Thursday 16 May 2024

షష్ఠి పూర్తి వేడుక (17-May-24, Enlightment Story)

 షష్ఠి పూర్తి వేడుక 

🌺🍀🌺🍀🌺🌺

జీవితంలో సగం వయసు గడిచే ఘట్టం చాలా ముఖ్యమైంది. మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది. 60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది షష్టిపూర్తి.ప్రతివారికీ మృత్యువు 

60 వ యేట ఉగ్రరథుడు అను పేరుతో, 70 వ యేట భీమరథుడు అను పేరుతో, 78 వ యేట విజయరథుడు అనుపేరుతో ఎదురుచూస్తుంటాడు. 

ఆరోగ్య సమస్యలకు తట్టుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి.బృహస్పతి , శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది.వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. 



తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి. షష్టిపూర్తి సందర్భంగా ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేయు యజ్ఞము ఆయుష్కామనయజ్ఞము. పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరగినట్టే భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు. 

పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక. బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకొనే అపురూప సందర్భం షష్టిపూర్తి.

పురుషుడి వయసు 60 ఏళ్లు నిండగానే షష్ఠి పూర్తి వేడుక నిర్వహిస్తారు. అయితే ఎగువ మధ్యతరగతి వాళ్లు, సంపన్నులే ఎక్కువగా ఈ వేడుక జరుపుకుంటారు. మధ్యతరగతి, పేద వర్గాల్లో ఇది అంతగా కనిపించదు. అయితే మనిషి జీవితకాలంలో సగం పూర్తయిన తర్వాత జరుపుకునే ఈ క్రతువు చాలా ముఖ్యమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ షష్ఠి పూర్తి వేడుక జరుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

కృతయుగం నాటి వైశంపాయన మహర్షి.. కలియుగంలో మనుషుల ఆయుర్దాయం తగ్గుతుందని చింతించాడు.      వేద వ్యాసుని కలిసి 'మహర్షీ! దేహం ఉంటేనే కదా ధర్మాలను పాటించగలిగేది! మరి శరీరం లేకున్నా వ్యాధిగ్రస్తమైనా కర్మలను ఎలా ఆచరించడం? కనుక కలియుగంలో ఆయుష్షు పెరిగి.. పుత్ర పౌత్రులతో, సర్వ సంపదలూ అనుభవించేందుకు ఏ ధర్మాన్ని ఆచరించాలి? ' అనడిగితే- వ్యాసుడు 'ఆయుష్షును. దేహపటుత్వాన్ని పెంచేదే షష్ఠి పూర్తి వేడుక /షష్ట్యబ్ది వ్రతం. 

కలియుగంలో 60 ఏళ్లు రాగానే, శ్రద్ధతో భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించాలి' అంటూ బదులిచ్చాడు.  అలా వచ్చిందే ఈ ఆచారం.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Wednesday 15 May 2024

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే (16-May-24, Enlightment Story)

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే

🌺🍀🌺🍀🌺🌺🌺🍀🌺🌺🍀🌺🍀

భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే అని చెప్తారు కదా!"దూరాత్‌ దూరే అంతికే చ!'' అంటుంది వేదం. అవగాహన కానంతసేపూ దూరంగా ఉంటుంది. అర్థమయితే దగ్గరే (లోపలే) ఉంటుందని అర్థం. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది.


