Friday 30 December 2022

సంపూర్ణ అన్నవరం (7-Jan-23,Enlightenment Story)

 🌺*సంపూర్ణ అన్నవరం -  స్థలపురాణం*🌺

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య,  శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందినారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నాకరుడు  భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామ చంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారాడు రత్నాకరుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామిగా వెలసి రత్నగిరి, లేదా రత్నాచలం కొండగా మారాడు

తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోర్సా గ్రామ ప్రభువు (గోర్సా, కిర్లంపూడి ఎస్టేట్స్) శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామరాయణిం బహద్దరు రాజా ఐ.వి.రామరాయణం వారి ఏలుబడిలో ఆరంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియ,మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి అంతర్ధానం అయ్యారు

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, అన్నవర గ్రామదేవత,స్వామి ఆవిర్భవానికి సంకేతం గ పూర్వమే వేలసిన నేరేల్లమ్మ కి నమస్కరించి, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటకే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు (. కృష్ణకుటజము),కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని  కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ  యంత్రాపై,విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీని (శాలివాహన శకం 1813) ప్రతిష్ఠించారు.

ఆలయాన్ని శాలివాహన. శ. 1934 లో బ్రహ్మశ్రీ అద్దేపళ్లి కృష్ణశాస్త్రి గారు ప్రముఖ కాశి పండితులు చే నవాఆవారణ ,సహిత విష్ణుపంచాయతన, పూర్వకంగా ప్రతిష్ఠించారు  ,పంచాయతనానికి, ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నముగ శూల శిఖరములతో ఉన్నాయి. పై చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు గల గోపురాలు ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం. పంపాతి అనే స్త్రీ తపస్సు చేసి పంపా(తీర్ధం)నదిగా ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది, నిత్యం స్వామి కి జరిగే అర్చనలు ఈ నీటితోనే నిర్వహిస్తారు, 

పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండడం , ప్రధాన ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభాని అనుకుని మండపం ఉంటుంది. ఈ  మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణంలో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూవుంటుంది

కొండ దిగువున కనకదుర్గమ్మ పాదచారులకు రక్షణ గా కాపాడుతుంది, స్వామి మెట్లు మార్గం మొదటి లో స్వామి దివ్య పాదములు చెక్కబడి వున్నాయి

స్వామి,ఆలయం  రెండు అంతస్తులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద్విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉంది. ఆ యంత్రం లో అనేక దేవతలు 13 ఆవరణలో వుండి ఇక్కడ స్వామి ని సేవిస్తూ, భక్తులకను అనుగ్రహిస్తున్నారు

ఇక్కడ అమ్మవారు అనంత లక్ష్మి సత్యవతి గ ఉపాసనాపరులకు ఆద్యాది మహాలక్ష్మి గ దర్శనమిస్తూవుంటారు,ఇక్కడ శైవ,వైష్ణవ అభేదంగ ఒకే పీఠం పై హరిహరలు దర్శనమిస్తూ అదైత మూర్తి గ దర్శించ వచ్చు


శ్రీ సత్యనారాయణ స్వామివారిని

" మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతశ్చ మహేశ్వరం, అధతో విష్ణురూపాయ,, త్ర్త్యెక్య రూపాయతేనమః " అని స్తుతిస్తారు. 

ఇక్కడ స్వామి  వ్రతం ఆచరించిన వెయ్యి క్రతువు ల ఫలం ,ప్రతి నిత్యం తనని శిరము మోస్తున్న భక్తునికి స్వామి స్వయంగా  కొండ దిగి కార్తికపౌర్ణమి నాడు ప్రదక్షిణం చేసి అనుగ్రహిస్తున్నారు ,రత్నాకరుడు ని స్మరిస్తూ

కొండకి (రత్నాకరుడికి) నమస్కరించి స్వామిని దర్శించుదాం స్వామి కృపకు పాత్రులు అవుదాం. భక్త రత్నాకరుడులా మనం కూడా స్వామిని సేవిద్దాము.

 🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼

అబ్బబ్బ వెధవ బండి (6-Jan-23,Enlightenment Story)

💥 అబ్బబ్బ వెధవ బండి 💥 {వ్యాకరణం (తెలుగు) తెలిసిన వారికి విందు భోజనం}

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

ఈ సంఘటన చాలా పాతకాలం నాటిది. ఒక పండితుడు వేరొక పండితుడి గ్రామానికి బస్సులో వస్తున్నానని కబురు చేశాడు. తన ఇంటికి వస్తున్న పండితుడిని ఆహ్వానించి, ఇంటికి తీసుకెళ్లడానికి ఎడ్లబండి కట్టుకొని బస్సు వచ్చే చోటికి వెళ్లాడు.

బస్ స్టాండ్ గ్రామానికి 3, 4 మైళ్ళ దూరంలో ఉంది. అందునలన, వేరే బండివాడిని తీసుకరాకుండా, తానొక్కడే ఎద్దులను కట్టి, బండి తోలుకుంటూ బస్టాండ్ కు వచ్చాడు. బస్సు దిగిన సోదర పండితుడిని సాదరంగా ఆహ్వానించి, బండిలో కూర్చోబెట్టుకొని తన గ్రామానికి బయలుదేరాడు.

పల్లెటూరుకు వెళ్లే త్రోవ కాబట్టి, అంత బాగా ఉండదు. నల్లేరు మీద బండి నడక కాకుండా, ఎగుడు దిగుడు బండల మీద త్రోవ వల్ల, ఎద్దుల బండి బాగా కుదుపులతో వెళుతూవుంది. కుదుపులు ఎక్కువ ఉండడం వలన పోరుగూరి నుంచి వచ్చిన పండితుడు 'అబ్బబ్బ వెధవ బండి' అన్నాడు.

దానికి, బండి యజమానియైన పండితుడు, ఏమండీ మీరంటున్నది షష్టీ తత్పురుషమా! లేక కర్మధారయమా! అన్నాడు నవ్వుతూ. షష్టీ తత్పురుషము అయితే 'వెధవ యొక్క' బండి అనే అర్థము వస్తుంది. అదే కర్మధారయమైతే 'వెధవ (యైన) బండి' అనే అర్థము వస్తుంది. (బండి యొక్క యజమాని వెధవనా? బండి వెధవదా?).

దానికి పొరుగూరి పండితుడు నవ్వుతూ, "యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి" అన్నాడు. (అంటే వెధవ కొఱకు బండి) అని. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. ఆ కాలంలో పండితులు మాటల్లో కూడా అలాంటి చెణుకులు విసురుకొని ఆనందించేవారు.

ఇంకొక చమత్కార సంభాషణను ఆస్వాదిద్దాం.ఒక శిష్యుడు, గురువుగారి దగ్గర విద్య అభ్యసించి,

పెళ్ళి చేసుకొని ఊరికి వెలుపల ఇల్లు కట్టుకొని స్థిరపడ్డాడు. ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద శిష్యుడి గ్రామం దారిలో వెళుతూ, ఒకసారి చూసి వెళ్దామని, శిష్యుడి యింటికి వచ్చాడు.రాక రాక వచ్చిన గురువు గారికి, శిష్యుడూ, అతడి భార్య చక్కని ఆతిథ్య మిచ్చి, తాంబూల సహిత పంచలచాపు యిచ్చి పాదాలకు నమస్కారం చేశారు. అప్పుడు గురువు గారు, ఒక శార్దూల వృత్తంలో (పద్యము), వేదమంత్రము వచ్చేట్టుగా చెప్పి ఆశీర్వదించారు.

అప్పుడు చమత్కారియైన శిష్యుడు నవ్వుతూ, "గురువుగారూ, ఆతిథ్యం స్వీకరించి మా యింట శార్దూలమును (పులిని) విడిచి వెళ్ళుట మీకు న్యాయమేనా?" అన్నాడు.దానికి గురువుగారు నవ్వుతూ, "ఆ శార్దూలమును మంత్రించి వదిలేశాను. నీకు ఏలాంటి అపకారం చేయదు. అదీగాక, నీవు ఊరి వెలుపల ఇల్లు కట్టుకున్నావు. పంచమీ తత్పురుషము లేకుండా ఈ షష్టీని కాపలాగా పెట్టానని" అన్నారు.

పంచమీ తత్పురుషానికి అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగవలన భయము'. షష్టీ తత్పురుషానికి 'కుక్క యొక్క కాపలా'. అంటే, గురువుగారు, దొంగ వలన భయము లేకుండా శార్దూలాన్ని కాపలా పెట్టారన్నమాట.

ఆ కాలం వాళ్లు, ఈ కాలం వాళ్ల లాగా, గుమ్మం దగ్గర నుండే టాటా, బై బై చెప్పేవారు కాదు. గురువుగారిని బండిలో ఎక్కించి, "మీరు మళ్ళీ మా యింటికి దయచేయాలి" అని మర్యాద పూర్వకంగా అనేవారు. 

శిష్యుడు కూడా అలాగే అన్నాడు. అందుకు గురువు గారు నవ్వుతూ, "నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే" అన్నాడట. ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ, 'భార్యా భర్తలు', 'తలిదండ్రులు', 'అక్కాచెల్లెళ్లు' అని ఉంటుంది.

ద్వంద్వాతీతుడంటే మీ భార్యాభర్తలు తలిదండ్రులు అయినప్పుడు, అంటే, "మీకు సంతానం కలిగినప్పుడు మళ్ళీ వస్తానని" అర్థము. పూర్వకాలము పండితులు కలిసినప్పుడు, ఇంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.

మనం ఎలాగూ మాట్లాడలేము. కనీసం విని ఆనందిద్దామని మీకు ఈ వ్యాసంలో తెలియజేస్తున్నాను.

చదివినందుకు ధన్యవాదాలు.

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼

ఆత్మవిశ్వాసం - Self Confidence (5-Jan-23,Enlightenment Story)

 ☀️ఆత్మవిశ్వాసం☀️ 

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻

రాము, తన డిగ్రీ పూర్తయి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఎటువంటి ఉద్యోగం లేక బాధపడుతూ ఉంటాడు .తన తోటి స్నేహితులందరూ అందరూ ఉద్యోగాల్లో స్థిరపడి పోవడంతో రాము తల్లిదండ్రులు ఎప్పుడూ రాముని బాధ్యతారాహిత్యంగా ఉన్నావ్ అని తిడుతూ ఉంటారు.

అలా రోజులు గడుస్తున్న కొద్దీ రాములో  నిరాశ మరీ ఎక్కువైపోతుంది,అనేక చోట్ల తన విద్యార్హత కన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగాల కోసం వెతికినా కూడా, అది కూడా దొరకక  చాలా అసహనానికి లోనవుతూ ఉంటాడు.

తనను అమితంగా ప్రేమించే వాళ్ళు ,గౌరవించే వాళ్ళు కూడా తనని మనిషిగా చూడకపోయే సరికి, తనకి విలువ ఇవ్వక పోయేసరికి రవికి చెప్పలేనంత బాధగా అనిపించి. ఈ జీవితం జీవించడం నాకు అవసరమా నేను ఎవరికీ ఉపయోగకరంగా లేను పైగా నా తల్లిదండ్రులకు నేను చాలా భారంగా ఉన్నాను … ఇటువంటి జీవితం నాకు జీవించడం ఇష్టం లేదు అనుకొని ఒక నిర్ణయానికి వచ్చి రైలు పట్టాల వైపు అడుగులు వేస్తూ ఉంటాడు.

ఒక్కొక్క అడుగు వేస్తూన్న కొద్దీ జీవితంలో జరిగిన అవమానాలు అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. ముందుకు వెళ్తూ భగవంతుడు నా మొర ఆలకించి నాకు ఒక దారి చూపెడితే ఎంత బాగుంటుంది, అని ఆశ మళ్లీ మళ్లీ కలుగుతూ ఉంటుంది.

ఇంకా ముందుకు… నడుస్తున్న  కొద్దీ అతను చిన్నతనం నుంచి ఎంత కష్టపడి చదివింది ,ఎంతమంది తనను ప్రశంసించింది అన్ని గుర్తుకు తెచ్చుకొని ఆకాశం వైపు చూస్తూ భగవంతుడా నువ్వు నాకు కొంచెం సాయం చేసివున్నట్లైతే  నాకు ఈ దుస్థితి వచ్చేది కాదు, ఎందుకూ చేతగాని వానిగా నన్ను ఎందుకు పుట్టించావు అని గట్టిగా ఏడుస్తూ… ఇక చేసేది ఏమీ లేదు అనుకొని అక్కడి నుంచి మరొక రెండు అడుగులు ముందుకు వేస్తాడు.  అప్పుడు అతనికి రాము…  అని ఎవరో పిలిచినట్లు అనిపించి వెనుకకు తిరిగి చూస్తే ఒక వ్యక్తి కనిపిస్తాడు, రాము ఆ వ్యక్తిని గుర్తుపట్టలేక పోయాడు  , అప్పుడు ఆ వ్యక్తి రాము దగ్గరకు వచ్చి రాము…  నేను ఎవరో గుర్తుపట్టారా అని అడుగుతాడు… లేదండి అని అంటాడు రాము. 

అప్పుడు అతను నేను నువ్వు చదువుకున్న కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాను అని చెపుతాడు. అప్పుడు రాము అవునండి నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది అంటాడు. అందుకు ఆ వ్యక్తి నువ్వు మొన్న మీ ఫ్రెండ్ పెళ్లి లో పాడిన పాట విని ,ఆ పెళ్ళికి నాతో పాటు వచ్చిన నా పదేళ్ల కొడుకు నీ దగ్గర సంగీతం నేర్చుకుంటానని పట్టుపట్టాడు ,నెలరోజుల నుంచి నీకోసం నేను వెతకని ప్రదేశం లేదు ఎన్నాళ్ళకు నువ్వు నాకు దొరికావు అని ఆనందంగా అంటాడు.

అప్పుడు… రాము అయ్యో నాకు సంగీతం రాదండి అని చెపుతాడు, ఆ మాటవిని  అతను ఏమిటీ! సంగీతం రాకుండా నువ్వు అంత శ్రావ్యంగా పాట ఎలా పాడను గలిగావు అంటాడు.అందుకు  రాము నాకు చిన్నతనం నుంచి పాటలు అంటే చాలా ఇష్టం ,ఇష్టం కొద్దీ నేర్చుకున్నాను అని చెప్తాడు.

అప్పుడు ఆ వ్యక్తి  ఇంత బాగా పాటలు పాడగలిగే వాడివి ఎంత అదృష్టవంతుడివి, నీ అంత అద్భుతమైన కంఠం ఎవరికన్నా జీవితంలో ఉంటే వారు ఎంత ఎత్తైనాఎదుగుతారు.నిన్ను కూడా నేను ఆ స్థానంలో చూస్తానని చాలా నమ్ముతున్నాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

అతని మాటలు విన్నాక రాము శరీరం అంతా చల్లగా అయిపోతుంది , అంతసేపు బాధతో విరక్తితో ఉన్న రాము శరీరమంతా ఆయన అనుకూలమైన  మాటతో తేలికబడుతుంది.

రాము అక్కడే ఉన్న పెద్ద బండరాయి మీద కూర్చుండి , ఒక్క క్షణం నేను ఆలోచించకపోతే ఎంత అద్భుతమైన జీవితాన్ని చేజార్చుకునే వాడిన, నాలోనూ అంత ప్రతిభ ఉందా… , నేనూ ఇతరులను ప్రభావితం చేయగలనా…. నా లో వున్న ప్రతిభ ఏంటో ఇతరులు చెబితేగాని తెలియనిస్థితి లో నేను ఉన్నానా…

నేను ఈ అద్భుతమైన జీవితాన్ని ఎంత తేలిగ్గా తీసుకుని దాన్ని అంతం చేద్దామని నిర్ణయించుకున్నాను.  అని తనలో తానే అనుకుంటూ ఉంటే ఒక్క క్షణం భయంతో శరీరమంతా ఓణికి పోతుంది, అప్పుడు  ఆకాశంవైపు చూస్తూ భగవంతుడా నువ్వు ఉన్నావు…  ఈ క్షణంలో నువ్వు నన్ను కాపాడావు, నాకు కనువిప్పు కలిగించి నా జీవితానికి చక్కని మార్గాన్ని చూపించావు  అని మనసులో దేవునికి  కృతజ్ఞతలు తెలియజేసి, అక్కడి నుంచి సంగీత నేర్చుకుందామ నే  ఆలోచనతో ఇంటి వైపు నిశ్చయంగా అడుగులు వేస్తాడు రాము.

