Thursday 6 July 2023

ఆంగ్లము – అహంకారం

    ఆంగ్లము – అహంకారం

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹

ఒక కుటుంబం పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్తూ వారితో పాటుగా అమెరికాలో నివసిస్తున్న వారి స్నేహితుని  కుటుంబాన్ని కూడా తీసుకువచ్చారు. కానీ, ఆ స్నేహితునికి మన ధర్మము, సంస్కృతి సంప్రదాయాల మీద, ముఖ్యంగా కాషాయధారులైన సన్యాసుల మీద అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు. కానీ తన స్నేహితుని బలవంతం పైన మహాస్వామివారి దర్శనానికి వచ్చాడు. అతను మహాస్వామి వారిని ఒక సాధారణ మతవాదిగా, జ్ఞానశూన్యుడుగా తలచాడు. ఇతనికి స్వామివారిపై అస్సలు గౌరవం లేదు. అంతే కాకుండా అహంకారంతో ప్రవాసీయుడిననే పొగరుతో ‘ఆయనకు ఏమి తెలుసు?’ ‘ఆయనకు ఆంగ్లము ఏం వచ్చు?’ అని శ్రీమఠంలో నుంచొని అంటున్నాడు.

ఆ రోజు మఠంలో భక్తుల రద్దీ ఎక్కవగా ఉండటం వల్ల వీరు స్వామి వారికి చాలా దూరంగా నిలుచుని ఉన్నారు. వీరు వరుసలో నిలబడి ఉండటం స్వామివారు గమనించి వారి కృపాకటాక్ష వీక్షణములను వీరిపై ప్రసరించటం, వీళ్ళని మహాస్వామి పిలవటం, వారు సకుటుంబ సమేతంగా స్వామివారి దగ్గరికి వెళ్ళటం క్షణాల్లో జరిగిపోయింది. ఈ కుటుంబంతో పాటు అతని స్నేహితుడు కూడా మహాస్వామి ముందుకు వచ్చి నిలబడ్డాడు.

వారి యోగక్షేమాలు, కుటుంబం గురించి మహాస్వామి వారు అడిగి తెలుసుకొన్నారు. వారితోపాటు వచ్చిన ఆ ప్రవాసీయుడిని కూడా వివరములు అడిగి తెలుసుకున్నారు. స్వామివారు అతనితో, “నీవు భారతదేశంలోనే పుట్టి పెరిగావు నీకు తమిళం వచ్చు; నీ భార్య కూడా ఇక్కడే పుట్టినది కాబట్టి ఆమె మాతృభాష కూడా తమిళమే అయి ఉంటుంది. కనుక మీరు ఇద్దరూ మాట్లాడితే తమిళంలోనే మాట్లాడుకుంటారు కదా?” అని అడిగారు. దానికి అతను, “మేము ఎప్పుడూ ఆంగ్లములోనే మాట్లాడుకుంటాము. తమిళంలో ఎప్పుడూ మాట్లాడము, కాబట్టి మా పిల్లలు కూడా ఆంగ్లములోనే మాట్లాడుకుంటారు” అని అన్నాడు.

అందుకు మహాస్వామి వారు “ఓహో అలాగా! మనం మాట్లాడే ముందు ఆలోచన మన మెదడులో మొదలై అది వాక్కు రూపంగా నోటి నుండి బయటకు వస్తుంది కదా! మరి ఈ ప్రక్రియ అంతా ఆంగ్లములోనే జరుగుతుందా? తమిళంలోనా?” అని అడిగారు. అతను దానికి సమాధానంగా “అది కూడా అంగ్లంలోనే” అన్నాడు.

కొద్దిసేపటి తరువాత ఒక ముసలావిడ మహాస్వామి వారి దర్శనానికి వచ్చింది. అప్పుడు మహాస్వామి వారు అతనికి ఆమెను చూపిస్తూ, “ఈమె చాలా బీదరాలు. కానీ ఒకప్పుడు బాగా సంపన్నమైన కుటుంబము. అశాశ్వతమైన ఈ సంపద అంతా పోయినా, మఠంపై, పూర్వ ఆచార్యులపై, నాపై ఆమె భక్తి ఇసుమంతైనా తగ్గలేదు. నాకు ఇప్పుడు చెప్పు ‘ఎంత కష్టం వచ్చినా ఈమె మొక్కవోని భక్తిని, విశ్వాసాన్నికూడా తగ్గించలేని’ ఈ స్థితిని ఆంగ్లంలో ఏ పదంతో సూచిస్తారు?” అని అడిగారు.

అతను కొంత గందరగోళంలో పడి అలా ఆలోచిస్తూనే ఉండిపోయాడు. అలా ఆలోచించి, ఆలోచించి చివరికి తనకు తెలియదు అన్నాడు. స్వామి వారు మందహాసము చేసి “కావలసినంత సమయము తీసుకొని బదులివ్వమన్నారు”. చాలాసేపు ఆలోచించిన తరువాత కూడా అతను ఏమి చెప్పలేకపోతే మహాస్వామి వారు “నేను ఒక పదం చెప్తాను అది సరియో కాదో సరిచూసుకొనుము అని అది‘ఎక్విపోయిస్డ్(EQUIPOISED)’ అని అన్నారు.

అతను కన్నుల నీరు కారుస్తూ తన అహంకారాన్ని పారద్రోలినందుకు మహాస్వామికి సాష్టాంగం చేసి వారి  పాదాలపై పడి క్షమాపణలు చెప్పి, స్వామివారి ఆశీస్సులు అందుకున్నాడు.✍️

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...