పెళ్లీడుకొచ్చిన పిల్లకి తల్లిదండ్రులు సంప్రదాయాననుసరించి సన్నిహిత బంధువుల పిల్లవాడిని పెళ్ళికి ఎంపిక చేస్తారు. కాని ఆ పిల్ల ఒప్పుకోక అందరి కన్నా శ్రేష్ఠుడినే వరిస్తానంటుంది. తల్లిదండ్రులు ప్రక్కకి తప్పుకొంటారు.
అందరి కన్నా ఉన్నతుడు రాజే కాబట్టి తాను రాజుని తప్ప ఇంకెవరినీ పెళ్లాడనంది ఆ పిల్ల. అప్పట్నుంచి రాజుని వెంబడింపసాగింది. ఒకనాడు పల్లకిలో పోతున్న రాజుకి దారిలో సన్న్యాసి కనబడితే, దిగి ఆయనకి ప్రణామాలు చెప్పి తన ప్రయాణం కొనసాగించాడు. దీనినంతా గమనించిన ఆ పిల్ల ''అందరి కంటే రాజే గొప్పవాడను కొన్నాను, పొరబడ్డాను. ఆయన కంటే సన్న్యాసి ఎంతో గొప్పవాడు. కాబట్టి నేను సన్న్యాసినే పెళ్లాడుతాను'' అనుకొని సన్న్యాసి వెంటపడింది. ఒకనాడు సన్న్యాసి ఒక రావిచెట్టు క్రింద ఉన్న వినాయకుని విగ్రహానికి నమస్కారం పెట్టటం చూచింది. ఆ పిల్ల, తన అభిప్రాయాన్ని మళ్లీ మార్చుకొంది. సన్న్యాసి కంటె ఉత్తముడు వినాయకుడని ఆయననే వివాహమాడటానికి నిశ్చయించుకొంది. సన్న్యాసిని విడిచి, వినాయకుని ఎదుట కూర్చొంది. చెట్టుక్రింద ఉన్న విగ్రహం కావటం వల్ల అక్కడ గుడి లేదు. ఎవ్వరూ వచ్చేవారు కారు. ఒకనాడు అటుపోతున్న ఒక కుక్క ఆ విగ్రహం పై కాలెత్తి అది చేసే పని అది చేసింది. ఆ విగ్రహం కంటె గొప్పదనుకొని ఆ పిల్ల కుక్క వెంటబడింది. ఆదారిన పోతున్న ఒక పిల్లవాడు ఆ కుక్కపై రాయిని విసిరి గాయపరచాడు. ఆ బాధకి అది ఇంకా వేగంగా పరుగెత్తటం మొదలు పెట్టింది. దీనినంతా గమనిస్తున్న ఒక యువకుడు ఆ మూగజీవిని ఊరికే కొట్టిన పిల్లవాడిని చివాట్లు వేశాడు. ఆ పిల్లవాడిని మందలించిన యువకుడే అందరికంటె గొప్పవాడనుకొంది ఆ పిల్ల. అతనినే వివాహమాడుతానంది.
ఇంతకూ, ఆ యువకుడు ఎవరో కాదు - తల్లిదండ్రులు ఎంపిక చేసిన వాడే! ఎక్కడో ఉన్నాడనుకొన్నవాడు సమీపానే ఉన్నాడు. అదీ కథ. ''ఈశ్వరుడెక్కడో ఉన్నాడని దేశమంతా వెతుకుతున్నావు. ఎరుగనంత వరకు నీకు ఆయన దూరస్థుడే. ఎంత వెతికినా కనబడడు. నీకు దగ్గరే ఉంటాడు. అన్నిటి కంటే దూరంగా, అన్నిటి కంటే దగ్గరగా ఉంటాడు'' అంటుంది వేదం.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Monday 13 May 2024

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

 ప్రయత్నలోపం పనికిరాదు

🌺🍀🌺🍀🌺🌺🌺🍀🌺

జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎదురవుతుంటాయి.వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలిచేవారు విజేత అవుతారు.  గెలుపు పిలుపు వినబడేవరకు పురుష ప్రయత్నం చేయాలి. ‘గెలుపు కోసం ఎన్ని సార్లు ప్రయత్నించినా గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోవద్దు ’అన్నారు స్వామి వివేకానంద.

కార్యసాధనలో మానవ ప్రయత్నం ముఖ్య పాత్ర పోషిస్తుంది.  మానవ ప్రయత్నం లేనిదే దేవ సహాయం లభించదని,ఎంత బలంగా ప్రయత్నిస్తే అంతే బలంగా దైవానుకూలత  ఉంటుందని తెలిపే ఒక కథ చదువుదాం.