Moral🌚🌝 : ఒక ప్రశంస ఆ మనిషి జీవితాన్ని మార్చకపోవచ్చుకాని,అతనిలో ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఖచ్చితంగా పెంచుతుంది.

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼

Thursday 29 December 2022

గృహం అంటే ఏమిటి (4-Jan-23,Enlightenment Story)


☀️ *గృహం అంటే ఏమిటి? గృహస్థుడు అని ఎవడు అనిపించుకుంటాడు ?*☀️ 

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻

ఐదు యజ్ఞాలు చేయని వాడు గృహస్థు పదానికి అర్హుడు కాడు.

1. ఇంట్లో కుల దేవతలని , వంశ దేవతలని, ఇష్ట దేవతలని ఆరాధించాలి. నిత్య దేవతారాధన జరగాలి. ఇది మొదట చేయ వలసినది . 

2. పితృ దేవతలని ఆరాధించడం. పూర్వ కాలంలో తల్లిదండ్రులు  బ్రతికి ఉన్నప్పటికీ నిత్య పితృ తర్పణం ఉండేది. అంటే, క్రితం జన్మలో తండ్రికి కూడా పితృతర్పణం చెయ్యాలి.

3. ఋషి యజ్ఞం జరగాలి. అంటే, మహర్షులు రచించిన గ్రంధాలను ఆ ఇంట్లో అధ్యయనం చేసుకోవాలి . అందులో చెప్పినవి ఆచరించే ప్రయత్నం చెయ్యాలి.

4. మనుష్య యజ్ఞం - ఆ ఇంటిలో అతిధి అభ్యాగతులు వస్తూ, భోజనం చేస్తూ వారికి కావలసినవి  తృప్తి పరచడం జరగాలి. 

5. తన ఇంటి మీద ఆధార పడిన ప్రాణి కోట్లని కాపాడడం . చెట్లు చేమలని పెంచడం , పశు పక్షాదులని పోషించడం.

☀️ *ఈ ఐదూ ఏ ఇంట్లో జరుగుతాయో ఆ ఇల్లు గృహం అనిపించుకుంటుంది.  ఇల్లు అంటే సుఖ పడటానికి షెల్టర్ కాదు. ధర్మం చేయడానికి స్థానం. *☀️ 

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼

Wednesday 28 December 2022

అజాత శత్రుత్వం (3-Jan-23,Enlightenment Story)

 ☀️అజాత శత్రుత్వం☀️ 

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻

శత్రువులు లేని మనిషంటూ ఉండడు. అవతార పురుషులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి వారు కూడా తమ జీవిత కాలాల్లో అనేక మంది శత్రువులతో పోరాడి సంహరించ వలసి వచ్చింది. పరమ శాంతమూర్తి అయిన బుద్ధుడికైనా ఈ మానవ శత్రుత్వం తప్పలేదు. గౌతమ బుద్ధుడి పేరు ప్రఖ్యాతులు పెరగడం, 

బౌద్ధ భిక్షువులకు ప్రజలు అనేక కానుక లందించడం, పూర్వాశ్రమంలో అత్యంత ధనికుడైన ఒక అనుచరుడు బుద్ధుడు నివసించడానికి, విహరించడానికి అతి సుందరమైన ఉద్యానవనాన్ని క్రయంచేసి తన గురువుకు బహూకరించడం, ఇవన్నీ చూచిన ఇతర మత వర్గీయులు ఓర్వలేకపోయారు. ఇదే కాక బింబిసార మహారాజు తన ఆస్థాన వైద్యుడైన జీవకుణ్ణి, బుద్ధుడికి, అతడి శిష్యులకు వైద్యం చేయమని నియోగించడం, వారందరి అసూయను మరింత ప్రజ్వరిల్ల చేసింది.

ఆ కారణం చేత బుద్ధుడి శీలం మీద బురద చల్లాలనే ఉద్దేశ్యంతో, భిన్న మతావలంబి అయిన చించ అనే సన్యాసిని చేత, బుద్దుడు పరస్త్రీ సంగమానికి పూనుకున్నాడని సభాముఖంగా అభియోగం చేయించారు. ఆవిడ వేసిన ఈ అభాండం శుద్ధ అబద్ధమని రుజువయిన తర్వాత, విధి వశాన ఆవిడ ఎన్నో కష్టాలకు గురయింది. అంతటితో ఆగకుండా గౌతముడి వ్యతిరేకులు మరో మతానికి చెందిన సుందరి అనే వనిత చేత, బుద్ధుడి పడక గదిలో తానొక రాత్రి గడిపానని పదిమంది ముందూ చెప్పించారు. ఇది ప్రజలలో ప్రచారం అయిన తర్వాత, ముందు ముందు సుందరి తాను అబద్దం చెప్పాననే విషయం బయట పెడుతుందేమోననే సంకోచంతో, ఒక తాగుబోతు ముఠా చేత ఆవిణ్ణి హత్య చేయించారు. ఇలాంటి దుష్కృత్యాలు చేయడంలో మానవ స్వభావం ఆనాటికీ ఈ నాటికీ ఒక లాగానే ఉందని గ్రహించవచ్చును.

వధించిన సుందరి శవాన్ని తీసుకెళ్ళి బుద్ధుడు నివసించే జటావన విహారం వద్ద పడేశారు. ఈ హత్య సందర్భంగా బుద్ధుడిపై చర్య గైకొనాల్సిందేనని రాజ్యా పాలకుల్ని అభ్యర్థించారు. కాని సుందరిని చంపిన తాగుబోతులు, ఓ కల్లు దుకాణంలో కూచొని చిత్తుగా తాగేసిన తర్వాత వొళ్ళు తెలియని స్థితిలో, 'సుందరి చావుకు నువ్వు కారణమంటే నువ్వు కారణమని' పోట్లాడుకుంటుండగా, రాజ భటులు వచ్చి పట్టుకు పోవడం జరిగింది.

రాజు సమక్షంలో సుందరిని తామే చంపినట్లు అంగీకరించడమే కాక, తమని ఎవరు ఈ పనికి నియోగించారో అది కూడా బయట పెట్టేశారు. రాజు, వారికీ వీరికీ కూడా మరణదండన విధించాడు. అప్పటికీ ఊరుకోకుండా, ఆ భిన్న మతస్థులు గౌతముణ్ణి పరిమార్చడానికి శ్రీగుప్త అనే వ్యక్తి చేత బుద్ధుడి ఆహారంలో విషం పెట్టించడానికి ప్రయత్నించి విఫలులయ్యారు; కరుణామయుడైన బుద్ధుడు శ్రీగుప్తుణ్ణి క్షమించాడు.

ఈ శతాబ్ది ప్రథమార్థంలో జీవించి తరించిన అరుణాచల రమణునికైనా శత్రువులు తప్ప లేదు. 

కొత్తగా కొండ మీదికి వచ్చి కూచున్న రమణుడి వద్దకు ఎక్కువ మంది వచ్చి పోతున్నారని, తన వద్దకు వచ్చేవారు తగ్గిపోతున్నారనే స్పర్ధతో అదే కొండమీద నివసిస్తున్న మరో పాతస్వామి, రమణుణ్ణి చంపడానికి పైనుండి రాళ్లు దొర్లిస్తుండేవాడు. ఇదే విధంగా ఒకసారి అతడో పెద్ద బండరాయి కింది వైపుకు దొర్లించినప్పుడు అది దారిలో మరో పెద్ద రాయికి తగిలి రెండు ముక్కలై రమణుడు కూచున్న రెండు వైపుల నుండి దూసుకొని, కొండ కింద కొచ్చి పడ్డాయంటారు. అద్భుతాల సంగతి ఎలా ఉన్నా తనకన్నా ముందు వచ్చి కొండ మీద నివాసమేర్పరచుకున్న ఈ 'స్వామి' చేతుల్లో రమణుడు చాలాసార్లు ప్రాణాపాయం తప్పించుకున్నాడు.

ఇంకో చదువుకున్న స్వామి తాను రమణుడికి గురువుగా ప్రకటించుకొని, అరుణాచల శిఖరం పైన రమణుడి నివాసం ముందు వరండాలో బైఠాయించి, రమణుణ్ణి పలు రకాలుగా వేధించాడు. శాంత స్వభావుడైన రమణుడు ఈ బాధనంతా అలాగే ఓర్చుకున్నాడు. రమణుడి శిష్యులు మాత్రం ఈ వరండా 'గురువు' ఆగడాలు సహించలేక, చివరకు బయటకు గెంటివేశారు.

శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారికి కూడా ఇంటా బయటా శత్రువులుండేవారు. ఈయన మీద హత్యాప్రయత్నాలు జరుగుతాయేమోనని శంకించి అతడి చిన్నతనంలో,అనీబిసెంటు ఎన్నో కట్టుదిట్టాలు చేస్తూ ఉండేది. ప్రముఖ దివ్యజ్ఞానసమాజం వారు (థియానఫిస్టులు) కృష్ణమూర్తి తమ చెప్పు చేతల్లో ఉంటడం లేదనే ఆగ్రహంతో "ఈ కృష్ణమూర్తిని దుష్టశక్తులు పట్టి పీడిస్తున్నాయి” అని ఆరోపించారు. 

కానీ కృష్ణమూర్తి ఈ ఆరోపణలను వేటినీ పట్టించుకోలేదు. దేనికీ తొణికేవాడు కాదు; బెణికేవాడు కాదు. తాను చేయదలచుకున్నదేదో - అనగా తాను జీవితాన్ని దర్శించిన తీరును వివరిస్తూ ముందుకు సాగుతుండేవాడు. కృష్ణమూర్తితో కలిసి జీవిస్తూ, ఆయన వ్రాతప్రతులను మొదట్లో సమర్థవంతంగా ఎడిట్ చేసిన రాజ గోపాల్ అనే సహచరుడు, కృష్ణమూర్తి ఖ్యాతిని చూసి ఓర్వలేక అసూయ కొద్దీ అనేక వివాదాలను సృష్టించి, కోర్టు కెక్కించి ఆయన్ని వేధించాడు.

భూమి మీద పుట్టిన తర్వాత, ప్రయోజకుడైన మనిషికి శత్రువులు లేకుండా ఉండడం కల్ల వారి సామర్థ్యమే వారి యెడల పరాయి వారి మనస్సుల్లో ఈర్ష్యాసూయలు, ద్వేషమూ తద్వారా శత్రుత్వమూ జనింప చేస్తాయి. అయితే సామాన్యులమైన మనవంటి వారందరికీ పరస్పర శత్రుత్వముంటుంది.

అనగా అవతలివాడు మన యెడల శత్రుత్వం వహించినప్పుడు, అతడి యెడల మనమదే రకమైన వైరాన్ని ప్రకటిస్తాం. కానీ మనం ప్రస్తావించుకున్న మహా పురుషుల వంటి వారికి, లోకంలో శత్రువులైతే ఉండవచ్చు కానీ, వారి యెడల వీరికి శత్రుత్వముండదు. తమ అజ్ఞానం వల్లనే వారు ఈ శత్రు భావాన్ని ప్రకటిస్తున్నారని కనుగొని మిన్నకుంటారు. తమకు కలుగనున్న అపాయం నుండి బయటపడేంత వరకూ జాగ్రత్త పడతారే కానీ, అవతల వారి చర్యలకు వీరు ఆగ్రహించేది, ఆవేశపడేదీ ఉండదు. ఇటువంటి మహాపురుషులకూ, మామూలు జనాలకూ ఇదే తేడా.🌺

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼

విశ్వాసం!చాగంటి వారి ప్రవచనం నుండి (2-Jan-23,Enlightenment Story)

విశ్వాసం! (చాగంటి వారి ప్రవచనం నుండి) 

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖✍️

విశ్వాసం గురించి రామకృష్ణ పరమహంస ఒక కథ చెపుతారు.

వెనుకటికి దక్షిణ సముద్రం దగ్గర ఒక భక్తుడు నిలబడి ‘ఈ సముద్రమును దాటి భారత దేశమునకు వెళ్ళాలి.’ఓడ వెళ్ళిపోయింది. ఎలా.,.. ‘అని కంగారుపడుతున్నాడు.ఆ సమయంలో అటుగా ఒక సిద్ధ పురుషుడు వెళ్ళిపోతున్నాడు.’ఏమి నాయనా... అలా కంగారు పడుతున్నావు...’అని అడిగాడు.

’అంటే ఏమి లేదండి... సముద్రం మీద ఓడ వెళ్ళిపోయింది….   ఇపుడు నేను ఎలా వెళ్ళాలో తెలియడం లేదు. మళ్ళీ రేపటి వరకు ఓడ లేదు! అందుకని కంగారు పడుతున్నాను.’ అన్నాడు.

అపుడు సిద్ధుడు  ‘నీవేమి కంగారుపడకు.’ అని ఒక కాగితం మీద రాసి, మడిచి చేతిలో పేట్టి... ‘ఇది విప్పి చూడకు. చూడకుండా చేత్తో పట్టుకో. పట్టుకుని ఈ సముద్రం మీద నడిచి వెళ్ళిపో. నువ్వు వెళ్లిపోతావు. నీళ్ళల్లో పడవు. వెళ్ళు...’ అన్నాడు.

సిద్ధపురుషుడు అంటే మాటలు కాదు కదా..! ‘ఈయన ఇచ్చాడు కాబట్టి ఇది నన్ను రక్షించి తీరుతుంది.... నేను మునగను..’ అనుకున్నాడు. అంటే ఆ నీళ్ళమీద పరుగెత్తడం మొదలుపెట్టాడు.

అందులో దిగిపోకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంకా కొద్ది దూరంలో ఒడ్డు కనిపించింది. అపుడు ఆశ్చర్యం వేసింది.ఇంతలా నన్ను నీటిమీద పరుగెట్టించిన ఈ కాగితంలో ఉన్న రహస్యం ఏమిటి..?’ అని అనుకున్నాడు. 

ఒకసారి ఆ కాగితంలో ఏమి రాసి ఉన్నదో చూడాలని అనుకున్నాడు. అనుకుని ఆ కాగితం విప్పాడు. ఆ కాగితంలో 'శ్రీరామ' అని రాసి ఉంది.

’ఈ నామమా నన్ను పరుగెత్తించింది' అన్నాడు. వెంటనే మునిగిపోయాడు. విశ్వాసం పోయింది. కొట్టుకుపోయాడు.విశ్వాసం ఉన్నంతసేపు వాడు మహా జ్ఞానితో సమానమై పోయాడు.

అందుకనే విశ్వాసం పోకుండా పరమాత్మ నామం చెప్పగలిగితే జ్ఞానితో సమానమైపోతావు.✍️

 🌷🙏🌷సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🌷🙏🌷 

 🌷🙏🌷లోకా సమస్తా సుఖినోభవన్తు! 🌷🙏🌷

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼


Monday 26 December 2022

ధర్మాత్ముడు (1-Jan-23,Enlightenment Story)

*ధర్మాత్ముడు*

🌷🌻🌹🌼💐 

ఓరాజుకు నలుగురు కొడుకులు ఉండేవారు. "ఎవడైతే సర్వాధికుడైన ధర్మాత్ముణ్ణి వెతికి తీసుకువస్తాడో అతడికే రాజ్యాధికారం ఇస్తాను" అన్నాడు ఆ రాజు తన కొడుకులతో.రాకుమారులు నలుగురూ తమ గుఱ్ఱాలు తీసుకుని నాలుగు దిక్కులకూ బయలుదేరారు.

కొన్నాళ్ల తర్వాత పెద్ద కొడుకు తిరిగి వచ్చి తండ్రికి ఎదురుగా ఓవ్యాపారిని నిలబెట్టి, *ఈ శేఠ్ గారు వేలాది రూపాయలు దానం చేస్తుంటారు. ఎన్నో గుళ్లూ గోపురాలు కట్టించారు. చెరువులు తవ్వించారు. చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. తీర్థక్షేత్రాలలో ఎన్నో వ్రతాలు చేస్తుంటారు. నిత్యం పురాణ శ్రవణం చేస్తుంటారు. గోపూజలు చేస్తుంటారు. ప్రపంచంలో వీరిని మించిన గొప్ప ధర్మాత్ముడెవరూ ఉండరు* అన్నాడు.

’ఈయన నిశ్చయంగా ధర్మాత్ముడే!’అని పలికిన రాజు, ఆ వ్యాపారిని సత్కరించి పంపివేశాడు.

