Monday 20 March 2023

ప్రపంచ పిచ్చుకల దినోత్సవం -World Sparrow Day - మార్చి 20 (01-Apr-23, Enlightenment Story)

   🥀*ప్రపంచ పిచ్చుకల దినోత్సవం*🥀

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. ఇంటి చూరుల్లో, గోడల నెర్రెల్లో గూడు కట్టుకుని కళ్లు తెరవగానే కనిపించే ఈ చిన్న జీవాలు చేసే కిచకిచలు నేడు పల్లెల్లోనే కరువయ్యాయి.

గూడు కట్టడం, గుడ్లను పొదగడం, నోటితో ఆహారాన్ని తెచ్చి పిల్లలకు అందించటం,ఆ పిల్లలు రెక్కలొచ్చి ఎగిరేంత వరకు జాగ్రత్తగా కాపాడటం తల్లిప్రేమకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇటువంటి ఆదర్శవంతమైన పిచ్చుకల అన్యోన్యతను గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. వీటి ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాలా బిళ్లలను కూడా విడుదల చేసింది. 

కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవం వీటి చావుకొచ్చింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలనే తాపత్రయంలో ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటుచేస్తున్న సెల్‌టవర్లు ఈ చిన్నారి నేస్తాలకు మరణశాసనాన్ని రాస్తున్నాయి. సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్‌కు ఈ చిట్టి గువ్వలు బలవుతున్నాయి. దీంతో పర్యావరణాన్ని తన శక్తిమేరకు కాపాడే పిచ్చుకలను రక్షించేందుకు పక్షి ప్రేమికులు నడుం బిగించాల్సిన పరిస్థితి వచ్చింది.

*దాంపత్య జీవితానికి విలువ*

పిచ్చుకలు దాంపత్య జీవితానికి చాలా విలువనిస్తాయి. 85 శాతం పిచ్చుకలు బతికినంత కాలం ఒకే ఆడపిచ్చుకతో కలిసి ఉంటాయి. దీన్ని సైన్స్‌ పరంగా మోనోగాసన్‌ అంటారని పక్షి శాస్త్ర నిపుణులు తెలిపారు. సృష్టిలో అధిక సంతానోత్పత్తిని విస్తారంగా చేయగలిగే సామర్థ్యం వీటి సొంతం. ఏడాదికి మూడు, నాలుగు సార్లు గుడ్లు పెడతాయి. 

పిచ్చుకలు మనుషుల్లానే కుటుంబానికి విలువ ఇస్తాయి. ఆడ, మగ కలిసి కష్టపడి గూడు కట్టి పిల్లలను సాకి సంతరిస్తాయి. అందుకని కూడా మనవాళ్లకు అవంటే ఇష్టం. మగపిచ్చుక కొంచెం బొద్దుగా ఉంటే ఆడ పిచ్చుక సన్నగా స్పీడుగా ఉంటుంది. అవి రెండు ఏమిటేమిటో మాట్లాడుకుంటూ ఉంటాయి. వాటి మాటలు వినడం ఎవరికైనా సరే బాగుంటుంది. పిచ్చుకలు మూడేళ్లు బతుకుతాయి. కాని అవి ఆ మూడేళ్లను సంపూర్తిగా జీవిస్తాయి. బద్దకించవు. మెల్లగా ఉండవు. ఉత్సాహం మానుకోవు. ఎప్పుడూ బతుకు మీద ఆశతో మన బతుకు మనం బతుక్కుందాం అన్నట్టుగా ఉంటాయి. 

ఈ చిన్ని ప్రాణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉంది. పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించుకునేందుకు మనం నడుం బిగించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పల్లెల్లో నివసించే వారు ఊరపిచ్చుకల గూళ్లు కనబడితే వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి.

త్వరలోనే మళ్ళీ పిచ్చుకల కిచకిచలు విరివిగా వినే అదృష్టం కలగాలని ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సాక్షిగా కోరుకొందాం.

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏

No comments:

Post a Comment

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే (16-May-24, Enlightment Story)

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర వున్నాడు అనుకొం...