ఒక రైతు  బండి మీద సరుకులు వేసుకుని సంతకు వెళుతున్నాడు.దారిలో అతని బండి చక్రాలు బురదలో కూరుకుపోయాయి. అతడు నేల మీదకు  దిగి బురద లోతుని అంచనా వేసాడు. ఒక్కడే ఆ  బండిని బయటకు తీయడం సాధ్యం  కాదని అనుకున్నాడు. కాసేపు ఆలోచిస్తే అతడికొక ఆలోచన వచ్చింది. అదేమిటంటే  అతడి  ఇష్టదైవమైన ఆంజనేయుడుని పిలిస్తే ఆయన వచ్చి సాయం చేస్తే బండిని ఆయనకున్న బలంతో సులువుగా ఒడ్డెక్కించవచ్చు అనుకున్నాడు.అలా అనుకున్నదే తడువుగా ఆంజనేయుడిని స్తోత్రం చేస్తూ బండిని బురద నుండి  బయటకు లాగమని ప్రార్ధన చేసాడు రైతు. కానీ ఆంజనేయుడు కనికరించలేదు.



అయితే ఆ రైతు  ఆంజనేయుడుకి మహా భక్తుడు. ఆయన మహిమలు చదివి ఉన్నాడు.అందుకే ఆయన వచ్చి  సహాయం చేస్తాడన్న దృఢమైన విశ్వాసంతో  పట్టు విడువకుండా చాలా సేపు  స్తోత్రం చేసాడు .

రైతుకి తనమీదున్న  విశ్వాసానికి కరిగిపోయాడు ఆంజనేయుడు.  రైతు ముందు ప్రత్యక్షమయ్యాడు. 
ఆయనకు నమస్కరించి “స్వామీ! ఎంతగా నీ కోసం ప్రార్ధించానో తెలుసా? పోనీ ఇప్పటికైనా వచ్చావు. నా బండి బయటపడేందుకు సాయం చెయ్యు” అనడిగాడు రైతు .

“నీ ప్రయత్నం చేయకుండా దేవుడి  మీద భారం వేసే  నీలాంటి  సోమరులకు సాయపడను. నీలా పనికి వెనకంజ వేసేవారికి సాయం చేస్తే  ప్రపంచమంతా  సోమరులతో  నిండిపోతుంది.  భగవత్ సాయం పొందాలంటే  నీ వంతు  ప్రయత్నం ముందుగా చేయాలి. అప్పుడే దైవ సహాయం లభిస్తుంది.  నువ్వు బండిని బురదలో నుంచి బయటికి లాగే ప్రయత్నం చెయ్యకుండా నా కోసం ప్రార్ధించడం తప్పు. ముందుగా నువ్వు   బురదలో దిగి నీ  భుజాలను చక్రాలకు మోపి అవి  బయటపడేలా శక్తి నుపయోగించు. ఆ ఎద్దులను కూడా బండి లాగమని ప్రోత్సహించు. అప్పుడే నీ ప్రయత్నానికి  నా సాయం తోడవుతుంది. నీలో  నా బలాన్ని  ప్రవేశపెట్టి ఆ  బండి కదిలిస్తాను”  అన్నాడు ఆంజనేయుడు. ఆయన  చెప్పినట్టే  చేసాడు రైతు.

అప్పుడు బురద నుండి  బండిని బయటకు రప్పించగలిగాడు రైతు.ఆంజనేయుడికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు రైతు.   

సీతను రావణుడు ఎత్తుకు పోవడం చూసిన జటాయువు రావణుడితో యుద్ధం చేసాడు. రావణుడు మహాబలవంతుడని,  ఎదిరించడం తన శక్తికి మించిన పని అని జటాయువుకి తెలుసు.అయినా రావణుడిని  అడ్డగించాలన్న ప్రయత్నం మానలేదు. ఆ ప్రయత్నంలో జటాయువు మరణించాడు కానీ  తగిన కీర్తి పొందాడు. రాముడి చేతుల మీదుగా అంత్యక్రియలు చేయించుకునే భాగ్యం కూడా  దక్కింది.

