Saturday 10 February 2024

భక్తి - చాదస్తం (11-Feb-24, Enlightenment Story)

 భక్తి - చాదస్తం

🌺🍀🌺🍀🌺
మనం నిత్యం భగవంతునికి పూజలు, పునస్కారములు ఆచరిస్తూ, ఆయన అనుగ్రహం పొందడానికి ఎన్నో తాపత్రయాలు పడుతుంటాము. ఒక్కసారి ఇది చదివితే, మనం పూజ భక్తితో నిర్వహిస్తున్నామో, లేక అనవసరమైన చాదస్తంతో, ఆర్భాటాలు చేస్తున్నామో అర్థం అవుతుంది.

ఏది భక్తి
ఒక్కోసారి మనకు అర్ధం పర్దం లేని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. పూజానియమాలు తెల్సుకోవడం మంచిదే , పూజలో దోర్లుతున్న తప్పులను సవరించుకోవడం మంచిదే కాని వాటికోసం పూజనే మానివేయడం తప్పు.



దేవుడు ఎంత కారుణ్య మూర్తో చూడండి!!!

1. భక్తకన్నప్ప పెట్టిన నైవేద్యం ఏమిటో తెలుసుకదా జింక మాంసం .. అయినా అయన భక్తితో పెట్టిన నైవేద్యం కాబట్టి దేవుడు స్వీకరించాడు, కాని... దేవుడు ఛీ నీచుడా... నీకు ఏమి నైవేద్యంగా పెట్టాలో తెలియదు. నువ్వు స్నానం చేసావా ముందు, విభూది కూడా పెట్టుకోలేదు దూరం జరుగు అనలేదు, పరమ సంతోషంతో స్వీకరించాడు.

ఇక్కడ అర్ధం చేస్కోవాల్సింది అందర్నీ జింక మాంసం పెట్టమని కాదు శివుడికి జింక మాంసం ఇష్టం అని కాదు, నువ్వు భక్తితో ఏది పెట్టిన భగవంతుడు స్వీకరిస్తాడు అనేది గ్రహించాలి.

2. గజేంద్ర మోక్షం లో గజ రాజు ప్రాణం పోతున్న సమయంలో స్వామి వారిని పిలిస్తే వైకుంఠం నుండి పరుగెత్తుకుని మరీ వచ్చాడు. పైగా తను నిత్యం ధరించే శంకు చక్రాలను ధరించకుండా, లక్ష్మి దేవికి కూడా చెప్పకుండా వచ్చి రక్షించాడు.

అంతే కాని నీ చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా పూజ చేయలేదు, ఈ ఆపద వేళలో మాత్రమే నీకు గుర్తుకు వచ్చానా .. నీ చావు నువ్వు చావు అనలేదు, ఇక్కడ మనం ఆర్థం చేసుకోవాల్సింది ఏమిటి. ఆపదలో ఉన్నవాణ్ణి , ఆర్తితో పిలిచినవాడిని, నీవుదప్ప వేరెవరూ లేరని సంపూర్ణ శరణాగతుడవైతే అప్పుడు శ్రీహరి నిన్ను కాపాడటానికి ఏ రూపంలో ఐనా సరే, ఏ సమయంలోనైనా సరే వచ్చికపాడతాడు, అదే ఆయన నైజం.

3. ద్రౌపతి వస్త్రాపహారణ వేళ నిండు సభలో రక్షించు వారెవరూ లేనప్పుడు ఇతరులెవ్వరు తనకు అండ లేనప్పుడు అన్నా శ్రీ కృష్ణా అంటే వెంటనే వచ్చి వస్త్రాలు ఇచ్చి రక్షించాలేదా. నిన్ను ముట్టుకోకూడదు మూడు రోజులు తరువాత పిలుస్తే వస్తాను, అప్పటివరకు నన్ను తలచకు అని చెప్పలేదే, భక్తీతో స్వామి నీవే తప్ప నన్ను రక్షించేది ఎవరు అని శరణు వేడితే తప్పకుండ ఏదో ఒక రూపం లో స్వామి పలుకుతాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది.
మనకు కావలసింది సంపూర్ణ భక్తి మాత్రమే.

ఏది చాదస్తం

దేవునికి ఇటు ముఖం ఉండాలి, అటు ముఖం ఉండాలి అని కొందరు,ఇవి నైవేద్యంగా పెట్టారాదు, అది పెట్టాలి అని కొందరు,వారు చెప్పేది ఎలా ఉంటుందంటే వీరికెప్పుడో దేవుడు ప్రత్యక్షంగా కనిపించి ఇది వద్దు అని చెప్పినట్లుగా చెబుతారు.

పూజ చేసేటప్పుడు ఎన్ని వత్తులు వెయ్యాలి, అవి ఏ దిక్కుకు తిప్పాలి, ఏ నూనేతో వెలిగించాలి అంటూ పూజ ప్రారంభం లోనే సవాలక్ష ప్రశ్నలతో మొదటిలోనే ఆగిపోతే, ఇంకా మనం భగవంతుడుని ఎప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడు శరణాగతులం కావాలి.

అందుకే ఎప్పుడైనా భక్తుడు అనేవాడు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, భగవంతునికి కావాల్సింది భక్తి తప్ప హంగులూ ఆర్భాటాలు కావు.

ఏదైనా పూజలోనో వేరే ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు తప్పులు దొర్లితే స్వామి ఏదైనా తెలియక తప్పు చేస్తే క్షమించు తండ్రి అంటే అయన చిరునవ్వుతో మన్నిస్తాడు, తెలిసి కూడా తప్పుచేసి దాచేద్దాం అనుకుంటూ చేసే పనులు మాత్రం చేయకూడదు, ఎందుకంటే సర్వవ్యాపితుడైన అతని ముందు ఏది దాయటం కుదరదు గాక కుదరదు..


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...