రెండవ కొడుకు ఓ బక్కచిక్కిన బ్రాహ్మణుడిని తీసుకువచ్చి "ప్రభూ!  ఈ బ్రాహ్మణుడు నాలుగు ధామాలకు, సప్తపురాలకు కాలినడకన వెళ్లి యాత్రలు చేసివచ్చాడు. సదా వీరు చాంద్రాయణ ప్రతం చేస్తుంటారు. అసత్యానికి వీరు భయపడతారు. ఈయన కోపగించడం ఎవరూ, ఎన్నడూ చూడలేదు. నియమబద్దంగా మంత్ర జపాదులు పూర్తి చేసుకున్న తరువాతే జలపానం చేస్తారు. త్రికాలాల్లోనూ స్నానం చేసి సంధ్యావందనం చేస్తారు. ఈకాలంలో యీవిశ్వంలో వీరిని మించి సర్వశ్రేష్ట ధర్మాత్ములెవరూ లేరు." అన్నాడు.

రాజు బ్రాహ్మణ దేవతకు నమస్కరించి అధిక దక్షిణలిచ్చి, వీరు మంచి ధర్మాత్ములే అంటూ పంపివేశాడు.మూడవ కొడుకు కూడా ఒక బాబాజీని తీసుకొని వచ్చాడు. ఆబాబాజీ వస్తూనే ఆసనం వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చుండి పోయారు. జీర్ణమైన బట్టలతో అస్థిపంజరంలా ఉన్న ఆకారంతో ఆయన కనిపిస్తున్నాడు. అందరూ ఆసీనులైన తరువాత మూడవ కొడుకూ  "ప్రభూ! వీరు ఎంతగానో నేను ప్రార్థించగా ఇక్కడకు విచ్చేశారు. వీరు మహా తపస్వులు. వారానికి ఒక్కసారి మాత్రమే క్షీరపానం చేస్తారు. గ్రీష్మ ఋతువులో పంచాగ్ని మధ్యంలో ఉంటారు. శీతకాలంలో జలాలలో నిలబడుతారు. సదా భగవంతుని ధ్యానంలో వుండే వీరికి మించిన మహా ధర్మాత్ములు లభించడం దుర్లభమే..." అన్నాడు.

రాజు ఆమహాత్మునికి సాష్టాంగ ప్రణామం చేసి వారి ఆశీస్సులు అందుకుని వీడ్కోలు పలికాడు.. ఆపై వీరు ధర్మాత్ములే అన్నాడు. అందరి తరువాత చిన్నకొడుకు వచ్చాడు. అతనితో మాసిన బట్టలు కట్టుకున్న పల్లెలో నివసించే ఓ రైతు ఉన్నాడు. దూరం నుండియే రాజుకు దండాలు పెడుతూ భయపడుతూ ఆ రైతు వచ్చి నిలబడ్డాడు. అన్నలు ముగ్గురూ తమ్ముని మూర్ఖత్వానికి పకపక నవ్వారు. అప్పుడా చిన్నకొడుకు… " ప్రభూ! ఓకుక్కకు గాయం అయ్యింది. ఇతను అది చూసి దాని గాయం కడిగాడు. అందుకే నేనితణ్ణి తీసుకువచ్చాను. ఇతడు ధర్మాత్ముడవునో కాదో మీరే అడిగి తెలుసుకోండి" అన్నాడు. రాజు "ఏమయ్యా! నువ్వు ఏంధర్మం చేస్తుంటావు?"

భయపడుతూనే రైతు పలికాడు… "ప్రభూ! నేను చదువుకున్నవాణ్ణి కాను. నాకు ధర్మం అంటే ఏం తెలుస్తుంది, ఎవరైనా జబ్బుపడితే సేవ చేస్తాను. ఎవరైనా యాచిస్తే గుప్పెడు మెతుకులు పెడతాను"

అంతట రాజు, "ఇతడే అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు" అన్నాడు. 

అది విని కొడుకులందరూ అటూ ఇటూ చూడసాగారు. రాజు అప్పుడు, "దాన ధర్మాలు చేయడం, గోపూజ చేయడం, అసత్యమాడక పోవడం క్రోధంగా ఉండక పోవడం, తీర్థయాత్రలు, సంధ్యావందనం పూజాదులు కొనసాగించడం కూడా ధర్మమే. తపస్సు చేయడం ఆవశ్యకమైన ధర్మమే, కానీ సర్వాధిక ధర్మమేమంటే అర్థించక పోయినా అసహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం, రోగికి సేవ చేయడం, కష్టంలో ఉన్న వారికి చేయూతనీయడం సర్వాధికమైన ధర్మం. పరులకు సహకరించే వారికి తనంతతానుగా సహాయం అందుతుంది. త్రిలోక నాథుడైన పరమాత్మ అట్టి పరోపకార పరాయణునిపై ప్రసన్నుడై ఉంటాడుఅని అన్నాడు.

అందుకే పరోపకారం అన్నింటికన్నా మించిన ధర్మం. అది నిర్వర్తించే వాడే ధర్మాత్ముడు.

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻

పురోహితుని ఆశీర్వాదం విలువ (27-Jun-23,Enlightenment Story)

పురోహితుని ఆశీర్వాదం విలువ

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻

ఒకరోజు ఒక కోర్టులో జడ్జి గారి ముందుకు ఒక కేసు వచ్చింది. ఫిర్యాదు దారుడు ఒకతను ఈ విధంగా ఫిర్యాదు చేశాడు. ఒక పురోహితుడు  సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి Tax కూడా చెల్లించడం లేదు. కావున తమరు విచారణ జరిపి అక్రమ సంపాధరణ దారుడిగా గుర్తించి తగిన విధంగా శిక్షించగలరని పిర్యాదు.

జడ్జి :- పురోహితుణ్ణి పిలిచి ఈ విధంగా ప్రశ్నించారు. మీరు మీ వద్ద ఉన్న ధనం అక్రమంగా సంపాధించారా లేక సక్రమంగా సంపాధించారా అని

పురోహితుడు:- ఈ విధంగా సమాధానం ఇచ్చాడు నేను సంపాదించినదంతయు సక్రమమే ఇసుమంతయు అక్రమం కాదు అని

జడ్జి :- అంత సంపాదన సక్రమంగా ఎలా సంపాదించావో వివరించు

పురోహితుడు :- అయ్యా!ఒక రోజు ధనవంతులైన దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి చెరువు వద్దకు వచ్చారు నేను ఆ సమయంలో సంధ్యావంధనం చేస్తున్నాను. ఆ సమయంలో వారు చేసుకోబోయే అకృత్యాన్ని చూసి వారించాను ఆత్మ హత్య మహా పాపం అని వివరించి వారిని ఆ ప్రయత్నం నుండి విరామయింప చేసి సాంతన కలిగించాను. నా మాటపై విశ్వసంతో వెనుదిరిగి వెళ్లారు కొద్ది రోజుల తరువాత నాపై గౌరవంతో వద్దన్న వినకుండా కొంత ధనాన్ని ఇచ్చి ఆశీర్వదించండి అని వేడుకున్నారు. దానికి ప్రతిఫలంగా సంతానా సిద్ధిరస్తు అని ఆశీర్వాదం ఇచ్చాను. కొన్ని సంవత్సరాల తరువాత వారికీ కలిగిన సంతానాన్ని వెంటబెట్టుకొని ఆనందంతో నావద్దకు వచ్చి నా కుమారునికి మీ ఆశీస్సులు అందచేయండి అని ప్రాధేయపడ్డాడు. దానికి నేను ఆపిల్లవాడు బాగా చదివి ప్రయోజకుడు అవుతాడు నీకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తాడు అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ సమయంలో ఆనందంతో మరికొంత ధనం ఇచ్చి వెళ్ళాడు. మరికొన్ని సంవత్సరాల తరువాత ఈ మధ్యనే అదనవంతుడు తన కుమారుడు ప్రయోజకుడాయ్యాడనే విషయం తెలియజేయడానికి నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం అడిగాడు నేను ఆదంపతులిద్దరిని ఆయురారోగ్య వృద్ధిరస్తు అని ఆశీర్వధించా అతను తన వద్ద ఉన్న ధనంలో కొంత ధనాన్ని ఇచ్చి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు.*

అయ్యా! ఈ విధంగా నేను ధనవంతుణ్ణి అయ్యాను. నేను సంపాధించింది సక్రమమైనదో లేక అక్రమమైనదో తమరే తీర్పు ఇవ్వండి అని సెలవిచ్చారు. -పై విషయం అంత సావధానంగా విన్న జడ్జి తీర్పు ఇచ్చాడు. ఆరోజున ఆత్మ హత్య చేసుకోవాలనుకున్న ఆదంపతులను ఈ పురోహితుడు వారించకుండా ఉంటే వారికీ తర్వాత జీవనం ఉండేది కాదు. కొన్ని రోజులకు వారు తప్పు తెలుకొని పశ్చాత్తాపంతో కృతజ్ఞత పూర్వకంగా కొంత ధనం ఇవ్వడం పూర్తిగా ఆమోదయోగ్యమైనది ఆ ధనం సక్రమమైనదే కొన్ని రోజులకు వారు సంతానవంతులై పుత్రుడు పుట్టాడనే ఆనందంలో మరికొంత ధనం ఇచ్చాడు అధియును సక్రమైనదేగా మరికొన్ని రోజులకు కొడుకు ప్రయోజకుడయ్యాడనే సంతోషం తో కొంత ధనం ఇచ్చాడు ఇది కూడా సక్రమమే మరియు ధనవంతుని శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉంటుందని తెలుకొని ఆనందంగా జీవిస్తున్నాడు ఈ విషయంలో ఎక్కడ పురోహితుని సంపాధన అక్రమమని తెలుపలేము అని తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంలోనే జడ్జి గారు ఇలా అడిగాడు.

జడ్జి:- అయ్యా ఇంత ధనాన్ని మికిచ్చి పుణ్యాత్ములైన ధనవంతులు ఎవరో తెలుసుకోవాలనే ఉత్చాహం ఉన్నాను ఎవరో తెలుపగలరా అని.

పురోహితుడు :- ఆ పుణ్య దంపతులు మీ తల్లిదండ్రులే అని తెలియచేసాడు. దుఃఖంతో తను కూర్చున్న స్థానం నుంచి దిగి వచ్చి పురోహితునికి షాష్టాంగ నమస్కారం చేసాడు జడ్జి. 🙏🕉️🙏

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

అన్నదాతా సుఖీభవ! (20-Jan-24, Enlightenment Story)

అన్నదాతా సుఖీభవ! 

🌺🍀🌺🍀🌺🍀

పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు. అటువంటి ఊళ్లో ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు. "ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి" అని తలచి, స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. మీరింక వెళ్లవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది.

'అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట! అంటూ వెనుదిరిగాడు. అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో 'స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని. నన్ను క్షమించండి. లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి' అని ప్రార్థించాడు. లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు.

అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. 'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది' ఇదేనా ఆ గొప్ప ఉపకారం? అన్నాడు ధనికుడు అసహనంగా. సన్యాసి అతనికొక సూది ఇచ్చి 'ఇది చాలా మహిమగల సూది. దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు.

ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను అని అరిచాడు. ఆ సాధుపుంగవుడు శాంతంగా నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా? అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. ఆసన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను' అన్నాడు. ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని. ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.

గుమాస్తా చదవడం ప్రారంభించాడు.

1వ వాడు: ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!

2వ వాడు: ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా. 

3వవాడు: అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.. అంటూ వాపోయారు.

సాధువతనిని ఓదార్చి బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు.

1వ వాడు: అన్నదాతా సుఖీభవ!

2వ వాడు: ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి.

3వ వాడు: అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు ఆరి బిడ్డలు, అందర్నీ దేవుడు చల్లగా చూడాలి.

దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు.కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు.ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు.

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

జీవించడం ఒక కళ ( 29-Dec-22,Enlightenment Story)

🕉️ జీవించడం ఒక కళ. 🕉️

🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🙏🛕🙏🛕🙏🛕

చెట్టుమీద పాకే గొంగళి పురుగు జీవించడం అంటే ఏమిటో చెబుతుంది. అది మనిషి ముందే సీతాకోకచిలుకై ఎగిరి వెళ్తుంది. మనిషి మనసు మాత్రం గొంగళి పురుగులా ఉండిపోతోంది. ‘ఎప్పటికైనా ఎదగాలి, ఎగరాలి’ అని ప్రణాళిక సిద్ధం చేసు కోవడంతోనే మానవుడి సమయమంతా గడచిపోతోంది.

జీవించడంలో ఎంత ఉదాత్తత, ఔన్నత్యం ఉంటాయో తెలుసుకోవాలని ప్రకృతి పలు విధాలుగా బోధిస్తోంది. అంతటా ఒకే రకమైన ప్రేమతత్వం  పంచుతున్నా- ఈ జీవితం ఎందుకో, ఎలా జీవించాలో మనిషికి ఇంకా అవగాహన కావడం లేదు. 

ఏదో విధంగా బతకడమన్నది నిజమైన జీవనం అనిపించుకోదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమూ జీవనం కాదు. బతుకు బండిని ఎలాగోలా లాగించడమన్నదే మానవుడి అంతిమ లక్ష్యం కాకూడదు.

మనము ఎక్కడి నుండి వచ్చినాము? ఎందుకు  వచ్చినాము?  ఏమి చేస్తున్నాం?  ఏమి చేయాలి? మనము ఎక్కడికి వెళతాము? అనే ప్రశ్నలు మీలో తలెత్తి ,వాటి గురించి వివరంగా తెలియ జేసే జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడ మే నిజమైన జీవితం.

కాళీమాత ఆలయంలో ఓరోజు ప్రసాదంగా ఇవ్వడానికి లడ్డూ తయారు చేస్తున్నారు. అయితే ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు..లడ్డూకి చీమలు పట్టడం మొదలైంది. 

లడ్డూ తయారు చేస్తున్న వారికి ఏం చేయాలో తెలీలేదు. చీమలను చంపకుండా ఎలా?’ అని ఆలోచనలో పడ్డారు. వాటిని చంపకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పమని రామకృష్ణ పరమహంసను సలహా అడిగారు. అప్పుడాయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి. వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి,  ఇక ఇటు రావు అని సూచించారు. 

పరమహంస చెప్పినట్లే చీమలొచ్చే దారిలో చక్కెర పొడి చల్లారు. ఆ పొడిని చూడటంతోనే వాటిని నోట కరుచుకుని చీమలు కాస్సేపటికల్లా అక్కడి నుంచివెళ్ళిపోవడం మొదలుపెట్టాయి. సమస్య కొలిక్కి వచ్చింది.

ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు. మనుషులూ ఈ చీమల్లాంటివారే. తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే తమకు తెలియకుండానే దానిని మధ్యలోనే విడిచిపెట్టి మరొకటేదైనా దారిలో కనిపిస్తే దానితో సరిపెట్టుకుంటారు తప్పముందనుకున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు. అని చెప్పారు. 

తమకు కావలసింది చక్కెర కాదు లడ్డూ పొడేనని ఒక్క చీమా ముందుకు రాలేదు. మనం కూడా అలానే ‘భగవంతుడు సర్వస్వము’ అనుకొనే ధ్యాన సాధన మొదలు పెడతాము, మధ్యలో ఎవరో ఎదో చెపితే దాని వద్దకు వెళ్లి మన సాధన అంతా వృధాచేసుకొంటాము..తీయగా ఉందన్న చక్కెరతో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు. రవ్వంత చక్కెర సంతోషం చాలనుకున్నాయవి. లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునే వారు చాలా తక్కువ మందే అని పరమహంస చెప్పారు.

🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🙏🛕🙏🛕🙏🛕🙏🛕

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🙏🛕🙏🛕🙏🛕🙏🛕

అందం అంటే ఏంటి నాన్నా? (28-Dec-22,Enlightenment Story)


🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼

🌹🌿 అందం అంటే ఏంటి నాన్నా అని ఎనిమిదేళ్ళ కూతురు తన నాన్నను అడిగితే, వాళ్ళ నాన్న చెప్పిన సమాధానం.. 