అందుకే   కార్యాలను తలపెట్టే వారు తమ వంతు ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో చేయాలి.  ఎవరైతే గట్టి ప్రయత్నం చేస్తారో వారికి భగవంతుడి సాయం కూడా దొరుకుతుంది.  చేయించేది  భగవంతుడు.  చేసేది మాత్రం మానవులే.  అది గ్రహించి నిజ జీవితంలో ప్రయత్నం చేయాలి జనులు.

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Tuesday 7 May 2024

ధర్మబద్ధమైన జీవనం(13-May-24, Enlightment Story)

  ధర్మబద్ధమైన జీవనం

🌺🍀🌺🍀🌺🌺

మనము ఎల్లప్పుడూ ధర్మమునే ఆశ్రయించి వుండాలి.ధర్మం గూర్చి మహాభారతమున అనేక విషయములను తెలుసుకుంటున్నాము. మనము సత్కర్మలను ఆచరిస్తే సత్ఫలితాలు లభిస్తాయి.

దుష్కార్యములకు కష్టనష్టములు, దుష్ఫలితములు కలుగుతాయి. కాబట్టి చివరివరకు మనతో వచ్చేది మన కర్మఫలమే. మనము ఆర్జించుకొన్న సంపద, బంధువులు ఎవ్వరూ కూడా వెంటారారు.


మహాభారతంలో ధర్మరాజు తనకు ఎన్ని కష్టములు వచ్చినా వాటిని ఎంతో సంయమనంతో ఆలోచించి ధర్మ మార్గాన్నే అనుసరించాడు. అతడు ధర్మమునకు ప్రతిరూపమైన వాడు.ధర్మరాజు భారత యుద్ధానంతరం మహాప్రస్థానం చేయాలనే సంకల్పంతో తాను, తన నలుగురు తమ్ములు, భార్య ద్రౌపది, తన విశ్వాస పాత్రయైన కుక్కతో సహా ఏడుగురూ మేరు పర్వత ప్రాంతానికి బయలుదేరారు.*

త్రోవలో ద్రౌపది శరీరం సడలి నేలపై పడి ప్రాణాలు విడిచింది. వెంటనున్న భీముడు,ద్రౌపది ఎందుచేత ఈ విధంగా అసువులు బాసింది?’ అని అడిగాడు.ఆమెకు అర్జునునిపై గల అధిక అనురాగం!  అది ధర్మం కాకపోవటం!’ అని ధర్మరాజు చెప్పాడు.

తరువాత సహదేవుడు, అర్జునుడు, నకులుడు, భీముడు కూడా మరణించినారు.వారి మరణములకు వారి ధర్మాతిక్రమణ, అహంకారములే కారణంగా తెలుస్తుంది.

ధర్మరాజుతో కుక్క మాత్రం మిగిలి వుంటుంది. ధర్మరాజును స్వర్గమునకు తీసుకుపోవటానికి ఇంద్రుడు విమానంతో వచ్చాడు. ధర్మరాజును విమానం అధిరోహించ మన్నాడు ఇంద్రుడు. ‘నాతో బాటుగా శునకం కూడా వున్నది దానితో వస్తా’నంటాడు.

స్వర్గంలో శునకములకు తావులేదు కాబట్టి దానిని వదలిపెట్టి విమానం అధిరోహించ’మంటాడు ఇంద్రుడు.ధర్మరాజు ఒప్పుకోడు. అది మిత్రద్రోహం. పాపహేతువు. కాబట్టి స్వర్గానికిరాను అంటాడు.


ఈ విధమైన ధర్మాధర్మ వివాదమును శునకరూపంలో చూస్తున్న యమధర్మరాజు తన నిజరూపమును ధరించి ధర్మరాజు యొక్క ధర్మజ్ఞతకు సంతోషించి ధర్మరాజును ఇంద్రునితో స్వర్గానికి పంపుతాడు.

మరియొక సందర్భంలో కూడా ధర్మరాజు యక్ష ప్రశ్నలకు సమాధానమిచ్చినప్పుడు ఆ సమాధానములకు సంతోషించిన యక్షుడు ధర్మరాజుతో నీ సమాధానములు ప్రశంసనీయముగా పున్నాయి, సంతోషం కలిగింది. దానికి ఫలంగా, ‘అసువులు బాసిన నీ సోదరులలో ఒకరిని పునర్జీవితులను చేసుకో’వలసినది అని అంటాడు.

