Thursday 12 October 2023

ఉండకూడని లక్షణం (13-Oct-23, Enlightenment Story)

 ఉండకూడని లక్షణం✍️

🍁🍁🍁🍁🍁🍁 🍁🍁

భాగవతంలో కార్తవీర్యార్జునుడిరాజు లోభం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్నీ ఉన్నా మనుషులు ఇలా దిగజారతారా అనిపిస్తుంది. ఆయన తన పరివారంతో సహా అడవికి వేటకు వెళ్ళాడు. తిరిగి తిరిగి చివరకు జమదగ్ని ఆశ్రమానికి చేరు కున్నాడు. అక్కడ కాస్త దప్పిక తీరితే చాలనుకుంటున్నప్పుడు మహర్షి భోజనమే పెడతానన్నాడు. కందమూలాలు అనుకుంటే, షడ్రసోపేతమైన విందుభోజనమే పెట్టాడు. తనకే కాదు, తనతో ఉన్న సైన్యం అంతటికీ దప్పిక, ఆకలి పూర్తిగా తీరి పోయాయి. అప్పటికప్పుడు అంతమందికి అంత గొప్ప విందు ఏర్పాట్లు ఎలా జరి గాయని రాజుకు అనుమానం వచ్చింది.

జమదగ్ని మహర్షి దగ్గర సుశీల అనే గోవు ఉంది. అది కామధే నువు దాన్ని ప్రార్ధించి రాజోచిత మైన విందు భోజనాలను అంతమం దికి మహర్షి కొద్ది వ్యవధిలోనే ఏర్పాటు చెయ్యగలిగాడు. ఆశ్చ ర్యానికి లోనైన రాజు కన్ను కామదే నువుపై పడింది.

మనిషి స్వభావంలో ఒక చిత్రమైన విషయం ఏమిటంటే కోరికలు తీరే కొద్దీ కొత్తవి పుడుతూనే ఉంటాయి. ఒకటి తీరేసరికి మరొకటి, అది తీరే. సరికి ఇంకొకటి. అంతేకాదు- చివరికి ఇంకొకడికి దక్కనివ్వకుండా మొత్తం దోచేద్దామని అనిపిస్తుంది. దాన్నే లోభం అంటారు.

సరిగ్గా ఇలాంటి సన్నివేశమే. రామాయణంలోనూ ఉంది. విశ్వా మిత్రుడు అప్పటికింకా రాజు మాత్రమే. రుషి కాలేదు. ఆయనోసారి ఇలాగే సైన్యంతో ఊరేగుతూ వసిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ బృందానికి వసిష్ఠుడు తన దగ్గరున్న శబల అనే ధేనువు సాయంతో జమదగ్నిలాగే మహత్తరమైన విందు చేశాడు. కార్తవీర్యుడు జమదగ్నిని కోరినట్లే విశ్వామిత్రుడు వసిష్టుణ్ని కోరాడు ఆ ధేనువును తన సొంతం చెయ్యమని. ఇది లోఖానికి పరాకాష్ట!

మహాభారతంలో ధృతరాష్ట్రుడిది రాజ్యలోభం. ఆయన పుట్టుగుడ్డి, కనుక ధర్మ శాస్త్ర రీత్యా ఆయనకు రాజ్యాధికారం దక్కలేదు. తమ్ముడు పాండురాజు రాజు. య్యాడు. కొద్దికాలానికి పాండురాజు ఆకస్మికంగా మరణించడంతో రాజ్య సంరక్షణ బాధ్యత దృతరాష్ట్రుడికి సంక్రమించింది. క్రమంగా రాజభోగాలకు ఆయన బాగా అలవాటు పడ్డాడు. ఆది లోభానికి దారితీసింది. తన చేజిక్కని రాజ్యశ్రీని కనీసం తన కొడుక్కి అయినా కట్టబెట్టాలని అనిపించి, ఆయన ఎన్నో పన్నాగాలు పన్నాడు. చివరకు రాజ్యాన్నే కాదు, నూరుమంది సంతానాన్ని పోగొట్టుకొన్నాడు.

రామాయణంలో భరతుడికి లభించింది. తాత్కాలిక రాజభోగమే. అయితే భర తుడు ప్రలోభానికి లోనుకాలేదు. రాముడి రాజ్యానికి కేవలం ధర్మకర్తగానే వ్యవహరించాడు. రావణ సంహారం పిదప రాముడు తనకన్నా ముందుగా హనుమను పంపి, భరతుడి మదిలో ఏ మూలనైనా రాజ్యకాంక్ష మెదులుతున్నదేమో గమనిం చమని కోరాడు. శీలపరీక్ష లాంటిదది. అందులో భరతుడు గెలిచాడు. తన లోభ రాహిత్యాన్ని నిరూపించుకొని లోకంనుంచి గౌరవాలను పొందాడు. లోభం ఆవరించి మనిషి గుడ్డివాడు కారాదని తన ప్రవర్తన ద్వారా లోకానికి బోధించాడు. భారత భాగవత రామాయణ కథల్లోని వ్యత్యాసం, పరమార్ధం గ్రహించిననాడు. మనిషి లోభం నుంచి, వ్యామోహం నుంచి బయటపడతాడు.

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃


No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...