Sunday 2 July 2023

గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ (03-Jul-23,Enlightenment Story)

 *గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ*  (సోమవారం, 03/07/2023)

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥

శ్లో|| ఏకాక్షరప్రదాతారం, యో గురుం నాభిమన్యతే|
స శ్వయోనిశతం గత్వా, చండాలత్వం అవాప్నుయాత్||

వసిష్ఠమహామునికి మునిమనుమడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరమునికి పుత్రుడు, శుకమర్షికి జనకుడైనట్టియు, నిర్మలుడైనట్టి, తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, అంటారు 

నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు.

సత్యవతికి, పరాశరమహర్షికి శ్రీమహావిష్ణువు అంశతో వ్యాసమహర్షి జన్మించిన తిథి ఆషాఢపూర్ణిమ. ఇదే వ్యాసపూర్ణిమ/గురుపూర్ణిమగా ప్రసిద్ధికెక్కినది. అనంతరం ఏకరూపం అయిన వేదాన్ని విభజించి, వేదవ్యాసుడయ్యాడాయన. అష్టాదశమహాపురాణాలను, ఉపపురాణాలను, మహాభారతసంహితను, బ్రహ్మసూత్రాలను లోకాలకి అందించిన విష్ణుస్వరూపుడైన వ్యాసుని జన్మమాసం ఈ ఆషాఢమాసం. పూర్ణిమ నాడు గురుపూజ చేసినవారు దక్షిణామూర్తి స్వరూపులవుతారు.

1. వేదవ్యాసుడు సాక్షాత్తు విఘ్ణస్వరూపుడు. వ్యాసో నారాయణో హరిః అని సమస్త జగత్తు ఆయన్ని కీర్తించింది.
2. శ్రీమన్నారాయణుడు భూమిపై ధరించిన ఇరవైరెండు అవతారాల్లో ఒక దివ్య అవతారం వ్యాసావతారం.
3. సత్యవతికి, పరాశరుడికి వ్యాసుడు ఆషాఢమాసంలో పూర్ణిమ నాడు సరిగ్గా మధ్యాహ్నం                 సమయంలో ఇంచుమించుగా 11:౩౦ కి ఆవిర్భవించినట్టుగా పురాణాలు చెపుతున్నాయి.
4. వ్యాసపూర్ణిమని గురుపూర్ణిమ అని పిలవబడడానికి కారణం అందరికి గురువు ఆయనే. విష్ణువు, వ్యాసుడి రూపంలో వచ్చి, వేదములను విభజించి ఇచ్చిన మహానుభావుడు.

వ్యాసుని తల్లిదండ్రులు సత్యవతి,పరాశరుడు. వేదాలను నాలుగుభాగాలుగా విభజించి పైలుడనే శిష్యుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమిని అనే శిష్యుడికి సామవేదాన్ని, సుమంతుడనే శిష్యుడికి అధర్వణవేదాన్ని తెలిపి వ్యాప్తిచేయమని ఆదేశించాడు.

గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫల దాయకం.



💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
అన్నింటికంటే గురుద్రోహం మహాపాతకం. గురుద్రోహికి ప్రాయశ్చిత్తం చాలాకష్టం. ఒక్క అక్షరం లేక ఓంకారం, ఉపదేశంగా ప్రసాదించిన గురువును గౌరవించని పాపి, వరుసగా నూరుజన్మలు కుక్కగా పుడతాడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఆషాఢశుక్లద్వాదశీ వ్రతం. 
ఆషాఢ శుక్లద్వాదశి నాడు ఉదయాన్నే లేచి, శిరస్నానం చేసి, గోపంచకంతో విప్రుల పాదాలు కడిగి, ఆపై శివాలయంలోని అర్చకునకు, స్వయంపాకాదులు దానం చేస్తే, గురుద్రోహ పాపం ఉపశమిస్తుంది.
ఆచరించవలసిన విధివిధానములు 
1. మనం ఎక్కడున్నా తప్పకుండా గురువుని ధ్యానించాలి, కుదిరితే గురువుని దర్శించి, సేవ చేసి, ప్రదక్షిణ చేసి, దక్షిణ సమర్పించాలి.
2. గురువుకి దూరంగా ఉన్నవారు, ఇంట్లోనే కూర్చుని యథాశక్తిగా గురువుని అర్చించాలి.
3. ఎంత ఎక్కువ గురుస్మరణ చేస్తే, జీవితంలో అంత ఎక్కువ శుభాలను పొందుతారు.
4. అమ్మవారి దగ్గర ఉన్న చింతామణి ఇచ్చేటటువంటి శుభాలు పొందాలంటే గురువు పాదాలు పట్టుకోవాలి.
5. గురువు అనుగ్రహిస్తే యోగాలు కూడా పొందలేనటువంటి శుభాలు ఈ జన్మలో పొందవచ్చు.
6. వ్యాసపూర్ణిమ నాడు తప్పక గురువును పూజించడంవల్ల భగవంతుడి అనుగ్రహం పొందవచ్చు. అందువల్లే తమ గురువుని వ్యాసుడిగా భావించి, భక్తితో పూజించాలి.   రేపు గురు పూర్ణిమ: వ్యాసుని పూజిస్తే అనుగ్రహిస్తాడు.. ఈ కథే ఉదాహరణ!_🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. పూర్వ కాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యా బుద్ధులు నేర్చుకునేవారు. ఆశ్రమంలోనే ఆయనతోపాటు నివశించేవారు.ఆషాఢ శుద్ధపౌర్ణమిని *‘గురుపూర్ణిమ’ ‘వ్యాసపూర్ణిమ’ అని అంటారు. ఈ రోజున గురువులను పూజించి , గౌరవిస్తారు. గురు పూర్ణిమ రోజునే వ్యాసమహర్షి జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ రోజున గురు భగవానుడిని , వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః  గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః’ గురు పౌర్ణమి చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. యతులు ఎక్కడకీ వెళ్లకుండా ఒకచోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాసం. ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురుపౌర్ణమి. అంటే తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను సమీపించి , పూజించి , జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురుపౌర్ణమి భూమికగా నిలుస్తుంది. గురుపూజ శ్రేష్ఠమైంది. దీని వెనుక ఒక విశిష్టత దాగి ఉంది.పురాణాల కథనం ప్రకారంపూర్వం వారణాసిలో బీద బ్రాహ్మణ దంపతులు నివాసం ఉండేవారు. ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి. ఆయన సతీమణి పేరు వేదవతి. ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన , భక్తి జ్ఞానం కలిగి జీవించే ఈ దంపతులకు సంతానం లేదు. ఎన్ని నోములు నోచి , వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాసభగవానుడు రోజూ మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా ఆయన దర్శించుకోవాలని భావించాడు. ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం వేయికళ్లతో వెతకడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షువు రూపంలో చేతిలో దండం , కమండలం ధరించిన వ్యక్తిని చూసిన వేదనిధి వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు. ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా ‘మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను. కాబట్టి మిమ్మల్ని శరణు పొందగోరు చున్నాను’ అని అంటాడు. ఆ మాటలకు ఖంగుతిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున నలుదిశలా చూస్తూ , ఎవరైనా తనను చూస్తున్నారేమోనని పరికించాడు. వెంటనే వేదనిధిని ఆప్యాయంగా పైకిలేపి ఏమి కావాలో కోరుకోమంటారు. రేపు నా తండ్రి పితృకార్యం , దానికి తమరు బ్రాహ్మణార్థమై అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చేయాలని వేడుకుంటాడు. వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి మహర్షి దీనికి అంగీకరిస్తాడు. దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరంలో జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాసభగవానుడిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు , పువ్వులను సిద్ధం చేసి , శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహించి , అనంతరం వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ఆతిథ్యానికి సంతుష్ఠుడైన ఆయన వారికి ఏ వరం కావాలో కోరుకోమన్మారు.స్వామి ఎన్ని నోములు , వ్రతాలు చేసినా సంతానభాగ్యం మాత్రం లేదని , ఆ వరాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతులు , ఐశ్వర్యవంతులైన పది మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు. వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి , వేదవతి సంతానయోగం లభించింది. సుఖసంతోషాలతో జీవిత చరమాంకంలో విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు. కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున మహామునిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు.     
రేపు (03.07.2023) వ్యాస పూర్ణిమ సందర్భంగా శ్రీ వేదవ్యాస అష్టోతరశతనామావళిః 🙏
1. ఓం వేదవ్యాసాయ నమః
2. ఓం విష్ణురూపాయ నమః
3. ఓం పారాశర్యాయ నమః
4. ఓం తపోనిధయే నమః
5. ఓం సత్యసన్ధాయ నమః
6. ఓం ప్రశాన్తాత్మనే నమః
7. ఓం వాగ్మినే నమః
8. ఓం సత్యవతీసుతాయ నమః
9. ఓం కృష్ణద్వైపాయనాయ నమః
10. ఓం దాన్తాయ నమః
11. ఓం బాదరాయణసంజ్ఞితాయ నమః
12. ఓం బ్రహ్మసూత్రగ్రథితవతే నమః
13. ఓం భగవతే నమః
14. ఓం జ్ఞానభాస్కరాయ నమః
15. ఓం సర్వవేదాన్తతత్త్వజ్ఞాయ నమః
16. ఓం సర్వజ్ఞాయ నమః
17. ఓం వేదమూర్తిమతే నమః
18. ఓం వేదశాఖావ్యసనకృతే నమః
19. ఓం కృతకృత్యాయ నమః
20. ఓం మహామునయే నమః
21. ఓం మహాబుద్ధయే నమః
22. ఓం మహాసిద్ధయే నమః
23. ఓం మహాశక్తయే నమః
24. ఓం మహాద్యుతయే నమః
25. ఓం మహాకర్మణే నమః
26. ఓం మహాధర్మణే నమః
27. ఓం మహాభారతకల్పకాయ నమః
28. ఓం మహాపురాణకృతే నమః
29. ఓం జ్ఞానినే నమః
30. ఓం జ్ఞానవిజ్ఞానభాజనాయ నమః
31. ఓం చిరఞ్జీవినే నమః
32. ఓం చిదాకారాయ నమః
33. ఓం చిత్తదోషవినాశకాయ నమః
34. ఓం వాసిష్ఠాయ నమః
35. ఓం శక్తిపౌత్రాయ నమః
36. ఓం శుకదేవగురవే నమః
37. ఓం గురవే నమః
38. ఓం ఆషాఢపూర్ణిమాపూజ్యాయ నమః
39. ఓం పూర్ణచన్ద్రనిభాననాయ నమః
40. ఓం విశ్వనాథస్తుతికరాయ నమః
41. ఓం విశ్వవన్ద్యాయ నమః
42. ఓం జగద్గురవే నమః
43. ఓం జితేన్ద్రియాయ నమః
44. ఓం జితక్రోధాయ నమః
45. ఓం వైరాగ్యనిరతాయ నమః
46. ఓం శుచయే నమః
47. ఓం జైమిన్యాదిసదాచార్యాయ నమః
48. ఓం సదాచారసదాస్థితాయ నమః
49. ఓం స్థితప్రజ్ఞాయ నమః
50. ఓం స్థిరమతయే నమః
51. ఓం సమాధిసంస్థితాశయాయ నమః
52. ఓం ప్రశాన్తిదాయ నమః
53. ఓం ప్రసన్నాత్మనే నమః
54. ఓం శఙ్కరార్యప్రసాదకృతే నమః
55. ఓం నారాయణాత్మకాయ నమః😘
56. ఓం స్తవ్యాయ నమః
57. ఓం సర్వలోకహితే రతాయ నమః
58. ఓం అచతుర్వదనబ్రహ్మణే నమః
59. ఓం ద్విభుజాపరకేశవాయ నమః
60. ఓం అఫాలలోచనశివాయ నమః
61. ఓం పరబ్రహ్మస్వరూపకాయ నమః
62. ఓం బ్రహ్మణ్యాయ నమః
63. ఓం బ్రాహ్మణాయ నమః
64. ఓం బ్రహ్మిణే నమః
65. ఓం బ్రహ్మవిద్యావిశారదాయ నమః
66. ఓం బ్రహ్మాత్మైకత్వవిజ్ఞాత్రే నమః
67. ఓం బ్రహ్మభూతాయ నమః
68. ఓం సుఖాత్మకాయ నమః
69. ఓం వేదాబ్జభాస్కరాయ నమః
70. ఓం విదుషే నమః
71. ఓం వేదవేదాన్తపారగాయ నమః
72. ఓం అపాన్తరతమోనామ్నే నమః
73. ఓం వేదాచార్యాయ నమః
74. ఓం విచారవతే నమః
75. ఓం అజ్ఞానసుప్తిబుద్ధాత్మనే నమః
76. ఓం ప్రసుప్తానాం ప్రబోధకాయ నమః
77. ఓం అప్రమత్తాయ నమః
78. ఓం అప్రమేయాత్మనే నమః
79. ఓం మౌనినే నమః
80. ఓం బ్రహ్మపదే రతాయ నమః
81. ఓం పూతాత్మనే నమః
82. ఓం సర్వభూతాత్మనే నమః
83. ఓం భూతిమతే నమః
84. ఓం భూమిపావనాయ నమః
85. ఓం భూతభవ్యభవజ్జ్ఞాత్రే నమః
86. ఓం భూమసంస్థితమానసాయ నమః
87. ఓం ఉత్ఫుల్లపుణ్డరీకాక్షాయ నమః
88. ఓం పుణ్డరీకాక్షవిగ్రహాయ నమః
89. ఓం నవగ్రహస్తుతికరాయ నమః
90. ఓం పరిగ్రహవివర్జితాయ నమః
91. ఓం ఏకాన్తవాససుప్రీతాయ నమః
92. ఓం శమాదినిలాయాయ నమః
93. ఓం మునయే నమః
94. ఓం ఏకదన్తస్వరూపేణ లిపికారిణే నమః
95. ఓం బృహస్పతయే నమః
96. ఓం భస్మరేఖావిలిప్తాఙ్గాయ నమః
97. ఓం రుద్రాక్షావలిభూషితాయ నమః
98. ఓం జ్ఞానముద్రాలసత్పాణయే నమః
99. ఓం స్మితవక్త్రాయ నమః
100. ఓం జటాధరాయ నమః
101. ఓం గభీరాత్మనే నమః
102. ఓం సుధీరాత్మనే నమః
103. ఓం స్వాత్మారామాయ నమః
104. ఓం రమాపతయే నమః
105. ఓం మహాత్మనే నమః
106. ఓం కరుణాసిన్ధవే నమః
107. ఓం అనిర్దేశ్యాయ నమః
108. ఓం స్వరాజితాయ నమః
|| ఇతి శ్రీ వేదవ్యాస అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...