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼

  •  రోజూ లేవగానే నువ్వు నానమ్మకు గుడ్ మార్నింగ్ నానమ్మా  అని చెప్తావు చూడు..ఆ పలకరింపే అందం అంటే.. 
  • స్కూల్ కి నిన్ను తీసుకెళ్లేటప్పుడు టర్నింగ్ లో నువ్వు చేతితో సిగ్నల్ ఇస్తావు చూడు అదే అందమంటే.
  • ఒకరోజు నీ ఫ్రెండ్ నీకు తెలీకుండా నీ పెన్సిల్ తీసిందని నీకు తెలిస్తే మళ్లీ ఎప్పుడూ అలా చెయ్యకు కావాలంటే నన్నడుగు అంటూ షేరింగ్ ఈజ్ కేరింగ్ అని అన్నావు చూడు అదే అందమంటే.. 
  • షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఏదన్నా బొమ్మ నచ్చితే .. కాస్ట్లీ అయితే వద్దు నాన్నా అంటావు చూడు అదే అందమంటే.. 
  • అమ్మకూ నాకూ గొడవైనప్పుడు నా దగ్గరికొచ్చి స్మైల్ నాన్నా అంటావు చూడు అదే అందమంటే.. 
  • నీకు ఐస్ క్రీం కొన్నప్పుడు బయట నుంచి ఆశగా చూస్తున్న ఇద్దరి పిల్లలకు కూడా తీసుకో నాన్నా అన్నావు చూడు అదే అందమంటే.. 
  • అమ్మకి ఒంట్లో బాలేనప్పుడు ఇంటి పనిలో నాకు సాయం చేస్తావు చూడు అదే అందమంటే.. 
  • నా బాధ నీకు తెలీకుండా నీతో మాట్లాడినప్పుడు అలా ఉన్నావేంటి నాన్నా..అంతా ఓకే అవుతుందిలే అంటావు చూడు అదీ అందమంటే.. అని అనగానే..

*అందం అంటే హర్ట్ లో ఉంటుందా నాన్నా ఆయన కూతురు సమాధానం విన్న నేను ఆశ్చర్యంగా..ఆనందంగా తన వైపే చూస్తూ ఉండిపోయాను.*

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼

ఆదివారం రోజు, రాత్రి సమయంలో ఉసిరి ఎందుకు ని షే ధం? (27-Dec-22,Enlightenment Story)

🍈🍈🍈🍈🍈 🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈 🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈

ఉ సి రి ని షే ధం? ఎందుకు? ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా

🍈🍈🍈🍈🍈 🍈🍈🍈🍈🍈 🍈🍈🍈🍈🍈🍈 🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈

పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరియాక పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు. ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనే వారు.ఉసిరికాయ పేరు కూడా మాట్లాడనిచ్చే వారు కాదు.వారికి కూడా వివరం తెలియక పోయిన సరే తమ తల్లి తండ్రుల నుంచీ వస్తున్న నియమాలని పాటించేవారు.కానీ ప్రస్తుతం కొందమంది మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తున్నారు.

అయితే ఆదివారం ఎందుకు ఉసిరి తినకూడదో అనే సందేహం మాత్రం చాలామంది మెదడుని తొలిచే ప్రశ్న. అందుకే ఆ నియమం లో దాగివున్న అర్ధాన్ని మీ ముందు ఉంచుతున్నాం.ఆదివారం రోజు, రాత్రి సమయంలో ఉసిరి ఎందుకు తాకకూడదు అంటే, ఉసిరికాయలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది.ఇది ప్రేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది.దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు.అజీర్తి చేయడం వలన గుండె మంటగా ఉండటం జరుగుతుంది.అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.అందులో ఉండే శక్తి రాత్రి పూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది.

అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతాము అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు అంటారు.ఉసిరి కాయకి ప్రత్యేకమైన గుణం ఏమిటంటే ఇందులో సూర్య శక్తి దాగి ఉంటుంది.సూర్యుడు రోజైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుంది.అందుకే ఆదివారం నాడు ఉసిరిని కూడా దూరం పెడుతారు.

(ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు అదే ఫలాని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.) ఇది సైన్స్ తో కూడిన దివ్య రహస్యం.ఇక శాస్త్ర ప్రమాణం కూడా చూడండి

శ్లో. భానువారేదివారాత్రం సప్తమ్యాంచతథాదివా , ధాత్రీఫలంనరస్స్యా ద్యహ్యలక్ష్మీకోభవేత్సదా. వీర్యహానిర్యశోహానిః ప్రజ్ఞాహానిస్తథైవచ. భవేద్యస్మాత్తతోరాత్రౌ ధాత్రీంయత్నేనవర్జయేత్.

ఆదివారంనాడు రాత్రింబగళ్ళుసప్తమినాడుపగటిపూట ఉసిరికపచ్చడి ని తిన్నచో అలక్ష్మీకు డగును కనుక నిషేధము. పైశ్లోకం ప్రకారం వీర్యహాని యశోహాని ప్రజ్ఞాహాని కూడా పొందుతారు నిషిద్ధ దినాలలో ఉసిరిక తింటే.

🍈🍈🍈🍈🍈 🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈 🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈 🍈🍈🍈🍈🍈🍈

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍈🍈🍈🍈🍈 🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈 🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈🍈 🍈🍈🍈🍈🍈🍈

Friday 23 December 2022

దోపిడి - దొంగతనం (26-Dec-22,Enlightenment Story)

 *దోపిడి - దొంగతనం  (26-Dec-22,Enlightenment Story)*

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

అమెరికా పోలీసులు ఒక 15 ఏళ్ళ కుర్రాడిని అరెస్ట్ చేసి కోర్ట్ లో ప్రవేశ పెట్టారు. జడ్జి విషయమేంటని అడిగితే ఈ అబ్బాయి ఒక బేకరీ లో బ్రెడ్ దొంగతనం చేసి పారిపోతుండగా అక్కడ వాచ్మాన్ పట్టుకున్నాడని అప్పుడు పెద్ద అద్దంపగిలిపోయిందని అందుకుగాను ఆ యజమాని కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పారు 

జడ్జి: దొంగతనం చేసావా ?   పిల్లాడు : అవును మేడం 

జడ్జి :ఏమీ దొంగతనం చేసావు ? పిల్లాడు: ఒక బ్రెడ్ ప్యాకెట్ 

జడ్జి: డబ్బులిచ్చి తీసుకుని ఉండొచ్చుగా ? పిల్లాడు :డబ్బులు లేక తీసుకున్నాను మేడం 

జడ్జి :ఇంట్లో వారిని అడిగి ఉండొచ్చుకదా 

పిల్లాడు :అమ్మ మాత్రమే ఉన్నారు అందులోనూ అనారోగ్యం అన్నాడు 

జడ్జి :ఏదైనా పని చేయొచ్చుగా నువ్వు 

పిల్లాడు :ఒక కారు షెడ్ లో పనిచేస్తుండేవాడిని మేడం అమ్మకు అనారోగ్యమని ఒక్కరోజు  సెలవు పెట్టినందుకు పని నుండి తీసేసారు 

జడ్జి :ఇంకెక్కడైనా పని చేయొచ్చుగా 

పిల్లాడు :ఉదయం నుండి యాభై మంది దాకా పని అడిగాను ఒక్కరుకూడా ఇవ్వలేదు. సూర్యుడు అస్తమించేసాడు ఇక ఏమీ చేయలేక ఈ పనిచేశానని తలదించుకున్నాడు. పిల్లాడితో సంభాషించాక జడ్జి తీర్పు రాయడం మొదలుపెట్టారు.

ఈరోజు ఈ పిల్లాడి పరిస్థితికి మనం అందరం నేరస్థులమే నాతో సహా. మన దేశంలో ఇంత సంపధ, డబ్బు ఉండి  ఆకలి అంటున్న అబ్బాయికి ఒక్క పూట తిండి అందించలేక పోయాము అందుకు జరిమానా ఇక్కడ కోర్ట్ లో ఉన్న ప్రతిఒక్కరు ఇతడిని పట్టుకున్న పోలీసులు నాతో సహా అందరూ 10 డాలర్ లు కట్టాలి  ఏ ఒక్కరు కట్టకుండా బయటకు వెళ్ళలేరు. ఇక ఇతడిపై కేసు పెట్టిన షాప్ యజమాని 100 డాలర్ లు జరిమానా కట్టాలి 

ఈ మొత్తాన్ని ఆ పిల్లాడికి అందించాలి అని తీర్పు రాశారు. ఆ పిల్లాడు అక్కడ ప్రజలు ఆ జడ్జి తీర్పుకు ఆశ్చర్యపోయారు ఆ పిల్లాడు తల ఎత్తి జడ్జి ని చూడగా బాధతో కళ్ళ వెంట కన్నీళ్లు 

సమాజంలో ఆకలి కోసం దొంగతనం జరుగుతున్నది అంటే మనం అందరం దానికి కారణమైనవాళ్ళమే. సాంకేతికత , సంపధ ఏ ఒక్కరి వల్ల సృష్టించబడదు. అది శ్రామికుల శ్రమ ఫలితం . అది తిరిగి వారికి సరిగా అందట్లేదు అంటే  మనమంతా దోపిడిధారులమే   అని ఆ జడ్జి తలవంచుకున్నారు

Thursday 22 December 2022

స్వర్ణముఖి నది (25-Dec-22,Enlightenment Story)

 *స్వర్ణముఖి నది*

దక్షిణ భారతదేశంలో ప్రవహించే ఒక నది. తిరుపతి జిల్లాలో ప్రముఖ నది. ప్రముఖ శైవ క్షేత్రమయిన శ్రీకాళహస్తి ఈ నది ఒడ్డున నెలకొని ఉంది. తిరుపతి-చంద్రగిరి మధ్య తొండవాడ సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం ధూర్జటి తన రచనల్లో దీన్ని మొగలేరు అని ప్రస్తావించాడు. ఈ నది ఒడ్డున శ్రీకాళహస్తీశ్వరాలయం, 

తొండవాడ వద్ద ఉన్న అగస్తేశ్వరాలయం, యోగి మల్లవరం వద్దనున్న పరాశరేశ్వరాలయం, గుడిమల్లం దగ్గరున్న పరశురామేశ్వరాలయం, గాజులమండ్యం దగ్గరున్న మూలస్థానేశ్వరాలయం ఉన్నాయి. ఇది జీవనది కాదు.

సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ప్రవహిస్తుంది.ఈ నది భీమ, కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనం అవుతుంది.

ఈ నదిని గురించి ఒక పురాణగాథ ఉంది.పూర్వం అగస్త్య మహర్షి బ్రహ్మను గురించి తపస్సుచేసి నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి, ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే నది వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలంగా దాని విలువచేసేంత బంగారంగా మారేది. అందుకే ఈ నదికి సువర్ణముఖి, స్వర్ణముఖి అనే పేర్లు వచ్చాయి.

స్వర్ణముఖి నది పాకాల దగ్గరలో ఉన్న పాలకొండ లలో ఆదినాపల్లి వద్ద చిన్నవాగులా పుట్టినది. ఇది చంద్రగిరి ఎగువన భీమానదితో సంగమించి నది అయింది. ఆతరువాత దిగువన ఉన్న కల్యాణీనదితో కలిసి పెద్దనదిగా మారింది. చంద్రగిరి వద్ద ఉన్న చంద్రనగము, హేమనగములలో ఇది హేమనగాన్ని ఒరుసుకుంటూ ప్రవహించడం వలన ఇది సార్థక నామాధేయురాలైంది. వాస్తవానికి స్వర్ణముఖరీ ఇసుక వెండిలా తెల్లగానూ అలాగే సువర్ణంలో బంగారు వర్ణంతోనూ ఉంటుంది. తరువాత ఈ నది కొంతదూరం ఉత్తరంగా ప్రవహించి మరికొంత దూరం ఈశాన్యంగా ప్రవహిస్తు శేషాచల కొండలను స్పృజించి కల్యాణీ, భిమానదులతో సంగమించి కపిలతీర్ధం, అలివేలుమంగాపురం, శ్రీకాళహస్తి, నెల్లూరు మీదుగా ప్రవహించి నూడుపేట సమీపంలో ఉన్న సిద్ధవరం వద్ద తూర్పుసముద్రంలో సంగమిస్తుంది. స్వర్ణముఖీ నదీ తీరంలో అగశ్వేరాలయం, వరేశ్వరాలయం, పద్మావతీ దేవి ఆలయం, పరశురామేశ్వరాలయం ఉన్నాయి. ఈ నది మొత్తంగా దాదాపు 100 మైళ్ళు ప్రయాణిస్తుంది.

సువర్ణముఖి నది అగస్త్యుని తపోభంగం కలిగించగా అగద్త్యుడు స్వర్ణముఖినీ నదిని శపించాడు. అందువలన నదిలో నీరు ఇంకిపోయింది. అయినప్పటికీ అంతర్వాహినిగా ప్రవహిస్తున్న కారణంగా నదీసమీపంలో ఉన్న బావులలో నీరు ఇంకిపోదు. నదీతీరంలో విపరీతంగా మొగలి పొదలు పెరిగిన కారణంగా స్వర్ణముఖీ నదికి " మొగలేరు " అనే మరొకపేరు కూడా వచ్చింది. ఈ నదికి పలు వాగులు, వంకలు, ఏరులూ జలాలను ఆందిస్తున్నాయి. వాటిలో కల్యాణీ, భీమానదులు ప్రధానమైనవి. కల్యాణీ నదీతీరంలో శ్రీనివాసమంగాపురంలో కల్యాణశ్రీనివాసుడు వెలసి పూజలందుకుంటున్నాడు.


Wednesday 21 December 2022

ప్రస్తుత వివాహ వ్యవస్థ (24-Dec-22,Enlightenment Story)

 *ప్రస్తుత వివాహ వ్యవస్థ*

💥💥💥💥💥💥💥💥💥💥

రాసినవి మాట్రిమొని నిర్వహించే వ్యక్తి నుండి.  అక్కడి తల్లితండ్రులు ,  ఆడపిల్లలు వేదనతో చెప్పిన  యదార్ధ సత్యాలు. అంతేకాని,  ఆడపిల్లలమీద అభాండాలు వెయ్యడం కోసం మాత్రం కాదు. 👉ఇది కేవలం అటువంటి ప్రవృత్తి కలవారికి మాత్రమె!👈 

ముమ్మాటికీ తల్లి తండ్రులు వివాహాలను పాడు చేస్తున్నారు. వారి నాశనానికి వీరే బాధ్యులు.ఎవరిని కించపరచటానికో వ్రాసింది కాదు. సంఘంలో జరుగుతున్న సంఘటనలు వారి స్పందనలు మాత్రమే. ....

"ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులదే పైచేయి"

కావలసిన అర్హతలు: BTech, Software ,America అబ్బయికి సొంత ఇల్లు, తండ్రికి పెన్షన్ వచ్చే ఉద్యోగం.సిగరెట్, మందు అలవాటు లేకుండా, మంచి పర్సనాలిటీ, ఉన్నత కుటుంబం.ఆడపిల్లల తల్లితండ్రులకు 
సపోర్ట్ గా  ఉండాలి.

💥ఇంటర్వ్యూ: 

ఫోన్ చేయ్యగానే పిల్ల తల్లి మాట్లాడుతుంది.భర్తకు అవకాశంలేదు.

"అబ్బాయి చదువు,తెలివితేటలూ పరీక్షించి లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తాడు సదరు కంపెనీ వాడు". కాని,10th పాస్ కాని తల్లి " మీ అబ్బాయి  ఏ యూనివర్సిటీలో చదువుకొన్నాడు?" అనే ప్రశ్న. ( అంటే ఉద్యోగమిచ్చినవాడు వెధవ అన్నమాట ఈవిడ దృష్టిలో) మీ అబ్బాయి ఫోటో,  వివరాలు whatsapp లో పంపండి ,  మా అమ్మాయిది పంపుతాము అంటుంది !  మనం పంపిస్తే వారు పంపరు. తరవాత మనమే ఫోన్ చేయాలి. అడిగితె

మొదటి వారం: 
"ఇంకా అమ్మాయి చూడలేదండి".

రెండవ వారం :
" అమ్మాయి లేట్ గా వస్తోందండి. ఇంకా చూడలేదు" .

మూడవ వారం: 
" ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉందండి". 

నాలుగో  వారం:
శని,ఆదివారాలలో " అమ్మాయి తలనోప్పని పడుకుందండి" .

ఐదో వారం:
అమ్మాయి పేకేజ్ మీకన్నా 10 వేలు ఎక్కువండి. ఒప్పుకోలేదు" అని కానీ , లేదా " మీరు ఇన్ని సార్లు చెయ్యవలసిన అవసరం లేదండి . మేమే చేస్తాము" అనిఫోన్ పెట్టేసి, తరవాత మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు.