*అందులకు ధర్మరాజు ‘నా తల్లికి సంతానమైన ముగ్గురలో నేను జీవితుడనై వున్నాను కాబట్టి మా పినతల్లి సంతానములో ఒకడైన నకులుడిని పునర్జీవిని చేయమ’ని అడుగుతాడు.*

ధర్మరాజు యొక్క పరమధార్మికమైన సమాధానముకు మిక్కిలి సంతోషించిన యక్షుడుతమ్ములనందరినీ పునర్జీవులను చేస్తాడు. ఈ విధంగా ధర్మమును చక్కగా ఆచరించిన వాడగుట చేతనే ధర్మము అతనిని ఎల్లవేళలా కాపాడుతూ వచ్చింది.*

ధర్మమును ఉపేక్షిస్తే అనర్ధములు జరుగుతాయి. అధర్మము పెరిగిపోతుంది. ధర్మగ్లాని (పతనము) ఏర్పడుతుంది. ధర్మగ్లానిని ఉద్దరించటానికే భగవంతుడు అవతరించవలసి వస్తుంది. అప్పుడు ధర్మము కాపాడబడుతుంది. మన పూర్వజులంతా ధర్మమును ఆచరించి, ధర్మమునకు ప్రాధాన్యత ఇచ్చి మహాత్ములైనారు.

*ధార్మిక జీవనమునకు ఆధ్యాత్మిక దినచర్య ప్రణాళికగా రూపొందించి తద్వారా జీవిత సాఫల్యము సుగమం చేశారు.*✍️

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

వంటింటి వైపు రాగానే తియ్యటి వాసన! (12-May-24, Enlightment Story)

 వంటింటి వైపు రాగానే తియ్యటి వాసన!

🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭


మావిడిపళ్లా?’ ఒక్కరుపు అరిచాను. అవునంది అమ్మ. భలే తియ్యటి వాసన గదంతా! గోనెపట్టామీద గడ్డిలో అప్పుడే పుట్టిన చిన్ని కృష్ణుడి లా కనబడుతున్నాయి..
కొద్దిగా పండని పళ్ళు.. గోనెపట్టామీద గడ్డి పరిచి పళ్లన్నిటినీ పసిపాపల్లా పడుకోబెట్టి, పైన మరింత గడ్డి కప్పేసి వుంచేవారు. మనం రోజులో పదిసార్లైనా ఆ గదిలోకెళ్లి వాటిని పరామర్శించి వచ్చేవాళ్లం. వారం తరవాత ఒకపండు కాస్త మెత్తబడగానే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ పేపర్ పట్టుకుని చేసినట్టు ఇల్లంతా తిరిగేస్తూ హడావుడి చేసేవాళ్లం.

అసలా మావిడిపళ్ల 🥭 ఆకలి చాలా దారుణమైన ఆకలి. వదిల్తే అన్నీ తినెయ్యాలన్నంత! ‘అది కడుపా ఖండవిల్లి మడుగా? ఎన్ని తింటావు? ఆనక అజీర్తి చేస్తుంది!’ అని అమ్మా, నాన్నగారు తిడుతున్నా సరే! 😇

వేసంకాలం ఊరగాయల రోజుల్లో కొత్తావకాయ కలపడానికి అమ్మానాన్నా చేసే హడావుడి గమ్మత్తుగా వుండేది.  నాల్రోజుల ముందునుంచీ ఊరంతా తిరిగి బారామాసి కాయలు ఎక్కడ దొరుకుతాయో చూసి కొనేవారు.

కొన్ని కాయలు చూడ్డానికి నా అంత లావున్నా పులుపుండవు.  అందుకని ముందుగా ఓ కాయలోంచి చిన్నముక్క కోసిమ్మనాలి.అది నోట్లో పెట్టుకున్న మరుక్షణం మనకి తెలీకండానే మన ఎడంకన్ను మూసుకుపోయి, 😉 మన నాలుకెళ్లి అంగుట్ని ‘ఠాప్’ మంటూ కొట్టాలి !

