Thursday 5 October 2023

జీవన్ భద్రాణి పశ్యతి - నరసింహ సుభాషితం (11-Oct-23, Enlightenment Story)

 నరసింహ సుభాషితం 102 – శ్రీమద్రామాయణం 

🍁🍁🍁🍁🍁🍁 🍁🍁 🍁🍁🍁🍁🍁🍁 🍁🍁 

ఏ పాపం తెలియని ఓ పేద యువకుణ్ని రక్షకభటులు తీవ్రవాదిగా పొరబడ్డారు. ఖైదు చేశారు. ఆ హఠాత్ పరిణామానికి యువకుడు ఎంతో కలవరపడ్డాడు. తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తననే నమ్ముకుని జీవిస్తున్న ముసలి తల్లిదండ్రులు అనాథలవుతారని కుమిలిపోయాడు. దానికి తోడు ఉన్న కొద్దిపాటి పొలాన్ని దున్నేవాడు లేక అది బీడు పడిపోతోందంటూ తండ్రి నుంచి అందిన లేఖ మరింత కుంగదీసింది. మరణమే శరణ్యమనిపించింది.

అంతలో అతడికి రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన 'జీవన్ భద్రాణి పశ్యతి... బతికియున్నను సుఖములు బడయవచ్చుననే మాట గుర్తుకొచ్చింది. చచ్చి సాధించేదేమీ లేదని తనను తానే ఓదార్చుకున్నాడు. చటుక్కున ఒక ఆలోచన తోచింది. ఆశ చివురించింది. ఏం చెయ్యాలో వివరిస్తూ తండ్రికి ఉత్తరం రాశాడు. వారం తిరిగేసరికి తండ్రి నుంచి బదులు వచ్చింది.తమ పొలాన్ని రక్షకభటులే దగ్గరుండి దున్నించారని, వారు అలా ఎందుకు చేశారో అర్థం కాలేదని తండ్రి రాశాడు.

తన ఉపాయం ఫలించినందుకు సంతోషిస్తూ, ఆ యువకుడు 'నా మొదటి ఉత్తరాన్ని రక్షక భటులు తెరిచి చూస్తారని నాకు ముందే తెలుసు. అందుకే ఆ భూమిలో కొన్ని ఆయుధాలను దాచి పెట్టానని నీకు రాశాను. ఇప్పుడిక నీవు అదను చూసి ఓపిక చేసుకుని విత్తనాలు జల్లు' అని రాశాడు. ఆశ మనిషిని బతికిస్తుంది. ఆలోచన ముందుకు నడిపిస్తుంది. అదే ఈ కథలోని సందేశం.

శ్లోకం:

వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి

తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః ।। 

జీవన్ భద్రాణి పశ్యతి – జీవించి ఉంటే ఎన్నో మంచివి చూస్తాడు – ఎంతటి అద్భుతమైన వాక్యం! ఎంతటి అద్భుతమైన వాక్య నిర్మాణం! ఇదం సతతం మనసా స్మరయేత్!!

జీవన్ = బ్రతికి యుండి .

భద్రాణి = మంగళములను .

పశ్యతి = చూచుచున్నాడు

*జీవన్ భద్రాణి పశ్యతి* 

పూర్వ పుణ్యం ఫలించి, ఏ క్షణమైన అదృష్టం తిరగ వచ్చు. అది మొదలు సర్వ శుభాలను అనుభవించ వచ్చు. చెప్పలేము. అందువల్ల ప్రాణాలతో ఉండాలి. సీతమ్మ గూడా హనుమ ద్వారా తన భర్త క్షేమవార్త విని 

తాత్పర్యం:

ఈ శ్లోకం ఆది కవి వాల్మీకి సంస్కృత భాషలో రచించిన శ్రీమద్రామాయణములోని సుందరకాండలోని సీతాదేవిని హనుమ అన్వేషించే ఘట్టం 13 వ సర్గలోనిది. మరణించుట వలన పెక్కు ప్రమాదములు సంభవించును. బ్రతికియుండిన సుఖములు బడయ వచ్చును. బ్రతికియున్న వారు ఎన్నడైనను మఱల కలసికొనుట నిశ్చయము. అందువలన నేను ప్రాణములను నిలుపుకొందును

.

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃

Reference : నరసింహ సుభాషితం – ovlnmurthy (wordpress.com)

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...