర సంక్రాంతి రోజున గంగానదిలో స్నానం చేయడం ద్వారా ఏడు జన్మల పాపాలు పోతాయని చెబుతారు.

గంగాస్నానానికి వెళ్లలేకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలని చెబుతారు.


🔆 హిందూ గ్రంథాలలో పేర్కొన్న వివరాల ప్రకారం, కపిల మహర్షి నాటి కాలంలో గంగాసాగర్ దగ్గర ఆశ్రమం నిర్మించి తపస్సు చేసుకునేవాడు.

నాటి రోజుల్లో సాగర రాజు కీర్తి మూడు లోకాలలోనూ వ్యాపించింది.

రాజులందరూ సాగరుడు చేసే దానధర్మాలను, సత్కార్యాల మహిమను గానం చేసేవారు.

దీనిని చూసిన స్వర్గలోకపు రాజు ఇంద్రుడు చాలా ఆందోళన చెందాడు.


🔆 ఈ సమయంలో సాగర రాజు అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు.ఇంద్రుడు అశ్వమేధ యాగ గుర్రాన్ని దొంగిలించి, కపిలముని ఆశ్రమం దగ్గర కట్టేశాడు.

అశ్వమేధ యాగానికి తెచ్చిన గుర్రాన్ని వెతకడానికి సాగర రాజు తన 60 వేల మంది కుమారులను పంపాడు.

ఆ కుమారులందరూ గుర్రాన్ని వెతుక్కుంటూ కపిల ముని ఆశ్రమానికి చేరుకున్నారు.

అక్కడ అశ్వమేధ యాగం కోసం తెచ్చిన గుర్రాన్ని చూశాడు.దీంతో వారు కపిలముని ఈ గుర్రాన్ని దొంగిలించారని ఆరోపించారు.

కోపోద్రిక్తుడైన కపిల ముని సాగర రాజు 60 వేల మంది కుమారులందరినీ కాలి బూడిద కమ్మంటూ శపించాడు.

వెంటనే సాగరరాజు కపిల ముని ఆశ్రమానికి చేరుకుని, తన కుమారులను క్షమించాలని అభ్యర్థించాడు.


🔆 అప్పుడు కపిల ముని అతనితో నీ కుమారులందరి మోక్షానికి ఒకే ఒక మార్గం ఉంది.

మీరు మోక్షదాయిని అయిన గంగను భూమిపైకి తీసుకురండి అని చెప్పాడు.

సాగర రాజు మనవడు రాజు అన్షుమాన్, గంగామాతని భూమిపైకి తీసుకువచ్చే వరకు తమ రాజవంశానికి చెందిన ఏ రాజు శాంతియుతంగా కూర్చోకూడదని కపిల ముని సూచనపై ప్రతిజ్ఞ చేసుకున్నాడు.

అతను తపస్సు చేయడం ప్రారంభించారు.

రాజు అన్షుమాన్ మరణం తరువాత, భగీరథుడు గంగామాతను తన తపస్సుతో సంతోషపెట్టాడు.


🔆 భగీరథుడు తన తపస్సుతో శివుడిని కూడా ప్రసన్నం చేసుకున్నాడు, తద్వారా శివుడు గంగామాత తన జఠాఝూటం ద్వారా భూమిపైకి దిగేలా చేశాడు.

గంగామాతను కేశాల్లో పెట్టుకుని శివుడు గంగాధరుడయ్యాడు.

గంగామాత భూమిపైకి దిగింది.


🔆 ముందు భగీరథ రాజు వెళుతుండగా వెనుక భూమిపై గంగామాత ప్రవహించడం ప్రారంభించింది.

భగీరథుడు గంగను కపిల ముని ఆశ్రమానికి తీసుకువచ్చాడు, అక్కడ గంగామాత సాగర రాజు 60 వేల మంది కుమారులకు మోక్షాన్ని ఇచ్చింది.సాగర రాజుకు గల 60 వేల మంది పుత్రులకు గంగామాత మోక్షాన్ని ఇచ్చిన రోజే మకర సంక్రాంతి అని చెబుతారు అక్కడి నుండి గంగ ముందుకు సాగి సముద్రాన్ని చేరింది.


