Thursday 30 March 2023

గురు బోధ (Guru Bodha) - 07-Apr-23, Enlightenment Story

🍁7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన "గురువు."🍁

  🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏  

🌿1వ ప్రశ్న: ప్రపంచంలో ఏది పదునైనది?

జ: చాలా మంది కత్తి అని చెప్పారు. 

*గురువు: కాదు,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు*

🌿2వ ప్రశ్న: మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ?

జ: చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ

*గురువు: మనకు అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం.ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము,*

ఆ కాలంలోకి వెళ్లలేము.అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము.

🌿3వ ప్రశ్న: ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది?

జ: చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి ఇలా ఎన్నో అంటారు.

*గురువు: ప్రపంచంలో పెద్దది మన పాపమే*

🌿4వ ప్రశ్న: ప్రపంచంలో కఠినంగా,బరువుగా ఉండేది ఏది ?

జ: చాలామంది,వజ్రము ఇనుము,ఏనుగు అని చెప్పారు.

గురువు: కఠినమైనది అనేది "మాట ఇవ్వడం". మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం*

🌿5వ ప్రశ్న: ప్రపంచంలో తేలికైనది ఏది?

జ: దూది,గాలి,ఆకులు అని చెప్పారు 

*గురువు: ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం*


🌿6వ ప్రశ్న: మనకు దగ్గరగా వున్నది ఏది?

జ: తల్లి తండ్రులు, స్నేహితులు,బంధువులు అని చెప్పారు. 

*గురువు: మనకు దగ్గరగా ఉండేది మన చావు.అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం.అది పుట్టుకతోనే మనవెంట వచ్చింది.*


🌿7వ ప్రశ్న: ప్రపంచంలో సులువైనది ఏది ?

జ:తినడం ,పడుకోవడం, తాగడం,తిరగడం 

గురువు: ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం, ఇంతకంటే సులువు ఏదీ లేదు.🍁


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762.  మీ చంద్రశేఖర్*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 

Tuesday 28 March 2023

అదృష్టవంతుడు అంటే (06-Apr-23, Enlightenment Story)

🥀*అదృష్టవంతుడు అంటే*🥀

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸

మీ నాన్న గారి జీవితం కంటే మీ జీవితం మెరుగ్గా ఉంటే మీరు అదృష్ట వంతులే.కొంతమంది కోట్లు సంపాదిస్తారు.వారిలో కొందరు పూర్తిగా దివాళా తీస్తారు. మరి అలా దివాళా తీసిన వారు మీకు కనిపించరా?

మైక్రో సాఫ్టు అధినేత సత్యానాదెళ్ళ గారు వేల కోట్లు సంపాదించారు. కానీ వారికి పూర్తి అంగవైకల్యం ఉండి వీల్ ఛైర్ కు మాత్రమే పరిమిత మైన కొడుకు ఉండేవాడు.అతను దాదాపు 25సంవత్సరాలపాటు అలాగే జీవించి ఇటీవలే మరణించాడు.మరి వారికి వచ్చి న ఈ దురదృష్టం ఎందరికి తెలుసు?

అలాగే మాగుంట సుబ్బరామిరెడ్డి గారు వేలకోట్లు సంపాదించారు.వారికి మానసిక వికలాంగుడైన కొడుకు ఉండేవాడు.అతనికి అంగరంగ వైభవంగా పెళ్ళి చేశాడు. కానీ అది కూడా ఫలించలేదు.

మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు కూడా వందల కోట్ల ధనము సంపాదించాడు. అయినా గానీ వారి‌మొదటి భార్య చనిపోతే ప్రేమ తో పట్టెడు అన్నం పెట్టే వాళ్లు లేరు. అలాగని రెండో పెళ్ళి చేసుకుంటే కుటుంబ కలహాలతో పదవీ చ్యుతుడై మనస్తాపం తో చనిపోయాడు.

రేమండ్సు అధినేత విశ్వపతి సింఘానియా తన స్వశక్తితో రేమండ్సు కంపెనీ ని బాగా అభివృద్ధి చేశాడు వేలకోట్ల ఆస్తులను తన పుత్ర రత్నానికి బహుమతి గా ఇచ్చాడు. ఇంత చేస్తే ఆ పుత్రుడే వారిని తమ ఇంటి నుంచి బయటకు గెంటేశాడంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. ?

మనము ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. మనము ధర్మ మార్గం లో జీవిస్తూ ఉండటం ముఖ్యం. మన పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు మంచి సంస్కారం అందించాలి. ఇలా ఉంటూ మన శక్తి మేరకు సంపాదిస్తూ వచ్చి న డబ్బు ను ఆస్తులను ఒక ధర్మ కర్త వలె ఖర్చు పెట్టాలి.అప్పుడే ఆ డబ్బు సుఖమును తృప్తి ని ఇస్తుంది. ఇలా తృప్తి సుఖము ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎంత సంపాదించాము అనేది ముఖ్యము కాదు.

ఇలా ఎంతో మంది ధనికులు చాలా బాధలు పడ్డారు. డబ్బు తనతో పాటు కొంత చెడును కూడా తీసుకుని వస్తుంది. *డబ్బు ఉంటే అహంకారం వస్తుంది. ఆ అహంకారమే అన్ని అనర్థాలకు మూలకారణం అవుతుంది.*

ఇలా ప్రతివారికీ ఏవో దురదృష్టం కూడా ఉంటుంది. కావున ఇతరుల ఆస్తులను గూర్చి అసూయ పడ కూడదు. ఎంత చెట్టు కు అంత గాలి ఉంటుంది. ఈ విషయం మరచిపోకూడదు.

మనకు ఉన్న దానితో సంతోషిస్తూ మన తెలివితేటలతో ఎక్కువ సంపాదించే కృషి చేయాలి. మనకు మంచి ఆకలి వేస్తూ ఉండటం, ఆకలివేసినపుడు‌మంచి భోజనం, మంచి నిద్ర, ఒక ఇల్లు, సంఘంలో గౌరవ ప్రదమైన జీవితం జీవిస్తూ ఉంటే మనము చాలా ధనవంతులము, అదృష్ట వంతులము కూడా. దానికి తోడు ప్రశాంతమైన,ధర్మ మార్గం లో జీవనం. ఇవి ఉంటే అన్నీ ఉన్నట్లే.

ఎవరకీ ఎప్పుడూ సుఖాలు ఉండవు. సుఖపడినవారు కష్టాలు పడతారు. కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంటుంది. కష్టపడేవారు హాయిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. ఈ అవకాశం చాలా మంది ధనవంతులకు లేదు గదా.

ఏ కష్టాలు లేని వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకుని రాగలరా? ప్రయత్నించి చూడండి.ఇలా అసూయ పడతారనే శేషప్ప కవిగారు సరళమైన తెలుగు పదాలతో ఇలా చెప్పారు.

||తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు|| వెళ్ళి పోయెడినాడు వెంటరాదు||

||లక్షాధికారైన లవణమన్నమె గాని||మెండుబంగారంబు మింగబోడు||

ఏ వస్తువు అయినా తాత్కాలికంగా సుఖమును, ఆనందమును ఇచ్చును. తక్కువ కోరిక లతో తృప్తిగా హాయిగా సమాజం లో గౌరవప్రదంగా జీవించడం చాలా అదృష్టం.

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762. Email: Chandra65402020@gmail.com మీ చంద్రశేఖర్*

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

Monday 27 March 2023

ఒక అమ్మ కథ (05-Apr-23, Enlightenment Story)

🥀*ఒక అమ్మ కథ*🥀

🌸❄️🌸❄️🌸❄️❄️🌸

*అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు*.ఆమె ఎక్కడికి  నాతో వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది.ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది. ఇంక అప్పట్నించి చూడండి

”మీ అమ్మ ఒంటి కన్నుది”    ”మీ అమ్మ ఒంటి కన్నుది” 

అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు. అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది.  ఒక్కోసారి నాకు అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు అనిపించేది

“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను. నువ్వు చచ్చిపో!” కోపంగా అరిచేసే వాణ్ణి. ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది

ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకే తెలియదు.ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. 

మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను. ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను.

ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను . పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను .మంచి విశ్వ విద్యాలయం లో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. *బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కొనుక్కున్నాను. అందమైన అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!*

అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న *నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి. ఇంకెవరు? అమ్మ*

ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతోజడుసుకుంది. “ఎవరు నువ్వు?ఎందుకొచ్చావిక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?ముందునువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!” సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను.

“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను”. ఆమె అదృశ్యమై పోయింది. “హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు” భారంగా ఊపిరి పీల్చుకున్నాను

ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించు కోనవసరం లేదు అనుకున్నాను. కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు. వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను

*స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను ఎంత వద్దనుకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి మా అమ్మ ఒంటరిగా కటికనేలపై పడి ఉంది ఆమె చేతిలో ఒక లేఖ నా కోసమే రాసిపెట్టి ఉంది.*

*దాని సారాంశం*

ప్రియమైన కుమారునికి, ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను. నేనింక నీవు వుండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా! ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను

కన్నపేగురా! తట్టుకోలేక పోతోంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిన దాన్నవుతాను

ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు చిన్నా! నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా! అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను .నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా?

నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధ పడలేదు. ఒకటి, రెండు సార్లు మాత్రం ''వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనే కదా!” అని సరిపెట్టుకున్నాను

చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులతో ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను కన్నా.

ఉత్తరం తడిసి ముద్దయింది. నాకు ప్రపంచం కనిపించడం లేదు. నవనాడులూ కుంగి పోయాయి. భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను. తన జీవితమంతా నాకోసం ధారబోసిన అటు వంటి మా అమ్మ పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిoచాను ?

మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తితే ఆమె ఋణం తీర్చుకోగలను ?

||నాస్తి మాతృ సమం దైవం||  ||నాస్తి మాతృ సమో పూజ్యః||

||నాస్తి మాతృ సమో బంధుః||  ||నాస్తిమాతృ సమో గురుః ||

అమ్మతో సమానమైన పూజ్యులుగానీ దైవంగానీ లేరు. తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు. 

ఆకలేసినా.. ఆనందం వేసినా.. దిగులేసినా..దుఃఖం ముంచుకొచ్చినా..పిల్లలకైనా..పిల్లలను కన్న తల్లిదండ్రులకైనా గుర్తొచే పదం *అమ్మ*

తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ. అటు వంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి .కనుపాప లా కాపాడండి. తల్లి రుణం ఈ జన్మకు తీరదని గుర్తుంచుకోండి.

ఓపికతో చదివిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నలుగురికీ ఇలాంటి సందేశాలుపంపండి.  బంధాలు బాంధవ్యాలను కాపాడండి మిత్రులారా!🙏🏻

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762. Email: Chandra65402020@gmail.com మీ చంద్రశేఖర్*

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

Saturday 25 March 2023

మేఘశాస్త్రం - అత్రిముని విరచితం (04-Apr-23, Enlightenment Story)

🥀*12 రకాలవర్షాలు 64 రకాల మెరుపులు 33 రకాల పిడుగులు**🥀

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🕉️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️

వేలసంవత్సరాల కిందటనే మన పూర్వీకులు శాస్త్రసాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించారు. అంతేకాదు కొన్నింటిని గ్రంథస్తం చేయడం జరిగింది.మన పాశ్ఛత్య సంస్కృతిసాంప్రదాయాలను విదేశీయులు నిర్లక్ష్యం చేయడం వలన, విదేశీమాయలో విదేశీఉచ్చులో  పడినమనం కూడా స్వంతవారసత్వ సంపదలను పూర్తిగా త్యజించడం వలన మనగొప్ప శాస్త్రసాంకేతిక సంపత్తిని కోల్పోయాము.ఉన్నవాటిని కాపాడుకోవాలనే ధ్యాస కూడా లేనివారం మనమే.

మన దార్శనీకులైన బుుషులు అనే కళలలో నిష్ణాతులు వారు తాము దర్శించిన విషయాలను గ్రంథస్తం చేయడం జరిగింది. అవేమిటో చూద్దాం.

(1) మేఘశాస్త్రం - ఇది అత్రిముని విరచితం. మేఘాలు ఏర్పడే విధానం, వర్షానికి కారణంవంటి విషయాలు చర్చించినది. 12 రకాల వర్షాలు, 64 రకాల మెరుపులు 33 రకాల పిడుగుల గురించి ఈ శాస్త్రం చర్చించింది.

(2) కాలశాస్త్రం - ఇది కార్తీకేయుడి సృష్టి. కాలవిభజన సేకనులు నిమిషాలు గంటలు రోజులు నెలలు సంవత్సరాల వెగైరా వాటి విభజన గురించి వివరించింది. ఆ రోజులలో సేకనులు లేవు, కాలాన్ని ఎంత సూక్ష్మంగా విభజించారో చెప్పటానికి ఉదాహరించడం జరిగింది.

(3) అక్షరలక్ష - రచయిత వాల్మీకి.ఈ గ్రంథం సృజించని అంశమంటూ లేదు. Encyclopedia of Sciences అంటారు.భూగర్భ వాయు భౌతిక యంత్ర గణిత రేఖాగణిత ఉష్ణ విద్యుత్ ఖనిజ జలయంత్ర వంటి అంశాలను క్షుణ్ణంగా వివరించింది.

(4) శబ్దశాస్త్రం - ఇది కండిక మహామునిచే రచింపబడింది. ఈ సృష్టిలోని ప్రాణమున్నవి ప్రాణంలేని నిర్జీవపదార్థాలచే సృష్టించబడిన శబ్దాలు వాటి పరిమాణం ప్రయాణం వంటి విషయాలను ఈ శాస్త్రం విశదీకరించింది.

(5) సూపశాస్త్రం - సూపశాస్త్రమునే పాకశాస్త్రమని అంటాము. రచయిత సుకేశుడు. మనకు చెందిన 108 రకాల భోజనపదార్థాలు వివిధరకాలైన ఊరగాయలు మిఠాయిలు పిండివంటల గురించి ఇంకా 3032 రకాల వంటకాల గురించి వివరిం చింది.

(6) శిల్పశాస్త్రం - ఇది కశ్యపుడి రచన.307 రకాల శిల్పాల గురించి గృహాలు దేవాలయాలు రాచభవనాలు  కోటలు మిద్దెలు మేడలు పూరిగుడిసెల నిర్మాణం గురించి చక్కగా ఈ గ్రంథం వివరిస్తుంది.

(7) లక్షణశాస్త్రం - జీవపదార్థాల పుట్టుకగురించి వాటిలో స్త్రీపురుష లక్షణాల గురించి వివరిస్తుంది.

(8) మాలినీశాస్త్రం - పూలదండల కూర్పు. వివిధరకాల పూలతో రకరకాల డిజైన్లను ఏర్పాటుచేయడం గురించి బుుష్యశృంగుడు వ్రాసిన ఈ శాస్త్రం చర్చిస్తుంది.

(9) స్థాపతవిద్య - అధర్వణవేదమునుండి గ్రహించిన ఈ శాస్త్రంలో భవననిర్మాణ వైజ్ఞానిక  ( ఇంజినీరింగ్ & ఆర్కిటెక్చర్)  వంటి విషయాలు చర్చించడం జరిగింది.

(10) యంత్రశాస్త్రము - భూమిపై ప్రయాణించటానికి అనువైన 339 వాహనాలు నీటిపై ప్రయాణించటానికి 783 వాహనాలు  గాలిలో ప్రయాణించటానికి వీలైన 101 వాహనాల వివరాలను ఇందులో గ్రంథకర్త  భరద్వాజుడు వివరించాడు.

