Thursday 5 October 2023

BIO-CLOCK అంటే (06-Oct-23, Enlightenment Story)

 *BIO-CLOCK అంటే*

🍁🍁🍁🍁🍁🍁 🍁🍁   

మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే తెల్లవారు జామున 4.00 గం॥లకు అలారం సెట్ చేసి 3.00 గం నుండి అలారం మోత కోసం వేచి చూడడటమే BIO --BLOCK.  

చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని నమ్మి 50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని మనసులో గాఢంగా నమ్మబల్కోని  చాలామంది తమ సొంత బయోక్లాక్‌ ను ఏర్పాటు  చేసుకున్నారు. 

దీంతో 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు.  మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌  ను మానసికంగా తప్పుగా సెటప్ చేసుకొంటున్నాం.

 చైనాలో ప్రజలు 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మి అలా మానసికంగా సంసిద్దులై వారి బయోక్లాక్ ను అలా ఏర్పాటు చేసుకున్నారు.


కాబట్టి మిత్రులారా..!

1. మనము మన బయో-గడియారాన్ని మానసికంగా పాజిటివ్ ఆలోచనలతో సర్దుబాటు చేసి, రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే తద్వారా మనం కనీసం120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు.

2. 40 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. వృద్దాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలు అవుతుందని బలంగా నమ్మాలి.

3. వెంట్రుకులకు సహజ సిద్ధమైన రంగు ( తెల్లజుట్టు ఉంటే) వెయ్యండి, యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. *ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడ  యువతి, యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. తద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి.  వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు.

4. మనం తీసుకునే భోజనం కల్తీ అనీ, కలుషితం, అనుకుంటూ నెగటివ్ థాట్స్ తో తీసుకోవద్దు. ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనది గా మారింది, ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి.

లేదంటే నెగట్యూ ఆలోచనల వల్ల మన శరీరంలో నెగటివ్ ఎంజైములు విడుదలై మన జీర్ణ వ్యవస్థను, మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.

5.  వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి. (ఇది నిజం కూడ).

6.ఆనందానికి, వ్యాధికి పడదు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు.కనుక ఆనందంగా ఉండండి తద్వారా ఆరోగ్యంగా ఉండండి. (ప్రతిరోజు హాస్య భరిత సినిమాలు చూడండి మనసులో కాకుండా పైకి నవ్వండి).

7. ప్రతి సమస్యకు కారణం మన మనస్సు. మన ఆలోచనా విధానం. ముఖ్యంగా మన మాట, సరదాకు కూడ నాకు old age వస్తుంది అనే మాటను అనకండి. 

ధర్మరాజుకు యువరాజుగా పట్టాభిషేకం జరిగింది కూడా 105 వత్సరాల వయసులోనే అని గ్రహించండి.

కాబట్టి మీ మానసిక బయో క్లాక్ ని మీ తక్కువ ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోకండి.

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...