🔆 అలా కలిసే ప్రదేశాన్ని గంగా సాగర్ అని అంటారు.మకర సంక్రాంతి రోజున గంగాసాగర్ లేదా గంగా నదిలో స్నానం చేయడం మోక్షానికి దారి తీస్తుంది.పాపాలను కడిగివేస్తుందని చెబుతారు.

భోగిపండుగతో ఇంద్రుడి - భోగిమంటలు

 🔥భోగిపండుగతో ఇంద్రుడి బాంధవ్యం🔥

🌻🌺🌻🌺🌻🌺🌻🌺

మకర సంక్రాంతికి ముందు రోజున భోగిపండుగను జరుపుకుంటారు. భోగి పండుగకు సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. భోగి పండుగ నాడు పూర్వం ప్రజలు వర్షాల కోసం ఇంద్రుణ్ణి పూజించేవారు. ఇలా పూజలందు కోవడం వల్ల ఇంద్రుడికి గర్వం పెరిగిపోయింది. అతడి గర్వం అణచాలని శ్రీకృష్ణుడు తలచి, ఇంద్రపూజలకు సిద్ధమవుతున్న యాదవులతో 'మన గోవులకు మేతనిచ్చేది గోవర్ధన పర్వతం. కాబట్టి ఈనాటి నుండి ఇంద్రుణ్ణి పూజించడం మాని గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం' అని అన్నాడు.

అప్పుడు ఇంద్రుడు కోపోద్రిక్తుడై, అతి వృష్టి కురిపించాడు. యాదవులందరూ శ్రీకృష్ణునితో తమ బాధలు చెప్పుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని, యాదవులకూ, గోవులకూ దాని క్రింద ఆశ్రయాన్ని కల్పించాడు. ఇంద్రుడు తన వద్ద ఉన్న ఏడు రకాల మేఘాలను వర్షింపజేసినప్పటికీ యాదవుల్ని ఏమీ చేయలేకపోయాడు. దానితో ఇంద్రుడి గర్వం అణిగింది. శ్రీకృష్ణుడి మహత్తు తెలుసుకొన్న ఇంద్రుడు పాదాక్రాంతుడయ్యాడు.

శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి మన్నించి భోగిపండుగ నాడు ఎప్పటిలాగే మళ్ళీ ఇంద్రపూజ జరిగేందుకు ఆనతిచ్చాడు. మకర సంక్రాంతి మరునాడు కనుమ పండుగ జరుపుకుంటారు. వ్యవసాయదారునికి పశువులే సంపద. పంటలు వాటి శ్రమ ఫలితంగా వచ్చినవి కాబట్టి, ఆ రోజు పశువులను పూజించి వాటికి పొంగలి వండి పెడతారు.


భోగిమంటలు - వ్యామోహానికి నిప్పు🕉️🙏

🕉️🙏మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి.  అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరు వినరు. భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. మన లోపల పాతుకుపోయిన పాతను వదిలించుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. ఒక పూలతోట మీదుగా గాలి వెళితే అది సుగంధభరితం అవుతుంది. అదే గాలి ఒక మురికికాలువ మీదుగా వెళితే దుర్గంధంగా మారిపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే! మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఆయువు గాల్లోకి కలిసిపోతుంది. ఆ స్థితిని బట్టే పునర్జన్మ దక్కుతుంది. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండమంటుంది భోగిమంట. ఇంట్లోని కుర్చీకి ఒక కాలు విరిగిపోయి కుంటుతున్నా సరే దాన్ని వదలం. “అది మా తాతగారిది. అదంటే నాకు సెంటిమెంటు” అని పట్టుకు వేళ్లాడతాం. పాడైపోయిన పాతవస్తువునే అంత సులువుగా వదులుకోకపోతే.. రేప్పొద్దున తుచ్ఛమైన ప్రాణాన్ని స్వేచ్ఛగా ఎలా వదలగలుగుతావు? అంతవరకు ప్రాణభయంతో నిశ్చింతగా ఉండగలవా? ఉండలేవు. అందుకే నీలోని పాతను భోగిమంటతోపాటు వదిలేయి

🙏సర్వేజనాసుఖీనోభవంతు 🙏

గోదా కల్యాణం

 గోదా కల్యాణం :



