Monday 24 July 2023

ఒక ముసలిఆవిడ (29-July-23, Enlightenment Story)

 🚩 భగవద్గీత గురించి 🚩

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఒక ముసలి ఆవిడ ప్రతి రోజు గుడి ముందు యాచిస్తూ (బిక్షం అడుగుతూ) ఉండేది. ఒక రోజు , ఆ  గుడిలో నుంచి ఒక సాధువు  గారు ఆ ముసలి ఆవిడను ఇలా అడిగారు :- మీరు మంచి కుటుంబానికి చెందిన వారు, మీ కొడుకు చాలా మంచివాడు కదా.

మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు ? అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది :-  బాబు , మీకు తెలుసు కదా ! నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు.

నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది . నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు 💰 ఇచ్చి వెళ్ళాడు.*

ఆ డబ్బు 💵 మొత్తం నా అవసరాలకు అయిపోయింది. నేను కూడా ముసలిదానిని అయిపోయాను . కష్టం చేసి డబ్బు 💸💴 ను సంపాదించలేను. అందుకే గుడి ముందు ఇలా బిక్షం అడుగుతున్నాను.

అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు:- మీ కోసం మీ కొడుకు డబ్బు 💰 పంపించడం లేదా ?    ఆ ముసలావిడ ఇలా చెప్పింది :- నా కొడుకు ప్రతి నెల నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు. నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను.

సాధువు ఆమె ఇంటికి వెళ్లి చూడాలని నిర్ణయించు కుంటారు.మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపల ఉన్న గోడను చూసి ఆశ్చర్యపోతాడు. ఆ గోడకు 8 చెక్ లు అతికించి వుంటాయి. ఒక్కొక్క చెక్ విలువ ₹50,000 లు.

ఆ ముసలావిడకు చదువు రాదు. అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద వుందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడ కు వాటి విలువ గురించి వివరిస్తారు.

మనం కూడా ఈ కథలో వున్న ముసలావిడ లాంటి వాళ్ళమే. మనందరి దగ్గర కూడ భగవద్గీత గ్రంథం ఉంది. కానీ, మనకు భగవద్గీత  ఎంత విలువైన సంపదో అర్థం కాలేదు.

మనకు భగవద్గీత విలువ తెలిసి వుంటే మనం దానిని ప్రతి రోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి ఉండ వాళ్ళం.

 మనం కూడా ఆ ముసలావిడ లాగానే భగవద్గీతను ఎప్పుడో ఒక సారి ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన Show Case లో భద్రంగా పెడుతున్నాం. ఈ ప్రపంచం మొత్తం ఒక్క భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనం మన సంసృతిని విడిచిపెట్టి విదేశీ ముసుగు బారిన పడుతున్నాం.

సనాతన ధర్మం భూమిపై  అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం భగవద్గీత. చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతితో అతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత. ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త కొత్త విషయాలను ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన గ్రంథం భగవద్గీత.

ఎన్నో వ్యాధులకు మందు రామాయణ,మహాభారత భగవద్గీత లలో ఉన్నాయి. దేవుడు లేడు అని నమ్మే ఎంతో మంది నాస్తికులను సైతం గొప్ప గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత.

గొప్ప గొప్ప సైంటిస్టులను సైతం హిందువులుగా (దైవమునకు విధేయులుగా) మారుస్తున్న గ్రంథం భగవద్గీత. ప్రపంచంలో కొన్ని కోట్లమంది హృదయాలలో కంఠస్థం చేయబడ్డ గ్రంథం భగవద్గీత.

ఈ ప్రపంచంలో  ఎల్లప్పుడూ , అత్యధికంగా పఠించ బడుతున్న గ్రంథం భగవద్గీత. ఇంకా ఎన్నో గొప్ప ఘనతలు కలిగివున్న గ్రంథం భగవద్గీత. దేవుడు  మనందరికి పవిత్ర రామాయణ మహా భారతాలను భగవద్గీత చదివి, అర్థం చేసుకొని, దాని ప్రకారం జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.

   💐 సర్వే జనాః సుఖినో భవంతు 💐

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


భాగవతప్రవచనం - దొంగ కనులవెంట కన్నీరు (27-July-23, Enlightenment Story)

  *దొంగ కనులవెంట కన్నీరు*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహంలో  భాగవత   ప్రవచనం ఇస్తున్నారు. అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, ఒక మూల దాక్కున్నాడు.  భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది. తల్లి యశోద, కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు.

భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము  అని అనుకున్నాడు. దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు. బ్రాహ్మణుడు భయపడి ‘నా దగ్గర ఏమీ  లేదు‘ అని అన్నారు.

దొంగ, మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ  పడటంలేదు.  మీరు చెప్పిన, నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి’ అని అన్నాడు.

బ్రాహ్మణుడు ఆలోచించి, *బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు  రోజూ  ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు, తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు.  ఆ నల్ల మబ్బు ఛాయలో, పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు* అని ఆ దొంగ నుండి తప్పించుకోటానికి చెప్పాడు.

బ్రాహ్మణుడి మాట నమ్మి ఆ దొంగ బృందావనానికి వెళ్ళాడు. యమునా నది తీరం వద్ద కూర్చుని, ఆ ఇద్దరు పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది , ఇద్దరు పిల్లలు వస్తున్నారు. ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ.

బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ, ‘ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు‘ అని అనుకున్నాడు. ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు  వచ్చింది..

తరువాత చూస్తే, దొంగ భుజం  మీద నగలు నిండి ఉన్న ఒక మూట  ఉంది. అది తీసుకుని, ఆ బ్రాహ్మణుడి దగ్గరకి వెళ్లి, జరింగింది అంతా చెప్పాడు. ఆనందభాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన  చోటు, తనకు చూపించమని దొంగని అడిగాడు. 

ఇద్దరూ కలిసి ఆ చోటికి  వెళ్ళగానే, దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, బ్రాహ్మణుడికి, కనిపించలేదు.  అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుడితో, నీవు ఒక దొంగని  అనుగ్రహించావు , నాకు కూడా దర్శనం ఇవ్వవా?” అని  బాధపడ్డాడు.

అప్ప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు ‘నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చదివావు, కాని దొంగ, నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకం, సమర్పణ శరణాగతి ఉన్న చోటే  నేను ఉంటాను.

*నీతి: పురాణాలను  చదవడమే కాకుండా, దానిలో ఉన్నవి (ఫీల్) అనుభవించడం నేర్చుకోవాలి. మనము కూడా మన చిత్తములను ఆ చిత్త చోరునికి సమర్పిద్దాము*.✍️

* సర్వం శ్రీకృష్ణార్పణమస్తు !!!🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!!!!🙏

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


చాతకపక్షి (26-July-23, Enlightenment Story)

*చాతకపక్షి - ఋతుపవనాల పక్షి, వానకోయిలగా కూడా పిలిచే ఈ పక్షి*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఎవరైన దేనికోసమైనా, ఎవరికోసమైనా ఎదురుచూస్తుంటే, వారిని 'చాతకపక్షి' లా ఎదురుచూస్తున్నారు, అని అంటుంటారు. అంటే దీక్షకు వేచి ఉండే ఓర్పుకు ఈ చాతక పక్షి ని ఉదాహరణగా చెప్తారు. అంటే ఈ చాతకపక్షి  వర్షపు చినుకుల కోసం ఎలా ఎదురు చూస్తుందో అలాగన్నమాట. చాతకపక్షి లేదా చాతకం అంటే నీటి కోకిల జాతికి చెందిన ఒక పక్షి. చాతక పక్షి నేల మీద ఉండే నీరు తాగనే త్రాగదు. వర్షం పడుతున్నప్పుడు మాత్రమే వాన చినుకుల్ని నోరుతెరచి పట్టుకుని మింగుతుంటుంది. ఈ పక్షి మన సాంప్రదాయం ప్రకారం కేవలం తొలకరి వర్షపు నీటినే తాగుతుంది. ఒక తొలకరి అయ్యాక మరలా తొలకరి వరకూ వేరే నీరు ముట్టదు. అందుకే అది తక్కిన ఋతువుల్లో దాహంతో అలమటిస్తూ అరుస్తూ ఉంటుంది. ఇది క్యూకులైడ్ [Cuculidae] కుటుంబానికి చెందిన, క్లామటర్ [Clamator] జాతికి చెందిన, జాకబీన్ [jacobinus] ప్రజాతి పక్షి.

భారతదేశంలో కొల్లేరు సరస్సుసమీపంలో ఈ చాతక పక్షి సంచరిస్తూ ఉంటుంది. ఈ చాతక పక్షి గురించిన ఒక కథో, కల్పనో ఏమో తెలీదు కానీ ఇలా ఉంది. 

