Saturday 10 December 2022

రామ లక్ష్మణులు (11-Dec-22,Enlightenment Story)

 రామ లక్ష్మణులు  ( 11-Dec-22,Enlightenment Story)

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍃🍂 🍃🍂

రామ-లక్ష్మణులు పుట్టుకతో కవలలు కాదు.  కానీ మన సమాజంలో ఎక్కువ మంది కవలలకి ఈ పేర్లు పెడుతుంటారు. సుమిత్రకి జన్మించిన లక్ష్మణ-శత్రుఘ్నులు కవలలు. సీతకి జన్మించిన లవ-కుశులు కవలలు ఈ పేర్లు కాకుండా రాము-లక్ష్మణ్ అని పేర్లు పెట్టడంలో ఆంతర్యం ఏంటి?

వివరణ: 

భారతీయ సమాజం రామ, లక్ష్మణులను వేర్వేరు తల్లులకు పుట్టిన బిడ్డల్లా చూడలేదు. అన్నదమ్ముల అనుబంధానికి, ధర్మానికి ప్రతీకగా చూసింది. ఒక ధర్మానికి కట్టుబడిన పురుషోత్తమునిగా రాముని, ధర్మమూర్తి అయిన అన్న వెంట నిరంతరం అనుసరించిన తమ్మునిగా లక్ష్మణుడు ఈ జాతికి ఆదర్శప్రాయులయ్యారు. 

నిజానికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు 'ఆదర్శ అన్నదమ్ములు'  అనే పదానికి నిదర్శనం. ఇది శ్రీరామ పట్టాభిషేకం ప్రకటించిన, తరువాత పరిణామాలలో వ్యక్తమవుతుంది. ఊహ వచ్చినప్పటి నుంచి, లక్ష్మణుడు రాముని విడిచి ఉండలేదు. కష్టాలకు గానీ, ప్రాణాలకు గానీ వెరవలేదు.

రాముడు సైతం లక్ష్మణుని ఎంతో ప్రేమించాడు. రామ-రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లితే, తల్లడిల్లి పోయాడు. సంజీవని తెచ్చిన హనుమంతుని ఆత్మబంధువుగా భావించాడు. ఇదంతా వారిద్దరి మధ్య వున్న అనుబంధాన్ని సూచిస్తుంది.

అందుకే భారతీయులు ఎక్కడ గుడి కట్టినా, అందులో సీతారాములతో పాటు లక్ష్మణుని విగ్రహం చేర్చుతారు. వీరితోపాటు ఆంజనేయుని విగ్రహం ఉండి తీరుతుంది. 

ఈ కారణాలవల్ల, కవలలకు రామలక్ష్మణుల పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

కుశలవుల పేర్లుకూడా పెడుతుంటారు. కానీ, చాలా అరుదుగా నామకరణం చేస్తారు. చాలా తక్కువగా వీరి పేర్లు పెట్టడానికి కారణం, రామలక్ష్మణులు సాక్షాత్తు విష్ణుమూర్తి, ఆదిశేషుని అవతారాలు కాబట్టి, తమ పిల్లలకు ఆ పేర్లు పెడితే వారు ఉచ్ఛస్థితికి వస్తారని భావిస్తారు. 

రామ లక్ష్మణుల గాధలతో పోలిస్తే,కుశ లవుల కథలు స్వల్పంగా భావిస్తారు. అందుచేత కవలలకు రామ లక్ష్మణుల పేర్లు పెట్టడానికే మొగ్గుచూపుతారు.✍️

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🌷🙏🌷

🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...