విశిష్టాద్వైత సంప్రదాయం ప్రకారం ఆండాళ్ లేదా గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారం. రామాయణంలో సీతలాగానే ఆమెకూడా అయోనిజ. జనకునికి సీత నాగేటిచాలులో దొరికినట్లు గోదాదేవి విష్ణుచిత్తునికి తులసీవనంలో దొరికింది. మనందరి కళ్లకూ రాతిబొమ్మగానే కనిపించే శ్రీరంగనాథుణ్ణి పెళ్లాడి ఆయనలోనే లీనమైపోయింది. అప్పటినుంచి ఆమె ఆండాళ్ అయింది. ఆండాళ్ అంటే రక్షించడానికి వచ్చినది అని అర్ధం. ఆమె దొరికినప్పుడు విష్ణుచిత్తుడు పెట్టుకున్న పేరేమో కోదై అంటే పూలదండ. తాను ముడిచి విడిచిన పూలను స్వామికి ఇచ్చి, ఆముక్తమాల్యద అని పేరు తెచ్చుకుంది. చూడికుడుత్త నాచ్చియార్, నప్పిన్నైప్పెరాట్టి, ఆండాళ్ అని వివిధ పేర్లతో ప్రస్తుతులు పొందిన ఆమె శ్రీరంగనాథుని ఇల్లాలు కావడం వెనుక తిరుప్పావై వ్రత మహిమ దాగుంది. ధనుర్మాసం నెలనాళ్లూ గోదాదేవి రోజుకొక్క పాశురంతో తిరుప్పావై గానంతో శ్రీరంగనాథుని అర్చించింది. ఆమె భక్తికి మెచ్చిన స్వామి పాండ్యరాజు కలలో కనిపించి వివాహానికి ఏర్పాట్లు చేయమన్నాడు. వివాహానికి తరలిరావలసిందిగా విష్ణుచిత్తులకు కబురందింది. రాజు పంపిన పల్లకీనెక్కి కల్యాణానికి తరలి వెళ్తూ విరహోత్కంఠిత అయిన గోదాదేవి మరో ప్రబంధం రచించింది. అది ద్రవిడ సాహిత్యంలో నాచ్చియార్ తిరుమొళిగా ప్రసిద్ధి కెక్కింది. ఒక రాతిబొమ్మను మానవకాంత పెళ్లాడే చిత్ర దృశ్యాన్ని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. శ్రీరంగంలోని చిత్రవీధిలో నిండిపోయిన అశేష జనవాహిని మధ్య పల్లకి దిగింది పెళ్లికూతురు. దేవాలయపు ఉత్తరపు వీథిలో భోగి పండుగనాడు గోదాకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణ తంతు ముగిసిన మూలమూర్తికి అప్పగింతలు పెట్టడానికి పాండ్యరాజు వంటివారంతా తోడురాగా కన్యాదాత పెరియాళ్వార్ అమ్మను తోడ్కొని వెళ్లారు. గర్భాలయంలో శేషశయన మూర్తిగా దర్శనమిచ్చే శ్రీరంగనాథుని పాదాలను గోదాదేవి స్పృశించింది. స్వామి పాదాల వద్దసాక్షాత్తూ మహాలక్ష్మిలా ఆమె కూర్చునేంత వరకూ అందరికీ కనిపించి ఆయనలో లీనమయ్యింది.

Thursday 12 January 2023

స్వామి వివేకానంద జయంతి -3 (14-Jan-23,Enlightenment Story)

స్వామి వివేకానంద జయంతి  ( జనవరి 12 )

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


స్వామి వివేకానందుడు ఒక కథ చెబుతుండేవారు - ఒక రైతు దగ్గర ఒక ముసలి గాడిద ఉండేది. ఒక రోజు దారి సరిగా కనబడక పాడుబడ్డ నూతిలో పడిపోయింది. రైతు ఆ గాడిదను పైకి తీసే ప్రయత్నం చేశాడు. కుదరలేదు. ‘‘ఇది ముసలిదైపోయింది. ఎక్కువ కాలం ఉపయోగపడదు. దీన్ని కష్టపడి పైకి తీసే కన్నా, నేను మరో బలమైన గాడిదను తెచ్చుకోవడం మేలు

అది కూడా దీనిలాగా ఈ బావిలో పడిపోతే మళ్లీ మరో గాడిద కొనుక్కోవాలి. ముసలి గాడిద ఎటూ పడిపోయింది కనుక, దీనిని మట్టితో కప్పేస్తే అప్పుడు బావి కూడా పూడిపోతుంది కనుక కొత్త గాడిద పడే సమస్య ఉండదు’’ అనుకుని చుట్టుపక్కల రైతులను పిలిచాడు. తలా ఒక తట్ట మట్టి తెచ్చి పోస్తున్నారు.

యజమాని వైఖరికి లోపలున్న గాడిద ఖిన్నురాలైపోయి - ఎంత దారుణం అనుకుంది. ఒక్క క్షణం ఆలోచించింది. ఇక నేను నా గురించి ఆలోచిస్తాను. తప్పుకునే మార్గాన్ని చూసుకుంటాను అనుకుంది. 

ఒకసారి సంకల్పం చేసుకున్నాక ధైర్యం వచ్చి లోపల గోడకు బాగా దగ్గరకు వెళ్లి నిలబడింది. పైనుంచి మట్టి పోస్తున్నారు. తనమీద పడిన దాన్ని దులుపుకుంటున్నది. పక్కన పడ్డ మట్టి ఒక దిబ్బగా మారగానే దాని మీదకు చేరుతున్నది. అలా లోపల మట్టి లెవల్ పెరిగే కొద్దీ అది కూడా పైకి జరుగుతూ బావి పైఅంచు దగ్గరకు రాగానే ఒక్కసారి శక్తి కూడదీసుకుని బావి బయటకు దూకి పారిపోయింది

ధైర్యంగా కష్టాన్ని ఎదుర్కోలేకపోయి ఉంటే, ఆ గాడిద కూడా ఒక అవశేషంగా మిగిలిపోయి ఉండేది. స్వామి వివేకానంద యువకులకు ఈ కథ చెబుతూ ‘‘భీరువులై (పిరికివారై) బతక్కండి, ధైర్యంగా నిలబడి కష్టాన్ని ఎదుర్కోండి’’ అని చెప్పేవారు.

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂


స్వామి వివేకానంద జయంతి -2 (జాతీయ యువజన దినోత్సవం ) -(13-Jan-23,Enlightenment Story)

జాతీయ యువజన దినోత్సవం ..స్వామి వివేకానంద జయంతి  ( జనవరి 12 )

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

*కెరటాలు నాకు ఆదర్శం. పడినందుకు కాదు..పడి లేచినందుకు’ స్వామి వివేకానంద*

స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 — జూలై 4, 1902),  ప్రసిద్ధి గాంచిన యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు.

వేదాంత, యోగ, తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.

స్వామి వివేకానంద గారి కొన్ని ఆణి ముత్యాలు

🤷‍♂️ 1.రోజుకు ఒక్కసారైన మీతో మీరు మాట్లాడుకొండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.

👌 2. నీ వెనుక ఏముంది…ముందేముంది… అనేది నీకనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం.

👉 3. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.

👌 4. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.

🤷‍♂️ 5. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే.

👉 6. ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి.

🫧 7. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు.

👉 8. విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు!!!

💥 9. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనలకంటే పెద్ద బలహీనత, తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు.

👌 10. లేవండి ! మేల్కొండి ! గమ్యం చేరేవరకు విశ్రమించకండి.

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂


పరమశివుడు దక్షిణామూర్తిగా దక్షిణాభిముఖుడే ఎందుకయ్యాడు..!!

 పరమశివుడు దక్షిణామూర్తిగా దక్షిణాభిముఖుడే ఎందుకయ్యాడు..!!

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

💫 పరమశివుడు మహర్షులకు జ్ఞానాన్ని బోధించదలచి దక్షిణాభిముఖుడై వటవృక్షం క్రింద కూర్చున్నాడు.

💫 అయితే,  దక్షిణాభిముఖుడే ఎందుకయ్యాడు...? ఉత్తరాభిముఖులైన జిజ్ఞాసాపరులకు జ్ఞానాన్ని బోధించేందుకే. మరి వారెందుకు ఉత్తరాభిముఖులే అయి ఉంటున్నారు? 

💫 అసలు ఉత్తర దక్షిణాలు – తూర్పు పడమరలు సూర్యగమనం వల్ల ఏర్పడే దిక్కులేనా? కాదు.  వీటికి అంతర్యంగా గొప్ప అర్దం ఉంది.

💫 ప్రతి మానవుడు బుద్ధిని కలిగి ఉన్నాడు.  అయితే,  ఆ బుద్దిలోని తెలివి అందరిది ఒకే రకంగా ఉండదు.  కనుకనే... వారి ప్రవర్తన కూడా ఒకే రకంగా ఉండదు. 