(11) విషశాశాస్త్రము - ఇది అశ్వనీకుమారుని రచన. ఇందులో 32 విషపదార్థాలు వాటి తయారీ లక్షణం ప్రయోగం విరుగుడు వంటి అంశాలు చర్చించడం జరిగింది.

(12) అశ్వగజశాస్త్రాలు - అశ్వశాస్త్రాన్ని అగ్ని గజశాస్త్రాన్ని కుమారస్వామి రచించారు.గుర్రానికి చెందిన శరీరలక్షణాలు దేహధర్మాలు శుభాశుభలక్షణాల గురించి, ఈనడం, శిక్షణ మొ॥ అంశాలను అశ్వశాస్త్రం, ఏనుగు శరీరలక్షణాలను తెలిపే 26 పద్ధతులు మచ్చిక శిక్షణ రోగలక్షణాలు నివారణ గురించి గజశాస్త్రం తెలియచేస్తుంది.

(13) రత్నపరిక్ష - వాత్యాయన బుుషిచే వ్రాయబడింది.నవరత్నాలకు సంబంధించిన 24 లక్షణాలు, సహజరత్నాల లభ్యత వాటి రూపం కాంతి బరువు, కృత్రిమ రత్నాలతయారి మొదలైన అంశాల గురించి తెలుపుతుంది.

(14) మల్లయుద్ధం - శారీరకశ్రమ, మల్లయుద్ధ లక్షణాలు శిక్షణ పోటీ లక్షణాలగురించి వివరించే ఈ శాస్త్రాన్ని మల్లుడు వ్రాశాడు.

(15) ధనుర్వేద, గాంధర్వశాస్త్రాలు. ధనుర్వేదం విలువిద్య గురించి, బాణప్రయోగం,  మంత్రబాణ ప్రయోగం, నారాయణ పాశుపత నాగ విష్ణు బ్రహ్మాస్త్రాలు వంటివాటి గురించి వివరించే ధనుర్వేదశాస్త్రకర్త విశ్వామిత్రుడు.

గంధర్వశాస్త్రం - సంగీతం నాట్యం గాత్రం వాయిద్యాల గురించి చర్చించే ఈ శాస్త్రంలో భరతముని ప్రముఖుడు.

॥సనాతన,ఆర్షధర్మంనుండి సేకరణ॥

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762. Email: Chandra65402020@gmail.com మీ చంద్రశేఖర్*

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

Friday 24 March 2023

ధర్మం అంటే ఏమిటి? (03-Apr-23, Enlightenment Story)

 ”ధర్మం” అంటే ఏమిటి?  

  🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏          

 *• ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా వుండటం -  వివాహ ధర్మం!* 

 *• తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడుకాకున్నా, నమ్మివుండటం: భార్య ధర్మం!*

 *• నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండటం : మిత్ర ధర్మం!*

 *• సోమరితనం లేకుండటం: *పురుష ధర్మం!* 

 *• విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం: గురుధర్మం!*

 *• భయభక్తులతో విద్యను నేర్చుకోవటం: శిష్యధర్మం!*

 *• న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించటం: యజమాని ధర్మం!*

*. భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్నీ నడపటం:  ఇల్లాలి ధర్మం!*

 *• సైనికుడుగా వుండి దేశాన్ని,ప్రజలను  కాపాడటం: * సైనిక ధర్మం!* 

 *• వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించటం: బిడ్డల ధర్మం!*

 *• తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయటం : తండ్రి ధర్మం!*

 *• తన ఇంటికీ, తనను కన్నవారికీ పేరు ప్రతిష్ఠలు తేవటం: *బిడ్డలందరి ధర్మం!* 

 *• తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించటం : ప్రతివాని ధర్మం!*

 *• తాను సంపాదించినదాన్ని తనవారితో పంచుకొని తినటం : సంసార ధర్మం!*

 *• అసహాయులను కాపాడటం: మానవతా ధర్మం!*

*•చెప్పిన మాటను నిలుపుకోవటం : సత్య ధర్మం*

 🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762.  మీ చంద్రశేఖర్*

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏        

మత్స్య జయంతి శుభాకాంక్షలు @March-24-2023 - (02-Apr-23, Enlightenment Story)

 మత్స్య జయంతి శుభాకాంక్షలు @March-24-2023

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

🌈ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు దశావతారములు ఎత్తాడు. వీటిలో మొట్టమొదటి అవతారం *ఈ మత్స్యావతారం*. కొందరు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచికగా చెబుతారు.

*మత్స్య జయంతి శుభాకాంక్షలు*


ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు యొక్క దశావతారములు  ప్రసిద్ధమైనది. మొట్టమొదటి అవతారం ఈ మత్స్యావతారం.

*మత్స్య జయంతి యొక్క ప్రాముఖ్యత:"

ఈ రోజు మత్స్యo తో అనుబంధం ఉన్న కారణాన, చెరువులు, సరస్సులు, నదులు మరియు ఇతర నీటి వనరులను శుద్ధి చేయడం ద్వారా అదృష్టం తెచ్చుకోవచ్చని నమ్ముతారు. చేపలు మరియు ఇతర జల జంతువులకు ఆహారమివ్వడం కూడా సాధారణoగా దీక్షలో భాగంగానే ఉంటాయి. ఈ రోజున దాతృత్వంలోని ఏదైనా రూపం ప్రోత్సహించబడుతుంది. అందువల్ల చాలామంది ప్రజలు ఈ రోజున సమాజంలోని పేద మరియు వెనుకబడిన వర్గాలకు ఆహారాన్ని మరియు పాత దుస్తులు విరాళంగా ఇస్తుంటారు. ఈరోజు మత్స్య్తావతారo లేదా మత్స్య పురాణం సంబంధించిన కథలు చదవడం కానీ వినడం వలన కానీ పాప చింతన తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని  విశ్వసిస్తారు.

బ్రహ్మకు ఒక పగలు అంటే – వెయ్యి మహాయుగాలు గడిస్తే ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు. ఆసమయంలో ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అంటారు. దీనినే నైమిత్తిక ప్రళయంగా చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్ళీ యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడు. దీనిని ‘కల్పం’ అని అంటారు.

*మత్స్యావతారం అసలు కథ*

వరాహకల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు , విష్ణు భక్తుడు. ఒకరోజు అతను కృతమాలా నదికి వెళ్ళి స్నానం చేసి , సూర్యునికి అర్ఘ్యం ఇస్తూండగా దోసిటలో చేపపిల్ల పడినది. రాజు దానిని నీటిలోనికి జారవిడిచాడు. మళ్ళీ నీటిని దోసిలి లోకి తీసుకున్నప్పుడు చేతిలోనికి చేప వచ్చి ఈ విధంగా పలికింది “రాజా ! నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి , దయచేసి నన్ను రక్షించు” అని ప్రార్థించినది. వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేసాడు. మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్రపట్టనంత పెద్దది అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు. ఆ మరుసటిరోజుకి ఆ చేపపిల్లకి చెరువు కూడా సరిపోలేదు. అ రాజు … ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ మత్స్యం (చేప) శతయోజన ప్రమాణానికి విస్తరించింది. అంతట ఆ మత్స్యం “తాను శ్రీమన్నారాయణుడుని అని , ఏడు రోజులలో ప్రళయం రానున్నదని , సర్వజీవరాశులు నశించిపోతాయి అని , ఈ లోకమంతా మహాసాగరమవుతుంది అని , నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని” పలికింది. ఒకపెద్ద నౌకను నిర్మించి , అందులో పునఃసృష్టికి అవసరమగు ఔషధములు , బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని , సప్తఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది.

మీనరూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్ప రూపమైన తాడుతో నావను కట్టి , ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సాంఖ్యాయోగ క్రియాసహితమైన పురాణసంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యునికి శ్రద్ధదేవునిగా జన్మించి , ‘వైవస్వత మనువు’ గా ప్రశిద్ధికెక్కాడు.

బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురి అయ్యాయి. బ్రహ్మదేవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటినుండి వేదాలు జారి క్రింద పడగా , “సొమకాసురుడు” అనే రాక్షసుడు నాలుగు వేదాలని అపహరించి , సముద్రగర్భంలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా , అతను మత్స్య రూపంలో జలనిధిని అన్వేషించి సోమకాసురునితో పోరాడి , అతని కడుపుని చీల్చి …… వేదాలను – దక్షిణావృత శంఖాన్ని తీసుకొని , బ్రహ్మవద్దకు వచ్చాడు. శంఖాన్ని తానూ తీసుకొని , శిధిలమైన వేదభాగాలని బ్రహ్మను పూరించమని ఆజ్ఞాపించాడు. ఇది రెండో మత్స్యావతారం.

*మత్స్య జయంతి విధి విధానాలు*

ఈ రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడిన రోజు , కావున ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించడం , ఉపవాస దీక్ష గావించడం వంటి వాటి ద్వారా ఆ దేవుని కృపకు పాత్రులవగలరని పురాణాల సారాంశం. ఒకవేళ ఈ ప్రత్యేకమైన రోజు ఉపవాస దీక్షను మరియు పూజలను వేకువ జామునే ఆరంభించగలిగితే , అదృష్టం వరించి మోక్ష మార్గానికి దారి సుగమం అవుతుందని చెప్పబడింది. మోక్షం , హిందూమతం యొక్క అంతిమ లక్ష్యం. అయినప్పటికీ , ఈ ప్రత్యేకమైన ఉపవాస దీక్షలో , పూర్తిగా ఆకలితో ఉండాల్సిన అవసరం కూడా లేదు. పాలు పండ్లు స్వీకరించవచ్చు అని సూచించబడినది.

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762.  మీ చంద్రశేఖర్*

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

Monday 20 March 2023

ప్రపంచ పిచ్చుకల దినోత్సవం -World Sparrow Day - మార్చి 20 (01-Apr-23, Enlightenment Story)

   🥀*ప్రపంచ పిచ్చుకల దినోత్సవం*🥀

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. ఇంటి చూరుల్లో, గోడల నెర్రెల్లో గూడు కట్టుకుని కళ్లు తెరవగానే కనిపించే ఈ చిన్న జీవాలు చేసే కిచకిచలు నేడు పల్లెల్లోనే కరువయ్యాయి.

గూడు కట్టడం, గుడ్లను పొదగడం, నోటితో ఆహారాన్ని తెచ్చి పిల్లలకు అందించటం,ఆ పిల్లలు రెక్కలొచ్చి ఎగిరేంత వరకు జాగ్రత్తగా కాపాడటం తల్లిప్రేమకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇటువంటి ఆదర్శవంతమైన పిచ్చుకల అన్యోన్యతను గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. వీటి ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాలా బిళ్లలను కూడా విడుదల చేసింది. 

కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవం వీటి చావుకొచ్చింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలనే తాపత్రయంలో ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటుచేస్తున్న సెల్‌టవర్లు ఈ చిన్నారి నేస్తాలకు మరణశాసనాన్ని రాస్తున్నాయి. సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్‌కు ఈ చిట్టి గువ్వలు బలవుతున్నాయి. దీంతో పర్యావరణాన్ని తన శక్తిమేరకు కాపాడే పిచ్చుకలను రక్షించేందుకు పక్షి ప్రేమికులు నడుం బిగించాల్సిన పరిస్థితి వచ్చింది.

*దాంపత్య జీవితానికి విలువ*

పిచ్చుకలు దాంపత్య జీవితానికి చాలా విలువనిస్తాయి. 85 శాతం పిచ్చుకలు బతికినంత కాలం ఒకే ఆడపిచ్చుకతో కలిసి ఉంటాయి. దీన్ని సైన్స్‌ పరంగా మోనోగాసన్‌ అంటారని పక్షి శాస్త్ర నిపుణులు తెలిపారు. సృష్టిలో అధిక సంతానోత్పత్తిని విస్తారంగా చేయగలిగే సామర్థ్యం వీటి సొంతం. ఏడాదికి మూడు, నాలుగు సార్లు గుడ్లు పెడతాయి. 

పిచ్చుకలు మనుషుల్లానే కుటుంబానికి విలువ ఇస్తాయి. ఆడ, మగ కలిసి కష్టపడి గూడు కట్టి పిల్లలను సాకి సంతరిస్తాయి. అందుకని కూడా మనవాళ్లకు అవంటే ఇష్టం. మగపిచ్చుక కొంచెం బొద్దుగా ఉంటే ఆడ పిచ్చుక సన్నగా స్పీడుగా ఉంటుంది. అవి రెండు ఏమిటేమిటో మాట్లాడుకుంటూ ఉంటాయి. వాటి మాటలు వినడం ఎవరికైనా సరే బాగుంటుంది. పిచ్చుకలు మూడేళ్లు బతుకుతాయి. కాని అవి ఆ మూడేళ్లను సంపూర్తిగా జీవిస్తాయి. బద్దకించవు. మెల్లగా ఉండవు. ఉత్సాహం మానుకోవు. ఎప్పుడూ బతుకు మీద ఆశతో మన బతుకు మనం బతుక్కుందాం అన్నట్టుగా ఉంటాయి. 

ఈ చిన్ని ప్రాణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉంది. పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించుకునేందుకు మనం నడుం బిగించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పల్లెల్లో నివసించే వారు ఊరపిచ్చుకల గూళ్లు కనబడితే వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి.

త్వరలోనే మళ్ళీ పిచ్చుకల కిచకిచలు విరివిగా వినే అదృష్టం కలగాలని ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సాక్షిగా కోరుకొందాం.

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

Sunday 19 March 2023

నవ గోప్యాలు (31-Mar-23, Enlightenment Story)

 🥀* నవ గోప్యాలు !!*🥀

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

భగవంతుడు మనిషితో పాటు జీవులన్నిటికీ శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’  అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు.


అందుకే ఈ నవ గొప్యాలు అంటే రహస్యంగా ఉంచతగ్గ  తొమ్మిది విషయాలు.

1 ఆయువు,    2 విత్తము,    3 ఇంటిగుట్టు,    4 మంత్రం,    5 ఔషధం,    6 సంగమం,

7 దానం,    8 మానము,    9 అవమానం

అనే ఈ తొమ్మి దింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచా ల్సినవి.

*1 ఆయువు* :-  రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. జరిగేది జరగకమానదు అని వివేకంతో ఆలోచిస్తాడు కాబట్టి మనిషి నిబ్బరంగా ఉండగలుగుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆయుః ప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై అతనిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు.

 *2 ధనం ( విత్తం)* :-   ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగా రంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం.

అయినా మన దగ్గర ఉన్నవిషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగు తుంది.

 *3 ఇంటి గుట్టు*:-   ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్నే ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని.

సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.

*4 మంత్రం*:-  ‘మననం చేసేది మంత్రం’- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.

*5 ఔషధం*:- ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలను ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరిస్తే ఎవ్వరంటేవారు తయారుచేస్తారు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.

*6 సంగమం*:- సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.

*7 దానం* :- దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.

*8 శీలం (మానం )* :-  మానం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది.

*9 అవమానం* :--   తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవమానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగు తుంది. దాంతో పగ.. ప్రతీకారాలు.. ఇక వాటికి అంతనేది ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మన చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం. 

ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మన చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం. ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధను మనం తప్పక ఆచరించాలి.  !!! లోక సమస్త సుజనో భవతు !!!

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥



Thursday 16 March 2023

గురువు - పూర్వ జన్మ కర్మ (30-Mar-23, Enlightenment Story)

  🥀*గురువు - పూర్వ జన్మ కర్మ*🥀

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

ఒక గురువు చెట్టు క్రింద కూర్చొనీ భక్తి గురించి దేవుని గురించి జన్మ రాహిత్యం గురించి చెబు తున్నాడు. అటుగా వెళుతున్న బాటసారి గురువు చెబుతున్నది. *వినీ దగ్గరకు వెళ్లి తనకు మంత్రోప దేశం ఇవ్వమని అడిగాడు*. గురువు అప్పుడు అడిగాడు, నీకు భార్య బిడ్డలు ఉన్నారా. అని తన భార్య గర్భవతి అని చెప్పాడు.

గురువు ఇలా అన్నాడు గురు దక్షిణగా నువ్వు నాకే మిస్తావు? అని అడిగాడు గురువు. మీరు ఏది అడిగితే అదే ఇస్తాను అన్నాడు. సరే,నీ భార్యను అడిగి రా. *తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వ గలదా? అలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను*.  వెళ్లి నీ భార్యను అడిగిరా, పిల్ల పుట్టిన వెంటనే రక్తం మడుగులో ఉండ గానే నాకు ఇచ్చేయాలి అన్నాడు గురువు. అతను వెంటనే ఇంటికి పరుగెత్తి భార్యకు విషయం చెప్పి మన పిల్లలను గురువుకు ఇవ్వ గలవా ? అని అడిగాడు. అందుకు ఆమె అలాగే ఇచ్చేద్దాం.

మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా, అంటూ ఒప్పు కుంది. ఆ విషయాన్ని గురువుకు చెప్పాడు. కొద్ది రోజులకీ ఆమె ప్రసవించింది. మగ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని నెత్తుటి మడుగులో ఉండ గానే తీసుకెళ్లి గురువు చేతిలో పెట్టారు భార్య భర్తలు . *గురువు ఆ పిల్ల వాడిని తీసు కెళ్లి గొయ్యి తీసి అందులో పూడ్చేసాడు*

తల్లి దండ్రులు బిత్తర పోయి చూస్తు, చేసేది. ఏమి లేక వెను తిరిగి వెళ్లి పోయారు. *ఈ విధంగా రెండో పిల్ల వాడిని కూడ గొయ్యి లో పూడ్చి పెట్టేసాడు*

మూడో సారికీ ఆవిడ ఒప్పు కోలేదు. ఇదేం గురువయ్యా ? నాకు నచ్చలేదు. నా కొడుకును ఇవ్వనుకాక ఇవ్వను అంటూ మొండి కేసింది. అతను గురువు వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. గురువు గారే ఆమె దగ్గరకు వెళ్లి ఇలా.  అన్నాడు. అమ్మ నీ బిడ్డను ఇవ్వనన్నావు కదా, ఇప్పుడు నీ బిడ్డను నేనేమి చేయను. 

కాని ఒక్క సారి బిడ్డను నా చేతి కిచ్చి నా వెంట రండి. మీ బిడ్డను నేనేమి చేయను.తిరిగి మీ బిడ్డను మీకు ఇచ్చేస్తా అని అన్నాడు. సరే ననీ బిడ్డను తీసుకొని గురువు వెంట బయలుదేరారు వారిరువురు.

గురువు వీళ్లిద్దరినీ ఇంతకు ముందు గొయ్యి తీసి పెట్టిన చోటికి తీసుకుని వెళ్ళాడు. ఆ రెండు గొయ్యిల మధ్య తెల్లని గుడ్డ పరిచి. ఈ పిల్ల వాడిని వాటి మద్యలో పడుకో బెట్టి చేతి లోకి నీళ్ళు తీసుకొని మంత్రించి. ఆ ముగ్గురు పిల్లల మీద చల్లాడు. తల్లిదండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి. ఆ గొయ్యిలో నుండి వస్తున్న శబ్దాలను విన మన్నాడు. 

గొయ్యి లో నుండి మొదటి పిల్లవాడు రెండవ వాడిని అడుగుతున్నాడు. ఒరేయ్ వీళ్ళకు కొడుకుగా పుట్టావు. కదా దేని కోసం పుట్టావు. వీళ్ళకి నీకు ఏమిటి సంబంధం అని అడిగాడు.

రెండో వాడు ఇలా చెబుతున్నాడు. గత జన్మలో వీడు బాకి పడ్డాడు. నాకు డబ్బులు ఇవ్వ కుండానే పోయాడు. అందుకనీ వీడికి కొడుకునై పుట్టి అందినంత లాగేసుకుందామని వచ్చాను. మరీ నువ్వు ఎందుకొచ్చావు అని అడిగాడు. వీడు నాకు కూడా ఇవ్వాలిరా.నేను కూడా అందుకే వచ్చాను. వీడికి కొడుకునై పుట్టి దొరికి నంత దోచుకొని వదిలేసి వెళదామని వచ్చాను . కానీ వీడు మనల్ని గురువు చేతిలో పడవేసాడు.

ఇంకే ముంది? వాడు మనకు పడిన బాకీలన్నీ గురువు తెగ్గొట్టేశాడు. ఇప్పుడు వాడికి మనకి రుణ బంధం తెగిపోయింది అని వాళ్ళు మాట్లాడు కుంటున్నారు. 

ఈ ఇద్దరూ కలిసి బ్రతికి ఉన్న మూడో వాడిని అడిగారు. ఒరేయ్ నువ్వెందు కొచ్చావురా అని? అప్పుడు బ్రతికి ఉన్న మూడోవాడు ఇలా చెప్పాడు, గతజన్మలో నాకు కొడుకులు బిడ్డలు ఉండికూడ దిక్కు లేకుండా పడిఉంటే వీడు నన్ను చేరదీసి అన్నంపెట్టి ఆదరించాడు. నేను పోయే వరకు నన్ను పోషించాడు.

అందుకే.ఈ జన్మ లో వీనికి కొడుకునై పుట్టి తల్లితండ్రులిద్దరినీ వాళ్ళు బ్రతికినంతకాలం అన్నం పెట్టి వాళ్లను సంతోషంగా ఉంచి ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళకు ఇచ్చి వారి రుణం తీర్చు కుందామని వారికి కొడుకునై పుట్టాను. 

మీరు ఆయన్ని పీడించాలని వచ్చారు. గనుక గురువు మిమ్మల్ని గొయ్యి లో పాత పెట్టాడు. నేను అలా కాదు గనుక నేను బ్రతికి ఉన్నాను అని చెప్పాడు. ఈ ముగ్గురు మాట్లాడుకున్న మాటలు ఈ తల్లి తండ్రులు విన్నారు. గురువు పాదాల మీద పడి క్షమించమని వేడు కున్నారు. కాబట్టీ గురువు లేని పూజ గుడ్డి పూజ అని అర్ధం. ఆత్మ జ్ఞానము తెలిసిన గురువును పట్టు కుంటే రుణానుబంధాలే కాదు, జన్మ రాహిత్యమే కలుగుతుంది.ఈ జన్మ లోనే మోక్షం లభిస్తుంది.

మోక్ష మంటే చని పోయిన తర్వాత మోక్షం వస్తుందనీ చాలా మంది అను కుంటారు కాని అది కాదు.మోక్షం అంటే బ్రతికుండగానే ఆత్మ జ్జానాన్ని పొందటం. 

దైవం ఏ ఏ రూపాలలో ఉన్నాడు.. ఎక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు.ఈ సృష్టి ఏమిటి. ఎలా తయారైంది, నేనెవరిని,ఎక్కడ నుండి వచ్చాను,మళ్లీ ఎక్కడికి వెళతాను. అసలు మాయ అంటే ఏమిటి??? ఇలా ఎన్నో సృష్టి రహస్యాలు బ్రతికుండగానే తెలిసిపోతాయి.ఇదే మోక్షం.మరుజన్మకి రాకుండా భగవంతుడు తన రూపాన్ని ఇచ్చి తానుగా మార్చు కుంటాడు.

*ఈ ఆత్మ జ్ఞానం కలగ డానికి ధ్యానం అనే ఆత్మ విద్యను మనకి బోధిస్తారు*

🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

వదిలెయ్ (29-Mar-23, Enlightenment Story)

 🥀* వదిలెయ్*🥀

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

ఒకటికి రెండుసార్లు వివరించిన తర్వాత కూడా ఎవరికీ అర్థం కాకపోతే, అవతలి వ్యక్తికి వివరించండం *వదిలెయ్*

పిల్లలు ఎదిగినప్పుడు, వారు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు, వారి వెనుకాలా పడడం *వదిలెయ్*

కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి.  ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే, అటువంటి వాళ్లను *వదిలెయ్*

ఒక వయస్సు తర్వాత, ఎవరూ మిమ్మల్ని పట్టించుకోకపోతే లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే, దానిని మనసులో పెట్టుకోకుండా  *వదిలెయ్*

మనచేతుల్లో ఏమీ లేదు, మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం *వదిలెయ్*

మనలోని కోరికకు, మన సామర్థ్యానికి చాలా తేడా ఉంటే, నీ గురించి నువ్వే ఎక్కువ ఆశించడం *వదిలెయ్*

ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. అంతెందుకు, ఓ మనిషి ఎత్తు, రంగు మొదలుకొని అన్నీ భిన్నంగా ఉంటాయి కాబట్టి సరిపోల్చడం *వదిలెయ్*

నేను మంచి స్నేహితుడిగా కనిపిస్తే సరేసరి, లేదంటే నన్ను కూడా *వదిలెయ్*

వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదించండి, రోజువారీ పేరుకుపోయిన ఖర్చుల గురించి చింతించడం *వదిలెయ్*

మీకు ఈ సందేశం నచ్చితే సరి. ఒకవేళ మీకు నచ్చకపోతే, సీరియస్ గా  తీసుకోకుండా *వదిలెయ్*



🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏


సనాతన ధర్మం - పునర్జన్మ (28-Mar-23, Enlightenment Story)

  🥀*సనాతన ధర్మం - పునర్జన్మ*🥀

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను స్వామివారి ముందుంచాడు.

స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.

ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.

అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర కారు ఉన్నదా అని అడిగి ఈ కంచీపురంలో వెళ్ళి కొంచం సమాచార గణాంకాలను సేకరించుకు రాగలవా అని కనుక్కున్నారు. అతను వెంటనే ఒప్పుకున్నాడు. కాని తన ప్రశ్నకు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేదు అని అనుకున్నాడు.

”సరే స్వామిజి, ఏమి చెయ్యమంటారో సెలవివ్వండి” అని అడిగాడు. అందుకు మహాస్వామి వారు, “కాంచీపురంలోని ఒక పది ప్రసూతి వైద్యశాలలకు వెళ్ళు. అక్కడ గత రెండు రోజులలో పుట్టిన పిల్లల వివరాలు, వారి ఆరోగ్యం, తల్లితండ్రుల పేర్లు, వారి స్థితి, వారి విద్యార్హతలు, పుట్టిన సమయం వంటివి తెలుసుకుని రా” అని చెప్పారు.

ఆ విదేశీయుడు, “సరే ఇదేమి పెద్ద పని కాదు” అని తన కారులో వెళ్ళిపోయాడు. సాయిత్రం లోపల కావల్సిన వివరాలతో మహాస్వామి వారి ముందు వచ్చాడు. ఆ వివరాలకు స్వామి వారికి చెప్పాడు.

“ఈ రెండు రోజులలో పది ఆస్పత్రులలో 15 మంది పిల్లలు పుట్టారు. 7గురు మగపిల్లలు, 8మంది ఆడపిల్లలు. వారిలో ముగ్గురికి పోషకాహార లోపం ఉంది. ఇద్దరు ధనికులైన తల్లితండ్రులకు ప్రథమ సంతానం. వారు అత్యంత ఖరీదైన ఆస్పత్రులలో పుట్టారు. నలుగురు పిల్లలు రోజుకూలి చెసుకునే వారికి పుట్టారు. వారికి అప్పటికే పిల్లలు ఉన్నారు” అని చెప్పుకొచ్చాడు.

స్వామివారు అతణ్ణి చూసి, కొన్ని ప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టారు. ”వీరు పుట్టిన ఈ రెండు రోజులలొ వారు నిజాయితీగా ఉందడమో లేదా కపట బుద్ధితో ప్రవర్తించడమో చేసారని నువ్వు అనుకుంటున్నావా?”

“లేదు వారు కనీసం తమ తల్లిని కూడా గుర్తించలేని చంటిపిల్లలు. కాబట్టి ఈ జన్మలో వాడికి పాపము పుణ్యము అనేది ఏమి లేదు” అని చెప్పాడు. మహాస్వామి వారు ”మీ సిద్ధాంతము ప్రకారం ఈ పిల్లలందరూ ఏ పాపము పుణ్యము చెయ్యలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండాలి. కాని లేరు. కొంత మంది అరోగ్యం బాగులేదు. కొంత మంది ధనవంతుల పిల్లలు, కొంతమంది కూలివాని పిల్లలు. ఒకేరోజు, ఒకే అక్షాంశం, రేఖాంశం ఒకే ఊరిలో పుట్టిన పిల్లలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు. ఇదే పునర్జన్మ సిధ్ధాంతం”

ఆ విదేశీయుడు ఈ మాటలను విని స్థాణువైపోయాడు. ఇక్కడే పునర్జన్మ సిద్ధాంతం నిజం అనేది తేటతెల్లమవుతోంది. ఈ పిల్లలందరూ వారి వారి పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో ఇలా పుట్టారు.

ఆ విదేశీయుడిని చూసి సనాతనధర్మ సాకారరూపం చిరునవ్వుతోంది. సనాతన ధర్మానికి పుర్జన్మ సిద్ధాంతం ప్రాణం. దాన్ని నమ్ముతాను అని చెప్పడానికే నుదుట బొట్టు పెట్టుకోవడం.

||పునరపి జననం పునరపి మరణం ||  పునరపి జననీ జఠరే శయనం ||

||అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం | శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ||


🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

అన్ని జన్మలలోను - ఏది ఉత్తమమైనది (27-Mar-23, Enlightenment Story)

 🥀*అన్ని జన్మలలోను - ఏది ఉత్తమమైనది*🥀

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది. అసలు జన్మలు 3 రకాలు..!   1) దేవజన్మ        2) మానవజన్మ        3) జంతుజన్మ.

జన్మలు ఎలా వస్తాయి వాటి ప్రత్యేకతలేమిటి.మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు.

*అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి. అందులో అన్నీ పుణ్య కర్మలఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ నెత్తుతాడు.* అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగభూమి, కనుక అక్కడ అతడికి ఏ కర్మలూ చేసే అధికారం లేదు.

అందువల్ల పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు, తన కర్మఫలాలననుసరించి భోగాలనుభవించి, ఆ కర్మఫలాలు క్షయంకాగానే. “ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ” అన్నట్లు ఈ మర్త్యలోకాన్ని.మానవ లోకాన్ని చేరుకోవలసిందే!

మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే! ఈ దేవజన్మలో కేవలం మనోబుద్ధులుంటాయి గాని కర్మజేయుటకు సాధనమైన స్థూలశరీరం ఉండదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు దేవజన్మ.

ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులందు జన్మిస్తాడు.

ఆ జన్మలలో ఆ కర్మ ఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడతాడు...

జంతుజన్మలలో కర్మలు చేస్తున్నట్లు కన్పించినా, ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసేవి కావు. కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి, కారణం ఈ జంతుజన్మలలో శరీరం - మనస్సు ఉన్నాయి గాని బుద్ధి మాత్రం లేదు.

కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే గాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు!

ఇక పుణ్యపాపకర్మలఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ జన్మలలో పుణ్య కర్మఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు. పాపకర్మఫలాలకారణంగా దుఃఖాలు, బాధలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మఫలాలనుభవించటం మాత్రమే గాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవజన్మలోనే ఉన్నది.

ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం, మనస్సు, బుద్ధి అనే 3 సాధనాలు ఉన్న జన్మ ఇది.కనుక పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మను ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది అన్నారు.

84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవ జన్మను.“జంతూనాం నరజన్మ దుర్లభం” అని ఆచార్య శంకరులు “వివేక చూడామణి” గ్రంధంలో తెలియజేయటం జరిగింది.

ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి.



🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

వృద్ధుడు తనకు కొంత సమయం ఇవ్వాలని (26-Mar-23, Enlightenment Story)

 🥀*గుల్జారీలాల్ నందా*🥀

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

తన ఇంట్లో అద్దెకు ఉన్న ఓ వృద్ధుడిని అద్దె బకాయి ఉందంటూ ఇంటి యజమాని వెళ్లగొట్టాడు. వృద్ధుడి వయస్సు 94 సంవత్సరాలు. పాత ఇనుప మంచం, రెండు అల్యూమినియం ప్లేట్లు, ప్లాస్టిక్ బకెట్, చిరిగిన బెడ్ కవర్‌ను ఇంటి యజమాని రోడ్డుపై విసిరేశాడు.  

వృద్ధుడు తనకు కొంత సమయం ఇవ్వాలని ఇంటి యజమానిని వేడుకున్నాడు. ఇతర వ్యక్తులు కూడా వృద్ధునిపై జాలిపడి, ఇంటి యజమానిని వృద్ధుడికి కొన్ని రోజులు సమయం ఇవ్వాలని కోరారు. ఇంటి యజమాని అయిష్టంగానే అంగీకరించాడు. అక్కడ గుమిగూడిన కొందరు వృద్ధుడి చెల్లాచెదురుగా ఉన్న వస్తువులను ఇంట్లోకి తీసుకెళ్లారు.

అటుగా వెళ్తున్న ఓ జర్నలిస్టు ఈ ఘటనను చూశాడు. తాను పనిచేసే వార్తాపత్రికలో ఇలాంటి దుర్వినియోగాన్ని ప్రచురించాలనే ఆలోచనతో తన పత్రికా కార్యాలయానికి వెళ్తాడు. అక్కడ జరిగిన కార్యక్రమాలను కొన్ని ఫొటోలు కూడా తీశాడు. దాని గురించి వార్తలు రాస్తాడు. దానికి హెడ్ లైన్ పెట్టాడు. "క్రూరమైన ఇంటి యజమాని ద్వారా వృద్ధులకు అన్యాయం.." !

ఈ సంఘటనలన్నింటి గురించి తాను రాసిన కథనాలన్నింటినీ తను పనిచేస్తున్న వార్తాపత్రిక ఎడిటర్‌కి చూపిస్తాడు. తన రిపోర్టర్ తెచ్చిన రిపోర్టు చదువుతూ, అక్కడ జరిగిన సంఘటన ఫోటో చూసి, న్యూస్ పేపర్ ఎడిటర్ ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు. వెంటనే తన విలేఖరిని అడిగాడు.

"ఈ ఫోటోలో ఉన్న పెద్దాయన నీకు తెలుసా?" రిపోర్టర్  'నో' అని తల ఊపాడు.  మరుసటి రోజు తన వార్తాపత్రిక మొదటి పేజీలో పెద్ద అక్షరాలతో నివేదిక ప్రచురించబడింది. "గుల్జారీలాల్ నందా; భారత మాజీ ప్రధాని, దయనీయ స్థితిలో!" అనే శీర్షికతో ప్రచురించబడింది.

ఆ రిపోర్టులో మాజీ ప్రధాని నందా ఇంటి యజమానికి అద్దె కట్టలేక ఓనర్ తన బెడ్ కవర్ ను రోడ్డుపై పడేసిన ఘటన గురించి రాసి ఉంది. ముందుకు వెళితే, ఈ రోజు ఒకసారి ఎన్నికైన వారు కూడా కోటీశ్వరులు అవుతారు. అయితే రెండుసార్లు ఆపద్ధర్మ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఎన్నో ఏళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన దగ్గర నివసించడానికి సొంత ఇల్లు కూడా లేదు.

నిజానికి గుల్జారీలాల్ నందాకు ప్రతి నెలా ఐదు వందల రూపాయల భత్యం ఉండేది. కానీ ఆ భత్యానికి తాను స్వాతంత్య్ర సమరయోధుడినని చెప్పి ఐదు వందల రూపాయల భృతిని స్వీకరించేందుకు నిరాకరించాడు. అయితే అప్పుడు అతని స్నేహితులు కొందరు, మీరు ఐదు వందల రూపాయల భృతిని నిరాకరించినట్లయితే, మీ కడుపుని ఏమి చేస్తావు అని అతనికి చెప్పి, అతను భత్యం తీసుకునేలా చూశాడు.

నివేదిక వెలువడిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయన నివాసముంటున్న ఇంటికి చేరుకున్నారు. అధికారుల హడావిడి, వారి వెంట వచ్చే ప్రభుత్వ వాహనాలను చూసి ఇంటి యజమాని అవుతాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది. ఆయన ఇంట్లో అద్దెకుండేది మాజీ ప్రధాని తప్ప మరెవరో కాదు. ఆయనే గుల్జారీలాల్ నందా. వెంటనే ఇంటి యజమాని తనను క్షమించమని గుల్జారీలాల్ నందా కాలు పట్టుకుంటాడు.

ప్రభుత్వ నివాసం మరియు ప్రభుత్వ ప్రయోజనాలను పొందాలని అధికారులు నందాను అభ్యర్థించారు. కానీ గుల్జారీలాల్ నందా అంతే సున్నితంగా తిరస్కరిస్తాడు. తన చివరి శ్వాస వరకు సాధారణ పౌరుడిలా జీవిస్తా నన్నాడు. నందా ను 1997లో "భారతరత్న"తో సత్కరించారు.

ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులతో సరిపోలడం లేదు. ఆయన మనల్ని విడిచిపెట్టి నేటికి 23 ఏళ్లు.


🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

Friday 10 March 2023

పాప - పుణ్యాలు అంటే ఏమిటీ (25-Mar-23, Enlightenment Story)

 🥀*పాప - పుణ్యాలు అంటే ఏమిటీ*🥀

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

మానవులు ఎలాంటి పుణ్యకార్యాలనూ చేయడానికి ఇష్టపడరు.కాని పుణ్యఫలాన్ని మాత్రం ఆశిస్తారు, పాపఫలితాన్ని ఆశించరు. కాని పాపకార్యాలను మాత్రం ప్రయత్న పూర్వకంగానే చేస్తారు, అని ధర్మనీతి శాస్త్ర నిర్వచనం.

ఇంతకీ పాపం అంటే ఏమిటి. పుణ్యం అంటే ఏమిటి. *పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం" అంటే ఇతరులకు చేసిన మేలు పుణ్యం అనీ, ఇతరులను పీడించడం వలన పాపం సంక్రమిస్తుంది అనీ శాస్త్రవచనం.*

తెలియక చేయడం, అజ్ఞానంతో చేయడం ఒకవిధంగా ప్రారబ్ద ఖర్మలను అనుభవిచడం అవుతుంది. కానీ తెలిసి చేస్తే అది మహా పాపం అవుతుంది.

పూర్వజన్మల్లో చేసిన పాప దోషాల వల్లనే ఈ జన్మలో శారీరక, మానసిక వ్యాధులు వచ్చి పీడుస్తున్నాయి అని మనం గ్రహించాలి.చేసుకున్న పాప,పుణ్యాల అనుభవం కోసమే ఈ జన్మ అనునది ఆధ్యాత్మికమైన జవాబు. అయితే. ఎంతకాలం ఈ అనుభవం? అనేదీ ప్రశ్నే. 

దానికీ జవాబు ఉంది. చేసిన పాప, పుణ్యాల గురించి ఈ లోకంలో తలచుకున్నంత కాలం.ఆ పాప, పుణ్య ఫలాన్ని అనుభవించ వలసిందే. ఇదేం తీర్పు. దీనికేదైనా నిదర్శనముందా.అనే సందేహం కలగచ్చు. ఏ సందేహానికైనా సరైన జవాబు చెప్పే సామర్థ్యం మన రామాయణ, భారత, భాగవతాలకే ఉంది. దీనికి సంబంధించిన కథ ఒకటి మహాబారతంలో ఉంది. ఆ కథ ఏమిటంటే.

కృతయుగకాలంలో., ఇంద్రద్యుమ్నుడు అనే చక్రవర్తి ఈ భూలోకాన్ని ధర్మబధ్ధంగా, ప్రజారంజకంగా పరిపాలిస్తూండేవాడు. ఆయన గొప్ప దాత. దశమహాదానాలే కాక షోడశమహాదానాలు విరివిగా చేసాడు. అంతేకాక ఎన్నో పుణ్యకార్యాలు కూడా చేసాడు. ఇంద్రద్యుమ్నుడు చేసిన పుణ్యకార్యాలవల్ల, అతను మరణించాక., దేవదూతలు వచ్చి అతన్ని సరాసరి స్వర్గలోకం తీసుకెళ్లారు. ఇంద్రద్యుమ్నుడు స్వర్గంలో సుఖభోగాలు అనుభవిస్తూ...ఆనందిస్తున్నాడు. 

అలా ఎంతకాలం అయిందో అతనికే తెలియదు. ఒకరోజు ఇంద్రద్యుమ్నుని దగ్గరకు దేవదూతలు వచ్చి, ‘నీవు చేసుకున్న పుణ్యఫలం అయిపోయింది. నీవు స్వర్గంలో ఉండే అర్హత లేదు. భూలోకానికి వెళ్లిపో’ అన్నారు. ‘అదేమిటి.. నా పుణ్యఫలం అప్పుడే తీరిపోవడమేమిటి... ఇంకా చాలా ఉంది’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు. ‘నిరూపిస్తావా’ అని అడిగారు దేవదూతలు. ‘నిరూపిస్తాను.. నన్ను భూలోకం తీసుకొని వెళ్లండి’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు. దేవదూతలు అతన్ని భూలోకం తీసుకు వచ్చారు. ఇంద్రద్యుమ్నునకు భూలోకం చాలా కొత్తగా కనిపించింది. అతనికి తెలిసున్న వారెవరూ కనిపించలేదు. ఆ కాలంలో భూలోకవాసులందరిలోకి అతి వృద్ధుడు మార్కండేయుడు ఒక్కడే అని తెలిసి.. దేవదూతలతో అతని దగ్గరకు వెళ్లి ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘ప్రావారకర్ణుడు’ అనే గుడ్లగూబ ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు మార్కండేయుడు.

అందరూ కలిసి ఆ గుడ్లగూబ దగ్గరకు వచ్చారు. ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘నాళీజంఘుడు’ అనే కొంగ ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు ప్రావారకర్ణుడు. అందరూ కలిసి ఆ ఆ కొంగ దగ్గరకు వచ్చారు. ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు.‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘ఆకూపారుడు’ అనే తాబేలు ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు నాళీజంఘుడు. అందరూ కలిసి ఆ తాబేలు దగ్గరకు వచ్చారు. ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు బాగా తెలుసు. మిమ్మల్ని నేనెలా మర్చిపోతాను.., మీరు ఇంద్రద్యుమ్న చక్రవర్తి. మీరు ఎన్నో యఙ్ఞాలు చేసారు. నన్ను ఎన్నోసార్లు కాపాడారు. దానాలు చెయ్యడంలోనూ మీరు చక్రవర్తే. ఆ కాలంలో మీరు చేసిన గోదానాలు అనంతం. దానగ్రహీతలైన బ్రాహ్మణులు ఆ గోవులను తోలుకుంటూ వెడుతూంటే.. ఆ గోవుల కాలి గిట్టల తొక్కుడు చేతనేకదా ఈ కొలను ఏర్పడింది. అందుకే ఈ కొలనుకు ‘ఇంద్రద్యుమ్నము’ అని నీ పేరే పెట్టారు ప్రజలు. నా సంతతి వారంతా ఈ కొలనులోనే ఇప్పటికీ..నివసిస్తున్నారు’ అన్నాడు ఆకూపారుడు. దేవదూతలు ఆ సమాధానంతో తృప్తిచెంది.. ఇంద్రద్యుమ్నుని తిరిగి స్వర్గానికి తీసుకుని వెళ్లారు. ఇదీ కథ.

కనుక కలకాలం అందరూ చెప్పుకునే విదంగా పుణ్యకార్యాలే చెయ్యాలి. అలాకాక పాపకార్యాలు చేస్తే. ప్రజలు తలుచుకున్నంత కాలం నరకబాధలు తప్పవు

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

నీతి మంతుని తక్కెడ (24-Mar-23, Enlightenment Story)

 🥀*నీతి మంతుని తక్కెడ*🥀

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺

ఒక పల్లెటూరులో ఒక పాలు అమ్మేవాడు ఉండేవాడు పాలు, పెరుగు,నెయ్యి,అన్నీ అమ్ముకుంటూ తన భార్యతో జీవితం సాగిస్తుండేవాడు. తనకున్న పాలలో కొన్ని పాలని ఊరిలో అమ్మి ఇంకా కొన్ని పాలతో నెయ్యి చేసి వారానికి ఒకసారి దగ్గరలో గల పట్టణంకు వెళ్లి అమ్మేవాడు.

అతని భార్య నెయ్యిని ఒక్కో ప్లాస్టిక్ సంచిలో కిలో చొప్పున వేసి ఇచ్చేది, తాను వాటిని అలాగే తీసుకెళ్లి అంగడిలో అమ్ముకునే వాడు, ఒకరోజు అంగడిలో రోజంతా అమ్మగా కొన్ని మిగలటంతో, తాను నిత్యం రోజువారీ సరుకులు కొనే కొట్టుకు వెళ్ళి అక్కడ ఆ యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు పప్పు బియ్యం అన్నీ సరుకులు తీసుకొని ఇంటికి బయలుదేరాడు, ఆ తర్వాత కొట్టు యజమాని నెయ్యిని తీసిపెడుతూ ఒక బ్యాగ్ ను తూకం వేసి చూశాడు ఆయనకు ఆశ్చర్యం వేసింది, ఆ నెయ్యి పాకెట్ 1కిలో లేదు కేవలం 900 గ్రాములే ఉంది. దాంతో యజమాని అన్ని ప్యాకెట్లను తూకం చేసి చూస్తే అన్నీ 900gm బ్యాగులే ఉన్నాయి. అది చూసి ఆయన మనస్సుకు చాలా బాధ అనిపించింది

నేను పాలవాడిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే, నన్ను మోసం చేశాడే అని వేదనపడ్డాడు..మళ్ళీ ఒక వారం తరువాత పాలు అమ్మేవాడు నెయ్యి అమ్మటానికి వచ్చాడు అప్పుడు యజమాని చెప్పాడు నా కొట్టులో ఇకపై కాలు పెట్టకు నీవు మోసగాడివి నమ్మకద్రోహివి, 

నెయ్యి 1కిలో అని 900గ్రాములు ఇస్తావా ఇకపై నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఎవరు ఉండరు, ఇక నీ ముఖం నాకు చూపకు వెంటనే ఇక్కడి నుండి వెళ్లు, నీవెంతో నీతిమంతుడవని నమ్మి నీ వద్ద నెయ్యి కొంటె నన్నే ఇంతలా మోసం చేస్తావా, నమ్మిన వాడిని మోసం చేయాలనుకోవడం సిగ్గుగా లేదూ.

అంటూ దారినపోయే వారందరినీ పిలుస్తూ గొడవ గొడవ చేయసాగాడు..అప్పుడు ఆ పాలవాడు వినయంగా యజమాని తో ఇలా చెప్పాడు, అయ్యా నేను బీదవాడినే కానీ. మోసగాణ్ణి కాదు నా దగ్గర త్రాసు, తూకంరాళ్ళు కొనే అంత డబ్బు లేదు 

మీ దగ్గర తీసుకెళ్లిన 1కిలో చక్కెర ఆధారంగా ఇంట్లో చిన్న కట్టె ముక్క మధ్యలో తాడుకట్టి తక్కెడ లా చేసుకొని ఒకవైపు మీరు అమ్మిన చక్కెర సంచీ వేసి తూకం చేస్తాను అని చెప్పాడు, వెంటనే కొట్టు యజమాని తల వంచుకుని తన తప్పు తనకు తెలిసి సిగ్గు పడ్డాడు, అప్పటివరకు ఇదంతా గమనిస్తున్న వాళ్ళు కొట్టు యజమానిని చీవాట్లు పెట్టి వెల్లసాగారు

మనం వేరేవారికి ఏది చేస్తామో, తిరిగి అదే మనకు మళ్లీ జరుగుతుంది. అది మంచి కావచ్చు చెడు కావచ్చు అది సంతోషమైనా, దుఃఖమైనా తిరిగి మళ్ళీ మనకు జరిగే తీరుతుంది.

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷



గత జన్మల పుణ్య ఫలం (23-Mar-23, Enlightenment Story)

 

*గత జన్మల పుణ్య ఫలం.ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి.అనుభవిస్తే కాని కర్మ పరిపక్వం చెందదు. అని తెలిపే చిన్న కథ!! 

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

పూర్వం ఒక ఊరిలో ఓ పేద కుటుంబం ఉండేది. ఇంటి పెద్ద రోజు శివపూజ చేస్తూ..తనకి ఉన్నంతలో నైవేద్యం నివేదన చేసి.తనపని తాను చేసుకునేవాడు. అలా ఎన్నాళ్ళ నుండో పూజలు చేస్తూ. తన బాధని శివయ్యకి వెళ్ళబోసుకుంటూ ఉండేవాడు.

ఒక రోజు పార్వతీదేవి శివుడితో *స్వామి అతడు అనేక సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు కరుణించి ఏదైనా వరం ఇవ్వవచ్చు కదా* అంటే శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.

*పార్వతికి కోపం వచ్చింది. ఏమిటి స్వామి ఆ నవ్వు!*ఇప్పుడు మీరు ఆ భక్తుడిని కరుణించి పేదరికం మాపి ధనవంతుడిని చేయకపోతే ఊరుకొను అంది. శివుడు మళ్ళి నవ్వి దేవి! నీకోరిక కాదనలేను.

కాని జరగబోయే విపరీతాలు నీవు ఎరుగవు. ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి. అనుభవిస్తే కాని కర్మ పరిపక్వం చెందదు" అన్నాడు. అయినా వినలేదు. పట్టుబట్టింది. 

శివుడు ఇక కాదనలేక దేవి! నీకోరిక ప్రకారం అతడిని ధనవంతుడిని చేస్తాను. చేసే ముందు అసలు ఏమి జరుగుతుందో నువ్వే చూడు. అని అక్కడ మాయమయ్యాడు శివుడు.

ఒక సాధువు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై "నిన్ను నేను రోజు గమనిస్తున్నాను. ఎందుకు అలా సేవలు చేస్తావు ఆ శివుడికి. భోళాశంకరుడు అన్నారు కానీ ఎప్పుడైనా కనికరించాడా? వృథాగా పూజలు చేయకు అని ఒక వజ్రపురాయి చేతికి ఇచ్చి. ఇది అమ్ముకొ చాలా డబ్బు వస్తుంది. హాయిగా బ్రతకవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

ఆ వజ్రపు రాయిని చూసే సరికి అతనికి మతి పోయింది.ఎన్నో కోరికలు మనస్సులో మెలిగాయి. అది కొనాలి ఇది కొనాలి. ఇంకేదో చేయాలి అని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాడు. 

పెట్టెలో భద్రంగా దాస్తుంటే భార్య వచ్చింది.\ఏమిటి అంటే జరిగింది చెప్పాడు. ఆవిడకి దానిమీద ఆశ పుట్టింది. చీరలు నగలు అంటూ వంద కోరికలు ఏకరువు పెట్టింది. ఇద్దరికీ వాదనలు జరిగాయి. 

భార్యని బయటికి గెంటి వజ్రపు రాయి పెట్టెలో పెట్టబోతూ ఉండగా తాగుబోతు కొడుకు సరిగ్గా అక్కడికి వచ్చాడు. చేతిలో ఉన్న రాయిని చూసి దాని వెలుగులు చూసి నాకు ఇవ్వు. నేను తాగాలి జూదం ఆడాలి, అప్పులు తీర్చాలి అన్నాడు. పెద్ద గొడవ అయింది. పక్కనే ఉన్న కత్తి తీసుకొని తండ్రి మెడ మీద ఒక్కటి వేశాడు. అంతే తండ్రి అక్కడికక్కడే కుప్పకూలి పోయి చనిపోయాడు. 

అడ్డు వచ్చిన తల్లిని చంపేసి వజ్రం తీసుకొని పారిపోయాడు.అది చూసిన దొంగలు వాడిని చంపి వజ్రం ఎత్తుకుపోయారు. అది చూసిన భటులు ఆ దొంగలని చంపేసి రాజు గారికి ఇచ్చారు. రాజు దానిని చక్కగా చెక్కించి పూజించి కిరీటంలో పొదిగాడు. చూశావా! పార్వతీ! ఏమి జరిగిందో! 

ఒక్క రాయి ఎన్ని బ్రతుకులు మార్చిందో, ఎన్ని బ్రతుకులు నాశనం చేసిందో! ఎన్ని ప్రాణాలను బలిగొందో! ఆ పేదవాడు పూర్వం జన్మలో భార్యని పిల్లల్ని హత్య చేశాడు.  ఎవరికీ దానం ధర్మం చేయలేదు. భక్తి మాత్రం మెండు. ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు కొనసాగింది. చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు. ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చడం కుదరదు.

అనుభవిస్తేనే కర్మ తీరుతుంది. ఏ వస్తువు ఎక్కడికి చేరాలో ఎవరికీ దక్కాలో వారికే దక్కుతుంది తప్ప అర్హత లేనివాడు పొందలేడు.  తాత్కాలికంగా విలువైన వస్తువులు మనదగ్గర ఉన్నట్లు కనిపించినా అర్హత లేకపోవడం చేత తొందరగానే పతనం అవుతాయి.

పేదవాడు, మంచివాడు అనేది ఉండదు. గత జన్మలో భార్య బిడ్డలని చంపాడు. భార్య గయ్యాళి అయింది. కొడుకు వ్యసనపరుడై తండ్రిని చంపాడు. వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితం. 

పుట్టుకైనా చావైనా తాను చేసుకున్నదానిని బట్టే వస్తుంది. ఇదే విధి..

ఓం నమః శివాయ🙏🙏🕉️🙏🙏

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

నాకు ఒక రూపం లేదు. నన్ను ఎవరు ఏ రూపంలో ఆరాధిస్తే (22-Mar-23, Enlightenment Story)

*నాకు ఒక రూపం లేదు. నన్ను ఎవరు ఏ రూపంలో ఆరాధిస్తే*

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తాను’’ అని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత నాలుగో అధ్యాయం పదకొండో శ్లోకంలో చెప్పాడు.

||యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్‌||మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః!||

‘‘పార్థా! నీకు ఒక దైవరూపం, ఒక దేవుడి పేరు అంటే ఇష్టం కాబట్టి అందరినీ అందులోకి మళ్లించే ప్రయత్నం చేయవద్దు. ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తున్నారో, పూజిస్తున్నారో వారిని అదే విధంగా నేను అనుగ్రహిస్తున్నాను. మనుషులందరూ నా మార్గాన్నే అనుసరిస్తున్నారు’’ అని శ్రీకృష్ణపరమాత్మ చెప్పాడు. కాబట్టి దేవుణ్ణి పూజించడానికి రూపం ప్రధానం కాదు. దానికి 

*ఉదాహరణ ఈ కథ*

పూర్వం ఒక వర్తకుడు ఉండేవాడు. రోజూ శివుణ్ణి ఆరాధించేవాడు. నాలుగైదు తరాలుగా శివుడు వారి ఇంటి దైవం. ఒకసారి ఆ వర్తకుడికి వ్యాపారంలో నష్టం వచ్చింది. దాంతో దిగాలుపడిపోయాడు. ‘శివుణ్ణి ఆరాధిస్తున్నా వ్యాపారంలో నష్టం వచ్చింది’ అనుకున్నాడు. ఇంటి అరుగు మీద దిగాలుగా కూర్చున్నాడు.  

అతని దూరపు బంధువు ఒకరు ఆ దారివెంట వెళుతూ వర్తకుణ్ణి పలకరించాడు.  ‘ఎందుకు దిగాలుగా ఉన్నావ’ని అడిగితే వ్యాపారంలో నష్టం గురించి చెప్పాడు వర్తకుడు. అప్పుడా వ్యక్తి ‘‘అయ్యప్ప మాల ఽధరించు, నీ  కష్టాలన్నీ తీరుతా‘’యన్నాడు. బలహీనమైన మనస్సుతో ఉన్న వర్తకుడు సరేనన్నాడు. వెంటనే ఇంట్లోనే తరతరాలుగా ఆరాధిస్తున్న నటరాజ విగ్రహాన్ని ఓ మూలకు నెట్టేసి, అయ్యప్ప విగ్రహాన్ని పెట్టి పూజించడం మొదలుపెట్టాడు. రోజూ ధూప, దీప, నైవేద్యాలతో పూజలు చేయసాగాడు. అనుకోకుండా వ్యాపారంలో మళ్లీ లాభం వచ్చింది. ‘అయ్యప్ప పూజ ఫలించింది’ అనుకున్నాడు.

ఒక రోజు ఇంట్లో పూజలో ఉండగా అయ్యప్ప ముందు వెలిగించిన ధూపం పొగ నటరాజ విగ్రహం దగ్గరకు వెళుతూండడం చూశాడు. గాలి మూలంగా పొగ అటువైపు వెళుతోంది. ‘అయ్యప్ప కోసం ధూపం వెలిగిస్తే, శివుడికి ఎందుకు? ఎంత ఆరాధించినా శివుడు నన్ను పట్టించుకోలేదు’ అని మనసులో అనుకుంటూ శివుడి వైపు ధూపం పొగ వెళ్ళకుండా చేయి అడ్డంపెట్టాడు. ఆ చేతి కింది నుంచి పొగ వెళ్ళసాగింది. దాంతో తనే అడ్డంగా నిలుచున్నాడు. అతని పక్కనుంచి పొగ వెళ్ళింది. నిజానికి గాలి మూలంగా పొగ అటువైపు వెళుతోంది. ‘అడ్డంగా నిలుచున్నా శివుడి వైపు ధూపం వెళుతోంది’ అని  ఒక వస్త్రం తీసుకువచ్చి, శివుడు ధూపం పొగ పీల్చుకోకుండా ఆ నటరాజ స్వామి విగ్రహం ముక్కుల్లో పెట్టాడు.

వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. వర్తకుడు ఆ అర్ధనారీశ్వరుడి కాళ్ళమీద పడి క్షమించమని వేడుకున్నాడు. ‘‘తరతరాలుగా ఆరాధిస్తున్నా ఎప్పుడూ కలగని భాగ్యం ఈ రోజు కలిగింది. నాపై ఎందుకు కరుణ చూపించావయ్యా!’’ అని శివుణ్ణి అడిగాడు. 

అప్పుడు శివుడు ‘‘నువ్వు ఎప్పుడు పూజ చేసినా నన్ను రాతి విగ్రహంగానే భావించావు. ధూపం పొగ ఎటుపోయినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నన్ను రాతి విగ్రహం అనుకోలేదు. నేను పొగ పీలుస్తున్నానని నమ్మావు. నాపైన సంపూర్ణ విశ్వాసం చూపావు. భక్తితో ఉన్నా, వైరభావంతో ఉన్నా నాకు కావలసింది నమ్మకం’’ అన్నాడు.

ఇప్పుడు చెప్పండి... శివుడు వేరు... అయ్యప్ప వేరా? నమ్మకం ప్రధానం కాదా? అంత నమ్మకం అప్పుడే శివుడిపై ఉంటే కాపాడే వాడు కాదా? అదే శ్రీకృష్ణుడు ఇక్కడా చెప్పాడు. 

కాబట్టి ఒక దీక్షలో ఉన్న వారిని మరో దీక్షలోకి మార్చకండి. కావలసింది సత్య దీక్ష! అదే భగవంతుడు మెచ్చే దీక్ష.

‘‘ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తున్నారో, పూజిస్తున్నారో వారిని అదే విధంగా నేను అనుగ్రహిస్తున్నాను. మనుషులందరూ నా మార్గాన్నే అనుసరిస్తున్నారు’’ అన్నాడు. శ్రీకృష్ణపరమాత్మ. కాబట్టి దేవుణ్ణి పూజించడానికి రూపం ప్రధానం కాదు.

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

సంతోషపు రహస్యం (21-Mar-23, Enlightenment Story)

 *🌹సంతోషపు రహస్యం🎊

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

😀నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఓ కుర్రవాడు బయల్దేరాడు. దేశంలో   చాలా  రోజులపాటు తెగ తిరిగాడు. చివరికి సంతోషపు రహస్యం గురించి చెప్పగల ఒక పెద్దాయన గురించి విన్నాడు. 

ఆ పెద్దాయన ఫలానా పర్వతం మీద ఓ అందమైన భవంతిలో ఉంటాడని తెలిసింది. ఆ ఇంటిని వెతుక్కుంటూ పర్వతాన్ని ఎక్కాడు. నిజంగానే ఆ పర్వతం మీద కళ్లు చెదిరిపోయే ఒక భవనం కనిపించింది. 

తన గమ్యాన్ని చేరుకున్నానన్న సంతోషంలో ఆ కుర్రవాడు హడావుడిగా భవంతిలోకి అడుగుపెట్టాడు. అక్కడ వందలాది మంది రకరకాల పనులలో నిమగ్నమై ఉన్నారు. వారందరినీ దాటుకుని ఆ ఇంటి యజమాని దగ్గరకు చేరుకునేసరికి అతనికి చాలా సమయమే పట్టింది. 

ఆ పెద్దాయన దగ్గరకి వెళ్లిన కుర్రవాడు, తన బాధనంతా ఏకరవు పెట్టాడు. సంతోషపు రహస్యం ఎలాగైనా తనకు చెప్పితీరాలని పట్టుపట్టాడు. 

కుర్రవాడు చెప్పినదంతా పెద్దాయన శ్రద్ధగా విన్నాడు. ‘నా పని పూర్తయ్యాక నీకు సంతోషపు రహస్యాన్ని తప్పకుండా చెబుతాను. ఈలోగా నువ్వు నా భవంతిని చూసిరా. అయితే ఒక చిన్న షరతు. ఇదిగో ఈ చెంచా ఉంది చూశావు. అందులో రెండు చుక్కల నూనె ఉంది. ఆ చెంచాని పట్టుకుని నువ్వు తిరగాలి. తిరిగి వచ్చేసరికి అందులోని నూనె ఒలికిపోకూడదు. సరేనా!’ అన్నాడు పెద్దాయన. 

 ‘ఓస్‌ అంతే కదా!’ అనుకున్నాడు కుర్రవాడు. ఆ చెంచాని పట్టుకుని భవంతి అంతా కలియతిరిగాడు. ఓ రెండు గంటలు ఇంట్లోని మూలమూలలా తిరిగిన తర్వాత పెద్దాయన దగ్గరకి చేరుకున్నాడు. ‘వచ్చేశావా! నా ఇల్లు ఎలా ఉంది చెప్పు. అక్కడ వంటింట్లో తగిలించి పర్షియా కర్టెన్లు చూశావా? నా తోటమాలి పదేళ్లపాటు శ్రమించి రూపొందించిన అందమైన తోటని గమనించావా? నా గ్రంథాలయంలో ఉన్న అరుదైన తాళపత్రాలను పరిశీలించావా?...’ అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. 

పెద్దాయన అడిగిన ప్రశ్నలకి కుర్రవాడు చిన్నబోయాడు. ‘భవనం అంతా తిరిగాను కానీ. వాటన్నింటినీ అంత దగ్గరగా పరిశీలించలేకపోయాను. నా చేతిలోని నూనె చుక్కలు ఎక్కడ జారిపోతాయో అన్న భయంతో నిరంతరం చెంచా వంక చూసుకోవడమే సరిపోయింది,’ అంటూ సంజాయిషీ చెప్పాడు. 

 ‘అయ్యయ్యో! ఎంత పని జరిగిపోయింది. నా ఇంటినే సరిగా చూడలేనివాడివి ఇక జీవితాన్ని ఏం చూడాలనుకుంటున్నావు. మరోసారి భవంతి అంతా కలియతిరిగి రా!’ అన్నారు పెద్దాయన. 

 ఈ మాటతో సంబరంగా మరోసారి ఇల్లు కలియతిరగడానికి బయల్దేరాడు కుర్రవాడు. ఈసారి ఇంట్లోని నలుమూలలూ క్షుణ్నంగా పరిశీలించాడు. 

అందులోని ప్రతి వస్తువులోనూ ఉన్న కళాత్మకతను ఆస్వాదించాడు. ఓ రెండుగంటల తర్వాత పెద్దాయన దగ్గరకి చిరునవ్వుతో వెళ్లి నిల్చొన్నాడు. ‘నీ వాలకం చూస్తే ఇంట్లోని ప్రతి అంగుళమూ చూసి వచ్చినట్లు ఉన్నావే!’ అన్నాడు పెద్దాయన. 

 ‘అవునండీ!’ అంటూ ముసిముసిగా నవ్వుతూ బదులిచ్చాడు కుర్రవాడు. ‘కానీ ఈసారి చెంచాలో నూనె అంతా ఒలికిపోయింది చూశావా? జీవితం కూడా ఇంతే! 

దాన్ని ఆస్వాదించాలి అన్న ధ్యాసలోనే ఉంటే నీ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేవు. నీ బాధ్యతల హోరులో పడిపోతే..... నీ చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదించలేవు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడంలోనే నిజమైన సంతోషం ఉంది,’ అని చెప్పుకొచ్చాడు పెద్దాయన. 

ఏమి జరిగినా మన మంచి కే అని అనుకోవడము అలవాటు చేసుకోవాలి.అప్పుడే హాయిగా, సుఖంగా వుండగలవు, లేదంటే బాధ, వ్యధల తో జీవితం ముగిసిపోతుంది. 

 ఇందుకు చిన్న ఉదాహరణ చెపుతాను విను. 

సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయింది. అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తూ బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జన సంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు. ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజూ భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు. 

ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవరూ కానరాలేదు. చూసి చూసి విసిగి పోయాడు. ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. ఆ గుడిసె లో అలల తాకిడికి కొట్టుకువచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు. 

ఇలా ఉండగా ఒక రోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు. తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి. తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు.  

తనకు పట్టిన దుర్గతిని తలుచుకుని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు. తెల్లవారి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది. అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధుల్లేవు.  ఆ నావలోని వాళ్ళలో ఒకర్ని “నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది?” అని అడిగాడు. 

“నువ్వు మంట పెట్టి  పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా. దానిని గుర్తు పట్టే ఇక్కడికి రాగలిగాం” అన్నాడు. ఒక్కోసారి మన ఆశల సౌధాలు ఇలాగే ఒక్కసారి తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ మంచికో సంకేతం కావచ్చు. 

ఎంత గొప్పవాళ్లకైనా వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలా తెలిస్తే మనిషి భయానికి, నిరాశకు లోనవుతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి - చెడు, సుఖం - దుఃఖం, కష్టం - నష్టం వస్తూ ఉంటాయి. ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా అంతా మన మంచికే అనుకొని మనుషులు ఆటుపోట్లను తట్టుకొని జీవించాలి. అప్పుడే నిజమైన సంతోషం మన సొంతం అవుతుంది. 

రాత్రి అయ్యింది, అంతా చీకటిగా ఉంది ఏమీ కనిపించడం లేదు అని నిరాశ చెందకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా తెల్లవారుతుంది నమ్మకం ఉండాలి. ఏందుకంటే ఇది ప్రతి రోజు జరిగేదే అని నీకు చాలా రోజులు గా అనుభవ పూర్వకంగా తెలుసు. 

సంతోషం కూడా అలాగే వస్తుంది అని నమ్మకం వుండాలి. అలా కాకుండా రాత్రి, అయిన వెంటనే తెల్లవార లేదు అని బాధ పడకూడదు. 

ఎందుకంటే దానికి 12 గంటల సమయం పడుతుంది అలాగే నీకు ఎదురైనా కష్టాలు కానీ, బాధలు కానీ పోవడానికి కొంత సమయం పడుతుంది అయితే చివరికి మాత్రం ఖచ్చితంగా నీకు మంచి జరిగి తీరుతుంది అనే నమ్మకంతో జీవిత గమనాన్ని కొనసాగించాలి.🙏

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

Wednesday 8 March 2023

లక్ష్మీనివాసం (20-Mar-23, Enlightenment Story)

 🥀*లక్ష్మీనివాసం*🥀

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

 లక్షీదేవి ఒకసారి ఒక వ్యక్తి పై  అలిగి “నేను వెళ్లి పోతున్నాను. మీ ఇంటికి ఇక దరిద్ర దేవత రాబోతున్నది. కాకపోతే నీకో వరం ఇవ్వదలచుకొన్నాను. అడుగు!”అని అంటుంది.

అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవి తో  ఇలా అంటాడు. “అమ్మా నీవు వెళ్లుతుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి అంతన్నా లేదు. మీలో ఒకరు వున్నచోట ఒకరు వుండరు. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే వుండేటట్లు వరం ఇవ్వమ”ని అంటాడు.

లక్ష్మీదేవి ‘తథాస్తు!’ అని వెళ్లిపోతుంది. కొన్నిరోజుల తర్వాత ఇంటిలో  వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాళ్ళలో  వేయమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది.

కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమై పోతుంది. ఇంకొంతసేపటికి పెద్దకోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తనుకూడ ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరేపనిలో పడిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్లు ఇద్దరు తమ పనిలోపడి ఉప్పు వేశారో లేదో అని తనూ కొంత వేస్తుంది.

మధ్యాహ్నం భోజనానికి   ఆవ్యక్తి  తను తినే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువ అయినది గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి  ప్రవేశించింది అని తెలుసుకుంటాడు. ఏమి అనకుండా తిని లేస్తాడు.

కొంత సేపటికి ఆ వ్యక్తి పెద్దకొడుకు కూడ భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయినది అని గ్రహించి ‘నాన్న గారు తిన్నారా?’ అని భార్యను అడుగుతాడు.’తిన్నారు!’  అని చెబుతుంది.

దానితో   ‘నాన్న ఏమీ అనకుండ తిన్నాడు. నేనెందుకు అనాలి?’   అని ఏమి మాట్లాడకుండ తిని లేస్తాడు. ఇలా ఇంటి వాళ్లంతా తిని వంట గురించి మాటలాడకుండ వుంటారు.

ఆరోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి *నేను వెళ్లిపోతున్నాను. ఉప్పు కసిం  అయిన వంట తిని కూడ మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు. ఇటు వంటి చోట నేనుండను!* అని వెళ్లిపోతుంది.

దరిద్ర దేవత వెళ్లిపోవటంతో ఆ ఇంట మళ్లీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకొంటుంది. ఏ ఇంటిలో  ‘ప్రేమ,అప్యాయతలు మరియు శాంతి’ వుంటాయో ఆ ఇల్లు    ‘లక్ష్మీ నివాసం’ అయ్యి వుంటుంది.

ఈ కథ చదివిన  వారి ఇంట లక్షీదేవి కొలువై ఉండాలని కోరుకొంటున్నాను.      

||సర్వం శ్రీకృష్ణార్పణమస్తు|| లోకా సమస్తా సుఖినోభవన్తు! ||రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷



భక్తకన్నప్ప (19-Mar-23, Enlightenment Story)

👏⚘ #భక్తకన్నప్ప ⚘👏

🌷🙏🌷🌷🙏🌷🌷

భక్త కన్నప్ప గొప్ప శివ భక్తుడు. పూర్వాశ్రమంలో తిన్నడు అనే బోయవాడు. చరిత్ర ప్రకారం శ్రీకాళహస్తి పరిసర ప్రాంత అడవుల్లో సంచరిస్తూ వేటాడి జీవనం సాగించేవాడు. 

ఒకనాడు అలా వేటాడుతుండగా అతనికి అడవిలో ఒక చోట శివలింగం కనిపించింది. అప్పటినుంచీ తిన్నడు దానిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే నైవేద్యంగా పెడుతుండేవాడు.

ఒక సారి శివుడు తిన్నడి భక్తిని పరీక్షించ దలచి తిన్నడు పూజ చేయడానికి వచ్చినపుడు శివలింగంలోని ఒక కంటినుంచి నీరు కార్చడం మొదలు పెట్టాడు. విగ్రహం కంటిలోనుంచి నీరు కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి నీరు కారుతున్న కంటికి అమర్చాడు. 

వెంటనే విగ్రహం రెండో కంటినుంచి కూడా నీరు కారడం ఆరంభమైంది. కాలి బొటనవేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించాడు. అందువల్లనే తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది.

తిన్నడు పూర్వ జన్మలో అర్జునుడు అనే ( కిరాతార్జునీయం) ఒక కథ కూడా ప్రచారంలో ఉంది.తన కన్నును ఈశ్వరునికర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. కన్నప్పనాయనారు అయ్యాడు. 

నేత్రేశనాయనారు అనునది సంస్కృతనామము..

 శ్రీకాళహస్తి స్థల పురాణం లో శ్రీకాళహస్తీశ్వర స్వామి కన్నప్ప అనే భిల్లునికి ముక్తి ప్రధానం చేసిన పుణ్యదినం విశేషం కన్ను అర్పణ చేసిన తరువాత భిల్లునుతో పరమేశ్వరుడు ఈ విధంగా అన్నారు. 

శ్లో: మమ రూపం హృదిధ్యాయ న్నుషిత్వా పంచవత్సరాన్ పునరస్మిన్దినే ప్రాప్తే ప్రోక్త సర్వగుణోత్తరే !!

తాత్పర్యము :- నా యొక్క రూపాన్ని అయిదు సంవత్సరముల పాటు నీ హృదయము నందు ధ్యానము చేయవలసినది ఆ తరువాత అన్ని శుభగుణములు కలిగిన ఒక శుభదినమున.

శ్లో:మత్సమీపే కృతావాసో భవ కైలాస మస్తకే ఇత్యుక్త్వాంత దధేలింగే పశ్యత్సు మునిషుస్ఫుటం !!

తాత్పర్యము :- దక్షిణ కైలాస పర్వతంలోని మస్తక భాగంలో నా సమీపం (ప్రస్తుతం కన్నప్ప ధ్వజారోహణం అని పిలువబడే కైలాసనాథ స్వామి దగ్గర )లోని కైలాసనాథ లింగం దగ్గర ధ్యాన వ్యవస్థలో ఉచ్చ స్థితి అయిన సమాధి వ్యవస్థలో నిమగ్నమై ఉన్న  సమయంలో.

శ్లో:అస్మిన్యః  ఫాల్గునే మాసే పూర్ణిమాయాం తిధౌశుభే భృగువారేచ నక్షత్రే శుభాదే భగదైవతే !!

తాత్పర్యము :-  ఒకానొక సందర్భమున ఫాల్గుణ మాసం పౌర్ణమి శుక్రవారం ఉత్తరఫల్గుణి నక్షత్రముతో కూడిన శుభదినమున.

శ్లో: శివాజ్ఞయా తత్రసోపి స్థిత్వావత్సర పంచకం త్యక్త్వాతనుం తతః ప్రాప శివ సారూప్యముత్తమం !!

తాత్పర్యము :- శివజ్ఞచే సమాధి స్థితిలో ఉన్న కన్నపకు  అయిదు సంవత్సరములు తరువాత తనువు చాలించిన బిల్లునకు(కన్నప్పకు) పరమేశ్వరుడు సారూప్య ముక్తిని అనుగ్రహించాడు.

శ్లో: తనుం త్యక్త్వాత్ర వల్మీకే భుజంగమ  ఇవత్వచం అవాప్య మమ సారూప్యం సర్వదేవాభికాంక్షితం !!

తాత్పర్యము :- అలా పరమేశ్వరుని అనుగ్రహం పొందిన బిల్లుని(కన్నప్ప) శరీరము నుండి ప్రాణము పాము కుబుసం వదిలిన విధానంగా  అందరు దేవతలు ఆకాంక్షించే సారూప్యముక్తి  పొంది దక్షిణకైలాస పర్వతం లో మస్తక భాగం లో కొలువైవున్న కైలాసనాధేశ్వరుడిలో ఐక్యం అయ్యారు అని స్థల పురాణం నందు తెలుపబడింది , 

కావున కన్నప్ప ముక్తి పొందిన ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున  కైలాసగిరిలో కొలువైవున్న  కైలాశనాధేశ్వరుణ్ణి  అదే విధంగా భిల్లుని(కన్నప్పను) దర్శించడం చాలా విశేషము.



🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

పది మందికి - సహాయపడాలి అంటే ఎంత డబ్భు అవసరం??? (18-Mar-22,Enlightenment Story)

🥀* పది మందికి - సహాయపడాలి అంటే ఎంత డబ్భు అవసరం???*🥀

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

ఒకసారి ఒక చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చాడు... ఇలా అడిగాడు.. నేను ఎందుకు పేదవాడను?

బుద్ధుడు సమాధానం చెప్పాడు: 

మీరు ఎందుకు పేదవారు  అంటే మీరు ఎటువంటి ఔదార్యము కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు, కాబట్టి మీరు పేదవారు అని అన్నారు, నేను ఇతరులకు దానం చేయడానికి నావద్ద ఏమున్నది కనుక? అని ఆ పేదవాడు అడిగాడు..

అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు

మీరు ఇతరులతో పంచుకోగల ఐదు నిధులను మీరు కలిగివున్నారు తెలుసా!!!.

మొదట మీ ముఖం ఉంది, మీరు ఇతరులతో మీ  ఆనందాలను (నవ్వులను) పంచుకోవచ్చు.ఇది ఉచితం .ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది.

రెండవది మీ కళ్ళు మీకు ఉన్నాయి, మీరు ప్రేమ మరియు శ్రద్ధతో  ఇతరులను చూడవచ్చు. ఇది నిజం.మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు. వాటిని మంచి అనుభూతితో చేయండి.

మూడవది మీకు భగవంతుడు ప్రసాదించిన నోరు ఉంది, ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు .. మంచి చర్చించి, సత్సంగములో చేర్పించి.వాటిని విలువైనదిగా భావించండి. దానితో ఆనందము మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి.

నాలుగవది మీకు భగవంతుని ప్రసాదమైన గుండె ఉంది. మీ దయగల హృదయంతో, భగవంతున్ని ప్రార్థిస్తూ. మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు.ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు. వారి జీవితాలను తాకవచ్చు.

మీరు కలిగి ఉన్న చివరి సంపద మీ శరీరం. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు. అవసరమైన వారికి చేతనైన సహాయం చేయవచ్చు.

సహాయం  చెయ్యడానికి  డబ్బు అవసరం లేదు. ఒక చిన్న శ్రద్ధ, సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు. భగవంతుడు మనకిచ్చిన జీవితం..

కలకానిదీ ! విలువైనదీ ! సర్వోత్తమమైనదీ !

*ప్రతిక్షణం ఆనందంగా ఉంటూ, పదిమందికి చేతనైన సహాయం చేస్తూ, మన జన్మను చరితార్థం చేసుకోవడమే మానవ జన్మకు సార్థకత. 

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

స్త్రీ అంటే ఎవరు? 220 పర్యాయ పదములు (17-Mar-22,Enlightenment Story)

🥀*స్త్రీ అంటే ఎవరు? (220 పర్యాయ పదములు) 🥀

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

స్త్రీ అంటే ఎవరు?*

ఆమె నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, ఆమె మనస్సులో మిలియన్ల విషయాలు నడుస్తున్నాయి. 

ఆమె నిన్ను తదేకంగా చూస్తున్నప్పుడు, ఆమె మిమ్మల్ని పెద్దగా ఎందుకు ప్రేమిస్తోందని ఆలోచిస్తోంది.ఎవరో ఆమెను అడిగారు, మీరు పని చేసే మహిళనా లేదా గృహిణినా?ఆమె సమాధానమిచ్చింది: అవును, నేను పూర్తి సమయం పనిచేసే గృహిణిని. నేను 24 గంటలు పని చేస్తాను.

నేను అమ్మను.నేను భార్యను.నేను ఒక కుమార్తెని.నేను కోడలిని.నేను అలారం గడియారాన్ని.

నేను వంటవాడిని.నేను పనిమనిషిని అలాగే టీచర్‌ని.నేను వెయిట్రెస్ మరియు నానీని.

నేను నర్స్ ని.నేను సెక్యూరిటీ అధికారిని.నేను కౌన్సెలర్‌ని.నేను కంఫర్టర్‌ని.నాకు సెలవులు రావు.

నాకు సిక్ లీవ్ రాదు.నాకు రోజు సెలవు లేదు.నేను పగలు మరియు రాత్రి పని చేస్తాను.

నేను అన్ని గంటలూ కాల్‌లో ఉంటాను.

ఒక స్త్రీకి ఉప్పు వంటి అత్యంత ప్రత్యేకమైన పాత్ర ఉంది! ఆమె ఉనికిని ఎప్పటికీ గుర్తుంచుకోదు, కానీ ఆమె లేకపోవడం అన్ని వస్తువులను రుచిగా చేస్తుంది సనాతన ధర్మం ను పాటించే ఆడవాళ్ళందరికీ, స్త్రీ విలువను గ్రహించండి.ధర్మం ను పాటించే స్త్రీ లకి నేను నమస్కరిస్తున్నాను.

===================================================================

స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదములివి. దాదాపుగా ఒక పదమునకు ఇన్ని పర్యాయ పదములు గల ఘనత మరే భాషలో ఉండవేమో ...!!!* ఇన్ని పదాలు ఒక్క స్త్రీ కే ఉన్నాయని ఇప్పటివరకు నాకు తెలియదు.

1. అంగన

2. అంచయాన

3. అంబుజాలోచన

4. అంబుజవదన

5. అంబుజాక్షి

6. అంబుజనయన

7. అంబురుహాక్షి

8. అక్క

9. అతివ

10. అన్ను

11. అన్నువ

12. అన్నువు

13. అబల

14. అబ్జనయన

15. అబ్జముఖి

16. అలరుబోడి

17. అలివేణి

18. అవ్వ

19. ఆటది

20. ఆడది

21. ఆడగూతూరు

22. ఆడుబుట్టువు

23. ఇంచుబోడి

24. ఇంతి

25. ఇదీవరాక్షి

26. ఇందునిభాష్య

27. ఇందుముఖి

28. ఇందువదన

29. ఇగురాకుబోణి

30. ఇగురాకుబోడి

31. ఇభయాన

32. ఉగ్మలి

33. ఉజ్జ్వలాంగి

34. ఉవిధ

35. ఎలతీగబోడి

36. ఎలనాగ

37. ఏతుల

38. కంజముఖి

39. కంబుకంఠ

40. కంబుగ్రీవ

41. కనకాంగి

42. కన్నులకలికి

43. కప్పురగంధి

44. కమలాక్షి

45. కరబోరువు

46. కర్పూరగంది

47. కలకంఠి

48. కలశస్తిని

49. కలికి

50. కలువకంటి

51. కళింగ

52. కాంత

53. కించిద్విలగ్న

54. కిన్నెరకంఠి

55. కురంగానయన

56. కురంగాక్షి

57. కువలయాక్షి

58. కూచి

59. కృషమధ్యమ

60. కేశిని

61. కొమ

62. కొమరాలు

63. కొమిరె

64. కొమ్మ

65. కోమ

66. కోమలాంగి

67. కొమలి

68. క్రాలుగంటి

69. గజయాన

70. గరిత

71. గర్త

72. గుబ్బలాడి

73. గుబ్బెత

74. గుమ్మ

75. గోతి

76. గోల

77. చంచరీకచికుర

78. చంచలాక్షి

79. చంద్రముఖి

80. చంద్రవదన

81. చక్కనమ్మ

82. చక్కెరబొమ్మ

83. చక్కెర

84. ముద్దుగుమ్మ

85. చాన

86. చామ

87. చారులోన

88. చిగురుంటాకుబోడి

89. చిగురుబోడి

90. చిలుకలకొలోకి

91. చెలి

92. చెలియ

93. చెలువ

94. చేడి(డియ)

95. చోఱుబుడత

96. జక్కవచంటి

97. జని

98. జలజనేత్ర

99. జోటి

100. ఝషలోచన

101. తనుమధ్య

102. తన్వంగి

103. తన్వి

104. తమ్మికింటి

105. తరళలోచన

106. తరళేక్షణ

107. తరుణి

108. తలిరుబోడి

109. తలోదరి

110. తాటంకావతి

111. తాటంకిని

112. తామరకంటి

113. తామరసనేత్ర

114. తియ్యబోడి

115. తీగ(వ)బోడి

116. తెఱువ

117. తెలిగంటి

118. తొగవకంటి

119. తొయ్యలి

120. తోయజలోచన

121. తోయజాక్షి

122. తోయలి

123. దుండి

124. ధవలాక్షి

125. ననబోడి

126. నళినలోచన

127. నళినాక్షి

128. నవల(లా)

129. నాంచారు

130. నాచారు

131. నాచి

132. నాతి

133. నాతుక

134. నారి

135. నితంబవతి

136. నితంబిని

137. నీరజాక్షి

138. నీలవేణి

139. నెచ్చెలి

140. నెలత

141. నెలతుక

142. పంకజాక్షి

143. పడతి

144. పడతుక

145. పద్మముఖి

146. పద్మాక్షి

147. పర్వందుముఖి

148. పల్లవాధర

149. పల్లవోష్ఠి

150. పాటలగంధి

151. పుచ్చడిక

152. పుత్తడిబొమ్మ

153. పువు(వ్వు)బోడి

154. పువ్వారుబోడి

155. పుష్కరాక్షి

156. పూబోడి

157. పైదలి

158. పొల్తి(లతి)

159. పొల్తు(లతు)క

160. త్రీదర్శిని

161. ప్రమద

162. ప్రియ

163. ప్రోడ

164. ప్రోయాలు

165. బంగారుకోడి

166. బాగరి

167. బాగులాడి

168. బింబాధర

169. బింబోష్ఠి

170. బోటి

171. భగిని

172. భామ

173. భామిని

174. భావిని

175. భీరువు

176. మండయంతి

177. మగువ

178. మచ్చెకంటి

179. మడతి

180. మడతుక

181. మత్తకాశిని

182. మదిరనయన

183. మదిరాక్షి

184. మసలాడి

185. మహిళ

186. మానవతి

187. మానిని

188. మించుగంటి

189. మించుబోడి

190.మీనసేత్రి

191. మీనాక్షి

192. ముగుద

193. ముదిత

194. ముదిర

195. ముద్దరాలు

196. ముద్దియ

197. ముద్దుగుమ్మ

198. ముద్దులగుమ్మ

199. ముద్దులాడి

200. ముష్ఠిమధ్య

201. మృగలోచన

202. మృగాక్షి

203. మృగీవిలోకన

204. మెచ్చులాడి

205. మెఱుగారుబోడి

206. మెఱుగుబోడి(ణి)

207. మెలుత

208. మెళ్త(లత)మెల్లు(లతు)

209. యోష

210. యోషిత

211. యోషిత్తు

212. రమణి

213. రామ

214. రుచిరాంగి

215. రూపరి

216. రూపసి

217. రోచన

218. లతకూన

219.లతాంగి

220. లతాతన్వి

తెలుగు భాషలో ఒక్క స్త్రీ అనే పదానికి మాత్రమే ఇన్ని పర్యాయ పదాలున్నాయంటే - తెలుగు నా మాతృభాష అని చెప్పడం గర్వకారణం కదా.

దేశభాషలందు తెలుగు లెస్స!

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

పరమాత్మ (16-Mar-23, Enlightenment Story)

🥀*పరమాత్మ*🥀

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏 
ఈ చరాచర జగత్తు అంతా పరమాత్మ నిండి ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. కాబట్టి పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న లేదు. 

మట్టి నుండి కుండ వచ్చింది. మట్టి ఎక్కడ ఉంది అంటే కుండ అంతటా మట్టి ఉంది. కాని మనకు కనపడేది కుండ మాత్రమే. అలాగే బంగారు ఆభరణంలో అంతటా బంగారం ఉంటుంది కాని మనకు అది ఒక ఆభరణం రూపంలో కనపడుతూ ఉంది. బంగారం తీసేస్తే ఆభరణం లేదు. మట్టి లేకపోతే కుండ లేదు. అలాగే ఈ జగత్తు అంతా పరమాత్మ అంతర్లీనంగా వ్యాపించి ఉన్నాడు. కంటికి కనిపించని పరమాత్మ లేకపోతే ఈ మన కంటికి కనిపించే ఈ జగత్తు లేదు. 

మణులతో కూర్చిన మాలలో కనపడకుండా దారం ఉంటుంది. అలాగే పూలమాలలో కూడా కనపడకుండా దారం ఉంటుంది. మణులు, పూలు బయటకు కనపడుతుంటాయి. వాటిని అన్నిటినీ కూర్చి ఒకటిగా చేసిన దారం బయటకు కనపడదు. అలాగే ఈ సృష్టికి మూలకారణమైన పరమాత్మ ఎవరికీ కనిపించడు. దారం లేకపోతే మణులు కానీ పూలు కానీ నిలువవు. ఎన్ని రకాల మణులు ఉన్నా, ఎన్నిరకాల పూలు ఉన్నా అందులో ఉండే దారం ఒక్కటే. ఆ దారమే మణులకు, పూలకు ఆధారము.

అలాగే జీవులలో ఆత్మ స్వరూపుడుగా ఉండే పరమాత్మ ఒక్కడే. భేదభావము మనం కల్పించుకుంటున్నాము. పూలలో దారం లేకపోతే పూలు నిలువవు, అలాగే మణిమాలలో దారం లేకపోతే మణిమాల నిలువదు అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము. ఆ దృష్టితో అంటే జ్ఞానదృష్టితో చూస్తేనే పరమాత్మ ఉనికి మనకు గోచరిస్తుంది కానీ మామూలు కళ్లకు కనపడదు.

కాని కొందరు మానవులు.. *దేవుడు ఏడీ! ఉంటే మాకు ఎందుకు కనిపించడు! కాబట్టి దేవుడు లేడు!" అని వితండంగా వాదిస్తుంటారు. 

పూలలో దారం లేదు అని అంటే వాడిని పిచ్చివాడంటారు కానీ ప్రస్తుత సమాజంలో దేవుడు లేడు అనే వాడు గొప్పవాడు, శాస్త్రవేత్త. ఇదే మన భావదౌర్భాగ్యం, అజ్ఞానం. 

కాబట్టి పరమాత్మ ఈ అనంత విశ్వం అంతా చైతన్యరూపంలో ఆవరించి ఉన్నా, మన కంటికి కనిపించడు కాబట్టి దేవుడు లేడు అనడం అజ్ఞానం.

||కృష్ణం వందే జగద్గురుమ్||

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

శీల సంపద (15-Mar-23, Enlightenment Story)

🥀*శీల సంపద*🥀

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

‘సౌశీల్య సంపద కలవాడికి సముద్రం పిల్ల కాలువలా కనిపిస్తుంది. మేరు పర్వతం చిన్న రాయిలా అగుపిస్తుంది. సింహం- జింకపిల్లలా తోస్తుంది’ అంటాడు భర్తృహరి మహాకవి."

"సచ్ఛీలత కలిగినవాడికి పాము పూలదండగా, కాలకూట విషం అమృతంగా మారతాయని ఆయన సుభాషితం చెబుతుంది."

"సదాచారుడికి పరాజయమే ఉండదు. ఎందుకంటే- అతడు ధర్మవర్తనుడు, సత్యసంధుడు, పర హిత వ్రతుడై ఉంటాడు. ఏ ఆపదా ఏమీ చేయలేదు. ఏ సమస్యా కుంగదీయదు. ఏ దుఃఖమూ దుర్బలుణ్ని చేయదు."

"మనిషి తన జీవిత కాలంలో ఏ క్షణమూ విడవకూడనిది, మరవరానిది- సచ్ఛీలం" .

"ఆరోగ్యం లోపించినా, సంపద తరిగినా మళ్లీ ఏదో విధంగా సంపాదించుకోవచ్చు."

"శీలసంపద పోతే, తిరిగి పొందడం దుర్లభం" .

"భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సౌశీల్య సంపదను మానవుడు ఎంతగా పెంచుకుంటే అంత మంచిదని ‘మను స్మృతి’ చెబుతోంది."

"అతడు ఆర్జించే విద్య, విత్తం, కీర్తి- అవి ఏవైనా శీలసంపద లేనిదే శోభిల్లవని సనాతన ధర్మం స్పష్టీకరిస్తోంది. మనిషికి మంచి నడవడి ప్రధానమని, అది నశిస్తే ఏ విధమైన శక్తీ అతణ్ని రక్షించలేదని ‘విదుర నీతి’ వెల్లడిస్తోంది."

"సచ్ఛీలి కానివాడు కుటుంబంలో, సమాజంలో ఒంటరివాడవుతాడు. ఎంత బలగం ఉన్నా అతణ్ని ఎవ్వరూ కాపాడలేరు."

"శీలవంతుడు అంటే ఎవరు"?

"ధార్మికుడు, సకల ప్రాణుల్ని ప్రేమించేవాడు, సాటివాడైనా అపరిచితుడైనా మేలు చేసేవాడు- సచ్ఛీలుడు. సంయమనం, క్షమ, సహనం కలిగి ఉండటంతో పాటు- తల్లిదండ్రుల్ని, గురువుల్ని, ఇతర పెద్దల్ని ఆదరించే సంస్కారం గలవాడు శీలవంతుడు. అహింస, ప్రేమ, సత్యసంధత వంటి సద్గుణాల్ని అలవరచుకున్నవాడు; క్రమశిక్షణ, సమయపాలన, చిత్తశుద్ధి కలిగినవాడే సచ్ఛీలుడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. సజ్జనుడనేవాడు అరిషడ్వర్గాలకు, సప్త వ్యసనాలకు నిరంతరం దూరంగానే ఉంటాడు. మనిషికి సచ్ఛీల సంపద సిద్ధింపజేయడానికి పూర్వులు ప్రత్యేక సూత్రాల్ని నిర్దేశించారు. యాజ్ఞవల్క్య స్మృతిలో వాటిని ‘ "యమ-నియమాలు" ’గా పేర్కొన్నారు."

1. బ్రహ్మచర్యం,

2. దూషణ భూషణలకు అతీతంగా ఉండటం,

3. పరమాత్మ ధ్యానం,

4. నిష్కపటం,

5. పరుల సంపద ఆశించకపోవడం,

6. మధుర సంభాషణ,

7. ఇంద్రియ నిగ్రహం- వీటిని "యమము"లంటారు."*

8. స్నానం,

9.మౌనం,

10.ఉపవాసం,

11.యజ్ఞ నిర్వహణ,

12.వేదాధ్యయనం,

13.గురు శుశ్రూష,

14.బ్రహ్మచర్య దీక్ష,

15.శాంత స్వభావం,

విధి నిర్వహణలో జాగరూకత"

"- వీటిని  "నియమాలు" గా పేర్కొంటోంది స్మృతి.

తేజస్సు, క్షమ, ధైర్యం, అంతశ్శుద్ధి, బాహ్యశుద్ధి, నిరహంకారం" - మానవుడి శీల సంపదను రెట్టింపు చేస్తాయి."

"ఈ లక్షణాలతో మానవుడు భగవంతుడు కాగలడని ‘భగవద్గీత’లో కృష్ణపరమాత్మ బోధిస్తాడు. రామాయణ భారత భాగవతాల్లో, అష్టాదశ పురాణాల్లో సౌశీల్యవంతుల పాత్రలు మనకు కొల్లలుగా కనిపిస్తాయి. అవే నేటి మానవాళికి అనుసరణీయాలు."

"శీలానికి అంతశ్శుద్ధి, బాహ్యశుద్ధి రెండూ అవసరమే .

విద్య, ధనం, యశస్సు పుష్కలంగా లభించినా కొందరు మాననీయులు కాలేరు. వారి మనసు వికారాలతో నిండి ఉండటమే అందుకు కారణం."

"శీలాన్ని మించిన సిరులు లేవని, అదే మనిషిని అందరికన్నా గొప్పగా చేస్తుందని యోగి వేమన అంటాడు. సచ్ఛీలుడి సాత్విక బుద్ధి ఒక్కటే దైవ తత్వాన్ని అందించగలుగుతుంది."

"దైవ చింతన సచ్ఛీలుడికే సత్ఫలితమిస్తుంది- అధర్మార్జనతో గుళ్లు గోపురాలు కట్టించేవాడికో, కీర్తి కాంక్షతో దానధర్మాలు చేసేవాడికో కాదు."

"ప్రాపంచిక విషయ కశ్మలంలో కొట్టుమిట్టాడేవాడికీ పారమార్థిక చింతన అసలే ఒంటపట్టదు. వ్యామోహ మమకారాలు తగ్గించుకుంటున్న కొద్దీ, మానవుడు సుగుణాలు పెంచుకోగలుగుతాడు. అప్పుడే ముక్తిసాధనకు ఏ కంటకాలూ లేని చక్కటి బాట ఏర్పడుతుంది!"

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

ఆశను అరికట్టాలి (14-Mar-23, Enlightenment Story)

🥀 ఆశను అరికట్టాలి 🥀

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

ఈ ప్రపంచంలో ఎంతో ధాన్యం ఉంది, బంగారం ఉంది. అలాగే ఆభరణాలు ఉన్నాయి, ఇళ్ళు, మేడలు ఉన్నాయి, ఎంతయో పశుసంపద కూడా ఉంది. వీటన్నిటిని కలిపి ఒకడికి ఇచ్చినప్పటికీ,  'నాకు చాలదు, ఇంకా కొంత ఇవ్వండి' అంటాడు. ఇది అని యొక్క లక్షణం. ఆశకు అంతం లేదు. 

సముద్రంలోనికి ఎన్నియో నదుల యొక్క నీరు వచ్చి పడుతుంది, కాని సముద్రం ' చాలును' అని అనదు. ఎంత జలాన్నయినా స్వీకరిస్తూనే ఉంటుంది.

ఆశ చాలా చెడ్డ గుణం. అది గనుక ఉంటే మానవుడికి అసలు తృప్తి అనేది యుండదు. ప్రాపంచిక విషయాలను కోరుతూనే ఉంటాడు. తత్ఫలితంగా అతడు శాంతిని నోచుకోలేడు. ఎప్పుడూ ఏదో మనస్తాపన అతడిని బాధిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కోరిక అతన్ని వేధిస్తూనే యుంటుంది.

'ప్రపంచంలో దరిద్రుడెవడు?' అను ప్రశ్నకు...  'ఎక్కువ ఆశగలవాడే' అని సద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఆనతి ఇచ్చియున్నారు.

'ధనవంతుడు ఎవరు?' అను ప్రశ్నకు 'తృప్తిగలవాడే' అని సెలవిచ్చారు. కనుక ఎక్కడో ఒకచోట ఆశను అంతమొందించి సంతుష్టికి హృదయమందు చోటివ్వాలి.

'భగవంతుడు ఇచ్చిన ఈ పదార్థం నాకు చాలు. దీనితో పరితృప్తినొందుతాను' అను నిశ్చయం కలిగియుండాలి.

జీవితంలో శాంతి, సుఖములను అభిలషించేవాడు ఆశకు ఏమాత్రం చోటు, గంధం ఇవ్వకుండా యదృచ్ఛాలాభసంతుష్డుడై మెలగాలి. తనకు శక్తియున్నంత వరకు ఇతరులకు సాయపడాలే కాని ఇతరుల సొత్తును అపేక్షింపరాదు.

భోగాశను వదలి పెట్టి, విషయతృష్ణను వదలి వైచి దైవచింతనలో కాలం గడుపుతూ నిరంతర సంతుష్టుడై పరమశాంతిని, ఆనందాన్ని అనుభవిస్తూ జీవించాలి. ఇదే విజ్ఞుని లక్షణం. తరించాలని అభిలషించేవాడు విజ్ఞానివలె మెలగవలెనే కాని అజ్ఞానివలె కాదు.

యత్ పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః

ఏకస్యాపి న పర్యాప్తం తస్మాతృష్ణాం పరిత్యజేత్|


🙏 సర్వే జనాః సుఖినోభవంతు 🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు

🚩 హిందువునని గర్వించు  🚩 హిందువుగా జీవించు

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

కర్మ - పునర్జన్మ (13-Mar-23, Enlightenment Story)

 *కర్మ - పునర్జన్మ *            

🌷🙏🌷🌷🙏🌷🌷      

మనకి కష్టాల ఎదురైనప్పుడు మనకి మూడు  లాభాలు కలుగుతున్నాయి.

1. మొదటిది:- మనం గత జన్మల్లో చేసుకున్న కర్మ రుణం తీరిపోతున్నది.

2. రెండవది:  వాటిని ఎదిరిస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వెలికి వస్తాయి. సాధన వలన మరింతగా ప్రకాశిస్తాయి.

3. మూడవది:-  ఈ శక్తులు మన వర్తమానంలోనూ భవిష్యత్తులోను గొప్ప సత్కర్మ చేసే అవకాశం మనకిస్తాయి.

ఈ పనే పాండవులు చేశారు. మనం మాత్రం ఎందుకు చేయకూడదు?  

మహర్షులు, యోగులు కర్మలనుండి ఎలా తప్పించుకోవాలా? అని ఎప్పుడు ఆలోచించలేదు. కర్మ క్షాళనం కోసం తపించారు. వారు అనుసరించిన పద్ధతినే మనం కూడా అనుసరించ వచ్చును.

మనం గత జన్మల్లో చేసుకున్న పాప రాశి కొండంత ఉంటుంది. దీనిని చాలా నెమ్మదిగాను, వాటినుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ కర్మ భారం వచ్చే జన్మలకి వాయిదా పడి ఇంకా జన్మలు పెరిగి పోతాయి.

విష్ణుమూర్తి ద్వారపాలకులు అయిన జయవిజయులని ‘మూడు జన్మల్లో  హరి వైరులుగా మారి,  శ్రీహరితో చంపబడి  వైకుంఠం చేరతారా?’ లేదా ‘ఏడు జన్మల్లో  హరిభక్తులు గా జన్మించి వైకుంఠం చేరతారా? ‘ అని అడిగితే వారు ‘ఏడు జన్మల హరి విరహం భరించలేము. ఏడు జన్మల సుదీర్ఘ కాలం భరించలేము!’ అన్నారు.

మనం మాత్రం మన కర్మాభారాన్ని కొద్ది జన్మల్లోనే వదిలించుకోవద్దూ! దీనికి మనం ఏమి చేయాలి? దీనికి శ్రీకృష్ణుడు ఒక మహాద్భుత మార్గాన్ని సూచించాడు..

||యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జీతాః||

|| జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితమ్ బుధాః||                                                                

భగవద్గీత.. జ్ఞానయోగం..19 శ్లో.

ఎవరి సమస్త కర్మలు కోరిక సంకల్పం లేకుండా ఉంటాయో, వారి కర్మలు జ్ఞానం అనేయగ్ని చేత దహించబడతాయి.         

||యధేయాంసి సమిద్ధో అగ్ని ర్భస్మాత్కురుతే అర్జున||

||జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మసాత్కతరుతే తధా”||

 జ్ఞాన యోగం: 37 శ్లో.

"అర్జునా! బాగా ప్రజ్వలింప చేయబడిన అగ్ని కట్టెలని ఏ విధంగా బూడిద చేయగలుగుతుందో, మనం సంపాదించిన జ్ఞానం మన సర్వకర్మలని బూడిద చేయగలుగుతుంది.”

 ఈ ఉపదేశం లో పరమార్ధం ఏమిటి? 

జ్ఞానం మనలో  అగ్నిలా జ్వలిస్తే…  మన కర్మలు మనలని బాధించలేవు. మనం గతంలో ఎవరినో మానసికంగా హింసిస్తే, ఇప్పుడు వారు తిరిగి ఆ కర్మ మనకి ప్రసాదించడానికి వచ్చారు. మనం ఈ కర్మ రహస్యాన్ని… జ్ఞానాన్ని పొందితే మన పెదవులపైన చిరునవ్వే ఉంటుంది కదా!         

కర్మలు వస్తాయి, మనలని చుట్టుముడతాయి. అవి మనపైన ఏ ప్రభావం చూపవు.  జ్ఞానం చేత ఆ కర్మ దగ్ధమయింది కదా.✍️

||సర్వం శ్రీకృష్ణార్పణమస్తు||లోకా సమస్తా సుఖినోభవన్తు!||

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷




బీబీ నాంచారమ్మ ఎవ్వరు ? - నాచియార్ (11-Mar-23, Enlightenment Story)

 బీబీ నాంచారమ్మ ఎవ్వరు ?

\|/ \|/ \|/ \|/ \|/ \|/ \|/ \|/\|/ \|/ \|/\|/ \|/ \|/

ఆ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామిగురించి తెలియని వారుండరు. అలాగే చాలామందికి "బీబీ నాంచారమ్మ" గురించి, చాలా అపోహలు ఉన్నాయి. అసలు ఈ బీబీ నాంచారమ్మ ఎవరు? ఆమె నిజంగానే ముస్లిం వనితా? ఆమె దైవస్వరూపం ఎలాఅయ్యారు?...

బీబీ నాంచారమ్మ! "నాచియార్" అనే తమిళపదం నుంచి "నాంచారమ్మ" అన్న పేరు వచ్చింది. అంటే భక్తురాలు అని అర్థం. ఇక "బీబీ" అంటే భార్య అని అర్థం. బీబీ నాంచారమ్మ గాథ ఈనాటిదికాదు. కనీసం 700 సంవత్సరాల నుంచి ఈమె కథ జనపదంలో నిలిచిఉంది...

బీబీ నాంచారమ్మ, 'మాలిక్ కాఫిర్' అనే సేనాని కుమార్తె. ఆమె అసలుపేరు సురతాని. స్వతహాగా హిందువైన మాలిక్ కాఫిర్, అల్లాఉద్దీన్ ఖిల్జీకి సేనానిగామారి తానుకూడా ముస్లింమతాన్ని స్వీకరించాడు. తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ, మాలిక్ కాఫిర్ మీద ఉంచాడు. దాంతో మాలిక్ కాఫిర్ దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడ్డాడు.

తమ దండయాత్రలో భాగంగా మాలిక్, శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం, భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగలాడిపోతోంది. పంచలోహాలతో రూపొందించిన ఆయన ఉత్సవమూర్తిని చూసిన కాఫిర్ కళ్లు చెదిరిపోయాయి. అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంతో ధనమొస్తుంది కదా అనుకున్నాడు.

అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని హస్తినకి బయలుదేరాడు. హస్తినకి చేరుకున్న తర్వాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్. వాటన్నింటిమధ్య శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు, తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రినడిగింది. ఆ విగ్రహం తనచేతికి అందిందే తడవుగా దాన్ని తన తోడుగా భావించసాగింది. విగ్రహానికి అభిషేకం చేయడం,

పట్టువస్త్రాలతో అలంకరించడం, ఊయల ఊపడం. అలా తనకుతెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది. ఆ విగ్రహంతో ఒక్కో రోజూ గడుస్తున్నకొద్దీ దానిమీదే సురతాని మనసు లగ్నం కాసాగింది. మరో పక్క రంగనాథుని ఉత్సవమూర్తి లేని శ్రీరంగం వెలవెలబోయింది. దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో,

రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులూ, పూజారులు అంతే బాధలో మునిగిపోయారు. చివరకి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫిర్నే వేడుకునేందుకు హస్తినకి ప్రయాణమయ్యారు. రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులు భక్తుల విన్నపాలుచూసి మాలిక్ కాఫిర్ మనసు కరిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకెళ్లేందుకు సంతోషంగా అంగీకరించాడు.

అయితే ఆపాటికే రంగనాథుని మీద మనసుపడిన సురతాని మాత్రం విగ్రహం ఇవ్వటానికి ఇష్టపడలేదు, అయితే అర్చకులు ఆమె ఆదమరిచి నిద్రపోయే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరుదాటించారు.

సురతాని ఉదయాన్నే లేచిచూస్తే విగ్రహం కనుమరుగైంది. ఎవరు ఎంత ఓదార్చినా సురతాని మనసు శాంతించలేదు. ఆ విష్ణుమూర్తినే తన పతిగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెతుకుతూ తానుకూడా శ్రీరంగానికి పయనమైంది. శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెబుతారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు. 

*మరొక కధ ఏమిటంటే* : ఆ విగ్రహం రంగనాథునిదికాదు. మెల్కోటే (కర్నాటక)లో ఉన్న తిరునారాయణునిది అని చెబుతారు. దానికి సాక్ష్యంగా ఇక్కడి ఆలయంలోకూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది. ఇంకొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు. కలియుగదైవమైన వేంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమెకూడా అవతరించిందని భక్తుల విశ్వాసం. అందుకనే తిరుపతిలోనూ బీబీనాంచారమ్మ విగ్రహంకూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఆమె "ముసల్మాను స్త్రీ" అన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూలేదు...

ఎందుకంటే తుళుక్క నాచియార్ అంటే తమిళంలో తురష్క భక్తురాలు అని అర్థం. బీబీ నాంచారమ్మను చాలామంది ముసల్మానులు సైతం వేంకటేశ్వరునికి సతిగా భావిస్తారు. కర్నాటకను హైదర్ఆలీ అనే రాజు పాలించేకాలంలో, అతను ఓసారి తిరుమలమీదకు దండయాత్రకు వచ్చాడట.

అయితే ఆ ఆలయం ఒక ముస్లిం ఆడపడుచును సైతం అక్కున చేర్చుకుందన్న విషయాన్ని తెల్సుకుని వెనుతిరిగాడట. ఇదీ బీబీ నాంచారమ్మ కథ !!!

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

ఎగ దీస్తే బ్రహ్మ హత్య - దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది? (29-Apr-24, Enlightenment Story)

  ఎగ దీస్తే బ్రహ్మ హత్య -  దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది?     🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺           ...