Friday 7 July 2023

ఆవుపాల యొక్క ఉపయోగాలు

 🐄ఆవుపాల యొక్క ఉపయోగాలు HEALTH BENEFITS OF COW MILK🐄 

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥

ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ఆవుపాలకు ఎంతో విశిష్టత ఉంది. ఆవుపాలు పలచగా ఉండి త్వరగా జీర్ణమవుతుంది. శిశువులకు తల్లిపాలు లభించని సందర్భంలో ఆవుపాలు పట్టడం అత్యంత శ్రేయస్కరం. 100 గ్రాముల ఆవుపాల నుంచి 60 కేలరీల శక్తి లభిస్తుంది. 100 గ్రాముల ఆవుపాలలో పిండిపదార్ధాలు 5 గ్రా , ప్రోటీన్స్ 3 గ్రా , ఫాట్స్ 3 .5 గ్రా , ఫాస్ఫరస్ 87 మి.గ్రా , క్యాల్షియం 120 మి.గ్రా , ఐరన్ 0 .3 మి.గ్రా , సోడియం 34 మి.గ్రా , పొటాషియం 130 మి.గ్రా , A విటమిన్ 170 LU లు  B1 - 55 మి.గ్రా , B2 - 200 మి .గ్రా , B3 - 4 .8 మి.గ్రా , నియాసిన్ - 3 మి.గ్రా , కొలెస్టరాల్ 11 మి.గ్రా ఉన్నాయి. ఇవి జీర్ణం కావడానికి 2 గంటల సమయం పడుతుంది.

 🐄 ఆవుపాలలో ఉన్న మాంసకృత్తులలో మన శరీరానికి అవసరమైన" ఎమైనో యాసిడ్స్"  పుష్కలంగా లభిస్తాయి.  పైన చెప్పిన వివిధ మోతాదుల్లో మన శరీరానికి అవసరమైన ఎన్నో విలువైన విటమిన్లు , ధాతువులు మనకి ఆవు పాలలో లభ్యమవుతాయి.


🐄 ఆవుపాలతో వైద్యప్రక్రియలు : 🐄  " :

🐄ఆవుపాలలో "కాసినోజిన్" మరియు "లాక్టాల్ అల్బుమిన్ " అను మాంసకృత్తులు ఉన్నాయి . పాలలో ఉన్న మాంసకృత్తులు మన శరీరానికి అత్యవసరం. 

🐄 ఆవుపాలలో ఉన్న మాంసకృత్తుల వలన మన శరీరంలో "వ్యాధినిరోధక శక్తి" పెరుగుటయే కాక మాంసకృత్తులు శరీరంలో లోపించిన సందర్భాలలో అవి భర్తీ చేయబడతాయి.

 🐄 ఆవుపాలలో ఉన్న మాంసకృత్తులు చిన్నపిల్లలకు , గర్భిణీ స్త్రీలకు , పాలిచ్చు బాలింతలకు , జీర్ణశక్తి లోపించిన వారికి , శస్త్రచికిత్స చేయించుకున్న వారికి అత్యంత అవసరం. క్షయ , మధుమేహం , క్యాన్సర్ , ఉబ్బసం , నిద్రలేమి , నరాల బలహీనత లాంటి దీర్ఘకాల వ్యాదులలో ఆవుపాల యందు ఉన్న మాంసకృత్తులు దివ్యౌషధంలా ఉపయోగపడతాయి. 

🐄 ఆవుపాలయందు ఉన్న పదార్ధాలలో మాంసకృత్తుల తరువాత కొవ్వు ముఖ్యమైన పదార్థంగా చెప్పుకోవచ్చు . పాలలో కొవ్వు కరిగి ఉండుటచేత పాలకు తెలుపు రంగు ప్రాప్తించింది . పాలలో ఉండు కొవ్వు మన శరీరంలో తేలికగా జీర్ణం అగును. కొవ్వు తీసిన పాలను "SKIMMEF MILK" అంటారు.

🐄 ఆవుపాల యందు ఫాస్ఫెట్స్ , క్యాల్షియం , పొటాషియం వంటి ఖనిజ లవణాలు సమృద్దిగా ఉన్నాయి . ఎముకలు , కండరాల పెరుగుదలలో ఇవి ప్రముఖపాత్ర వహిస్తాయి. ఆవుపాలలో ఐరన్ మాత్రం చాలా తక్కువ శాతములో లభించును. కాబట్టి ప్రతిరోజూ ఆవుపాలు ఆహారంగా స్వీకరించేవారు ఐరన్ కలిగిన ఆహారం తీసుకోవాలి.

🐄 ఆవుపాలతో పాటు 2 ఖర్జురాలు కలిపి సేవిస్తుంటే ఐరన్ , క్యాల్షియం , ఫాస్ఫరస్ వంటి మినరల్స్  మరియు సాల్ట్స్ మన శరీరానికి పుష్కలముగా లభిస్తుంది.

🐄 ఆవుపాలలో ఖనిజ లవణాలతో పాటు సిట్రిక్ ఆసిడ్ కూడా క్యాల్షియం , మెగ్నిషియంలలో మిళితమై పుష్కలంగా ఉంటుంది. ఈ ఆసిడ్ కడుపులో కురుపులు రాకుండా ఆపడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...