ఎవరి బుద్దిలో ఎటువంటి లక్ష్యం ఉంటుందో  వారి నడక ప్రయాణం కూడా ఆ లక్ష్యం వైపుగానే ఉంటుంది. వారి వారి నడతలను బట్టి మానవులను  నాలుగు విధాలుగా విభజించవచ్చు.

🌹 1. కొందరు మానవులు తమ తమ పుట్టు పూర్వోత్తరాలను, 

తమ వంశ చరిత్రను, పూర్వీకుల గొప్పతనాన్ని, జరిగిపోయిన విషయాలను తలచుకుంటూ మురిసిపోతూ ఉంటారు.  వీరే పూర్వభిముఖులు.  అంటే తూర్పు దిక్కుకు తిరిగినవారు అని అర్థం. (పూర్వ=తూర్పు)

🌹 2. మరి కొందరు మానవులు తమ భవిష్యత్తును గురించి ఊహించుకుంటూ,  రాబోయే వాటికోసం ఎదురు తెన్నులు చూస్తూ, ఎప్పుడూ జరగబోయే వాటి గురించే ఆలోచిస్తారు.  వీరు పశ్చిమాభిముఖులు. అంటే,  పడమర దిక్కున తిరిగినవారు అని అర్థం. (పశ్చిమ=పడమర)

🌹 3. చాలా మంది మానవులు ప్రపంచ ప్రమేయాలతో ఇరుక్కుపోయేవారు. 

జీవితం-ప్రపంచం-సుఖాలు-భోగాలు-సంపాదన-అనుభవించటం అంటూ ఇందులోనే కూరుకుపోయేవారు. వీరే దక్షిణాభిముఖులు.  అంటే,  దక్షిణ దిక్కున తిరిగిన వారు అని అర్దం

🌹 4. ఇక చాలా కొద్ది మంది మాత్రం - పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కారణంగా, 

పెద్దల యొక్క మహాత్ముల యొక్క సేవ చేసిన కారణంగా ఈ ప్రపంచ పరిమితులను దాటిపోయి సంసార జనన మరణ దుఃఖాల నుండి తరించి ముక్తులు కావాలని కోరుకునే వారు.  వీరే ఉత్తరాభిముఖులు. (ఉత్+తర =తరించి పైకి పోవాలనుకునేవారు).

💫 ఇలా నాలుగు రకాలైన మార్గాలలో ప్రయాణించే మానవుల యొక్క స్థితిని తెలియచేసేవియే నాలుగు దిక్కులు.

💫 ప్రపంచం నుండి తరించి బయట పడాలనుకునే ముముక్షువులే ఉత్తరాభిముఖులు. కనుక, సనకసనందాది మునులు జ్ఞానపిపాసులు కనుక  వారు ఉత్తరాభిముఖులు అని చెప్పటం జరిగింది.

💫 ఉత్తరాభిముఖులైన మహర్షులకు జ్ఞాన భోద చేయాలి కనుక పరమేశ్వరుడు దక్షిణాభిముఖుడు అయ్యాడు.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు 🙏

🚩 హిందువునని గర్వించు

🚩 హిందువుగా జీవించు

అష్టదిక్పాలకులు (17-Jan-23,Enlightenment Story)

 అష్టదిక్పాలకులు


ఇంద్రుడు - తూర్పు దిక్కు ఇతని భార్య పేరు శచీదేవి, ఇతని పట్టణం అమరావతి, అతని వాహనం ఐరావతం, వీరి ఆయుధం వజ్రాయుధము.

అగ్ని   - ఆగ్నేయ మూల ఇతని భార్య పేరు స్వాహాదేవి, ఇతని పట్టణం తేజోవతి, అతని వాహనం ఆయుధం శక్తిఆయుధము. తగరు, వీరి

యముడు  - దక్షిణ దిక్కు ఇతని భార్య పేరు శ్యామలాదేవి, ఇతని పట్టణం సంయమిని, అతని వాహనం మహిషము, వీరి ఆయుధం దండకము.

నైఋతి   - నైఋతి మూల ఇతని భార్య పేరు దీర్ఘాదేవి, ఇతని పట్టణం కృష్ణాంగన, అతని వాహనం గుఱ్ఱము, వీరి ఆయుధం కుంతము.

వరుణుడు   - పడమర దిక్కు ఇతని భార్య పేరు కాళికా దేవి, ఇతని పట్టణం శ్రద్ధావతి, అతని వాహనం మొసలి, వీరి ఆయుధం పాశము.

వాయువు  - వాయువ్య మూల ఇతని భార్య పేరు అంజనాదేవి, ఇతని పట్టణం నంధవతి, అతని వాహనం లేడి, వీరి ఆయుధం ధ్వజము.

కుబేరుడు  - ఉత్తర దిక్కు ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి, ఇతని పట్టణం అలక, అతని వాహనం నరుడు, వీరి ఆయుధం ఖడ్గము.

ఈశాన్యుడు  - ఈశాన్య మూల ఇతని భార్య పేరు పార్వతీ దేవి, ఇతని పట్టణం యశోవతి, అతని వాహనం వృషభము, వీరి ఆయుధం త్రిశూలము

దేవుని లెక్క (18-Jan-23,Enlightenment Story)

 ఇదీ దేవుని లెక్క:

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఇద్దరు  వ్యక్తులు కాలక్షేపానికి ఊర్లో ఉన్న గుడి దగ్గర కూర్చుని కబుర్లు  చెప్పుకుంటున్నారు. అప్పటికి కాస్త చీకటి పడుతోంది. కొంచెం మబ్బుకూడా  పట్టింది. ఇంతలో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. మీఇద్దరితో పాటు నేను మీతో  కూర్చోవచ్చా అని అడిగాడు. అందుకు ఆ ఇద్దరు అదేం భాగ్యం ఈ చోటు మాదికాదు,  మేము కూడా కాలక్షేపానికే కూర్చున్నాం నువ్వు కూడా కూర్చోమన్నారు. ముగ్గురు  కూర్చుని కబుర్లలో పడ్డారు. ఇంతలో గాలి వాన మొదలయ్యింది. వాళ్లు ఇక అక్కడ  నుంచి వెళ్లిపోలేకపోయారు.

ఇంతలో మూడో వ్యక్తికి ఆకలేసింది. అదే విషయం మిగిలిన  ఇద్దరితో చెప్పాడు. మేము కూడా అదే ఆలోచిస్తున్నాం అతడి దగ్గర మూడు నాదగ్గర  ఐదు రొట్టెలున్నాయి ఇవే అందరం పంచుకొని తిందాం అని రెండో వ్యక్తి అన్నాడు.

 కానీ ఎనిమిది రొట్టెలను ముగ్గురు సమానంగా పంచుకోవడం ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది.

అందుకు  మూడో వ్యక్తి ఒక ఉపాయం చెప్పాడు. మొత్తం ఎనిమిది రొట్టెలను మూడు మూడు  ముక్కలుగా చేద్దాం అప్పుడు వచ్చిన ఇరవైనాలుగు ముక్కలను ముగ్గురం సమానంగా  తిందాం అని అంటాడు. అది అందరికి సబబుగా తోచి ఎనిమిది రొట్టెలను మూడు మూడు  ముక్కలుగా చేసి తలా ఎనిమిది ముక్కలు తిని ఆకలి తీర్చుకొని నిద్రపోతారు.

 తెల్లవారి లేచిన తర్వాత మూడో వ్యక్తి వెళ్లిపోబోతూ  మీరు రాత్రి నాకు తోడుగా ఉండటమే కాకుండా నాకు మీ రొట్టెలు పెట్టి ఆకలి కూడా  తీర్చారు. మీకు చాలా కృతజ్ఞతలు. నా దగ్గరున్న ఎనిమిది బంగారు నాణాలు మీకు  ఇస్తాను. మీరిద్దరూ తీసుకోండి అని చెప్పి ఎనిమిది బంగారు నాణాలు ఇచ్చి  వెళ్లిపోతాడు. అతడు వెళ్లిపోయాక మొదటి వ్యక్తి నా నాలుగు బంగారు నాణాలు  నాకిస్తే నేను వెళ్లిపోతాను అంటాడు రెండో వాడితో. అయితే రెండో వ్యక్తి నీవి  మూడు రొట్టెలే నావి ఐదు రొట్టెలు కాబట్టి లెక్క ప్రకారం నాకు ఐదు బంగారు  నాణాలు, నీకు మూడు బంగారు నాణాలు చెందుతాయి అని అంటాడు.

 ఇలా వీళ్లిద్దరి మధ్య వివాదం మొదలవుతుంది.

ఈ చిక్కు  తీర్చుకోడానికి ఇద్దరు రచ్చబండకెక్కుతారు. అక్కడ న్యాయాధికారి మొత్తం కథ  విని బంగారు నాణాలు తన దగ్గర పెట్టమని చెప్పి తీర్పు తెల్లవారికి వాయిదా  వేస్తాడు.

 రాత్రి పడుకున్న తర్వాత న్యాయాధికారి కలలో దేవుడు కనిపించి ఏం తీర్పు  చెప్పబోతున్నావని అడుగుతాడు. నాకు రెండో వాడు చెబుతున్నదే న్యాయంగా  తోస్తున్నది అని అంటాడు. అందుకు దేవుడు నవ్వేసి నువ్వు కథ సరిగా విన్నావా  అని అడిగి మూడు రొట్టెలు ఇచ్చిన వాడికి న్యాయంగా ఒక్క బంగారు నాణెం మాత్రమే  ఇవ్వాలి అని అంటాడు.

 న్యాయాధికారి అదెలా అని అడుగుతాడు.

ఎలాంగంటే మొదటి  వాడి దగ్గర ఉన్నవి మూడు రొట్టెలు వాటిని అతడు 9 ముక్కలు చేశాడు. రెండో వాడి  దగ్గర ఉన్నవి ఐదు రొట్టెలు వాటిని అతడు 15 ముక్కలు చేశాడు.

అయితే  మొదటి వాడు వాడి రొట్టెల్లోని 9 ముక్కల్లో 8 అతడే తినేశాడు. కానీ రెండో  వాడు తన 15 ముక్కల్లో 7 ముక్కలు మూడో వాడికి పెట్టాడు. కాబట్టి ఏడు నాణాలు  రెండో వాడికి చెందాలి ఇదే నాలెక్క, ఇదే న్యాయం కూడా అని తేల్చేశాడు.  తెల్లవారి న్యాయాధికారి ఇదే తీర్పు చెప్పాడు. అది విని మొదటి వాడు ఇతడే నయం  3 నాణాలు ఇస్తానన్నాడు మీరు ఒక్కటే ఇస్తున్నారు అని వాపోయాడు. అది విని  న్యాయాధికారి అతడికి ఒకటే ఎలా చెందుతుందో వివరించాడు. దీన్ని బట్టి అర్థం  అయ్యిందేమిటంటే మనం వేసుకునే లెక్కలు వేరు, దేవుడి లెక్కలు వేరు. మనదగ్గర  ఉన్నదాంట్లో మనం ఎంత ఇతరులతో పంచుకోగలుగుతున్నమన్నదే దేవుడు పరిగణలోకి  తీసుకుంటాడు.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

హరిదాసు అంటె పరమాత్మతో సమానం (16-Jan-23,Enlightenment Story)

హరిదాసు అంటె పరమాత్మతో సమానం

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

గుమ్మం ముందుకు వచ్చి నాలుగు బియ్యం గింజలు కూడ వేయలేని పరిస్ధితిలో ఉన్నారు మన జనం. సంక్రాంతి ముందు మాత్రమే వీళ్ళు కనపడతారు మళ్ళి సంవత్సరం దాకా రారు. హరిదాసు అంటె పరమాత్మతో సమానం 

శ్రీ మహవిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు  హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపలు తోలగిపోతాయి 

హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే ధానధార్మలు అందుకోని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని దివించెవారు హరిదాసులు. నెలరోజులు పాటు హరినామన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరు ఇచ్చే ధన,ధాన్య , వస్తు దానాలను స్వికరిస్తారు 

సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా బావిస్తారు. ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. 

ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది.  

శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. 

హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు. 

శ్రీమద్రమారమణ గోవిందో హరీ అంటూ.. ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఐ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు. 

అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు.

హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.

హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్న ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి., మన సంస్కృతి ని కాపాడండి🙏🙏🙏🙏🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


ఎగ దీస్తే బ్రహ్మ హత్య - దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది? (29-Apr-24, Enlightenment Story)

  ఎగ దీస్తే బ్రహ్మ హత్య -  దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది?     🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺           ...