Wednesday 11 October 2023

గురువు వల్లే సాధ్యం! (12-Oct-23, Enlightenment Story)

 గురువు వల్లే సాధ్యం!

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

కొడుకులు-కూతుర్లు బాకీ సంబంధం తో పుడతారు. ఒక గురువు చెట్టు క్రింద కూర్చొని భక్తి గురించి దేవుని గురించి ‘జన్మరాహిత్యం’గురించి చెబుతున్నాడు. అటుగావెళుతున్న బాటసారిగురువు చెబుతున్నది వినిదగ్గరకు వెళ్లితనకుమంత్రోపదేశం ఇవ్వమని అడిగాడు.

గురువు అప్పుడు అడిగాడు,‘నీకు భార్య బిడ్డలుఉన్నారా...’ అని.తనభార్య గర్భవతి అని చెప్పాడు. 

’గురుదక్షిణగా నువ్వు నాకే మిస్తావు?’అని అడిగాడు గురువు.

‘మీరు ఏదిఅడిగితే అదే ఇస్తాను.’అన్నాడు.

’సరే...నీభార్యను అడిగి రా...తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వ గలదా అలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను. వెళ్లి నీ భార్యను అడిగి రా! పిల్ల పుట్టిన వెంటనే రక్తం మడుగులోఉండ గానే నాకుఇచ్చేయాలి.’ అన్నాడు గురువు.

అతను వెంటనేఇంటికి పరుగెత్తి భార్యకు విషయంచెప్పిమన పిల్లలను గురువుకుఇవ్వ గలవా?అని అడిగాడు.

అందుకు ఆమె‘అలాగే ఇచ్చేద్దాం.మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా,’అంటూ ఒప్పుకుంది.ఆవిషయాన్ని గురువుకు చెప్పాడు. 

కొద్ది రోజులకి ఆమె ప్రసవించింది.మగ పిల్లవాడు పుట్టాడు.ఆ పిల్లవాడిని నెత్తుటి మడుగులో ఉండగానే తీసుకెళ్లి గురువు చేతిలో పెట్టారు.భార్య భర్తలు.

గురువు ఆపిల్ల వాడిని తీసుకెళ్లి గొయ్యితీసి అందులో పూడ్చేసాడు.

తల్లి దండ్రులుబిత్తర పోయి చూస్తూ,చేసేది ఏమి లేక వెనుతిరిగి వెళ్లిపోయారు.ఈవిధంగా రెండోపిల్లవాడినికూడగొయ్యిలోపూడ్చిపెట్టేసాడు.

మూడోసారికి ఆవిడ ఒప్పు కోలేదు.‘ఇదేం గురువయ్యా?నాకు నచ్చలేదు.నా కొడుకును ఇవ్వను కాక ఇవ్వను.’ అని మొండికేసింది.

అతను గురువువద్దకు వెళ్లి విషయంచెప్పాడు. గురువు గారే ఆమె దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు..’అమ్మా నీ బిడ్డను ఇవ్వనన్నావు కదా,ఇప్పుడు నీబిడ్డను నేనేమి చేయను.కాని ఒక్క సారి నీబిడ్డను... నా చేతి కిచ్చినా వెంట రండి.మీ బిడ్డనునేనేమి చేయను.మళ్ళీమీబిడ్డను మీకుఇచ్చేస్తాను’అనిఅన్నాడు.

సరేనని బిడ్డనుతీసుకొని గురువు వెంట బయలు దేరారు వారిరువురూ. గురువువీళ్లిద్దరినీ ఇంతకు ముందు గొయ్యి తీసి పెట్టిన చోటికితీసుకు కెళ్లాడు. ఆ రెండుగొయ్యిల మద్యన తెల్లని గుడ్డ పరిచి... ఈపిల్ల వాడిని వాటి మద్యలో పడుకోబెట్టి చేతిలోకి నీళ్ళు తీసుకొని మంత్రించి...ఆముగ్గురు పిల్లల మీద చల్లాడు.

తల్లిదండ్రులనుకొంచెం దూరంలోనిలబెట్టి...ఆ గొయ్యిలో నుండి వస్తున్న శబ్దాలను వినమన్నాడు. గొయ్యిలో నుండి మొదటి పిల్లవాడు రెండవ వాడిని అడుగు తున్నాడు…‘ఒరేయ్ వీళ్ళకు కొడుకుగా పుట్టావుకదా దేని కోసం పుట్టావు?వీళ్ళకి నీకు ఏమిటి సంబంధం?’అని అడిగాడు.

రెండో వాడు ఇలా చెబుతున్నాడు…‘గత జన్మలో వీడు నాకు బాకీ పడ్డాడు. నాకు డబ్బులు ఇవ్వకుండానే పోయాడు. అందుకనీ వీడికి కొడుకునై పుట్టి అందినంత లాగేసుకుందామని వచ్చాను.మరి నువ్వేందు కొచ్చావు?’అనిఅడిగాడు.

’వీడు నాకు కూడా ఇవ్వాలిరా...నేను కూడా అందుకే వచ్చాను.వీడికి కొడుకునై పుట్టి దొరికినంత దోచుకొని వదిలేసి వెళదామని వచ్చాను.కానీ వీడు మనల్ని గురువు చేతిలో పడ వేసాడు.ఇంకేముంది వాడుమనకు పడిన బాకీలన్నీ గురువు తెగ్గొట్టేసాడు.ఇప్పుడు వాడికి మనకీ రుణబంధం తెగిపోయింది.’అని వాళ్ళుమాట్లాడుకుంటున్నారు.

ఈఇద్దరూ కలిసి బ్రతికి ఉన్న మూడోవాడిని అడిగారు.‘ఒరేయ్ నువ్వెందుకొచ్చావురా?‘అని. అప్పుడు బ్రతికి ఉన్న మూడోవాడుఇలా చెప్పాడు,‘గతజన్మలో నాకు కొడుకులు బిడ్డలు ఉండికూడ దిక్కు లేకుండా పడిఉంటే వీడు నన్ను చేరదీసి అన్నం పెట్టి ఆదరించాడు.నేను పోయే వరకు నన్ను పోషించాడు.అందుకే... ఈ జన్మలో వీనికి కొడుకునై పుట్టి తల్లి తండ్రులిద్దరినీ వాళ్ళు బ్రతికినంత కాలం అన్నం పెట్టి వాళ్లను సంతోషంగా ఉంచి ప్రశాంతమైన జీవితాన్నివాళ్ళకు ఇచ్చి వారిరుణంతీర్చుకుందామని వారికి కొడుకునై పుట్టాను.మీరు ఆయన్ని పీడించాలని వచ్చారు. గనుక గురువు మిమ్మల్ని గొయ్యిలో పాతిపెట్టాడు. నేను అలా కాదు గనుక నేను బ్రతికి ఉన్నాను.’ అని చెప్పాడు.

ఈముగ్గురూ మాట్లాడుకున్నమాటలుఈ తల్లితండ్రులు విన్నారు. గురువు పాదాల మీద పడి క్షమించమని వేడు కున్నారు. కాబట్టీ ...గురువు లేని పూజ ఒ’గుడ్డి పూజ’ అని అర్దం. ఆత్మ జ్ఞానము తెలిసిన గురువును పట్టుకుంటే రుణానుబంధాలే కాదు, ‘జన్మ రాహిత్యమే’ జరుగుతుంది.

ఈ జన్మ లోనే మోక్షం లభిస్తుంది...మోక్షమంటే చని పోయిన తర్వాత మోక్షం వస్తుందనీ చాలా మంది అను కుంటారు.కాని అది కాదు. మోక్షం అంటే బ్రతి కుండగానే ఆత్మ జ్జానాన్ని పొందటం...

దైవం ఏ, ఏ, రూపాలలో ఉన్నాడు.ఎక్కడఉన్నాడు. ఏం చేస్తున్నాడు.ఈ సృష్టి ఏమిటి. ఎలాతయారైంది. నేనెవరిని,ఎక్కడ నుండి వచ్చాను.మళ్లి ఎక్కడికి వెళతాను.అసలు మాయ అంటే ఏమిటి? ఇలా ఎన్నో సృష్టి రహస్యలు బ్రతి కుండగానే తెలిసి పోతాయి.

ఇదే మోక్షం! మరో జన్మలేకుండా భగవంతుడు తనలో ఐక్యం చేసుకుంటాడు. ఈ ఆత్మజ్ఞానం కలగడానికి ధ్యానం అనే ఆత్మ విద్యను మనకి బోధిస్తారు. సద్గురువులు. ఇది కథ అయినా వాస్తవం!గురువుద్వారానే కర్మ పరిష్కారం కలుగుతుంది!✍️

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...