‘బాబోయ్, పులుపు రొడ్డు!’ 😖 అనేది అమ్మ. ఆవకాయంటే ఏడాదంతా మనల్ని ఆదుకునే ఎర్రని తల్లి కదా!  అంచేత కాయ గట్టిగా టెంకపట్టి, పుల్లగా వుంటేనే నిలవుంటుంది. ఇక అసలు విషయానికొద్దాం.

వేడివేడన్నంలో అంత ఆవకాయ కలుపుకుని, పక్కన బాగా ముగ్గిన చెరుకురసం మావిడిపండొకటి పెట్టుకుని, ముద్దముద్దకీ  తింటూవుంటే వుంటుందీ... నాసామిరంగా! వేటూరి పాటని ఇళయరాజా చేత కొట్టించుకున్నంత ధీమాగా అనిపిస్తుంది

అసలు మావిడిపండెలా తినాలో పిల్లలకి మనం శిక్షణా తరగతులు నిర్వహించాలి.ఆమధ్య సమ్మర్లో ఓరోజు హొటల్లో భోంచేస్తోంటే అన్నంలోకి అరటిపండుకి బదులు మావిడిపండిచ్చాడు.నా పక్కన కూర్చున్నతను భోజనం అంతా అయిపోయాక పండుని ‘స్స్...స్స్...!’ అని ఓసారి గట్టిగా పీల్చి పక్కనబడేసి లేచి చెయ్యి కడిగేసుకున్నాడు. 😡నాకు వాణ్ణి చంపెయ్యాలనిపించింది.

అసలు మనం తొక్కని పిండి తిన్న తరవాత దానిమీంచి రోడ్డురోలరెక్కించి తొక్కించినా ఒక్క బొట్టుకూడా రసం రాకూడదు..🤤ఇక టెంకయితే మనల్ని ఏడుస్తూ వేడుకోవాలి... ‘చీకింది చాలు, ఇక ఆపరా బాబూ!’ అని! అంతలా వేధించాలి మావిడిపండుని!😝

అసలు వాణ్ణని ఏంలాభం?🤔  వాళ్లమ్మా నాన్నల్ని అనాలి. పిల్లలకి సంస్కారం నేర్పకపోయినా ఫరవాలేదు, పొద్దున్నే వచ్చే వాట్సప్ ఫార్వర్డ్స్ ఓ నాలుగు చదివితే అదే వస్తుంది.
కానీ మావిడిపండు తినడం మాత్రం తప్పకుండా నేర్పాలి! 😀

తాతగారేం చేసేవారంటే చెరుకురసాలు, పందార కలిశలు పరకల లెక్కన తెచ్చేవారు. వాటన్నింటినీ గోలెంలో నిండా నీళ్లుపోసి అందులో పడేసేవారు. ఎవడికెన్ని తినాలనిపిస్తే అన్నీ తీసుకు తినెయ్యడమే!

వెంకటేశ్వరస్వామి గుళ్లో బోల్డంత నెయ్యి, జీడిపప్పూ వేసి చేసిన చక్రపొంగలి ప్రసాదం ఓ పెద్ద బేసిన్లో పెట్టేసి అక్కడెవరూ లేకుండా మనల్నే పెట్టుకు తినమంటే ఎలావుంటుంది? ఏలక్కాయ తొక్కలు కూడా మిగల్చం కదా? అచ్చం అలాగన్నమాట! 😋

అమ్మ, అమ్మమ్మ అరగంటకోసారి గోడ గడియారంలో గంటలు కొట్టినట్టు ‘అన్ని పళ్లు తినకండ్రా! సెగ్గడ్డలొస్తాయీ!’ అంటూ రాగాలు తీసేవారు. సెగ్గడ్డలొస్తే ఏదో చూర్ణఁవో, భస్మఁవో తెచ్చుకుని వేసుకుంటాం. రెండ్రోజుల్లో మాడిపోతాయి.

మన చిన్నతనాల్లో మావిడిపళ్లు పరకలు, డజన్ల లెక్కన కొనేవాళ్లం కదా?ఆర్నెల్లకోసారి హైదరాబాద్ వెళ్లొచ్చి నాన్నగారు ‘అక్కడ మల్కాజిగిరిలో మావిడిపళ్లు కేజీల్లో కొలిచి అమ్ముతారు. కలికాలం! ఇంకా ఏంచూడాల్సొస్తుందో?’ అంటూ ఆశ్చర్యం, విచారం కలిపి బాధపడిపోయేవారు.

ఇక మావిడిపళ్ల వంశంలో తనదైన స్థానం ఉన్న ఏకైక రకం... బంగినపల్లి! రసాలైతే వయసైపోయినట్టు ఒళ్లంతా ముడతలుంటాయి. కానీ ఇవలా కాదు.  మంచి యవ్వనంతో మిసమిసలాడుతూ ఒక్క ముడతైనా లేకుండా నిగనిగలాడి పోతుంటాయి.

పెరుగన్నంలో బంగినపల్లి ముక్కలేసుకుని పళ్లతో గీరుకు తినడం భోజనానికి ఒక పరిపూర్ణత చేకూరుస్తుంది. కొంతమంది బొప్పాయి పళ్లకి మల్లే తొక్కలు తీయించి, పనసపొట్టులా చిన్నచిన్న ముక్కలు కోయించుకు తింటారు. అంత రెడీమేడ్ గా తినడంకన్నా ఓ సీసాడు 'మాజా'  తాగడం బెటరు.
లేకపోతే సామర్లకోట స్టేషన్లో మావిడితాండ్ర అమ్మొచ్చినపుడు కొనుక్కుతినాలి. అంత మావిడిపళ్ల ముక్కల్ని గీరుకు తినలేనంత వ్యాపకాలేఁవిట్టా??😀

బజారెళితే నాన్నగారు చాలా పెద్దసైజు పళ్లు అరడజను కొనేవారు. ఆయనెప్పుడూ క్యాంపులే! అట్నించి వచ్చేటప్పుడూ బోల్డన్ని తెస్తూండేవారు. పాపం ఆయన తినేది తక్కువైనా సరే పిల్లలున్నారని తెచ్చిపడేసేవారు.

అంత పెద్ద పండునీ అమ్మ కత్తిపీటతో తరిగేది. పైపెచ్చు ఓ మాటనేది.‘ఈ చెంప నీకు, ఆ చెంప అన్నయ్యకీ! సైడు ముక్కలు ఆడపిల్లలు తింటార్లే!టెంక మీరెలాగూ తినరు కాబట్టి నాకుంచెయ్యండి. అదిచాలు నాకు!’

అది బంగినపల్లి కంటే తియ్యని మనసు కదా!😊 అంచేత అలానే చేస్తుంది. ఈ ముక్క రాస్తోంటే కళ్లెందుకో నీళ్లతో నిండిపోతున్నాయి.మావిడిపండంటే తీపే కాదు!తీపి జ్ఞాపకం కూడా!
 💭 😍 🥭🥭🥭

మనవి : ఇది మామిడి పండ్ల మీద మమకారం తో ఎవరో మహానుభావులు వ్రాసిన కధనం... ఎవరో తెలీదు గానీ, చాలా బాగా రాసారు.. అన్నీ కళ్ళకి కట్టినట్టు.. పాత రోజులన్నీ గిర్రున వెనక్కి తిప్పినట్టు..😍
 మీకు మామిడి పండ్లు 🥭 ఇష్టం అయితే, హాయిగా చదివి ఆనందించి, మీ చిన్ననాటి స్నేహితులకి, చుట్టాలకి పంపండి 🥰



🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭

షష్ఠి పూర్తి వేడుక (17-May-24, Enlightment Story)

 షష్ఠి పూర్తి వేడుక  🌺🍀🌺🍀 🌺 🌺 జీవితంలో సగం వయసు గడిచే ఘట్టం చాలా ముఖ్యమైంది.  మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య ...