💥అమ్మాయిల విషయానికొస్తే:
తల్లి తండ్రుల గారాబం, తరవాత వారిమాట వినకపోవడం , మితిమీరిన స్వేచ్ఛా  జీవితంతో పెళ్లి చూపులనాడు పెళ్ళి కోడుకుతో సంభాషణ ఏకాంతంగా:

"మీ ఇంట్లో బాగేజీ , లగేజి ఉన్నాయా?  మీ ఇంట్లో  వీల్ ఛైర్ లు ఉన్నాయా? మీ ఇంట్లో డస్ట్ బిన్లు ఉన్నాయా?మీ ఇంట్లో రాహు కేతువులున్నాయా?" అని అబ్బాయి తల్లితండ్రుల నుద్దేసించి పై ప్రశ్నలు . తరవాత,
 
"మీ అమ్మ నాన్నలు మనతో ఉండడానికి వీలు లేదు, నా సెల్ నువ్వు ఆన్సర్ చెయ్యొద్దు. నీ సెల్ నేను ముట్టుకోను! 

నేను వంట చెయ్యను. కర్రి పాయింట్ లో తెచ్చుకుందాము!లేదా వంటమనిషి పెట్టుకుందాం..
 
నాజీతం సేవింగ్స్ కోసం బ్యాంకులో , నీ జీతం ఖర్చుపెడదాము!"ఇంకా కొంతమంది " మనకి పిల్లలు వద్దు" అని నిబంధనలు. కావాలి అని గట్టిగా పట్టుపడితే ఎక్కడైనా తెచ్చి పెంచుకుందాం...లేకపోతె తాంబూలాలు లేవు. కొన్ని షరతులు తరవాత చెప్పి కూడాతాంబూలాలు కాన్సిల్ చేసుకొన్న కేసులు చాలా ఉన్నాయి..

పెళ్ళైన తరవాత ఖర్మకాలి వారికి పడక..  విడాకుల వరకు వస్తే, విడాకులకై సంతకం పెట్టాలంటే లక్షలు పరిహారం.అప్పటికే అబ్బాయి క్రెడిట్,డెబిట్ కార్డులు బాలన్స్ జీరో చేసేస్తుంది. కాపురం చేయటం భయమేస్తుంది అంటుంది...విడాకులైనా ఏ మాత్రము మార్పు, బాధ లేకుండాకొత్త పెళ్లి కూతురు లాగ అవే కండిషన్లు.
సర్దుబాటు వ్యవహారం, పశ్చత్తాపం ఏకోశానా ఉండవు.

వీటన్నిటికి వెర్రి తల్లి సపోర్ట్! 

ఇలాంటి వాళ్లకు మళ్లీ ఒక బకరా నీ చూసి పెళ్లి చేస్తారు కాని, కాపురం చేయించగలరా? ఉద్యోగం చేసే ఊరినుండి, లేదా విదేశాలనుండి వచ్చిందంటే సూట్కేసులతో సరాసరి ఎయిర్ పోర్ట్ నుండి అమ్మగారి ఇంటికే. 15 రోజుల తరవాతో లేదా వెళ్ళిపోయే టప్పుడు ఒక వారం ముందరో అత్తగారింట్లో ప్రత్యక్షం.

ప్రమాదమేమంటే,  మగవారికి సంతానోత్పత్తి 90 సంవత్సరాలు దాకా ఉంటుంది. కానిఆడవారికి మొనోపోజ్ వచ్చిందంటే కుదరదు. ఇప్పుడు 35 సంవత్సరాలు దాటితే వచ్చేస్తోంది. తల్లితండ్రులు ఈ సంగతి  తెలిసో, తెలియకో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటున్నారు.

ఆడపిల్లల సంపాదన మరిగి వారికి వచ్చిన సంబంధాలు తోసిపుచ్చే తల్లితండ్రులు.... కాపురాలు చెడగొట్టి వాళ్ళ సంపాదనతో జల్సా చేసే... తల్లితండ్రులు కూడా ఉన్నారు అనటానికి ఏమాత్రం సందేహం లేదు. కొంత మంది ఆడపిల్లలు స్వయంగా చెప్పిన వ్యధ ఇది ! (వీళ్ళు కళ్ళు తెరిచేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది)
ఇవండీ!  మన మగ పిల్లలకు వివాహం కాకపోవడాని కారణాలు , వాస్తవాలు!  అనుభ వించిన వారు చెప్పిన నగ్న సత్యాలు! 

🌹30 సం. వయసు దాటిఅదృష్టవంతులైన పెళ్లి కాని ప్రసాదులకు ,
🌹పెళ్లి చేసుకొని బాధలుపడి విడాకులు తీసుకొన్న అబ్బాయిలకు,
🌹ఇంకా పెళ్ళి చేయ్యక మంచి , మంచి అని సంబంధాలు వెదుకుతూ, అత్యాశతో వయసు దాటబెట్టిన అమ్మాయిల తల్లితండ్రులకు ,
🌹18 వయసు ఫోటోలు పెట్టి పాకేజీలను , క్వాలిఫికేషన్లు పోల్చుకొని అత్యాసతో చార్మింగ్ పోయి జుట్టుకు రంగేసుకుని ఇంకా ఎదురు చూస్తున్న అమ్మాయిలు , 
🌹అబ్బాయిలకు 
🌹తల్లితండ్రుల స్వార్థ ఆలోచనలకు మనస్పర్థల తో ఉద్యోగాలు మాని కోర్టుల చుట్టూ తిరుగుతున్న అమ్మాయిలకు  
ఈ పోస్ట్ అంకితం.👍

🌷పోయిన వయసు రాదు.
🌷"35 వయసు దాటిన అబ్బాయిలు దయనీయ పరిస్థితి.

*"పురుషుడు-స్త్రీ- వయస్సు" ఇవి మూడే ముఖమైనవి. జీతం, చదువు కాదు ఒక వ్యక్తి ఆవేదన.*

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂


Tuesday 20 December 2022

మరణం తర్వాత? ఏం జరుగుతుంది? Part -2 (23-Dec-22,Enlightenment Story)

మరణం తర్వాత? ఏం జరుగుతుంది? Part -2

(:::🔴:::)(:::🔴:::)(:::🔴:::)(:::🔴:::)(:::🔴:::) 

*జీవితాన్ని పరిశీలించుకొనుట*

ఇచ్చట అంక్షపెట్టే వారు, నిర్ణయించేవారు ఎవరూ ఉండరు. ఎలాగైతే ఆత్మ భూమిపైన తన జన్మలో ఇతరులని నిర్ణయించిందో అంటే జడ్జ్ చేసిందో అలాగ ఇక్కడ తనని తానే జడ్జ్ చేసుకుంటుంది. భూమిపై ఎవరికైతే కష్టాలను కలిగించిందో అవన్నీ చూసుకొని తాను తప్పుచేసానని ఫీల్ అవుతుంది. *తాను చేసిన తప్పుల నుండి జ్ఞానం పొందటానికి శిక్ష కావాలని కోరుకుంటుంది. ఈ విధమైన తన గత జీవితాన్ని పరిశీలించుకోవడం ద్వారా, రాబోయే తన జీవితానికి ఒక బ్లూప్రింట్ అంటే నఖలు లేదా ఒక ప్లాను వేసుకుంటుంది. ఏలాంటి సంఘటనలని ఎదుర్కొనాలి, ఎలాంటి ఛాలంజ్ లను ఎదుర్కొనాలి, ఎలాంటి కష్టాలను అధిగమించాలి, ఇలాంటి ఎన్నో నిర్ణయాత్మక రచనలతో నఖలు తయారుచేసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే, నిమిషాలతో సహా, వయస్సు, వ్యక్తులు, పరిసరాలు, సంభవాలు లేక సంఘటనలు అన్నీ, తాను ఎదుర్కొనవలసినవి రచించుకుంటుంది.  

*నఖలు లేదా నమూనా*

ఈ విధంగా మన తప్పిదాలకి మనమే బాధపడతాము మరియు శిక్షలు విధించుకుంటాము. ఒక ముఖ్యవిషయం చెప్పాలి అదే ఏమిటంటే, మీరు ఒక తప్పు చేసే దానికి 10 రెట్లు లేదా 20 రెట్లు అధికంగా భాదపడవలసి వస్తుంది అంటారు. అది నిజం కాదు. కానీ ఆత్మా తన గత జన్మ పరిశీలన చేసుకున్నాక ఎంత ఎక్కువగా బాధపడుతుందో అంత ఎక్కువగా శిక్షని విధించుకుంటుంది. ఒకోసారి 5 నెలలు ఒక వ్యక్తి తాను బాధపెట్టి వుంటే 2 సంవత్సరాలు తన రాబోయే జన్మలో బాధపడాలి అని కూడా నిర్ణయంతీసుకుంటుంది. అందువలనే, మీ భావోద్వేగాలని సరిచేసుకుంటూ ఉండాలి అని అంటూ వుంటారు ఎందుకంటే, అవే తర్వాత కూడా మోసుకునిపోబడతాయి కాబట్టి. ఒకసారి ఈ నమూనా పూర్తిగా తయారుచేసుకున్నాక ఒక ప్రశాంతతో కూడిన కాలం ఆత్మకి అప్పుడు ప్రారంభమవుతుంది.

*మరుజన్మ*

మన మరుజన్మ ఆత్మలలోకంలో తయారు చేసుకున్న నఖలు పై ఆధారపడి ఉంటుంది. జన్మకి మరుజన్మకి మధ్య 20 నుంచి 30 ఏళ్ళు పట్టవచ్చు లేదా ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. మన తల్లిదండ్రులను మనమే నిర్ణయించుకుంటాము ఒకోసారి తల్లిగర్భంలో పిండం  రూపుదిద్దుకుంటున్న సమయంలోనో లేక గర్భం దాల్చిన 4, 5 నెలకో, లేక పుట్టడానికి కొంత సమయం ముందో ఆత్మ ప్రవేశించడం జరుగుతుంది. ఈ సృష్టి ఎంత అద్భుతమైనదంటే పుట్టే తేదీ, సమయము మరియు స్థలమునకు తగినట్ట్లు గ్రహముల అమర్చబడినాయి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను దురదృష్ట జాతకుడను, నాకు అదృష్టం లేదని కానీ అసలు విషయం ఏమిటంటే, నీ జీవితం మొత్తం కూడా, నువ్వు ఆత్మలలోకంలో తయారుచేసుకున్న నఖలు లేదా బ్లూప్రింట్ మాత్రమే. ఒకసారి మరుజన్మ తీసుకున్నాక, 40 రోజులదాకా బిడ్డ తన గత జన్మకి సంబందించిన జ్ఞాపకాలు అన్నీ కలిగివుంటుంది. అందువలనే ఒకోసారి సంబంధం లేకుండా నవ్వడమూ లేక ఏడ్వడమూ జరుగుతూ ఉంటుంది. 40 రోజుల తర్వాత, గత జన్మకి సంబందించిన అన్ని జ్ఞాపకాలు ఆటోమెటీక్ గా తుడిచివేయబడి, అసలు నాకు గతజన్మ అంటూ ఒకటి ఉందా అన్నంతగా మారిపోతాము.

*నఖలు అమలుపరచబడుట*

ఇక అప్పటినుండి నఖలు లో లిఖించుకున్నది పూర్తిగా అమలులోకి రావడం ప్రారంభమవుతుంది. ఇక అప్పటి నుండి, మన సంఘటనలు తలచుకుని, ఇతరులను మరియు భగవంతుని దూషించడము ప్రారంభమవుతుంది. అందువలన మీరు ఇంకొకరిని వ్రేలెత్తి చూపే ముందర గుర్తుంచుకోండి, ఇతరులందరూ మీ నఖలు లో మీరు పూర్తిగా మీ స్వంత ఇష్టంతో లిఖించుకున్న ప్రకారమే మీకు సహాయం చేస్తున్నారని. మనము ఏదైతే ముందరే జరగాలని నిర్ణయించుకున్నామో అదే జరుగుతోంది. తలిదండ్రులు, బంధువులు, మిత్రులు, శత్రువులు, భాగస్వామీ అందరూ కూడా మన జీవితంలోకి ఎందుకువస్తున్నారంటే, వారు అలా రావాలని మీరే నిర్ణయించుకున్నారు కాబట్టి. 

మరణించిన తర్వాత ఆత్మలు భూమిపైనే తిరుగుతూ ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటిలో కొన్ని, చేయవలసిన పని మధ్యలో ఆగిపోవడం, అత్యంత దుఃఖం, గాయాల వలన మరణించడం, అనుకోని సమయంలో అంటే ఉన్నపలంగా మరణం సంభవించడము.   ఏది ఏమైనప్పటికి ఆత్మకి 12 రోజుల గడువు మాత్రమే ఉంది, ఈ గడువులోపే తను చేయాలనుకున్నవన్నీ చేయగలగాలి. 12 రోజుల తర్వాత కొంతకాలం ఆగి, ఆత్మల లోకాల ద్వారం కూడా మూసివేయబడుతుంది.

అలా జరిగితే, ఆత్మల పరిస్థితి మరీ దయానీయకమై పోతుంది. ఎందువలన అంటే, అవి ఆత్మలలోకానికీ వెళ్లలేవు, భూలోకంలో శరీరంతో వ్యవహరించడానికి మళ్ళీ జన్మ తీసుకోలేవు.   అందువలననే మన ప్రార్థనలు మరియు మరణించినవారికి జరుపబడే కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి. అలా చేయడం వలన, ఆత్మలు తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించి ఆత్మలలోకానికి వెళ్ళి చేరుతాయి. హిందూ సాంప్రదాయంలో ఆ 12 రోజులు దేవాలయానికి వెళ్ళడం నిషిద్దం అని వుంది.   *మనము మరణించిన వారికి కాపాడుటకు వారు తమ గమ్యాన్ని చేరుటకు మన వంతు సహాయం చేయడం కూడా ఎంతో  ప్రాధాన్యమైనదే.*

🙏🎟🎟🎟🎟🎟🙏🙏🎟🎟🎟🎟🎟🙏🙏🎟🎟🎟🎟🎟🙏🙏🎟🎟🎟🎟🎟🙏

*మనకి మరణం లేదు, మరణం అనేది అంతం కాదు, అది ఒక విడిది సమయం మాత్రమే మళ్ళీ, మనం కలుసుకోవడానికి.*🙏🏻ఓం నమః శివాయ 🙏🏻

🙏🎟🎟🎟🎟🎟🙏🎟🎟🎟🎟🎟🙏🎟🎟🎟🎟🎟🙏🙏🎟🎟🎟🎟🎟🙏

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

         

మరణం తర్వాత? ఏం జరుగుతుంది? Part -1 (22-Dec-22,Enlightenment Story)

మరణం తర్వాత? ఏం జరుగుతుంది? Part -1

(:::🔴:::)(:::🔴:::)(:::🔴:::)(:::🔴:::)(:::🔴:::)

*భూమితో అనుసంధానింపబడి ఉన్న  చక్రాలతో సంబంధం తెగిపోతుంది*

భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా, మొదట, మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలనే 

మీరు మరణానికి కొద్ది గంటలలో, చేరువలో ఉన్న వ్యక్తిని  యొక్క అరికాలు పాదాలు గమనించారంటే. అవి చల్లబడుతున్నాయి అని తెలుసుకుంటారు. 

*సూక్ష వెండి తీగ*

అసలు ఏం జరుగుతుందంటే, ఆత్మకి                                                                                                   అనుసంధానింపబడి ఉన్న వెండితీగ తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండితీగ తెగుతుందో, శరీరంలో ఉన్న ఆత్మకి స్వేచ్చ లభించి శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్లలేక, మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని, మరణించిన వెంటనే సూక్షమంగా పరిశీలిస్తే, ముఖంలోనో లేక శరీర ఇతర అవయవలాలలోనో సూక్షమైన కదలికలు గమనించగలగుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే, ఆత్మ తన శరీరాన్ని కదలించడానికి ప్రయత్నించడం వల్లనే. మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది అయినా కూడా, వెండి తీగ తెగిపోవడం వలన, శరీరంలో దూరగలిగినా అక్కడ ఉండలేక పోవడం వలన, ఆత్మ ఇక శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. ఏదో ఒక శక్తి వలన ఆత్మ, అలా శరీరం నుండి పైకి, ఇంకా పైకి ఆకర్షింపబడుతుంది.

