Wednesday 8 March 2023

రక్త సంబంధం (09-Mar-23, Enlightenment Story)

 🙏🙏రక్త సంబంధం🙏🙏

🌷🙏🌷🌷🙏🌷🌷

తోబుట్టువులంటే ఇప్పటి కాలంలో  ఒక బరువులా  భావిస్తున్నారు.ఒకే తల్లి కడుపులో పుట్టి పిల్లలుగా ఉన్నప్పుడు అందరూ కలిసి ఉంటాం. పెళ్ళి అవగానే ఎవరి జీవితం వారికి ముఖ్యం అని తలచి తోడబుట్టినవారి కష్టాలను పట్టించుకోము

అప్పట్లో..

ఒకరోజు అన్నయ్య ఫోన్ చేసాడు. చెల్లి నీ వదినను తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని.  అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క ఇల్లంతా వెతికింది. వారికోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని. పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు.రెండే రెండు ఆరంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో రెండు గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది.

బెల్ మోగిందిఅన్నయ్య వచ్చేసాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది.  ఎదురుగా అన్నయ్య, వదిన, వదిన తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది.  అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది.

వంట గదిలోకి వెళ్ళింది. రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని ఒక గ్లాసు లో నీళ్లు తెచ్చింది. వదిన ముందు ఆమె తల్లి ముందు ఆరంజ్ జ్యూస్ ఉంచింది. అన్నయ్య ముందు మాత్రం నీళ్ళ గ్లాసు ఉంచింది. అన్నయ్యకి 7up అంటే ఇష్టం అని చెబుతూ.

అన్నయ్య అది తాగి నిజం తెలుసుకున్నాడు. ఇంతలో అత్తగారు నాకు 7up కావలి అని అడగడంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అచెల్లి కు.

చెల్లి నువ్వు కూర్చో నేను తెస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక  గ్లాసు కింద పడేసాడు. అయ్యో ఏమైంది ఆని అందరూ అడిగితే. జ్యూస్ ఒలికింది. నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే.అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది.

ఇక వెళ్ళొస్తామంటూ.  బయల్దేరారు ముగ్గురూను.

అన్నయ్య చెల్లి  దగ్గరకు వచ్చి, చేతులు పట్టుకుని "చెల్లి.! జాగ్రత్త. వంటగదిని శుభ్రంగా తుడిచేయి. లేదంటే చీమలు వచ్చేస్తాయి" అని చేతిలో కొంత డబ్బును చేతిలో పెట్టాడు.  భార్యకు, అత్తగారికి కనిపించకుండా డబ్బులను, చెల్లికు తెలియకుండా.. కంటి నీరుని దాచుకుంటూ, చెల్లి కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ.  👍

"ఇక నుంచి తరచూ.. పనుల మీద ఈ ఊరు రావలసి వస్తుంది. వచ్చినపుడల్లా.నీ చేతి వంట రుచి చూడాల్సిందే" అన్నాడు భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ.

ఆలోచించుకుంటూ. ! ఇలా ఉండాలిదా..!  

బంధం అనే కాదు.కష్టాల్లో  ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సహాయం, ప్రయత్నం చేయాలి.  ఆత్మీయతను కోల్పోకండి.!

దయచేసి మనకి అందరు దొరుకుతారు. ఎక్కడ అయినా తోడపుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు దొరకరు. ఏదైనా విభేదాలు ఉన్నా.మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపు కోవడంలో తప్పు లేదు. ఏమంటారు"..?

ఇలాంటి ఆత్మీయతలను; *అనుబంధాలను నేడు మనం కోల్పోతున్నాం

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...