Tuesday 7 May 2024

ధర్మబద్ధమైన జీవనం(13-May-24, Enlightment Story)

  ధర్మబద్ధమైన జీవనం

🌺🍀🌺🍀🌺🌺

మనము ఎల్లప్పుడూ ధర్మమునే ఆశ్రయించి వుండాలి.ధర్మం గూర్చి మహాభారతమున అనేక విషయములను తెలుసుకుంటున్నాము. మనము సత్కర్మలను ఆచరిస్తే సత్ఫలితాలు లభిస్తాయి.

దుష్కార్యములకు కష్టనష్టములు, దుష్ఫలితములు కలుగుతాయి. కాబట్టి చివరివరకు మనతో వచ్చేది మన కర్మఫలమే. మనము ఆర్జించుకొన్న సంపద, బంధువులు ఎవ్వరూ కూడా వెంటారారు.


మహాభారతంలో ధర్మరాజు తనకు ఎన్ని కష్టములు వచ్చినా వాటిని ఎంతో సంయమనంతో ఆలోచించి ధర్మ మార్గాన్నే అనుసరించాడు. అతడు ధర్మమునకు ప్రతిరూపమైన వాడు.ధర్మరాజు భారత యుద్ధానంతరం మహాప్రస్థానం చేయాలనే సంకల్పంతో తాను, తన నలుగురు తమ్ములు, భార్య ద్రౌపది, తన విశ్వాస పాత్రయైన కుక్కతో సహా ఏడుగురూ మేరు పర్వత ప్రాంతానికి బయలుదేరారు.*

త్రోవలో ద్రౌపది శరీరం సడలి నేలపై పడి ప్రాణాలు విడిచింది. వెంటనున్న భీముడు,ద్రౌపది ఎందుచేత ఈ విధంగా అసువులు బాసింది?’ అని అడిగాడు.ఆమెకు అర్జునునిపై గల అధిక అనురాగం!  అది ధర్మం కాకపోవటం!’ అని ధర్మరాజు చెప్పాడు.

తరువాత సహదేవుడు, అర్జునుడు, నకులుడు, భీముడు కూడా మరణించినారు.వారి మరణములకు వారి ధర్మాతిక్రమణ, అహంకారములే కారణంగా తెలుస్తుంది.

ధర్మరాజుతో కుక్క మాత్రం మిగిలి వుంటుంది. ధర్మరాజును స్వర్గమునకు తీసుకుపోవటానికి ఇంద్రుడు విమానంతో వచ్చాడు. ధర్మరాజును విమానం అధిరోహించ మన్నాడు ఇంద్రుడు. ‘నాతో బాటుగా శునకం కూడా వున్నది దానితో వస్తా’నంటాడు.

స్వర్గంలో శునకములకు తావులేదు కాబట్టి దానిని వదలిపెట్టి విమానం అధిరోహించ’మంటాడు ఇంద్రుడు.ధర్మరాజు ఒప్పుకోడు. అది మిత్రద్రోహం. పాపహేతువు. కాబట్టి స్వర్గానికిరాను అంటాడు.


ఈ విధమైన ధర్మాధర్మ వివాదమును శునకరూపంలో చూస్తున్న యమధర్మరాజు తన నిజరూపమును ధరించి ధర్మరాజు యొక్క ధర్మజ్ఞతకు సంతోషించి ధర్మరాజును ఇంద్రునితో స్వర్గానికి పంపుతాడు.

మరియొక సందర్భంలో కూడా ధర్మరాజు యక్ష ప్రశ్నలకు సమాధానమిచ్చినప్పుడు ఆ సమాధానములకు సంతోషించిన యక్షుడు ధర్మరాజుతో నీ సమాధానములు ప్రశంసనీయముగా పున్నాయి, సంతోషం కలిగింది. దానికి ఫలంగా, ‘అసువులు బాసిన నీ సోదరులలో ఒకరిని పునర్జీవితులను చేసుకో’వలసినది అని అంటాడు.

*అందులకు ధర్మరాజు ‘నా తల్లికి సంతానమైన ముగ్గురలో నేను జీవితుడనై వున్నాను కాబట్టి మా పినతల్లి సంతానములో ఒకడైన నకులుడిని పునర్జీవిని చేయమ’ని అడుగుతాడు.*

ధర్మరాజు యొక్క పరమధార్మికమైన సమాధానముకు మిక్కిలి సంతోషించిన యక్షుడుతమ్ములనందరినీ పునర్జీవులను చేస్తాడు. ఈ విధంగా ధర్మమును చక్కగా ఆచరించిన వాడగుట చేతనే ధర్మము అతనిని ఎల్లవేళలా కాపాడుతూ వచ్చింది.*

ధర్మమును ఉపేక్షిస్తే అనర్ధములు జరుగుతాయి. అధర్మము పెరిగిపోతుంది. ధర్మగ్లాని (పతనము) ఏర్పడుతుంది. ధర్మగ్లానిని ఉద్దరించటానికే భగవంతుడు అవతరించవలసి వస్తుంది. అప్పుడు ధర్మము కాపాడబడుతుంది. మన పూర్వజులంతా ధర్మమును ఆచరించి, ధర్మమునకు ప్రాధాన్యత ఇచ్చి మహాత్ములైనారు.

*ధార్మిక జీవనమునకు ఆధ్యాత్మిక దినచర్య ప్రణాళికగా రూపొందించి తద్వారా జీవిత సాఫల్యము సుగమం చేశారు.*✍️

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

ఆనందంగా ఉండాలంటే (20-May-24, Enlightment Story)

 ఆనందంగా ఉండాలంటే..! 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺🍀 🌺 🌺   ఆనందంగా ఉండాలనుకుంటున్నారా నిజమా? అయితే కొన్ని నిమిషాలు మీ కోసం కేటాయించండి .  మంచిదే !...