*భౌతికశరీరానికి ముగింపు*

శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మా తన ప్రియమైన వాళ్లతో మాట్లాడుతుంది, నేను మరణించలేదు అని చెబుతుంది. కానీ, ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినబడవు. నెమ్మదిగా ఆత్మకి అర్థమవడం మొదలవుతుంది తాను  ఇక తన శరీరంలో జేరలేనని. శరీరానికి సుమారు 12 అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి, ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడము మరియు చూడడము జరుగుతుంది. సాధారణంగా అంత్యక్రియలు జరిగేంతవరకూ ఆత్మ అలా సుమారు 12 అడుగులు శరీరానికి పైన వుంటుంది. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇకపై ఎక్కడైనా అంత్యక్రియలు కార్యక్రమం జరుగుతోంది అంటే, అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి, అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ, వింటూ ఒక సాక్షిభూతంగా వుందని.

*భౌతికదేహంతో విడివడుట*

ఇక అంత్యక్రియలు కూడా జరిగాక, తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక, ఆత్మకి ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థీవ దేహం పంచభూతాలలో కలసిపోయిందని నిర్ణయించుకుంటుంది. అప్పటిదాకా తను దేహంలో ఉండడం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడివడిపోవడం వలన, ఇక ఆత్మకి పూర్తి స్వేచ్చ అనుభవంలోకి వస్తుంది. ఆత్మ తలచుకున్న మాత్రానా ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది. తర్వాతి 7 రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు, తనకిష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది. 7 రోజులు ముగిసాకా, తన కుటుంబానికి, ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకొని, భూమిని దాటి గగనంలోకి వెళ్ళిపోతుంది.

*ఆత్మప్రయాణం*

ఆత్మలలోకానికి వెళ్ళ్దడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయవలసివుంటుంది. అందువలన తర్వాతి 12 రోజులు అత్యంత ముఖ్యమైనవి. ఈ 12 రోజులలో మనం జరుపవలసిన కార్యక్రమాలు చక్కగ నెరవేర్చవలసి వుంటుంది. మరియు మనం చేసిన తప్పులను క్షమించమని ఆత్మని అడగడము మరియు ప్రార్ధించడము జరుపవలెను. అంత్యక్రియల తరువాత జరుపబడే కార్యక్రమాలు, ప్రార్థనలు, ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి. ఆత్మలలోకానికి అడుగుపెడుతున్నాను అన్న సూచనగా, మార్గం యొక్క ముగింపులో ఆత్మకి ఒక అతి పెద్ద వెలుగు కనపడుతుంది.

*పూర్వీకులను కలసుకొనుట*

హిందువులు 11వ మరియు 12వ రోజున జరుపబడే ఇతర కార్యక్రమాలవలన, ఆత్మ తన పూర్వీకులను, ఆప్త మిత్రులను, బంధువులను మరియు తనకు మార్గనిర్దేశనం చేసిన వారిని కలసుకోవడం జరుగుతుంది మనం భౌతికంగా ఎలాగైతే, మన దూరపుబంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా కౌగిలించుకుంటామో, అదేవిధంగా ఆత్మలలోకంలో కూడా 12వ రోజున మరణించిన పూర్వీకులు ఆ ఆత్మని అహ్వానించి మనస్పూర్తిగా కౌగిలించుకుంటారు. ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గనిర్దేశకులు, ఆత్మని తను భూలోకంలో, భాద్యతవహించిన సంఘటనలను సమీక్షించుకోవడానికి, ఒక పెద్ద వెలుగువంటి బోర్డ్ ఉన్న ప్రదేశానికి తీసుకునివెళ్తారు. దీనినే కార్మిక్ బోర్డ్ అంటారు. ఈ బోర్డ్ లో గత జన్మలో జరిగినదంతా చూపించబడుతుంది.

🙏🎟🎟🎟🎟🎟🙏🙏🎟🎟🎟🎟🎟🙏🎟🎟🎟🎟🎟🙏🎟🎟🎟🎟🎟🙏🎟🎟🎟🎟🎟

*మనకి మరణం లేదు, మరణం అనేది అంతం కాదు, అది ఒక విడిది సమయం మాత్రమే మళ్ళీ, మనం కలుసుకోవడానికి.*🙏ఓం నమః శివాయ 🙏🏻

🙏🎟🎟🎟🎟🎟🙏🎟🎟🎟🎟🎟🙏🎟🎟🎟🎟🎟🙏🎟🎟🎟🎟🎟🙏🎟🎟🎟🎟🎟


🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂                

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః (21-Dec-22,Enlightenment Story)

 గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

*గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః*

ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది. మొదట ఎవరు పలికారు. ఎందుకు పలికారు.. దాని వెనుక ఉన్న కథ.

పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాన్ని విద్యాధరుడు అనే గురువు గారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. ఒకసారి గురువు గారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు. గురువు గారు తిరిగి వచ్చేవరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు.

గురువు గారు తిరిగివచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడి చదువు పూర్తయింది. కౌత్సుణ్ణి తీసుకెళ్లాడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌత్సుడు తాను గురువు గారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని ఖరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు.

వాళ్ళు వెళ్లిన తరువాత గురువు కారణం అడిగాడు.అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు గురువు గారూ మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినపుడు మీ జాతకం చూసాను.మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్లలేను అని చెప్పాడు.

కొన్ని రోజులకు గురువు గారికి క్షయ రోగం వచ్చింది.ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్లి దాన ధర్మాలు, పుణ్య కార్యాలు చేయాలని గురుశిష్యులు కాశీకి వెళ్లారు. గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్ళను అసహ్యించుకున్నారు. కానీ కౌత్సుడు గురువు గారికి సేవలు చేస్తూనే ఉన్నాడు. ఎంతోమంది గురువు గారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువు గారిని వదలలేదు.

కౌత్సుడి గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్లి గురువుని వదిలేయమని సలహా ఇచ్చాడు. కౌత్సుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. మరలా విష్ణువు మారు వేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు. మెచ్చిన పరమేశ్వరుడు ఏదయినా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరూ గురువును వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నాడు.

అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌత్సుడికి మోక్షం ఇస్తాం అన్నారు. అప్పుడు కౌత్సుడు వారితో నాకు మీ గురించి చెప్పి ఈ రోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు. మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు.

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః  గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః

తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌత్సుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు

ఇదీ ఈ శ్లోకం వెనుక ఉన్న కథ...

కొన్ని ముఖ్య శ్లోకాల విలువలు, అర్ధాలు అందరము తెలుసుకోవాలి, మనము అందరం మన తరువాత వాళ్ళకి కూడా తెలియజేయాలి.

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

Monday 19 December 2022

పటిక బెల్లం లో మూడవవంతు (20-Dec-22,Enlightenment Story)

పటిక బెల్లం లో మూడవవంతు (20-Dec-22,Enlightenment Story)

🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏

*అరుణాచల ఆలయంలో యదార్థo*

ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది.ఆ పిల్ల లిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు. అందులో ఒకడు " ఒరేయ్ ఎవరన్నా చూస్తున్నారేమో - చూడరా అన్నాడు ఇంకొకడితో.

రెండవవాడు చుట్టూ చూసి.... అరుణాచలుడు ఇంతేసి గుడ్లు ఏసుకొని చూస్తున్నాడురా అన్నాడు.

ఇద్దరు అరుణాచలుని కి ఎదురుగా నిలబడి మా దొంగ తనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లం లో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం, ఇది మన ఓడంబడిక ( అగ్రిమెంట్ ) అన్నారు.

ఇలా ప్రతీ రోజు పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు, ఆశ్చర్యం గా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం  మాయమవుతోంది.ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారి కి అప్పగించాడు, వీళ్లిద్దరు ఎనిమిదేళ్ల  పసి కాయలు, వీళ్ళను ఎలా శిక్షించాలి అని, అరేయ్ పిల్లలు మీరు ఇద్దరు అంతరాలయం లో 108 ప్రదక్షిణలు చేయండి అని, ఇదేమీ శిక్ష అన్నాడు.పిల్లలు ఇద్దరు ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించారు, ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చొని పిల్లల ప్రదక్షిణాలు చూస్తున్నారు వినోదంగా. ఇంతలో పూజారి , అధికారి ఒక్కసారిగా తృల్లి పడ్డారు, పరిశీలించి పిల్లల్ని మళ్ళొకసారి  చూసారు, ఆ ఇద్దరి పిల్లతో పాటు, మూడవ పిల్లవాడు ప్రదక్షిణ చేయడం చూసారు, మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు మళ్ళీ మాయమవుతున్నాడు మాటిమాటికీ. ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని  గట్టిగా వాటేసుకున్నాడు.

అద్భుతం!!

మూడవ పిల్లవాడు కాంతిరేఖ గా మారి, గార్బాలయం లోకి వెళ్లి మాయమై పోయాడు.అరుణాచళేశ్వరుడు దొంగ పటిక బెల్లం మూడవ వంతు తిన్నాడు కదా, అందుకని పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణ చేస్తున్నాడన్నమాట. ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ "  అసలేం జరిగింది " అని అడిగాడు. పిల్లలు అరుణాచళేశ్వరుని వాటా గురుంచి చెప్పారు. అది విని వారు ఆశ్చర్యం, ఆనందం లో మునిగిపోయారు.

సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు కూడా వారితో వాటా పంచు కున్నందుకు శిక్ష అనుభవించాడన్నా మాట. ఆలయం లో సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు ఉన్నాడు అంటానికి ఇంతకన్నా సాక్ష్యం ఎం కావాలి ??.

నిష్కల్మష  ప్రేమకు, నిర్మల  భక్తి కి అరుణాచళేశ్వరుడు ఎపుడూ బందియే !! అరుణా చలుడు  కాంతి రూపం లో ఉంటాడని, అది అగ్ని లింగం అని శాస్త్రవచనం. ఆ పరిసర ప్రాంతాలలో  మరియు కొడపైన అరుణాచలుడు కాంతి రూపం లో, కాంతి స్తంభం ( beam of light ) రూపం లో భక్తులని అనుగ్రహించిన సంఘటనలు అనేకం . 

అరుణాచలం శివయ్య 🚩🕉️🔱🙏🙏🙏

🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏

Friday 16 December 2022

☝🏻నాభి విజ్ఞానం👨🏻‍⚕️ (19-Dec-22,Enlightenment Story)

☝🏻నాభి విజ్ఞానం👨🏻‍⚕️

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

మన బొడ్డు బటన్ (NABHI) అనేది మన సృష్టికర్త మనకు అందించిన అద్భుతమైన బహుమతి.  62 ఏళ్ల వ్యక్తికి ఎడమ కంటికి చూపు సరిగా లేదు.  అతను రాత్రిపూట ప్రత్యేకంగా చూడలేడు మరియు అతని కళ్ళు మంచి స్థితిలో ఉన్నాయని కంటి నిపుణులు చెప్పారు, కానీ ఒకే సమస్య ఏమిటంటే అతని కళ్ళకు రక్తాన్ని సరఫరా చేసే సిరలు ఎండిపోయాయి మరియు అతను మళ్లీ చూడలేడు. 

 సైన్స్ ప్రకారం, గర్భం దాల్చిన తర్వాత సృష్టించబడిన మొదటి భాగం బొడ్డు బటన్.  ఇది సృష్టించబడిన తర్వాత, అది బొడ్డు తీగ ద్వారా తల్లి మావికి కలుస్తుంది.

మా బొడ్డు బటన్ ఖచ్చితంగా అద్భుతమైన విషయం!  సైన్స్ ప్రకారం, ఒక వ్యక్తి మరణించిన తర్వాత, బొడ్డు బటన్ ఇప్పటికీ 3 గంటల పాటు వెచ్చగా ఉంటుంది, దీనికి కారణం ఒక స్త్రీ బిడ్డను గర్భం దాల్చినప్పుడు, ఆమె బొడ్డు బటన్ పిల్లల బొడ్డు బటన్ ద్వారా బిడ్డకు పోషణను అందిస్తుంది.  మరియు పూర్తిగా ఎదిగిన బిడ్డ 270 రోజులు = 9 నెలల్లో ఏర్పడుతుంది.

మన సిరలన్నీ మన బొడ్డు బటన్‌తో అనుసంధానించబడి ఉండటం వల్ల ఇది మన శరీరానికి కేంద్ర బిందువుగా మారుతుంది.  బొడ్డు బటన్ అంటే ప్రాణం!

 "PECHOTI" బొడ్డు బటన్ వెనుక ఉంది, దానిపై 72,000 ప్లస్ సిరలు ఉన్నాయి.  మన శరీరంలో ఉన్న రక్త నాళాల మొత్తం భూమి చుట్టుకొలతకు రెండు రెట్లు సమానం.

బొడ్డు బటన్‌కు నూనెను పూయడం వల్ల కళ్లు పొడిబారడం, కంటి చూపు సరిగా లేకపోవడం, ప్యాంక్రియాస్ పై లేదా కింద పని చేయడం, మడమలు మరియు పెదవులు పగిలిపోవడం, ముఖం మెరిసిపోవడం, మెరిసే జుట్టు, మోకాళ్ల నొప్పులు, వణుకు, నీరసం, కీళ్ల నొప్పులు, పొడి చర్మం వంటి వాటిని నయం చేస్తుంది.

*కళ్లు పొడిబారడం, కంటి చూపు మందగించడం, గోళ్లలో ఫంగస్, మెరిసే చర్మం, మెరిసే వెంట్రుకలకు నివారణ* -      రాత్రి పడుకునే ముందు, మీ బొడ్డు బటన్‌లో 3 చుక్కల స్వచ్ఛమైన నెయ్యి లేదా కొబ్బరి నూనెను వేసి, మీ బొడ్డు చుట్టూ 1 మరియు అర అంగుళం విస్తరించండి.

*మోకాళ్ల నొప్పులకు* - రాత్రి పడుకునే ముందు, మీ బొడ్డు బటన్‌లో 3 చుక్కల ఆముదం వేసి, మీ బొడ్డు చుట్టూ 1 మరియు అర అంగుళం విస్తరించండి. 

*వణుకు మరియు నీరసం కోసం, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం, పొడి చర్మం*- రాత్రి పడుకునే ముందు, మీ బొడ్డు బటన్‌లో 3 చుక్కల ఆవాల నూనె వేసి, మీ బొడ్డు చుట్టూ 1 మరియు అర అంగుళం విస్తరించండి.

 మీ బొడ్డు బటన్‌లో నూనె ఎందుకు వేయాలి?

మీ బొడ్డు బటన్ ఏ సిరలు ఎండిపోయాయో గుర్తించి, దానికి ఈ నూనెను పంపుతుంది కాబట్టి వాటిని తెరవండి. శిశువుకు కడుపునొప్పి వచ్చినప్పుడు, మేము సాధారణంగా ఇంగువ (హింగ్) మరియు నీరు లేదా నూనెను కలిపి, నావల్ చుట్టూ అప్లై చేస్తాము.  నిమిషాల్లో నొప్పి నయమవుతుంది.  చమురు అదే విధంగా పనిచేస్తుంది.

ప్రయత్నించు.  ప్రయత్నించడం వల్ల నష్టమేమీ లేదు. మీరు మీ మంచం పక్కన అవసరమైన నూనెతో ఒక చిన్న డ్రాపర్ బాటిల్‌ను ఉంచవచ్చు మరియు నిద్రపోయే ముందు నాభిపై కొన్ని చుక్కలు వేసి మసాజ్ చేయవచ్చు.  ఇది ప్రమాదవశాత్తు స్పిల్‌ను పోయడం మరియు నివారించడం సౌకర్యంగా ఉంటుంది.



గౌరవంతో

డా. అజయ్ దూబే
సహాయ ఆచార్యులు
MDNIY ఆయుష్ మంత్రిత్వ శాఖ

 🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂

🪷 ఇంద్రియ నిగ్రహం 🪷 (18-Dec-22,Enlightenment Story)

🪷నిగ్రహం 🪷

తాబేలు తనను తాను రక్షించుకోడానికి దాని మీద ఒక ధృఢమైన కవచం లాంటి డిప్ప ఒకటి సహజంగా అమర్చబడి ఉంటుది. తాబేలు తనకు బయట నుండి ఏదైనా ఆపద సంభవిస్తుంది అని అనిపించిపుడు. 

తన తలను, మిగిలిన అంగములను ఆ డిప్పలోకి లాక్కుంటుంది. అప్పుడు దానికి రక్షణ కలుగుతుంది.  అలాగే స్థిత ప్రజ్ఞుడు బయట ప్రపంచంలో ఉన్న విషయవాంఛల నుండి తనను తాను రక్షించుకోడానికి తన ఇంద్రియములను వెనక్కు లాక్కుంటాడు. ఇది అర్థం కావాలంటే మనము ఆచరించ వలసిన సాధనల గురించి ముందు తెలుసుకోవాలి!

ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియములను అదుపులో ఉంచుకోవడం.

నిగ్రహము అంటే ఇంద్రియములను అణగతొక్కడం అని అర్థం తీసుకోకూడదు.

విపరీతంగా ఇంద్రియములతో స్పందించకూడదు. దేహమును అంటే ఇంద్రియములను నియంత్రించాలి.

సాధకుడికి ఇదిముఖ్యం. దీనినే ‘దమము’ అని అంటారు.

ఎందుకంటే ప్రాపంచిక విషయములకు ఇంద్రియములు విపరీతంగా స్పందిస్తుంటే నిరంతరం వాటి ప్రభావానికి లోనవుతాడు కానీ అతడికి ఉన్నతస్థితి లభించే అవకాశమే లేదు.

ఇంద్రియములనే ఎందుకు నియంత్రించాలి ముందు మనసును నియంత్రించవచ్చు కదా. అంటే ముందు బయటకు కనపడే ఇంద్రియములను నియంత్రించ గలిగితే మనసును నియంత్రించడం సులభం అవుతుంది. అందుకే ముందు ఇంద్రియ నిగ్రహముతో మొదలు పెట్టాలి.🪷

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂

కాళిదాసుకు పరీక్ష (17-Dec-22,Enlightenment Story)

🎻🌹🙏 కాళిదాసుకు పరీక్ష...!!

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

🌿మహాకవి కాళిదాసు ఒకసారితీర్ధయాత్రలు  చేస్తూ వున్నాడు.  మార్గంలో ఒక దగ్గర ఆయనకి దాహంవేసింది.       🌸కాళిదాసు కి కొంచెం కొంచెం దూరంలో ఒక నూతి వద్ద ఒక స్త్రీ నీరు తోడుతూవుండడం కనిపించింది.                   🌿నూతి వద్దకు వెళ్ళి  ఆ మహిళను మంచినీరు అడిగాడు. ఆ మహిళ  కాళిదాసు తో ఇస్తాను..ముందు మీరెవరో  పరిచయం తెలుపండి అని అడిగింది. 

🌸తనెవరో తెలుసుకునేంత గొప్ప స్త్రీ కాదని తలచిన  కాళిదాసుతను ఒక ప్రయాణీకుడునని చెప్పాడు.                  🌿వెంటనే ఆ స్త్రీ ఈ లోకంలో ఇద్దరే ప్రయాణీకులు వున్నారు. వారు సూర్య చంద్రులు నిత్యం ఉదయించడం , అస్తమించడంసదా ఈ పయనంలోనే నిమగ్నమైవుంటారు అన్నది ఆమె.

🌸సరే , నేను ఒక అతిధినిఅన్నాడు కాళిదాసు. ఆమె యీ లోకంలోఇద్దరే అతిధులు వున్నారు.యవ్వనం, సంపద ఈ రెండూ తాత్కాలికమే అందువలన వాటినే అతిధులనవచ్చునుఅన్నది ఆమె.

🌿కాళిదాసు కి ఆశ్చర్యం కలిగినది అయితే, నన్ను  సహనశీలిగా భావించు అన్నాడుకాళిదాసు. దానికి  ఆమె ఒప్పుకోలేదు. 

🌸 లోకంలో ఇద్దరే సహనశీలురు వున్నారు. భూమి, వృక్షము మాత్రమే.భూమిని ఎంత త్రొక్కినా , పండ్ల కోసం చెట్టు మీదకి ఎన్ని రాళ్ళు విసిరినా , ఎంతో సహనంతో  ఓర్పుతో భరిస్తూవున్నాయి అన్నది ఆమె.

🌿కాళిదాసుకి ఓర్పు నశించినది.సరే, నేను మొండి వాడినిఅని అన్నాడు. ఆ స్త్రీ చిరునవ్వుతో, లోకంలో పట్టు వదలని మొండివి రెండే రెండు.*మన గోళ్ళు, శిరోజాలు* మనం కత్తిరిస్తూ వుంటే ఎదుగుతూనే వుంటాయి.

🌸కాళిదాసుకి కోపం మిన్నంటింది.నన్ను ఒక మూర్ఖుడని అనుకో,అన్నాడు. అప్పుడు కూడా ఆమె చలించలేదు.యీ లోకంలో తెలివితేటలు లేకుండా రాజ్యాన్ని పాలించే రాజు, ఆ రాజునిపొగిడే మంత్రి, వీరిద్దరే రెండువిధాలైన  మూర్ఖులవుతారు.అన్నది ఆమె. 

🌿కాళిదాసుకు జ్ఞానోదయమయింది. ఆమె సామాన్య స్త్రీ కాదని గ్రహించాడు. తన వాదం ఓడి పోయినదని ఒప్పుకున్నాడు. ఆమెకి పాదాభివందనం చేశాడు.

🌸అప్పుడే, కాళిదాసును సంభ్రమాశ్చర్యాలలో ముంచివేసే దృశ్యం సాక్షాత్కరించింది. విద్యాధిదేవత అయిన సరస్వతీదేవి ఆయన ముందు ప్రత్యక్ష మైనది. 

🌿*కాళిదాసా  ! నీవు మేధావివే.. కాని,నిన్ను నీవు  తెలుసుకొన్న నాడే నీవు పరిపూర్ణుడవు. ఎవరైతే తనని తాను గుర్తించుకోలేరో వారు ఉన్నత పురుషులు కాజాలరు*అని ఉపదేశించి కాళిదాసుని ఆశీర్వదించింది...స్వస్తీ..🚩🌞🌹🙏🎻

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂


Thursday 15 December 2022

పంచభూతాలు, భూదేవంత సహనం! (16-Dec-22,Enlightenment Story)

పంచభూతాలు, భూదేవంత సహనం!

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

👉బ్రహ్మ దేవుడు పంచభూతాలను పిలిచి ఒక్కో వరం కోరుకోమన్నాడు.

👉వరం కోసం తొందర పడిన ఆకాశంఅందరికంటే పైన ఉండాలని కోరింది. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిపాడు బ్రహ్మ.

👉ఆకాశం మీద కూర్చునే వరాన్ని సూర్యుడు కోరడంతో నేటికీ ఆకాశం మీద విహరిస్తున్నాడు.

👉వారిద్దరి మీద ఆధిపత్యం చేసే వరమడిగిన జలం మేఘాల రూపంలో మారి ఆకాశం మీద పెత్తనం చలాయిస్తూనే కొన్నిసార్లు సూర్యుడుని కప్పేస్తుంది.

👉పై ముగ్గురినీ జయించే శక్తిని వాయువుకోరడంతో  పెనుగాలులు వీచినప్పుడు రేగే దుమ్ము ధూళికి మేఘాలు పటాపంచలవడం, సూర్యుడు, ఆకాశం కనుమరుగవడం జరుగుతాయి.

👉చివరివరకు సహనంగా వేచి చూసింది భూదేవి     పై నలుగురూ నాకు సేవ చేయాలని కోరడంతో బ్రహ్మ అనుగ్రహించాడు.

👉అప్పటినుండి  ఆకాశం  భూదేవికి గొడుగు పడుతోంది.

👉వేడి, వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు.

👉వర్షం కురిపించి చల్లబరుస్తోంది జలం.

👉సమస్త జీవకోటికీ ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు.

👉సహనంతో మెలిగి వరం కోరిన  భూదేవికి మిగతా భూతాలు సేవకులయ్యాయి.

👉సహనవంతులు అద్భుత ఫలితాలు పొందగలరని నిరూపించడానికి ఈ కథ చాలు.

👉సహనానికి ప్రతిరూపం స్త్రీ. అందుకే భూదేవిని ఓర్పు, సహనాలకు ప్రతిరూపంగా చెప్పారు పెద్దలు.

👉సహనం అంటే నిగ్రహం పాటించడం. కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్వేగాన్ని దాటవేయడం లేదా వాయిదా వేయడం. బాధను అధిగమించడమే సహనం.

👉సహనంగా ఆలోచించే వారికి సమస్యలు దూరమవుతాయి.

👉కొన్ని సార్లు ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే చావు వైపు నడిచే బదులు సహనంగా ఆలోచిస్తే పరిష్కారం కనిపిస్తుంది.

👉సరైన ఆలోచన కలగనప్పుడు అనుభవజ్ఞుల్ని ఆశ్రయిస్తే పరిష్కారం దొరుకుతుంది..!

పంచభూతాలు

భూమి మనకు నేర్పేది ఓర్పూ, ప్రేమా.గాలి నేర్పేది కదలిక. అగ్ని నేర్పేది సాహసం, వెలుగు. ఆకాశం నేర్పేది సమానత నీరు నేర్పేది స్వచ్ఛత. కనుక మనకు ప్రతి అడుగులోనూ తోడుండేవి పంచభూతాలనేది గుర్తుంచుకోవాలి..

సర్వే జనా సుజనో భవంతు

సర్వే సుజనా సుఖినో భవంతు

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

Wednesday 14 December 2022

జన్మచేత కాదు వర్ణం, కర్మ చేతనే (15-Dec-22,Enlightenment Story)

 జన్మచేత కాదు వర్ణం, కర్మ చేతనే  (15-Dec-22,Enlightenment Story)

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂 🍃🍂

జన్మచేత కాదు వర్ణం, కర్మ చేతనే...బ్రాహ్మణులుగా  పూజించబడి .. ఈరోజుకీ పూజింపబడుతూ .. యజ్ఞయాగాలలో నేటికీ హవిర్భాగములు కూడా అందుకుంటున్న  బ్రాహ్మణేతరులు .. 

(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 

1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.

2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.

3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..

4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.

5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 

6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.

7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. 

వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 

8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.

9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.

ఇంకా ..

1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.

2.  ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)

3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.

ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు

1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.

2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..

3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 

4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.

5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.

6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)

7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది  ( విష్ణుపురాణం 4.1.13). 

8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).

9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).

10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.

వీరిలో చాలామంది .. వేదమంత్రాలు కూడ రచించారు. హిందూ ధర్మం జ్ఞానంమీద ఆధారపడి నది కానీ, జన్మం మీద కాదు.

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

Tuesday 13 December 2022

శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు (14-Dec-22,Enlightenment Story)

 14-Dec-22,Enlightenment Story

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు,

ఆయన శరీరం పంచభూతాలలో కలిసిపోయింది, కానీ ఆయన గుండె సాధారణంగా జీవించి ఉన్న మనిషిలా కొట్టుకుంటుంది మరియు ఆయన ఇంకా ఈ లోకంలో సాధారణం గానే జీవించి ఉన్నాడు అనిపించేలా కొట్టుకుంటుంది.ఆయన గుండె ఈ రోజు వరకు కూడా సురక్షితంగా ఉంది, ఇది చాలా తక్కువ మందికి తెలుసు.

కొయ్య_విగ్రహంలోపల జగన్నాథుడి అంశగా నివసిస్తాడు. మహాప్రభు యొక్క గొప్ప రహస్యం ఇక్కడ స్వామి వారి స్థానంబంగారుచీపురుతో శుభ్రపరచడం జరుగుతుంది. మహాప్రభు_జగన్నాథ్ (శ్రీ కృష్ణుడు)ని కలియుగ దేవుడు అని అంటారు.

మహాప్రభు విగ్రహాన్ని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు,ఆ సమయంలో పూరీ నగరం మొత్తం చీకటిగా మారుతుంది అంటే నగరం మొత్తం లైట్లు ఆపివేయబడతాయి, లైట్లు ఆపివేయబడిన తర్వాత, crpf సైన్యం పహారా లోకి వెళ్లిపోయితుంది ఆ ప్రాంగణం. నలువైపుల నుంచి ఆలయ ప్రాంగణంలోకి ఆ సమయంలో ఎవరూ గుడికి వెళ్లలేరు.

గుడిలోపల దట్టమైన చీకటి... పూజారి కళ్లకు కట్టు.బ్రహ్మపదార్ధం ఏమిటో నేటికీ ఎవరికీ తెలియదు... ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు. వేల సంవత్సరాలుగా అది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతోంది,

ఇది అతీంద్రియ పదార్ధం, దీన్ని తాకడం ద్వారా, వ్యక్తి యొక్క శరీరం అద్వితీయం గా శక్తిమంతంగా తయారు అవుతుంది.ఈ అవకాశం 19 సంవత్సరాల తర్వాత వచ్చింది, కొన్నిసార్లు ఇది 14 సంవత్సరాలలో జరిగినప్పటికీ, ఈ సందర్భాన్ని నవ్_కల్వర్ అని పిలుస్తారు,

కానీ మహాప్రభు జగన్నాథుని విగ్రహంలో ఏముందో ఇప్పటి వరకు ఏ పూజారి చెప్పలేకపోయారు??? మేము అతని చేతిని చేతిలోకి తీసుకున్నప్పుడు, అతను కుందేలులా గెంతుతున్నాడని.. అక్కడ కళ్లకు గంతలు ఉన్నాయని.. చేతిలో గ్లౌజులు ఉన్నాయని, మాకు మాత్రమే అనిపించిందని కొందరు పూజారులు అంటున్నారు.

ఈరోజు కూడా జగన్నాథ యాత్ర సందర్భంగా పూరీ రాజు స్వయంగా బంగారు చీపురుతో ఊడ్చేందుకు వస్తాడు. జగన్నాథుని ఆలయంలోని సింహద్వారం నుంచి లోపలికి తొలి అడుగు వేయగానే లోపల సముద్రపు అలల శబ్దం వినిపించదు, అయితే ఆశ్చర్యం ఏంటంటే.. గుడి నుంచి ఒక్క అడుగు బయటకు వేయగానే సముద్రపు శబ్ధం మళ్లీ వినబడుతుంది,

మీరు చాలా దేవాలయాల శిఖరాగ్రంపై పక్షులు  ఎగురుతూ ఉండడం చూసి వుంటారు కానీ జగన్నాథ దేవాలయం మీదుగా ఏ పక్షి వెళ్లదు, జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది,జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన శిఖరం రోజులో ఏ సమయంలోనైనా నీడ ఉండదు.

జగన్నాథుని ఆలయంలోని 45 అంతస్తుల శిఖరంపై ఉన్న ధ్వజాన్ని ప్రతిరోజూ మారుస్తుంటారు, జెండాను ఒక్కరోజు కూడా మార్చకపోయినట్లైతే, 18 సంవత్సరాల పాటు ఆలయం మూసివేయబడుతుందని నమ్ముతారు

అదేవిధంగా, జగన్నాథ దేవాలయం పైభాగంలో సుదర్శన చక్రం కూడా ఉంది, ఇది ప్రతి దిశ నుండి చూసినప్పుడు, మీ వైపుకు ఉంటుంది. జగన్నాథ దేవాలయంలోని వంటగదిలో, ప్రసాదాన్ని వండడానికి 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచుతారు, దీనిని కట్టెల ద్వారా వండుతారు, ఈ సమయంలో పైన ఉన్న కుండలోని వంటకం మొదట వండుతారు.

జగన్నాథుని ఆలయంలో ప్రతిరోజూ చేసే ప్రసాదం భక్తులకు తగ్గదు, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆలయ తలుపులు మూసిన వెంటనే, ప్రసాదం కూడా ముగుస్తుంది మరియు సనాతన ధర్మానికి చెందిన అనేక అద్భుతమైన విషయాలు ఉన్నాయి.

 🙏💎🙏 సనాతన ధర్మానికి నమస్కారం🙏💎🙏

🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

Monday 12 December 2022

దేవుడు ఏరూపంలో వుంటాడంటే (13-Dec-22,Enlightenment Story)

 దేవుడు ఏరూపంలో వుంటాడంటే (13-Dec-22,Enlightenment Story)

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

అది ఒక చిన్న హోటల్! చేతిలో గిన్నె పట్టుకుని ఒక పదేళ్ళ బాబు హోటల్ యజమానితో అన్నా, అమ్మ పది ఇడ్లీలు తీసుకు రమ్మంది. డబ్బులు రేపు ఇస్తానుఅని చెప్పాడు.ఆ హోటల్ యజమాని “ఇప్పటికే చాలా బాకీ ఉన్నది అని అమ్మతో చెప్పు. గిన్నె ఇలా ఇవ్వు బాబూ సాంబార్ పోసిస్తాను.” అని చెప్పాడు.

ఇడ్లీలు  పొట్లం కట్టి, గిన్నెలో సాంబార్ పోసి ఆబిడ్డ చేతిలో పెట్టాడు.“సరే వెళ్ళొస్తాను, అమ్మకు చెప్తాను!”అని చెప్పి బయల్దేరాడు. అదే హోటల్ లో అన్నీ గమనిస్తున్న ఓవ్యక్తి యజమాని దగ్గరకు వెళ్లి అడిగాడు..”ఇప్పటికే చాల బాకీ పడ్డారు అంటున్నారు. మళ్ళీ ఎందుకండీ ఇచ్చి పంపారు?” అని.

ఆయజమాని… “ఆహారమే కదండీ నేను ఇస్తున్నది. పెట్టుబడి పెట్టి నేను నడుపుతున్నది. కానీ ఇటువంటి చిన్న పిల్లలు వచ్చి అడిగినప్పుడు లేదని చెప్పడానికి మనసు రావట్లేదు!  ఈరోజు కాకపోయినా రేపైనా నా డబ్బులు నాకు ఇచ్చేస్తాయండి. కాకపోతే కాస్త లేటుగా ఇస్తారు అంతే! అందరికీ డబ్బులు అంత సులభంగా దొరకవు. బిడ్డ ఆకలితో అడిగుంటుంది అందుకే పంపారేమో!”

”నేను ఇస్తాను అనే నమ్మకంతో పంపారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేను. నాది కష్టపడి సంపాదిస్తున్న డబ్బు అండి, ఎలాగైనా నాకు వస్తుందండి, మోసం చేయరు. కానీ ఇప్పటికి వారి ఆకలి తీరుతుంది కదండీ అది ముఖ్యం!”

”నేను ఇప్పుడు ఇవ్వను అంటే ఆ బిడ్డ ఆతల్లికోసం దొంగతనం చేయొచ్చు, లేదా ఆ తల్లి ఆ బిడ్డను బిక్షమెత్తడానికి పంపవచ్చు! లేదా ఆ తల్లి బిడ్డ ఆకలి తీర్చడానికి తప్పుడు మార్గం ఎంచుకోవచ్చు! ఇప్పటికి నేను నష్టపోవచ్చు కానీ సమాజంలో జరిగే మూడు తప్పుడు ప్రయత్నాలను నేను ఆపగలిగాను అంతే!” అన్నాడు.

ఇంత ఆలోచించిన ఆ మహనీయుడికి మనసులోనే దణ్ణం పెట్టుకున్నాడు ఆ వ్యక్తి.దేవుడు లేడని ఎవరండీ చెప్పేది?ఇలాంటి వారి మనస్సులో ఉన్నాడండి. వాళ్ళు ఇచ్చేస్తారన్న నమ్మకంలో ఉన్నాడండి. ఒక మనిషి మనల్ని వెతుక్కుంటూ వచ్చారంటే మనం కచ్చితంగా ఇస్తాము అనే నమ్మకంతోటే వస్తారు. మనకు మించిన సహాయం చేయమని చెప్పడంలేదు… మనకు ఉన్నదాంట్లో చిన్న సాయం అయినా చాలు అంటున్నాను.✍️

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Sunday 11 December 2022

పరీక్షలు (12-Dec-22,Enlightenment Story)

 12-Dec-22,Enlightenment Story

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

పరీక్షలు

ఒక శిల్పిఒక రాయిని ఎన్నుకునే క్రమంలోనే ఆ రాయిని ఎన్నో దెబ్బలు కొడతాడుపరీక్షించడానికి  కేవలం పరీక్షించడానికే.రాయి శిల్పంగా మారడానికి ఎన్ని దెబ్బలు తగలాలిఒక రాయి కే  ఇన్ని పరీక్షలు దెబ్బలు అయితే

ఒక గురువు శిష్యున్ని ఎన్నుకోవడానికి ఎన్నో పరీక్షలు పెడతాడు. గురువు పెట్టే పరీక్షల్లో నెగ్గితేనే శిష్యుడికి జ్ఞానోపదేశం చేస్తాడు.గురువు శిష్యుడికి పరీక్షలు ఎందుకు పెడతాడు అంటే జ్ఞానం అందించిన తర్వాత శిష్యుడు పొరపాటు చేయకూడదు. తప్పుడు మార్గంలో పోకూడదు అనే ఉద్దేశంతోనే తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండడానికి గురువు అన్ని పరీక్షలు పెడతాడు తప్ప గురువుకు శిష్యుడి మీద ఎలాంటి కోపం ద్వేషం ఉండదు.

ఒక జీవి ఎన్ని సంవత్సరాలు జీవించిన, ఒక జీవి ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా, జీవికి ఎన్ని యుగాలు గడిచినా జీవి ఏ లోకంలో ఉన్న ఇంద్రియ సుఖదుఃఖాలు అనుభవించాలి పుట్టడం,చావడం,ఆకలి,దప్పిక,నిద్ర,భయం, మైధునము,రాగద్వేషాలు,కర్మలు,ఫలాలు,అనుభవాలు,జ్ఞాపకాలు,బ్రమ  భ్రాంతిఇంతకుమించి ఏమీ లేదు.బాహ్య మాయా ప్రపంచం లో ఇంకేమైనా ఉన్నది అనుకుంటే అది కేవలం అజ్ఞానం మాత్రమే మాయ ప్రపంచం కలలో ప్రపంచం లాంటిదే. ఈ ప్రపంచం పై మాయా మొహాలు వదిలేసి

.నేను దేహం కాదు ఆత్మని అనే ఎరుక తెచ్చుకొని దేహాన్ని వదిలేసి పరమాత్మలో లీనం కావడమే మనిషి చివరి గమ్యస్థానం దానికి మార్గాలు. భక్తి, జ్ఞాన,వైరాగ్యము,త్యాగము,తత్వం అనే మార్గాల ద్వారా యోగ మార్గాన్ని అనుసరించి తన దేహంలో ఉన్న ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తే సమస్తం ఉన్నది ఒకటే పరబ్రహ్మము అని అర్థంఅవుతుంది. ఇదే అఖండమైన బ్రహ్మ స్థితి ఇంతకుమించి చెప్పేది అంటూ ఏమీ లేదు వినేది అంటూ ఏమీ లేదు తెలుసుకోవాల్సింది అంటూ ఏమీ లేదు.

సర్వేజనా సుఖినోభవంతు

సర్వేజనా సుఖినోభవంతు

సర్వేజనా సుఖినోభవంతు

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

Saturday 10 December 2022

రామ లక్ష్మణులు (11-Dec-22,Enlightenment Story)

 రామ లక్ష్మణులు  ( 11-Dec-22,Enlightenment Story)

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍃🍂 🍃🍂

రామ-లక్ష్మణులు పుట్టుకతో కవలలు కాదు.  కానీ మన సమాజంలో ఎక్కువ మంది కవలలకి ఈ పేర్లు పెడుతుంటారు. సుమిత్రకి జన్మించిన లక్ష్మణ-శత్రుఘ్నులు కవలలు. సీతకి జన్మించిన లవ-కుశులు కవలలు ఈ పేర్లు కాకుండా రాము-లక్ష్మణ్ అని పేర్లు పెట్టడంలో ఆంతర్యం ఏంటి?

వివరణ: 

భారతీయ సమాజం రామ, లక్ష్మణులను వేర్వేరు తల్లులకు పుట్టిన బిడ్డల్లా చూడలేదు. అన్నదమ్ముల అనుబంధానికి, ధర్మానికి ప్రతీకగా చూసింది. ఒక ధర్మానికి కట్టుబడిన పురుషోత్తమునిగా రాముని, ధర్మమూర్తి అయిన అన్న వెంట నిరంతరం అనుసరించిన తమ్మునిగా లక్ష్మణుడు ఈ జాతికి ఆదర్శప్రాయులయ్యారు. 

నిజానికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు 'ఆదర్శ అన్నదమ్ములు'  అనే పదానికి నిదర్శనం. ఇది శ్రీరామ పట్టాభిషేకం ప్రకటించిన, తరువాత పరిణామాలలో వ్యక్తమవుతుంది. ఊహ వచ్చినప్పటి నుంచి, లక్ష్మణుడు రాముని విడిచి ఉండలేదు. కష్టాలకు గానీ, ప్రాణాలకు గానీ వెరవలేదు.

రాముడు సైతం లక్ష్మణుని ఎంతో ప్రేమించాడు. రామ-రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లితే, తల్లడిల్లి పోయాడు. సంజీవని తెచ్చిన హనుమంతుని ఆత్మబంధువుగా భావించాడు. ఇదంతా వారిద్దరి మధ్య వున్న అనుబంధాన్ని సూచిస్తుంది.

అందుకే భారతీయులు ఎక్కడ గుడి కట్టినా, అందులో సీతారాములతో పాటు లక్ష్మణుని విగ్రహం చేర్చుతారు. వీరితోపాటు ఆంజనేయుని విగ్రహం ఉండి తీరుతుంది. 

ఈ కారణాలవల్ల, కవలలకు రామలక్ష్మణుల పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

కుశలవుల పేర్లుకూడా పెడుతుంటారు. కానీ, చాలా అరుదుగా నామకరణం చేస్తారు. చాలా తక్కువగా వీరి పేర్లు పెట్టడానికి కారణం, రామలక్ష్మణులు సాక్షాత్తు విష్ణుమూర్తి, ఆదిశేషుని అవతారాలు కాబట్టి, తమ పిల్లలకు ఆ పేర్లు పెడితే వారు ఉచ్ఛస్థితికి వస్తారని భావిస్తారు. 

రామ లక్ష్మణుల గాధలతో పోలిస్తే,కుశ లవుల కథలు స్వల్పంగా భావిస్తారు. అందుచేత కవలలకు రామ లక్ష్మణుల పేర్లు పెట్టడానికే మొగ్గుచూపుతారు.✍️

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🌷🙏🌷

🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

Friday 9 December 2022

తాపత్రయం (తపన) - 10-Dec-22,Enlightenment Story

 10-Dec-22,Enlightenment Story

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

తాపత్రయం (తపన)

ఒక కోటిశ్వరునికి పెద్ద కారు  ప్రమాదం జరిగింది. పదిహేను రోజుల తర్వాత  కోమాలో నుండి  స్పృహలోకి వచ్చాడు. చుట్టు ఉన్న కుటుంబ సభ్యులందరు ఆనందంతో చూసారు. 

*తాపత్రయం మొదటి మెట్టు*

అందరు ఇక్కడే వున్నారా అని అడిగాడు..అవుననే కొడుకు చెప్పాడు. అందరు ఇక్కడే ఉంటే అక్కడ షాపులో ఎవరున్నారు అని అడిగాడు.

*తాపత్రయం రెండో మెట్టు*

నేను అదృష్టవంతురాలిని.  నా మాంగల్యం గట్టిది. మీకు పెద్ద కారు ప్రమాదం జరిగింది , కారు నుజ్జునుజ్జు అయ్యింది, అయినా మీరు ప్రాణాలతో బయటపడ్డారు, అంది భార్య. వెంటనే కారు ఇన్సూరెన్స్ చేయించారా అని అడిగాడు.

*తాపత్రయం మూడో మెట్టు*

నాన్న మీకింకొక విషయం చెప్పాలి.  కారు ప్రమాదంలో మీచెయ్యి కారు డోరులో ఇరుక్కుపోయింది. మీ చెయ్యి తీసేసారు అన్నాడు.  చెయ్యి చూసుకున్నాడు, లేదు. చేతికి పాతిక లక్షల రోలెక్స్ వాచీ వుండాలిరా అన్నాడు.

*తాపత్రయం నాలుగో మెట్టు*

వాచీ తీసుకున్నారా అని లేవబోయాడు. నాన్న కంగారు పడకండి, మీకు ఇంకొక విషయం చెప్పాలి, ప్రమాదంలో మీ వెన్నెముక విరిగిపోయింది.  మీరు నడవలేరు. మీపనులన్నీ చేసుకొనేందుకు అనువుగా మీకు కోటిరూపాయలతో ఎలక్ట్రానిక్ రోబో వీల్ చెయిర్ తీసుకొన్నాం.  అందులో కూర్చుంటే పళ్ళు బ్రష్ చేసుకోవటం, స్నానం చేయటం, భోజనం చేయటం వంటి అన్ని మీపనులు మీరే చేసుకోవచ్చు అన్నాడు కొడుకు. కోటిరూపాయలతో కొన్నారా, కొంటానికి  కొటేషన్ తీసుకున్నారా, ఇంకా తక్కువకి వచ్చేదేమో అన్నాడు. 

*తాపత్రయానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేమి కావాలి*

*నీతి : తాపత్రయం తగ్గించుకోండి. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, అంత ఆనందంగా ఉంటాము. చిన్న జీవితం మనది*

🙏💐🙏శుభోదయం🙏💐🙏

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

Thursday 8 December 2022

మానవుని పంచకోశాలు (09-Dec-22,Enlightenment Story)

 09-Dec-22,Enlightenment Story

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

మన శరీరాలు వాస్తవానికి మూడు శరీరాలతో రూపొందించబడ్డాయి; భౌతిక, జ్యోతిష్య మరియు కారణ. ఈ ఐదు తొడుగులు లేదా 'కోశాలు' లోపల; అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ మరియు ఆనందమయ కోశ.

ఐదు కోషాలు లేదా తొడుగులు

అన్నమయ కోశ - ఆహార కోశం

మన భౌతిక శరీరాలు భౌతిక ప్రపంచంలోని భౌతిక అంశాలతో రూపొందించబడ్డాయి. మనం తినేది మనమే, అలా మాట్లాడాలి. మనం ఆహారంతో తయారయ్యాము మరియు మన మరణం తర్వాత మన ఆహారం ఎక్కడ నుండి వచ్చిందో భూమికి తిరిగి వస్తాము. ఈ తొడుగు భౌతిక శరీరానికి చెందినది.

ప్రాణమయ కోశ - ప్రాణాధార కోశం

ఈ తొడుగు జ్యోతిష్య శరీరానికి చెందినది. మేము ఐదు ముఖ్యమైన శక్తులతో కూడి ఉన్నాము, ఇవన్నీ జ్యోతిష్య విమానం ద్వారా భౌతిక శరీరం గుండా ప్రవహిస్తాయి; ప్రాణ, అపాన, సమాన, ఉదాన మరియు వ్యాన. vyana  ప్రాణమయ కోశంలో ఐదు క్రియలు (కర్మ ఇంద్రియాలు) కూడా ఉన్నాయి; నోరు, చేతులు, పాదాలు, పాయువు మరియు జననేంద్రియాలు. ఈ కోశాలో, మేము వేడి, చలి, ఆకలి మరియు దాహం మొదలైన వాటిని అనుభవిస్తాము.

మనోమయ కోశ - మానసిక కోశం

ఈ తొడుగు మళ్లీ జ్యోతిష్య శరీరంలో కూర్చుంటుంది. మేము ఈ కోశం ద్వారా ఆలోచనను అనుభవిస్తాము. మనం ఆలోచించడం, అనుమానించడం, కోపం, కామం మొదలైన వాటిని అనుభవించవచ్చు. మనస్సు (మనస్), ఉపచేతన (చిత్త) మరియు జ్ఞాన ఇంద్రియాలు (జ్ఞాన అవయవాలు; కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం).

విజ్ఞానమయ కోశ - మేధో కోశం

ఈ తొడుగు జ్యోతిష్య శరీరానికి సంబంధించినది. ఇది మేధస్సును కలిగి ఉంటుంది, ఇది మనం స్వీకరించే సమాచారాన్ని విశ్లేషిస్తుంది. ఇది మన స్వీయ-ధృవీకరణ సూత్రమైన అహంకారాన్ని (అహంకారాన్ని) కూడా నియంత్రిస్తుంది. ఇది పైన జాబితా చేయబడిన జ్ఞానం యొక్క ఐదు అవయవాలతో పాటు పనిచేస్తుంది. వివక్ష మరియు నిర్ణయం తీసుకోవడం దాని వ్యక్తీకరణలు.

ఆనందమయ కోశ - ఆనంద కోశం

ఇది కారణశరీరంలో కూర్చునే ఏకైక కోశం. ఆనందం, ఆనందం మరియు శాంతిని అనుభవించేది మనలో భాగం. ఇది అనుభూతి చెందడం అత్యంత కష్టతరమైన శరీరం కాబట్టి మనం సంబంధాన్ని కోల్పోతాము. అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండే ఆ అంతర్భాగానికి చేరుకోగానే ఆనందమయతో మనకున్న అనుబంధం కనపడింది.









🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

ఎగ దీస్తే బ్రహ్మ హత్య - దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది? (29-Apr-24, Enlightenment Story)

  ఎగ దీస్తే బ్రహ్మ హత్య -  దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది?     🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺           ...