Wednesday 28 February 2024

పక్షి నేర్పిన పాఠం (29-Feb-24, Enlightenment Story)

 పక్షి నేర్పిన పాఠం 

🌺🍀🌺🍀🌺🌺🍀         


ఓ వూరి దగ్గరి పొలంలో సారసపక్షుల జంట నివసిస్తూ వుండేది. ఆడ సారసపక్షి గుడ్లు పెట్టింది. కొంత కాలానికి గుడ్లలో నుంచి పిల్లలు బయటికి వచ్చాయి. వాటికి రెక్కలు వచ్చి, అవి ఎగరటానికి ముందే పంట కోతకు వచ్చింది. సారస పక్షులకు దిగులు చుట్టు కొనింది. రైతు పంటను కోయటానికి ముందే, పిల్లలతో పాటు మరో సురక్షితమైన చోటుకి ఎగిరి వెళ్లాలి. కాని పిల్లలు ఎగరలేవే? అప్పుడు సారసపక్షి పిల్లలతో ఇలా అంది - 'మేం లేనప్పుడు ఎవరైనా పొలం వద్ద ఏమైనా మాట్లాడుకొంటే విని మాకు చెప్పండి.'



ఓ రోజు సారసపక్షి మేత తీసుకొని సాయం కాలం గూడు చేరుకొంది. అప్పుడు పిల్లలు ఇలా అన్నాయి - “ఈ రోజు రైతు వచ్చాడు. పొలం చుట్టూ తిరిగాడు. ఒకటి, రెండు, చోట్ల నిలబడి పొలం వైపు చాలాసేపు చూసాడు. చేను కోతకు వచ్చింది. ఇక కొయ్యాల్సిందే. ఈ రోజే వెళ్లి వూళ్లోని వాళ్లతో నా చేను కోయమని చెప్తాను.” అన్నాడు.

“మీరేమీ భయపడకండి. రైతు ఇప్పుడిప్పుడే చేను కొయ్యడు. ఇంకా కొన్ని రోజులు మనం ఇక్కడే హాయిగా వుండొచ్చు” అని పక్షి పిల్లలతో చెప్పింది.

కొద్ది రోజులు గడిచాయి. ఓ రోజు సారసపక్షి సాయంకాలం గూడు చేరుకొంది. అప్పుడు
పిల్లలు బితుకు బితుకుమంటూ ఇలా చెప్పాయి.

“మనం వెంటనే ఈ చేను వదిలి వెళ్లాలి. ఈ రోజు రైతు మళ్లీ వచ్చాడు. ఊళ్లోని రైతులు చాలా స్వార్థపరులు. నా చేను కొయ్యటానికి ఇంతవరకు రాలేదు. నేను నా అన్నతమ్ముల్ని పిలిపించి వాళ్లతో పంట కోయిస్తాను.”

సారసపక్షి హాయిగా, నిశ్చింతగా కూర్చొని పిల్లలతో ఇలా చెప్పింది “ఇప్పుడిప్పుడే రైతు పంట కోయించడు. నాలుగైదు రోజుల్లో మీరు ఎంచక్కా ఎగరగలరు. ఇప్పుడిప్పుడే మనం పాలం విడిచి మరో చోటికి పోనక్కర్లేదు.”

“అన్నతమ్ములు నా మాట వినడం లేదు. ఏదో ఓ నేపంతో తప్పించుకొంటున్నారు. పైరు బాగా ఎండిపోయి గింజలు నేల రాలిపోతు న్నాయి. రేపు పొద్దు పొడవగానే నేనే వచ్చి కోత మొదలెడ్తాను.”

అప్పుడు సారసపక్షి భయపడింది. “అరరే! వెంటనే బయలుదేరండి. ఇంకా చీకటి పడలేదు. మరో చోటికి వెళ్లి తలదాచుకొందాం. రైతు రేపు తప్పకుండా పంట కోస్తాడు.” అని.

పిల్లలు ఆదుర్దాగా అడిగారు “ఎందుకు వెళ్లాలి? రైతు రేపు పంట కోస్తాడన్న నమ్మకం ఏంటి?”


సారసపక్షి ఇలా బదులు చెప్పింది.  “రైతు గ్రామస్తులను, సోదరులను నమ్ముకొన్నంత కాలం పంట కోస్తాడన్న నమ్మకం కలుగలేదు. తన పని తాను చేయకుండా, ఇతరులు చేసి పెడ్తారని అనుకున్నంత కాలం ఎవరి పనులు జరగవు. కాని ఎవరంతట వారు, తమ పనులు చేసుకోవాలని నిర్ణయించుకొన్నప్పు డు, అవి చకచకా సాగిపోతాయి. రైతు తానే రేపు పంట కోస్తానని అన్నప్పుడు, ఆ పని తప్పకుండా జరిగి తీరుతుంది.” అన్నది.

సారసపక్షులు పిల్లలతో ఆ క్షణమే మరో సురక్షితమైన చోటికి ఎగిరిపోయ్యాయి.
ఆ మరుసటి రోజు రైతు తానే పనిముట్లు తెచ్చుకుని పంట కోత మొదలుపెట్టాడు.

నీతి: ఒకరి మీద ఆధారపడకుండా పనులు మొదలుపెడితేనే పనులు సజావుగా, చక్కగా సాగుతాయి.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...