ఒక ఊళ్లో ఒక స్త్రీ ఉండేది. ఆమెకు కూతురు, కోడలు ఉన్నారు. వారికి కొంత పొలం ఉంది. నాలుగు గేదెలున్నాయి. కూతురు రెండు గేదెలు కోడలు రెండు గేదెల్ని తీసుకుని నాగలికి కట్టి పొలం దున్ని పంట పండించేవారు. తల్లి ఇంటి పని చూసేది. ఒక రోజు కూతురు, కోడలు గేదెల్ని తీసుకుని పొలానికి వెళ్లారు.  నాగలికి కట్టి పొలం దున్నడం మొదలు పెట్టారు. మధ్యాహ్నమైంది. ఎండ మండి పోతోంది. సూర్యుని తాపానికి కూతురు, కోడలు అలసిపోయారు. గేదెలూ అలసిపోయాయి. కొంచెం పొలం పని కూడా ఆరోజు కాలేదు. ఇంతలో డప్పుల మోత వినిపించింది.  ఒక గుంపు కొండపైకి పోతున్నది. కొండ మీద పెద్ద ఉత్సవం జరుగుతున్నదనీ, కూతురికి ఆ ఉత్సవానికి వెళ్లాలనీ అనిపించింది. గేదెల్ని పొలంలోనే వదిలేసి ఇంటికి పరిగెత్తుకొచ్చి తల్లితో ‘అమ్మా! కొండ మీద ఉత్సవం జరుగుతోంది. నేను వెళతాను’ అంది. తల్లి 

మొదట ‘పొలంపని వదిలేసి ఎలావెళతావు’, అనగా 'చూసి వెంటనే వచ్చేసి పొలం పని చేస్తాననడంతో తల్లి ఒప్పుకుంది. ఐతే  ‘నువ్వుగేదెల్ని చెరువు కు తీసుకెళ్లి వాటి దాహం తీర్చి తెచ్చి  కొట్టంలో కట్టేసి వెళ్లు’ అంది. కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి తాను కొండపైకి ఉత్సవానికి వెళుతున్నట్లు వదినతో చెప్పింది. గేదెల్ని చెరువుకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నించింది. కానీ, అవి అలసిపోయి ఉండటాన త్వరగా నడవలేకపోయాయి. మెల్లగా నడిచాయి. వాటిని చెరువు దాకా తీసుకెళ్ళి, నీళ్ళు తాపిస్తే  ఆలస్యమవుతుందని, చెరువుకు  వెళ్ళకుండానే  ఇంటికి తీసుకెళ్లి వాటి దాహం తీర్చకపోయినా 'నీళ్ళు తాపించా’ నని అసత్యం చెప్పి కొట్టంలో కట్టేసి కూతురు కొండ పైకి వెళ్లింది.  కోడలు మెల్లగా గేదెల్ని చెరువు దగ్గరికి తీసుకెళ్లి వాటి దాహం పూర్తిగా తీర్చి ఇంటికి తెచ్చింది. “ఎందుకు ఇంత ఆలస్యమైందని" అత్త అడిగింది. "గేదెలు అలసిఉండటం వల్ల త్వరగా చెరువుకు నడవ లేక ఆలస్యమైందని" చెప్పింది.

కూతురు కొండపైకి వెళ్లి ఎంతో సంతోషంతో ఉత్సవంచూసింది. ఇక్కడ కొట్టంలోని కూతురి గేదెలు దాహంతో అల్లాడిపోయాయి. ఎండ వేడికి, దాహానికి తాళలేక,  అవి దాహంతోనే చనిపోయాయి. చనిపోయే ముందు తమను దాహంతో కన్నుమూసేలా చేసిన కూతురు తను కూడా బతుకంతా దాహంతో అల్లాడుతూ ఉండాలని శపించాయి.

అప్పుడు కొండ మీద ఉత్సవంలో ఉన్న కూతురు 'చాతక పక్షి'గా మారిపోయింది. కూతురు తిరిగి రాకపోవడంతో తల్లి ఎంతో సేపు ఎదురుచూసింది. చాతక పక్షిగా మారిన కూతురు ఇంటికి వచ్చి ఇంటి ముందు వాలి ఎంత అరచినా తల్లి తరిమేసింది. ఆపక్షే తన కూతురని తెలుసుకోలేకపోయింది.

అందుకనే చాతక పక్షులు దాహంతో అరుస్తూ ఉంటాయి అనేది ఒక కథ. ఇది కల్పనో యదార్ధమో  తెలీకపోయినను ఎవ్వరినీ అలా దాహంతో ఉంచరాదనీ, అసత్యాలు చెప్పరాదనీ, తను చేస్తున్న పనిని వదిలేసి ఆకర్షణకు లొంగరాదని మనకు నీతులు చెప్తున్నది. మంచైనామ చెడైనా ఏది చేస్తే అదే మనకు ప్రాప్తిస్తుందనీ దీనివలన తెలుస్తున్నది.

ఇండోనేషియా ప్రభుత్వం ఈ పక్షిబొమ్మతో ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. వర్షాలు వచ్చేముందుగా భవిష్య సూచకంగా చాతక పక్షి అరుస్తుంటుందిట. చాతక పక్షి వలస వచ్చినపుడు రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాలు సమీపించినట్లేనని పక్షి శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఋతుపవనాల పక్షి, వానకోయిలగా కూడా పిలిచే ఈ పక్షి దక్షిణాఫ్రికా నుంచి ఏటా నైరుతి ఋతుపవనాలకు సుమారుగా ఐదు నుంచి ఏడు రోజుల ముందుగా వస్తుందని నమ్మకం. చాతక పక్షికి, వానలకు సంబంధం ఉన్నట్లు మహా భారతంలో, కాళిదాసు మేఘసందేశంలో కూడా ఉంది.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


వానలు పలురకాలు (25-July-23, Enlightenment Story)

 🌧️ *వానలు పలురకాలు - వానలపేర్లు ఇన్నుంటాయని తెలియదు*  

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

1. గాంధారివాన = కంటికి ఎదురుగా ఉన్నది  కనిపించనంత జోరుగా కురిసే వాన

2. మాపుసారివాన = సాయంత్రం కురిసే వాన

3. మీసరవాన = మృగశిరకార్తెలో కురిసే వాన

4. దుబ్బురువాన = తుప్పర/తుంపర వాన

5. సానిపివాన = అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వాన

6. సూరునీల్లవాన = ఇంటి చూరు నుండి ధార పడేంత వాన

7. బట్టదడుపువాన = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన

8. తెప్పెవాన = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన

8. సాలువాన = ఒక నాగలిసాలుకు సరిపడా వాన

10. ఇరువాలువాన = రెండుసాల్లకు & విత్తనాలకు సరిపడా వాన

11. మడికట్టువాన = బురదపొలం దున్నేటంత వాన

12. ముంతపోతవాన = ముంతతోటి పోసినంత వాన

13. కుండపోతవాన = కుండతో కుమ్మరించినంత వాన

14. ముసురువాన = విడువకుండా కురిసే వాన

15. దరోదరివాన = ఎడతెగకుండా కురిసే వాన

16. బొయ్యబొయ్యగొట్టేవాన = హోరుగాలితో కూడిన వాన

17. రాళ్లవాన = వడగండ్ల వాన

18. కప్పదాటువాన =  అక్కడక్కడా కొంచెం కురిసే వాన

19. తప్పడతప్పడవాన = టపటపా కొంచెంసేపు కురిసే వాన.

20. దొంగవాన = రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన

21. కోపులునిండేవాన = రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన

22. ఏక్దారవాన = ఏకధారగా కురిసే వాన

23. మొదటివాన = విత్తనాలకు బలమిచ్చే వాన

24. సాలేటివాన = భూమి తడిసేంత భారీ వాన

25. సాలుపెట్టువాన = దున్నేందుకు సరిపోయేంత వాన

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥



Thursday 20 July 2023

ఐశ్వ‌ర్యం, ఆనందం కోసం ఏం చేయాలి (28-July-23, Enlightenment Story)

 ఐశ్వ‌ర్యం, ఆనందం కోసం ఏం చేయాలి

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. త్వరలోనే ఆర్థిక స‌మ‌స్య‌లు తీరిపోతాయి.

2. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.

3. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.

4. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.

5. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి.

6. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.

7. సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది.

*అమరావతిలో కొలువైన అమరేశ్వరుడు ఇంద్రడు ప్రతిష్టించాడు*




💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Wednesday 19 July 2023

తిరుఉత్తర కోసమాంగై (22-July-23, Enlightenment Story)

 *తిరుఉత్తర కోసమాంగై*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

🍀🥀🍀 తమిళనాడులోని ఒక కుగ్రామం, రామే శ్వరం నుండి సుమారు 75 kms. దూరంలో ఉంది *తిరుఉత్తర కోసమాంగై*. మధురై వెళ్లే దార్లో వస్తుం ది ఈ ప్రదేశం. ఊరిపేరు పలకడం కొంచెం కష్టమే. మనందరికీ సొంతఊరు ఉన్నట్టే పరమేశ్వరుడికి కూడా సొంతఊరు ఉంది.

🍀🥀🍀  శివాలయం మొట్టమొదట వెలిసిన ప్రాంతం ఇదే. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు. శివభక్తురాలైన మండోదరి శివుడ్ని ప్రార్ధించి "నాకు ఒక గొప్ప శివభక్తుడ్ని భర్త గా ప్రసాదించు ఈశ్వరా!" అని వేడుకుంటే తన భక్తుడైన రావణబ్రహ్మను మండోదరికిచ్చి ఇక్కడే వివాహం జరిపారు.

🍀🥀🍀 ఏ దేవాలయంలో కూడా పూజకుపయో గించని మొగలిపువ్వును ఇక్కడ మాత్రమే స్వామి వారికి అలంకరిస్తారు. ఇక్కడ వెలసిన రేగిపండు చెట్టు 3000 సంవత్సరాలకు పూర్వమే ఉంది. ఇక్క డ శివుడు శివలింగరూపంలో, మరకతరూపంలో, స్పటికలింగంలో దర్శనమిస్తారు. నటరాజరూపం లో 5 అడుగుల విగ్రహం మరకతంతో చేయబడిం ది. ఇది అత్యంత విశిష్టమైంది.

🍀🥀🍀 ఆ మరకతం నుండి వచ్చే Vibrations ను మనం తట్టుకోలేం కాబట్టి స్వామివార్ని ఎప్పు డూ విభూది, గంధపుపూతతో ఉంచుతారు. కేవ లం ఆరుద్ర నక్షత్రంరోజు మాత్రమే నిజరూపదర్శ నముంటుంది. అలాగే ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి స్పటికలింగానికి అభిషేకం చేసి తర్వాత Locker లో  భద్రపరుస్తారు.

🍀🥀🍀 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అ త్యంతప్రాచీనమైన ఈ శివాలయదర్శనం మన పూర్వజన్మసుకృతం. ఈ ఆలయానికి సమీపంలో అమ్మవారు వారాహిరూపంలో వెలిశారు. భక్తులు పసుపుకొమ్ములను ఆ ప్రాంగణంలోనే నూరి, ము ద్దచేసి, అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. 

🍀🥀🍀 ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడిన తిరుఉత్తర కోసమాంగై ఆలయం గురించి మన ఆంధ్రులకు పెద్దగా తెలీదు. మీరెప్పుడైనా రామే శ్వరం యాత్రకెళ్తే తప్పక ఈ దేవాలయదర్శనం చేసుకోండి.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

విమానంలో భోజనం (21-July-23, Enlightenment Story)

 *విమానంలో భోజనం*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

విమానంలో నా సీట్లో కూర్చున్నాను , ఢిల్లీ కి ఆరేడు గంటల ప్రయాణం , మంచి పుస్తకం చదువుకోవటం, ఓ గంట నిద్ర పోవటం ఇవి నా ప్రయాణంలో మేం చేయాలనుకున్నవి ,సరిగ్గా టేకాఫ్ కి ముందు నా చుట్టూ ఉన్న సీట్లలో 10 మంది సైనికులు వచ్చి కూర్చున్నారు. అన్నీ నిండిపోయాయి . కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను, ఎక్కడికి వెళుతున్నారు అని ? ఆగ్రా సర్ ! ఇక్కడ రెండు వారాల శిక్షణ , తరువాత ఆపరేషన్ కి పంపిస్తారు అన్నాడు అతను.

ఒక గంట గడిచింది , అనౌన్సమెంట్ వినిపించింది. కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చును అని. సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని ఐపోతుంది అనిపించింది. నేను పర్స్ తీసుకొని లంచ్ బుక్ చేద్దాము అనుకుంటుండగా మాటలు వినిపించాయి. మనం కూడా లంచ్ చేద్దామా ? అని అడిగాడు ఆ సైనికులతో ఒకరు, వద్దు! వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ. విమానం దిగాక సాధారణ హోటల్ లో తిందాం అని వినిపించింది.

సరే అనుకోని నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకు వెళ్ళాను. ఆమెతో ఆ సైనికులందరికి లంచ్ ఇవ్వండి , అని చెప్పి అందరికీ లంచ్ కి సరిపడా డబ్బులు చెల్లించాను.

వెంటనే ఆమె కళ్ళల్లో నీరు కనపడింది , అప్పుడు చెప్పింది, నా తమ్ముడు కార్గిల్ లో ఉన్నాడు సర్, వాడికి. మీరు భోజనం పెట్టినట్లు అనిపిస్తోంది అంటూ దణ్ణం.పెట్టింది. నాకేదో లాగా అనిపించింది క్షణకాలం. నేను నా సీట్లోకి వచ్చి కూర్చున్నాను , అరగంటలో అందరికీ లంచ్ బాక్సులు వచ్చేశాయి.

నేను భోజనం ముగించి, విమానం వెనకవైపు ఉన్న వాష్ రూమ్ కు వెళుతున్నా,వెనక సీట్ నుండీ ఒక ముసలాయన వచ్చాడు, నావైపు చూస్తూ, నేను అంతా గమనించాను సర్, మీకు అభినందనలు , ఈ మంచి పనిలో నాకూ భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు , ఆ చేతిలో 500 రూపాయల నోటు నా చేతికి తగిలింది, మీ ఆనందంలో నా వంతు అన్నారాయన.

నేను వెనకకు వచ్చి నా సీట్లో కూర్చున్నాను , ఓ అరగంట గడిచింది, విమానం పైలెట్ సీట్ నంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చాడు , నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు , మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు , నేను సీటుబెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను , అతను షేక్ హ్యాండ్ ఇస్తూ *నేను గతంలో యుద్ద విమాన పైలెట్ గా పనిచేశాను , అప్పుడు ఎవరో ఒకాయన మీలాగే నాకు భోజనం కనిపెట్టారు. అది మీలోని ప్రేమకు చిహ్నం. నేను దానిని మరువలేను అన్నాడు, ఇదంతా వింటున్న విమానంలోని పాసింజర్లు అంతా చప్పట్లు కొట్టారు , నాకు చాలా సిగ్గుగా అనిపించింది.*

దానికి బదులుగా నేను అన్నాను , నేను చేసే పని నాకు మంచిది అనిపించింది, అందుకే చేశాను , పొగడ్తల కోసం చేయలేదు అన్నాను. అని అక్కడ నుంచీ లేచి కొన్ని సీట్ల ముందుకు వెళ్ళాను , ఓ 18 సంవత్సరాల కుర్రవాడు నా ముందుకు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ ఓ నోట్ పెట్టాడు. నా ప్రయాణం ముగిసింది. నేను దిగటం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను. ఒకాయన ఏమీ మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టీ వెళ్ళిపోయాడు. 

నేను దిగి వెళ్లేలోగా నాతో పాటు ప్రయాణించిన సైనికులందరూ ఒకళ్ళని ఒకళ్ళు కలుసుకుంటుంన్నారు, అంతలో నేను గబ గబా వారి దగ్గరకు వెళ్ళి , నాకు విమానంలో తోటి పాసింజర్లను ఇచ్చిన నోట్లను జేబులో నుండీ తీసి వారికి ఇస్తూ ఇలా అన్నాను , "మీరు ట్రైనింగ్ ప్లేస్ దగ్గరకు చేరే లోపు ఈ డబ్బులు మీకు ఏదైనా తినటానికి పనికి వస్తాయి అని ఆ డబ్బును వారికి అందించాను, మీరు మాకిచ్చే రక్షణ తో పోలిస్తే మేము మీకు ఎంత ఇచ్చినా , ఏమీ ఇచ్చినా తక్కువే , మీరు ఈ దేశానికి చేస్తున్న సేవకు మీకు ధన్యవాదములు , ఆ భగవంతుడు , మిమ్మల్నీ, మీ కుటుంబాలని ప్రేమగా చూడాలి అన్నాను , చిత్రంగా అలా అంటున్నప్పుడు నా కళ్ళల్లో చిరుతడి. 

ఆ పది మంది సైనికులు విమానంలోని అందరి ప్రయాణికుల ప్రేమను వారితో తీసుకువెళుతున్నారు , నేను కూడా నా కార్ ఎక్కుతూ , తమ జీవితాలను ఈ దేశం కోసం త్యాగం చేస్తున్న వీరిని దీర్ఘాయువులుగా చూడు స్వామీ అని మనః స్ఫూర్తిగా వేడుకున్నాను.

ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని భారతదేశానికి చెల్లించబడే బ్లాంక్ చెక్ లాటి వాడు , బ్రతికినంత కాలమూ జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్ లాటి వాడు.

ఇంకా వారి గొప్పతనం తెలియని వారు ఎందరో ఉన్నారు , ఎన్ని సార్లు చదివినా కంట తడి పెట్టించే ఈ ఘటన మళ్ళీ మళ్ళీ చదవండి , ఇలానే ఇంకొకరికి పంపిస్తూ ఉండండి. ఈ భారత మాత ముద్దుబిడ్డలను గౌరవించటం అంటే మనలను మనం గౌరవించుకున్నట్లే.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Tuesday 18 July 2023

మానవత్వం అంటే (19-July-23, Enlightenment Story)

 ✨*మానవత్వం అంటే ఏమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

సుధాకర్ నేను ఒక ప్రయివేట్ ఆఫీస్ లో పనిచేస్తాం.  త్వరలో ఇచ్చే ప్రమోషన్ కి మా ఇద్దరికీ అన్ని అర్హతలు ఉన్నాయి.  సోమవారమే ఇంటర్వ్యూ.  

ఈ ప్రమోషన్ తో జీతం, హోదా రెండు పెరుగుతాయి.  దీని వలన నా అహం తృప్తి పడితే సుధాకర్ కి అవసరం తృప్తి పడుతుంది. అవును వాళ్లది మధ్యతరగతి కుటుంబం. ఆర్ధిక అవసరాలు ఎక్కువ.  నాకు డబ్బు కంటే హోదా ముఖ్యం.  తండ్రి ఇచ్చిన ఇల్లు, పొలం ఉండడం వలన పెద్దగా డబ్బు అవసరాలు లేవు.  అయినా ఈ ప్రమోషన్ నాకే రావాలి.  లేకపోతే తన కింద సబార్టినేట్ గా ఉండాలి. 

ఆ ఊహే భరించడానికి ఇబ్బందిగా ఉంది.  ఎలా? ఏం చేస్తే ఈ ప్రమోషన్ నాకే వస్తుంది?..నా ఆలోచనలు ఒక కొలిక్కి రావటం లేదు. చటుక్కున ఒక అలోచన వచ్చింది..అసలు సుధాకర్ ఇంటర్వ్యూకి హాజరు అవ్వకపోతే!! ఈ ఐడియా నాకు బ్రహ్మాండంగా నచ్చేసింది

 ఏం చేసి సుధాకర్ ని ఆపాలి? ఆలోచనలలో మునిగిపోయాను.  ఇంతలో 'ఇదిగో మిమ్మల్నే..ఎన్నిసార్లు పిలిచినా పలకరేం?  మీ సుపుత్రుడు ఏం ఘనకార్యం చేసుకొచ్చాడో తెలుసా' అని నా శ్రీమతి  అరిచేసరికి ఉలిక్కిపడ్డాను. 

ఏం చేసాడు నా బంగారుతండ్రి?'శారదతోపాటు వచ్చిన కృష్ణని దగ్గరకు తీసుకుని అడిగాను.  పదేళ్ల కృష్ణ తలవంచుకున్నాడు. 'నేనే చెప్తాను లెండి' అంది శారద. 

నిన్న జరిగిన జిల్లా స్థాయి వ్యాస రచన పోటీలో సరిగ్గా రాయకుండా వచ్చాడట. కావాలనే..వాళ్ల మేడమ్ నాకు ఫోన్ చేసి చెప్పింది. బహుమతి ఐదు వేలు. అ వంశీకి వచ్చిందిట'. 

నాకు చాలా ఆశ్చర్యం వేసింది.  కృష్ణ చాలా బ్రిలియంట్.  అన్నింటిలోనూ ముందుంటాడు.'ఏంటి కన్నా..ఒంట్లో బాగోలేదా? ఆదుర్దాగా అడిగాను. 

 'అదేం లేదు డాడి..'మెల్లిగా అన్నాడు. 

 మరి..నీకు తెలియని టాపిక్ ఇచ్చారా?' 

 లేదు..చాలా ఈజీదే..'మరి..నాకు క్రమంగా కోపం వచ్చేస్తోంది. 

 డాడీ . వంశీ వాళ్లు చాలా పూర్..వాడు ప్రతీ సారి స్కూల్ ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది పడతాడు..లేటుగా కడతాడని మేడమ్ బయట నిలబెడతారు కూడా..నేను హెల్ప్ చేద్దామంటే వాడు ఒప్పుకోడు..అందుకని ...అందుకనీ..పొటీలో మేమిద్దరం ఫైనల్ లో ఉన్నాం.  ఒక వేళ నేను సరిగ్గా రాయకపోతే తప్పకుండా వాడికే ఫస్ట్ వస్తుంది.  ఆ డబ్బుతో వాడు ఫీజ్ కడితే బయట నిలబడనక్కరలేదు కదా....నేను చేసింది కరెక్టే కదా డాడీ.? 

 నా బుర్ర ఎపుడో పని చేయడం మానేసింది.  పదేళ్లు లేని నా కొడుక్కి ఉన్న పాటి మంచి ఆలోచన నాకు రాలేదు..వాడి పెద్ద మనసు ముందు నేను మరుగుజ్జుని అయిపోయిన భావన నన్ను  తలదించు కునేలా చేసింది.  వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేశాను

కన్నా.. చాలా మంచి పని చేశావురా(.ఒకటి కాదు రెండుసార్లు మనసులో అనుకున్నాను.) నీకు మంచి గిఫ్ట్ ఇద్దామనుకుటున్నాను. ఎప్పటి నుండో  అడుగుతున్నావుగా మనం ఊటీ ట్రిప్ కి వెళ్తున్నాం.' 

మా వాడి ఆనందానికి అవధుల్లేవు. థాంక్యూ.. డాడీ అంటూ నన్ను వాటేసుకుని ముద్దులు కురిపించాడు.  ఇపుడే మా ఫ్రెండ్స్ కి చెప్తాను అని పరుగు తీస్తున్న వాడిని ఆపి ఇంతకీ టాపిక్ ఏంట్రా అని అడిగాను. 'మానవత్వం' అని చెప్పి తుర్రుమన్నాడు. 

నిజానికి పసిపాపలే మనకు అసలు సిసలైన గురువులు. ప్రతి ఇంటికి తన కానుకగా ఆ దైవం ఇచ్చింది భగవద్గీత లాంటి అపసి పిల్లలే. అందుకే బడి పాఠాలు వాళ్లకు మనం నేర్పితే బ్రతుకు పాఠాలు వాళ్లే మనకు నేర్పుతారు. అందుకే  మన వొడిలోని దైవాన్ని వదిలి గుడిలో వెతకకండి మిత్రులారా! 

🌻🌹🪷🏵️🦚🌈🌻🌹🪷🏵️🦚🌈🌻🌹🪷🏵️🦚🌈🌻🌹🪷🏵️🦚🌈🌻🌹🪷🏵️🦚🌈

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

మన సంస్కృతి సంప్రదాయాలు (20-July-23, Enlightenment Story)

 *మన సంస్కృతి సంప్రదాయాలు*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

🍃 నాలుగు  ఇంగ్లిష్ ముక్కలు నేర్చుకోగానే  గొప్పవాళ్ళమైపోయినట్టు బొట్టుతీసేసి పొట్టి బట్టల్లోకి దిగిపోయే అమ్మయిలని వాళ్ళని చూసి మురిసి పోయే తల్లితండ్రులని చూస్తే అటువంటివాళ్ళకి నా తోడికోడలుని చూపించాలనిపిస్తుంది..

నాకన్నా పదేళ్లు చిన్నది.. రంగరాయ మెడికల్ కాలేజీలో మెరిట్ లో చదువుకుని పెళ్లయి USA రాగానే మొదటి సారి చూసినప్పుడు నాకు తనకి set అవుతుందా లేదా అని కొంచం భయం వేసింది.జనరేషన్ gap కదా నేనే పెద్దరికం గా జాగ్రత్త గా ఉండాలి అనుకునేదాన్ని. అక్క అనే పిలుపుతో  12 సంవతసరాల క్రితం మొదలైన మా బంధం.ఇప్పటికి బలంగా ఉందంటే తన ఒద్దిక తనమే, అక్క అక్క అని నా కూడా తిరిగే పిల్ల 2 పిల్లల తల్లి ఐయింది..

కష్టపడి రెసిడెన్సీచేసి pediatric గ్యాస్ట్రోఎంట్రోలజీ లో double ఫెలోషిప్ చేసి USA లో top చిల్డ్రన్స్ hospital లో పనిచేస్తూకూడా ఎక్కడ మన సంస్కృతి సంప్రదాయాలని ఇసుమoతకూడ వదిలిపెట్టకుండా పాటించే తనని రోజూ చూసే నాకు ఎంతముచ్చటగా ఉంటుందో. ఒకింతగర్వంగానూ ఉంటుంది.

నుదుట బొట్టు పాపిట సింధూరం నిండుగా నల్లపూసలు తో hospital dress లో చూస్తే  ప్రాణం పోసే పార్వతీదేవి లానే ఉంటుంది..

USA వచ్చినకొత్తలో రెసిడెన్సీ కి ఇంటర్వూస్ కి వెళుతున్నప్పుడు కొంతమంది బొట్టు తీసేయి కుంచం మోడరన్ గా ఉండు లేకపోతే నీకు రెసిడెన్సీ రావటం కష్టం అని చెప్పినవాళ్ళకి. మా అక్క WallStreet లో work చేస్తోంది. తన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే విజయాలు సాధిస్తోంది..తనే నాకు inspiration అని చెప్పేది..

తనకి రెసిడెన్సీ రావటం late ఐతే నాకు భయంవేసింది.నాది  IT నీది doctor filed నాల ఉండాలి అనుకోకు అని చెప్పేదాన్ని.. వింటేగా. సర్లే అక్క నా కట్టు బొట్టు వల్ల రెసిడెన్సీ రాకపోతే తొక్కలో USA ఉంటాం ఏమిటి మనం సంప్రదాయం ఒదులుకుంటాం ఏమిటి అనేది..

సంస్కృతి,సంప్రదాయాన్ని ఎక్కడ విడవకుండా one of the TOP pediatric సర్జన్ అయ్యి భారతీయ స్త్రీ గొప్పతనం తన చేతలతో చూపించే సరస్వతీదేవి నా తోడికోడలు. అక్క నీ పిల్లల్లా నాపిల్లలు పెరిగితే చాలు అంటుంది కాని నాకన్నా నేర్పుతో పిల్లలని పెంచుతోంది..

ముఖ్యం గా ఆడపిల్లని. ఒక్కనిమిషం కూడా పిల్లకి బొట్టు లేకుండా ఉంచదు.ఏదైనా culture కి సంబంధించిన question వేస్తె ప్రణవ్ కి అప్పచెపుతుంది. అన్నమాట వింటుందని. బావగారి మాట వేదవాక్కు.మీరుచెప్పండి బావగారు మీ మాటఫైనల్ అనే చెల్లెలి స్థానం తనది..

తిన్నావా అక్క అని రోజు lunch టైములో నాకువచ్చే phone తనదే. ఏదయినా స్పెషల్ surgery జరిగితే నాకు చెప్పేయాల్సిందే.

పూజలు నోములు వ్రతాలు వంటలు లో నాకు రైట్ హ్యాండ్. ప్రతిరోజూ పూజ చేసుకుని ప్రసాదం నోట్లో వేసుకుంటే గాని అడుగు బయటపెట్టదు. ఎక్కువ stress తీసుకోకు అంటే నువ్వు చేయటంలేదా అంటుంది.ప్రతీ పండగ పూజ శాస్ట్రోక్తం గా చేయవలసిందే.

మా stress busters పిల్లలే, నలుగురు కలసి ఆడుకుంటూ ఉంటే  చూసుకుని మురిసిపోతాం. సంప్రదాయం విషయంలో ఏప్రశ్న వేసిన అందరం డిస్కస్ చేసుకుని సమాధానం చెపుతాం.

మాటలతో కన్నా చేతలతో పిల్లలని మన సంస్కృతిక వారసుల గా ఉంచగలమని నమ్మి ఆచారించే నాకు మావారికి  మీకుతోడు నీనున్న అనే support తన చేతలతో ఇస్తూనే ఉంటుంది. ఇదంతా ఎందుకుంచెపుతున్నాను అంటే

మన సంస్కృతి సంప్రదాయాలని ఒదులుకోకుండా ఉన్నత స్థానాలని అందుకోవచ్చు అనటానికి నా తోడికోడలు ఉదాహరణ.

ఈమధ్య ఒక సోదరుడు బొట్టుమీద ఈగోలేంటి,మీ moral పోలీసింగ్ ఏమిటండి?కూడా  పట్టుకుతిరుగుతామా ఏంటి అని వెటకారం గానే అన్నారు. అదే విషయం తోడికోడలుతో అంటే.. ఏమి smartphone పట్టుకుని తిరగటానికి ఉన్నచేతులు ఓ స్టికర్ ప్యాకెట్ బ్యాలో పడేసుకోలేరా అని చెప్పాల్సింది అక్కఅంది.

నాకన్నా కట్టర్ ఐపోతోంది అనుకున్న. అదేమాట తనతో అంటే, అవ్వాలి అక్క లేకపోతే హిందువులు బ్రతికే పరిస్థితి ఉందా,భాష వేషం లో మన ఐడెంటిటీ కోల్పోతే నువ్వెవరు అంటే ఏంచెప్పుకుంటారు మనపిల్లలు.

నా మాటలు నాకే చెప్పింది. ఇంతకి తన పేరు చెప్పలేదుగా. Dr స్రవంతి.

ఈ generation పిల్లలకి ముఖ్యంగా వారి తల్లి తండ్రులకి నా ది ఒకటే విన్నపం. చరిత్ర తెలుకోండి, సంస్కృతిని వదులుకోకండి, చదువుకి ఆచరణ అడ్డం కానే కాదు చదువుతో పాటు. మన భాష,వేషం, ఆహారం, కుటుంబం విలువలు ఇవే మనల్ని ప్రపంచ వేదిక మీద ప్రత్యేకంగా నిలబెడతాయి..

 ✒️ శారదా వాసుదేవ్ గారు..వాల్ స్ట్రీట్.. అమెరికా 


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Monday 17 July 2023

యక్షప్రశ్నలు (18-July-23, Enlightenment Story)

 *యక్షప్రశ్నలు*

🍁🍁🍁🍁🍁🍁

ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు.వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు..:

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగు వారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింప చేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచి యున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేని వలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహాయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సు వలన సాధు భావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధు భావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మృత్యు భయము వలన)

12. జీవన్మృతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశం కంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలి కంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తృణం కంటే దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్య చే)

20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ఞం చేయుట వలన)

21. జన్మించియు ప్రాణం లేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడం వలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గృహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ, దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కుమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషి దేని వల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)

36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)

39. ఎవరితో సంధి శిథిలమవదు? (సజ్జనులతో)

40. ఎల్లప్పుడూ తృప్తిగా పడి యుండునదేది? (యాగ కర్మ)

41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)

42. అన్నోదకాలు వేని యందు ఉద్భవిస్తాయి? (భూమి, ఆకాశము లందు)

43. లోకాన్ని కప్పి వున్నది ఏది? (అజ్ఞానం)

44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)

45. మనిషి దేనిని విడచి సర్వజన ఆదరణీయుడు, శోక రహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో)

46. తపస్సు అంటే ఏమిటి? ( తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం)

47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)

48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)

49. సర్వ ధనియ అనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు)

50. జ్ఞానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించగలగడం)

51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)

52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)

53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)

54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ఞానం కలిగి ఉండటం)

55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)

56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)

57. దానం అంటే ఏమిటి? ( సమస్త ప్రాణుల్ని రక్షించడం)

58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)

59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు)

60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)

61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ఞానం)

62. డంభం అంటే ఏమిటి? (తన గొప్ప తానే చెప్పుకోవటం)

63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)

64. నరకం అనుభవించే వారెవరు? (ఆశ పెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు)

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)

67. ఆలోచించి పని చేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు)

68. ఎక్కువ మంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)

69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పు లేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)

70. ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)

71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ, అప్రియమూ, సుఖమూ, దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)

72. స్ధితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందూ, కలిమి లేములందూ, సుఖ దు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్ధి కలవాడుగా ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడంటారు)

🙏🙏సర్వేజనాసుఖినోభవంతు🙏🙏




💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Friday 14 July 2023

వయస్సు దాటుతున్న వేళ (17-July-23, Enlightenment Story)

 వయస్సు దాటుతున్న వేళ

🔥🌹🔥🌹🔥🌹🔥🔥🌹🔥

1. ఈ సమయం ఇన్నాళ్ళూ సంపాదించినదీ, దాచుకున్నదీ తీసి ఖర్చు పెట్టే వయసు. తీసి ఖర్చు పెట్టి జీవితాన్ని ఎంజాయ్ చెయ్యండి. దాన్ని ఇంకా దాచి అలా దాచడానికి మీరు పడిన కష్టాన్ని, కోల్పోయిన ఆనందాలనూ మెచ్చుకునేవారు ఎవరూ ఉండరు అనేది గుర్తు పెట్టుకోండి

2. మీకొడుకులూ, కోడళ్ళూ మీరు దాచిన సొమ్ము కోసం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో? ఈ వయసులో ఇంకా సంపాదించి సమస్యలనూ, ఆందోళనలూ కొని తెచ్చుకోవడం అవసరమా? ప్రశాంతంగా ఉన్నది అనుభవిస్తూ జీవితం గడిపితే చాలదా?

3. మీ పిల్లల సంపాదనలూ, వాళ్ళ పిల్లల సంపాదనల గురించిన చింత మీకు ఏల? వాళ్ళ గురించి మీరు ఎంత వరకూ చెయ్యాలో అంతా చేశారుగా? వాళ్లకి చదువు, ఆహారం, నీడ మీకు తోచిన సహాయం ఇచ్చారు. ఇపుడు వాళ్ళు వాళ్ళ కాళ్ళమీద నిలబడ్డారు. ఇంకా వాళ్ళ కోసం మీ ఆలోచనలు మానుకోండి. వాళ్ళ గొడవలు వాళ్ళను పడనివ్వండి.

4. ఆరోగ్యవంతమైన జీవితం గడపండి. అందుకోసం అధిక శ్రమ పడకండి. తగినమోతాదులో వ్యాయామం చెయ్యండి. (నడక, యోగా వంటివి ఎంచుకోండి)తృప్తిగా తినండి.హాయిగా నిద్రపోండి. అనారోగ్య పాలుకావడం ఈ వయసులో చాలా సులభం, ఆరోగ్యం నిలబెట్టుకోవడం చాలా కష్టం. అందుకే మీ ఆరోగ్య పరిస్థితిని గమనించుకుంటూ ఉండండి. మీ వైద్య అవసరాలూ, ఆరోగ్య అవసరాలూ చూసుకుంటూ ఉండండి. మీ డాక్టర్ తో టచ్ లో ఉండండి. అవసరం అయిన పరీక్షలు చేయించుకుంటూ ఉండండి. (ఆరోగ్యం బాగుంది అని టెస్ట్లు మానేయకండి)

5. మీ భాగస్వామి కోసం ఖరీదైన వస్తువులు కొంటూ ఉండండి. మీ సొమ్ము మీ భాగస్వామితో కాక ఇంకెవరితో అనుభవిస్తారు? గుర్తుంచుకోండి ఒకరోజు మీలో ఎవరో ఒకరు రెండో వారిని వదిలిపెట్ట వలసి వస్తుంది. మీ డబ్బు అప్పుడు మీకు ఎటువంటి ఆనందాన్నీ ఇవ్వదు. ఇద్దరూ కలిసి అనుభవించండి.

6. చిన్న చిన్న విషయాలకు ఆందోళన పడకండి. ఇప్పటి వరకూ జీవితంలో ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొన్నారు. ఎన్నో ఆనందాలూ, ఎన్నో విషాదాలూ చవిచూశారు. అవి అన్నీ గతం. మీ గత అనుభవాలు మిమ్మల్ని వెనక్కులాగేలా తలచుకుంటూ ఉండకండి, మీ భవిష్యత్తును భయంకరంగా ఊహిచుకోకండి. ఆ రెండిటి వలన మీ ప్రస్తుత స్థితిని నరకప్రాయం చేసుకోకండి. ఈరోజు నేను ఆనందంగా ఉంటాను, ఉన్నాను అనే అభిప్రాయంతో గడపండి. చిన్నసమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి.

7. మీ వయసు అయిపొయింది అనుకోకండి. మీ జీవిత భాగస్వామిని ఈ వయసులో ప్రేమిస్తూనే ఉండండి. జీవితాన్ని ప్రేమిస్తూనే ఉండండి. కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉండండి. మీ పొరుగు వారిని ప్రేమిస్తూ ఉండండి. జీవితంలో ప్రేమ, అభిమానం, తెలివితేటలూ ఉన్నన్ని నాళ్ళూ మీరు ముసలివారు అనుకోకండి. నేను ఏమిచెయ్యగలనూ అని ఆలోచించండి. నేను ఏమీ చెయ్యలేను అనుకోకండి

8. ఆత్మాభిమానంతో ఉండండి. (మనసులోనూ బయటా కూడా) హెయిర్ కట్టింగ్ ఎందుకులే అనుకోకండి. గోళ్ళు పెరగనియ్యిలే అనుకోకండి. చర్మసౌందర్యం మీద శ్రద్ధ పెట్టండి. పళ్ళుకట్టించుకోండి. ఇంట్లో పెర్ఫ్యూమ్ లూ, సెంట్లూ ఉంచుకోండి. బాహ్య సౌందర్యం మీలో అంతః సౌందర్యం పెంచుతుంది అనే విషయం మరువకండి. మీరు శక్తివంతులే!

9. మీకు మాత్రమే ప్రత్యేకం అయిన ఒక స్టైల్స్ ఏర్పరచుకోండి. వయసుకు తగ్గ దుస్తులు చక్కటివి ఎంచుకోండి. మీకు మాత్రమే ప్రత్యేకం అయినట్టుగా మీ అలంకరణ ఉండాలి. మీరు ప్రత్యేకంగా హుందాగా ఉండాలి.

10. ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉండండి. న్యూస్ పేపర్లు చదవండి. టీవి న్యూస్ చూడండి. పేస్ బుక్ , వాట్సాప్ లలో ఉండండి. మీ పాత స్నేహాలు మీకు దొరకవచ్చు.

11. యువతరం ఆలోచనలను గౌరవించండి. మీ ఆదర్శాలూ వారి ఆదర్శాలూ వేరు వేరు కావచ్చు. అంత మాత్రాన వారిని విమర్శించకండి. సలహాలు ఇవ్వండి, అడ్డుకోకండి. మీ అనుభవాలు వారికి ఉపయోగించేలా మీ సూచనలు ఇస్తే చాలు. వారు వారికి నచ్చితే తీసుకుంటారు. దేశాన్ని నడిపించేది వారే!

12. మా రోజుల్లో అంటూ అనకండి. మీరోజులు ఇవ్వే! మీరు బ్రతికి ఉన్నన్ని రోజులూ ఈరోజు నాదే అనుకోండి. అప్పటి కాలం స్వర్ణమయం అంటూ ఆ రోజుల్లో బ్రతకకండి. తోటి వారితో కఠినంగాఉండకండి. జీవితకాలం చాలా తక్కువ. పక్కవారితో కఠినంగా ఉండి మీరు సాధించేది ఏమిటి? పాజిటివ్ దృక్పధం, సంతోషాన్ని పంచే స్నేహితులతో ఉండండి. దాని వలన మీ జీవితం సంతోషదాయకం అవుతుంది. కఠిన మనస్కులతో ఉంటే మీరూ కఠినాత్ములుగా మారిపోతారు. అది మీకు ఆనందాన్ని ఇవ్వదు. మీరు త్వరగా ముసలివారు అవుతారు.

13. మీకు ఆర్ధికశక్తి ఉంటే, ఆరోగ్యం ఉంటే, మీ పిల్లలతో మనుమలతో కలిసి ఉండకండి. కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం మంచిది అని అనిపించవచ్చు. కానీ అది వారి ప్రైవసీకి మీ ప్రైవసీకి కూడా అవరోధం అవుతుంది. వారి జీవితాలు వారివి. మీ జీవితం మీది. తప్పని పరిస్థితుల్లో వారికి అవసరం అయినా, మీకు అవసరం అయినా తప్పక పిల్లలతో కలిసి ఉండండి.

14. మీ హాబీలను వదులుకోకండి. ఉద్యోగ జీవితంలో అంత ఖాళీ లేదు అనుకుంటే ఇప్పుడు చేసుకోండి. తీర్థయాత్రలు చెయ్యడం, పుస్తకపఠనం, డాన్స్, పిల్లినో, కుక్కనో పెంచడం, తోట పెంపకం, పెయింటింగ్, రచనా వ్యాసంగం, ఏదో ఒకటి ఎంచుకోండి.

15. ఇంటి బయటకు వెళ్ళడం అలవాటు చేసుకోండి. కొత్తపరిచయాలు పెంచుకోండి. పార్కుకి వెళ్లండి. గుడికి వెళ్ళండి. ఏదైనా సభలకు వెళ్ళండి. ఇంటి బయట గడపడం కూడా మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

16.మర్యాదగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. పిర్యాదులు చెయ్యకండి. లోపాలను ఎత్తిచూపడం అలవాటు చేసుకోకండి. విమర్శించకండి. పరిస్థితులను అర్ధం చేసుకుని ప్రవర్తించండి. సున్నితంగా సమస్యలను చెప్పడం అలవాటు చేసుకోండి.

17. వృద్ధాప్యంలో బాధలూ, సంతోషాలూ కలిసి మెలసి ఉంటాయి. బాధలను తవ్వి తీసుకుంటూ ఉండకండి. అన్నీ జీవితంలో భాగాలే

18. మిమ్మల్ని బాధపెట్టిన వారిని క్షమించండి. మీరు బాధపెట్టిన వారిని క్షమాపణ కోరండి. మీతో పాటు అసంతృప్తిని వెంటబెట్టుకోకండి. అది మిమ్మల్ని విచారకరం గానూ, కఠినంగానూ మారుస్తుంది. ఎవరు రైటు అన్నది ఆలోచించకండి.

19. ఒకరిపై పగ పెట్టుకో వద్దు. క్షమించు, మర్చిపో, జీవితం సాగించు.

20. నవ్వండి నవ్వించండి. బాధలపై కూడా నవ్వుతూ వుండండి. ఎందరికన్నానో మీరు అదృష్టవంతులు.

దీర్ఘకాలం హాయిగా జీవించండి. ఈ వయసు వరకు కొందరు రాలేరు అని గుర్తించండి. మీరు పూర్ణ ఆయుర్దాయంపొందినందుకు ఆనందించండి. అందరు బాగుండాలి, అందులో నేనుండాలి అనుకోండి.



*సర్వేజనా సుఖినోభవంతు. ధర్మాన్ని రక్షించండి. ధర్మం మిమ్ములను రక్షిస్తుంది.*

ధర్మో రక్షిత రక్షితః🙏


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


చంద్రయాన్ -3 (15-July-23, Enlightenment Story)

*చంద్రయాన్ -3*

🔥🌹🔥🌹🔥🌹🔥

చంద్రయాన్ -3 అనేది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టదలచిన చంద్ర యాత్ర. భారత చంద్రయాన్ కార్యక్రమంలో ఇది మూడవది. చంద్రయాన్-2 లో లాగానే ఇందులో కూడా ఒక రోవరును, ఒక ల్యాండరునూ పంపుతారు. కానీ ఇందులో ఆర్బిటరు ఉండదు. దాని ప్రొపల్షను మాడ్యూలే రిలే ఉపగ్రహం లాగా పనిచేస్తుంది. ఈ ప్రొపల్షను మాడ్యూలు చంద్రుని చుట్టూ 100 కి.మీ.

తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది. గురువారం ఉదయం స్వామివారి‌ నైవేద్య విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకుని చంద్రయాన్-3 సూక్ష్మ నమూనాలను పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి శుక్రవారం మధ్యాహ్నం2.35 గంటలకు చంద్రయాన్-3 ప్రయోగం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం వేళ ఇస్రో అధిపతి సోమనాథ్ సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇస్రో ఏ ప్రయోగం చేపట్టినా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చంద్రయాన్ 3 భూ కక్ష్య లోకి ప్రవేశం విజయవంతం. 24 రోజులు భూ కక్ష్య లోనే ఉంటుంది. 24 రోజుల తర్వాత చంద్రుని వైపు పయనం. మొత్తం 3.60 లక్షల కిలోమీటర్ల పయనం. Rs.613 కోట్ల రూపాయల వ్యయం. మొత్తం ప్రయాణం 40 రోజులు. చంద్రయాన్ బరువు 3,900 కిలోలు. ఆగష్టు 23 చంద్రునిపై ల్యాండ్ అయ్యే అవకాశం. చంద్రుడిపై రోవర్ ల్యాండింగ్ అచ్చట ఉండి, చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనం చేయనున్న రోవర్. మరో 40 రోజులలో చందమామను చేరే ఘట్టం ఆవిష్కృతం. అంతరిక్షంలో సరి కొత్త అధ్యాయం. ఓ చారిత్రక ప్రయోగం. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ. యావత్ ప్రపంచం దృష్టి చంద్రయాన్ పైనే. ప్రపంచానికి భారత్ సత్తా చూపే సమయం. ఇస్రో శాస్త్రవేత్తల నిర్విరామ కృషి కోట్లాది భారతీయుల ఆశల రాకెట్ స్వప్నం సాకారమయ్యె సమయం మరికొన్ని రోజులలో.

జయహో చంద్రయాన్. జయ జయహో భారత్ మేరా భారత్ మహాన్ హై.



🇮🇳🇮🇳🇮🇳🚀🚀🇮🇳🇮🇳🇮🇳 💐💐💐🌙🌙💐💐💐 Today,India witnessed a magnificent feat in moon exploration. Indian Space Research Organization (ISRO) successfully launched India's third lunar mission, Chandrayaan 3, today at 2:35 pm, from the Satish Dhawan Space Centre in Sriharikota in Andhra Pradesh. Its an exciting and proud moment for every Indian watching the live telecast .If everything goes normal then landing on the moon is expected on August 23rd at around 5.47 pm IST. Prime Minister Narendra Modi called it a "new chapter" in the country's space Odyssey which has elevated the dreams and ambitions of every Indian. Some criticize that spending funds on space exploration is not important. There's no denying that there are many important issues facing humanity that need fixing. But to deal with those problems doesn’t mean we have to stop looking up, stop exploring, and stop making discoveries. Human civilization has astonishing capacity, and we can do more than one important thing at a time. If someone thinks that a particular issue should get more attention and investment, they can and should advocate for that. The problems we face don’t persist because we’re spending money on space science and exploration. And there’s no reason to pit our aspirations against one another. In our modern world, we’re often looking for instant gratification. But science isn’t always like that. Nuclear power wasn’t harnessed for decades after the idea was first proposed; Many such countless achievements have helped bring about the modern world, with billions of people enjoying a higher quality of life than ever before. In conclusion, the Chandrayaan-3 mission is an exciting development for India's space program and for the global scientific community. The mission will build on the success of the previous mission and will help to further our understanding of the Moon and its resources. With the grace of Lord Ranganatha Swamy, lets hope for the successful landing of Chandrayaan 3 on moon...
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

శాలువా నాకెందుకు - శ్రీ టంగుటూరి ప్రకాశంపంతులు (16-July-23, Enlightenment Story)

*శాలువా నాకెందుకు ఆరటి పళ్ళు ఇస్తే ఓక పూట గడిచేదిగా అన్న మాజీ ముఖ్యమంత్రి*

 🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹

నాలుగో క్లాస్ చదువుతున్న ఓ కుఱ్ఱాడు తన పరీక్ష ఫీజుకు మూడు రూపాయలు లేక, వాటి కోసం తన ఊరుకు 25 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ బావ గారింటికి కాలి నడకన బయల్దేరాడు. తీరా చేసి బావ గారింటికి వెడితే *నా దగ్గర మాత్రం ఎక్కుడ ఉన్నాయిరా* అన్నాడా బావ గారు. చేసేదేముం దనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ 25 మైళ్ళు తిరిగి నడుచుకుంటూ ఇంటికొచ్చేశాడు, ఆ కుఱ్ఱాడు. 

ఆ పరిస్థితికి తల్లడిల్లి పోయిన ఆతని తల్లి తన పెళ్ళినాటి పట్టుచీరను అమ్మి ఆ మూడు రూపాయల ఫీజు కట్టింది.ఆ తరువాత ఎన్నో ఎన్నెన్నో ఢక్కా మొక్కీలు తిని తన కిష్టమైన ప్లీడరీ పరీక్షలో నెగ్గి, అక్కడితో తృప్తి పడక ఇంగ్లండ్ పోయి, బారిష్టరయ్యి, మద్రాస్ మైలాపూర్ అరవ మేధావులతో పోటీపడి ఆ రోజులలోనే (1917-18 నాటికే) రోజుకు వెయ్యి రూపాయల ఫీజు తీసుకునే స్థాయిలో, కోస్తా జిల్లాలన్నిటిలో భూములు బంగళాలు కొనుగోలు చేసేటంతగా ఎదిగిన మన కాలపు మేరు నగధీరుడు శ్రీ టంగుటూరి ప్రకాశంపంతులు 🙏

గాంధీజీ పిలుపుతో తన ప్లీడరు వృత్తిని వదిలి, జాతీయ ఉద్యమంలోకి ఉరికాడు. తన సర్వస్వాన్ని ప్రజాసేవకే అంకితం చేశాడు. లాయర్ గా ఎంతోమందిని జైళ్ళ నుంచి బైటకు తెచ్చిన ఆయన ప్రజల కోసం తాను స్వచ్చందంగా జైలు శిక్షను అనుభవించాడు. 

గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం 'స్వరాజ్య' పత్రికను స్థాపించి గాంధీజీ నిజమైన అనుచరునిగా ఆయన మెప్పును పొందాడు. అదే గాంధీజీ, కొందరి చెప్పుడు మాటలు విని ఆయనను తప్పు పట్టుకుంటే, గాంధీజీని సైతం నిలదీశాడు. సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా మద్రాస్ నగరంలో హర్తాళ్ జరిగినప్పుడు, తెల్లవాడి తుపాకీకి తన గుండెనే ఎదురు పెట్టాడు.  

ఆనాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి రెవిన్యూ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు (1953) తొలి తెలుగు ముఖ్యమంత్రి అయ్యాడు. దురాశాపరుల మూలంగానూ, అప్పటి శాసన సభ స్పీకర్ తెలివి తక్కువ తనం మూలం గానూ ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పతనమైనప్పుడు, వ్యతిరేకంగా ఓటు వేసిన వారు తమ తప్పు తెలుసుకుని మళ్ళీ ఓటింగ్ కు వెడదామని బ్రతిమాలుకున్నా వినకుండా శాసనసభ నుండి తిన్నగా గవర్నర్ వద్దకు వెళ్ళి తన రాజీనామాను సమర్పించాడు.  కేవలం 13 నెలల తన ప్రభుత్వ కాలంలో ఆ రోజుల్లోనే 14 నీటి పారుదల ప్రాజెక్టులు స్థాపించాడు.  

శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం స్థాపించాడు. తెలుగు వారికి ఓ హైకోర్టు స్థాపించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులకు శాసనబద్దత కల్పించాడు.  సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రధమ స్థానంలో నిలిపాడు.  

బెజవాడలో కాటన్ దొర కట్టిన బ్యారేజి కొట్టుకుపోయే పరిస్థితి వస్తే, అప్పటి  కేంద్ర ప్రభుత్వం పైసా కూడ ఇవ్వలేమని స్పష్టం చేస్తే, రాష్ట్ర నిధులనన్నీ మళ్ళించి యుద్ధ ప్రాతిపదికన బ్యారేజిను బాగు చేయించి నిలబెట్టాడు. ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజలమీద వెయ్యకుండా, ఆ లోటును సరిదిద్దాడు.  

అందుకే ప్రజలందరూ ఆ బ్యారేజ్ ను, ఆయన పేరునే ప్రకాశం బ్యారేజ్ గా పిలుచుకుంటున్నారు.  రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా, దేశంలోనే తొలిసారిగా ఖైదీలందరినీ విడుదల చేశాడు.అంతటి మహనీయుడు తన చరమ దశలో కటిక దారిద్ర్యాన్ని అనుభవించాడు.  

తనను శాలువతో సత్కరిస్తే 'ఈ శాలువ నాకెందుకురా! ఆ డబ్బుతో అరటి పళ్ళు కొని తెస్తే ఓ పూట గడిచేది కదురా!!' అని తన అనుచరునితో అన్నారంటే ఆయన పరిస్థితి అర్థం  చేసుకోవచ్చు..

ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన మహా నాయకులందరూ అధికారం కోసం ఆయనకు వెన్నుపోటు పొడిచినా, ఆయన అధికారం కోసం ప్రాకులాడలేదు. 85 సంవత్సరాల వయస్సులో రోహిణీ కార్తె మండు టెండలో వడ దెబ్బకు మరణించిన ఇద్దరు ముదుసలుల కుటుంబ పరామర్శ కోసం వెళ్ళి తాను వడదెబ్బ తిని తెలుగు పౌరుషాన్ని పై లోకాలకు తీసుకుపోయిన "ఆంధ్రకేసరి"  టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నమస్సులు..

ఇలాంటి నిస్వార్థ పరులు పుట్టిన పవిత్రభూమి మన భారత భూమి అని చెప్పండి..!!!

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥



ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి
పదవీ కాలం
అక్టోబరు 11953నవంబరు 151954
తరువాతబెజవాడ గోపాలరెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననంఆగష్టు 231872
మరణంమే 201957
జీవిత భాగస్వామిహనుమాయమ్మ


Thursday 13 July 2023

మానవ జన్మ ఎందుకు (30-July-23, Enlightenment Story)

 మానవ జన్మ ఎందుకు

🔥🌹🔥🌹🔥🌹🔥🌹

మంత్రానికి పనికిరాని అక్షరమే ఉండదు. ఏ ఏ అక్షరాన్ని ఏవిధంగా ఉచ్చరించాలో, ఏ స్థలంలో ఉపయోగించాలో, ఆవిధంగా ఉపయోగించి, దాన్ని మంత్రంగా ప్రయోగించడం అనేది మంత్రశాస్త్ర పరిభాష తెలిసినవారికి మాత్రమే సాధ్యమౌతుంది. మందుకు పనికిరాని మూలికలనేవి ఉండవు. మూల మంటే వేరు, ఔషధమంటే మందు. ఏయే చెట్టు వేర్లు, మూలికలు ఉపయోగిస్తే, ఏ రోగానికి మందుగా ఉపయోగించవచ్చు, అనేది ఆయుర్వేద వైద్య రంగంలో నిష్ణాతులైన వారికి మాత్రమే తెలిసిన మర్మం. అయోగ్యులంటే అప్రయోజకులు. దేనికీ పనికిరాని వారు, అసలీ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు. భగవంతుని సృష్టిలో దేని ప్రయోజనం దానికి ఉంటుంది.

పిపీలికాది పర్యంతం అంటే చీమ మొదలుకొని ప్రతి ప్రాణి ఏదో ఒక ప్రయోజనం తోనే సృష్టించబడింది. భగవంతుడి మాయ మనకు అవగాహన కావడమనేది చాల కష్టం. సృష్టిలో పనికిరాని మనిషి ఉన్నాడా అంటే ఉండడు, అందరూ ఏదో ఒక విధంగా పనికివస్తారు.

యోజగః తత్ర దుర్లభః !!

యోజగః = చక్కగా ఆలోచించ గలిగినవాడు, దుర్లభః = అరుదు. అంటే దేనిని ఏ విధంగా ఉపయోగిస్తే అది ప్రయోజనకారిగా ఉంటుందని, చక్కగా యోచించి, ప్రయత్నం చేసి, ఆచరించ గలిగె వారే ఈ సృష్టిలో చాలా అరుదని దీని అర్థం.

“జీవులేనుబది నాల్గు లక్షల చావు పుట్టుక లిక్కడా ఎవరు చేసిన కర్మము వారనుభవించే దక్కడా”

అని చాటుతుందొక తత్త్వగేయం. ఈ సృష్టిలో జీవరాశులు 84 లక్షల రకాలు. ఇన్ని ప్రాణుల లోను మానవుడనే ప్రాణి ఉన్నతమైన వాడు, విశిష్టమైన వాడు. కారణం, కన్ను, ముక్కు, చెవి వంటి పంచేంద్రియములతో పాటు, జ్ఞానమనే ఆరవ ఇంద్రియంద్రియములతో విశిష్టమైంది. ఇతర ప్రాణుల నుండి మనిషిని వేరుచేసేది విచక్షణాజ్ఞానం.

ఏది మంచి, ఏది చెడు, ఏది పాపం, ఏది పుణ్యం. ఏది అక్రమం, ఏది సక్రమం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం అనే విచక్షణాజ్ఞానం కలవాడు మానవుడు. ఏది ధర్మం..? ఏది అధర్మం..? అని మనం ప్రశ్నించు కొంటే మహాభారతంలో దీనికి సరైన సమాధానం లభిస్తుంది.

“ఒరు లేయవి యొనరించిన నరవర! యప్రియము తన మనంబునకగు నొరులకు నవి సేయకునికయ పరాయణము ధర్మపథముల కెల్లన్”

ఇతరులు, ఎదుటి వారు ఏ పనిని చేసిన యెడల నీ మనస్సుకు అప్రియము, అంతే కష్టం కలుగునో, ఆ పనిని నీవు ఇతరుల యెడ చేయవలదు. అంటే ఇతరులకు కష్టం కలిగించే ఏ పనీ నీవు చేయవద్దు. ఇదే అన్ని ధర్మాల కంటే పరమధర్మము. నీ కర్తవ్యమును నీవు నిర్వర్తిస్తూ, అందరికి ప్రయోజనకరమైన పనులు, నిస్వార్థమైన సేవలు చేస్తూ జీవించిన యెడల మానవజన్మ సార్థకమగును.

🙏ఓం నమో నారాయణాయ🙏

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

స్నేహం ఓ వరం (23-July-23, Enlightenment Story)

 స్నేహం ఓ వరం.

🔥🌹🔥🌹🔥🌹

మా మనవడిని పాఠశాలలో దింపడానికి వెళ్ళాను చాలా రోజుల తరువాత. వాడిప్పుడు పదో తరగతి చదువుతున్నాడు.నాకు ఆ పాఠశాల ఆవరణలో రంగురంగుల బెంచ్ ఒకటి కనిపించింది. నేను మా మనవడిని అడిగాను నవ్వుతూ "ఏరా మీ స్కూల్లో ఇదొక్కటేనా బెంచి కూర్చోవడానికి.."

"కాదు తాతగారు, ఆ బెంచ్ 'స్నేహితుల బెంచి' అన్నాడు నా మనవడు నాతో.నేను ఆశ్చర్యంగా "అంటే ఏమిట్రా ? 

నా మనవడు చిరునవ్వుతో అన్నాడు "తాతాగారు, పిల్లలు కొత్తగా చేరినప్పుడు లేదా ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే ఆడుకోవడానికి ఎవరూ లేనప్పుడు ఆ బెంచి మీద కూర్చుంటారు. అలా ఒంటరిగా ఉన్న అబ్బాయిని చూసి , వాళ్ళతో జతకట్టడానికి , స్నేహం చెయ్యడానికి, ఆడుకోవడానికి , ఎవరో ఒకరు వచ్చి కూర్చుని స్నేహం చేస్తారు" అన్నాడు.

నేను మనసులో ఎంత అద్భుతమైన ఆలోచన  ఎవరిదో కానీ అనుకుని , మావాడిని అడిగాను "ఒరే, నువ్వెప్పుడన్నా ఆ బెంచి మీద కూర్చున్నావా?"

"కూర్చున్నాను తాతగారు, నేను ఈ స్కూల్లో కొత్తగా చేరినప్పుడు, నాకు ఎవరూ పరిచయం లేనప్పుడు" అన్నాడు నాతో నెమ్మదిగా, ఎదో గుర్తు చేసుకుంటున్నట్టు.

"నేను ఆ బెంచి మీద కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి పరిచయం చేసుకుని నాతో అడుకున్నాడు. మేమిద్దరం అప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని, నాకెప్పుడైనా ఎవరైనా ఆ బెంచి మీద కూర్చుని ఒంటరిగా కనిపిస్తే నేను వెళ్లి వాళ్ళతో కబుర్లు చెప్పి, వాళ్ళతో అడుకుంటాను తాతగారు" అన్నాడు . 

ఓ నిముషం ఆగి "ఆ బెంచ్ మీద కూర్చున్న వాళ్లు మూడో నాలుగో తరగతి పిల్లలైనా కూర్చుని వాళ్ళతో కబుర్లు చెప్తే బావుంటుంది తాతయ్య, వాళ్లెప్పుడు కనిపించినా అన్నయ్యా అంటూ నా దగ్గరకు పరుగెత్తుకువచ్చి పలకరిస్తారు"

తరువాత వాడు వాడి క్లాస్ రూంలోకి వెళ్ళిపోయాడు. నాకెందుకో కొద్దిసేపు ఆ బెంచి మీద కూర్చోవాలి అనిపించి వెళ్లి కూర్చున్నాను. నా మనసు నా చిన్ననాటి రోజుల్లో నేను మొదటిసారి స్కూల్ కు వెళ్లడం గుర్తుకువచ్చింది. నేను స్కూల్లో చేరినప్పుడు నాకు స్నేహితులు ఎవరూ లేరు, ఎలా పరిచయాలు చేసుకోవాలో అన్న బిడియం ఒకటి. 

నేను చేరిన కొత్తలో మా టీచర్  పిల్లందరిని క్లాస్ లో ఉన్న ఎవరో ఒకరికి ఒక బొమ్మ గీసి ఇమ్మంది. అందరూ ఎదో ఒకటి గీసి వాళ్ళ వాళ్ళ స్నేహితులకిచ్చుకున్నారు. నాకు ఎవరూ ఇవ్వలేదు నేనూ ఎవరికి ఇవ్వలేదు. ఆ రోజు నాకు ఎంత ఏకాంతంగా అనిపించిందో నాకు బాగా గుర్తు. ఎంతో బెంగగా అనిపించింది స్నేహితులు లేకపోవడం అప్పుడు.

ఆ రంగుల బెంచి మీద కూర్చుంటే నాకెంతో ఆనందమేసింది. ఎవరి ఆలోచనో కానీ కొత్తగా చేరిన పిల్లలు ఆడుకోవడానికి , జీవితాంతం చక్కటి స్నేహితులని సంపాదించుకోవడానికి చక్కటి దారి అనిపించింది.

నెమ్మదిగా ఆ బెంచి మీద నుంచి లేచి బయటకు నడుస్తూ అనుకున్నాను నేను రోజూ ఉదయాన్నే నడిచే పార్కులో నలుగురు పెద్దవాళ్ళు కూర్చోవడానికి సరిపడే సిమెంట్ బెంచ్ చేయించాలి. ఆ బెంచి మీద స్నేహితుల బెంచి అని రాయించాలి, జీవిత చరమాంకంలో కొత్త స్నేహితులను సంపాదించుకోవాలి, కష్టసుఖాలు చెప్పుకోవడానికి అనుకుంటూ ఇంటి దారి పట్టాను. నా చిన్ననాటి స్నేహితులు ఎక్కడెక్కడో స్థిరపడ్డారు మరి, దగ్గరలో ఎవరూ లేరు. దగ్గరగా ఉన్నవారితో స్నేహం చేస్తే ఎంత బాగుంటుందో కదా .

స్నేహబంధము..ఎంతో మధురము!

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

ఎగ దీస్తే బ్రహ్మ హత్య - దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది? (29-Apr-24, Enlightenment Story)

  ఎగ దీస్తే బ్రహ్మ హత్య -  దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది?     🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺           ...