Monday 12 February 2024

వేదములలో ముక్తి గురించి వివరణ (15-Feb-24, Enlightenment Story)

వేదములలో ముక్తి  గురించి వివరణ

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀

ముక్తి లేదా మెాక్షము అనగా ముక్తి అంటే స్వేచ్ఛ ఎటువంటి స్వేచ్ఛ అనగా ముక్తి అనేది అన్నిఆత్మలూ కోరుకొనేస్వేచ్ఛ వేరే విధముగాచెప్పాలంటేదుః ఖము మరియు బాధల నుండేస్వేచ్ఛను పొందటాన్ని ముక్తి  అనవచ్చును. యిటు వంటి స్వేచ్ఛ లభించిన  తరువాత ఏమవుతుంది యిటువంటి స్వేచ్ఛ లభించిన తరువాత త్మ అమితానందపు అనుభూతిని పొందుతూ ఈశ్వర దేవుడు పరమాత్మఅనుగ్రహము స్పూర్తితోజీవిస్తుంది

ఎవరైనా పొందగల అత్యాంత సంతృప్తి కరమైన ఆనందమయమైన స్థితి అయితే నిద్రా లేదా సుషుప్తి వంటి అవస్థలే ముక్తి అనుట సమంజసము కాదు యిది నిద్రకు పూర్తిగా వ్యతిరేకమైనది అదొక సాధించ వీలైన ఉత్కృష్ట మైన చైతన్య స్థితి. అయితే,ఈశ్వరుడు పరమాత్మ మనలోనే  వున్నాడు కదా


కనుక మనము యిప్పటికే ఈశ్వర స్పూర్తితో అనుగ్రహము పొందుతూ జీవిస్తున్నాము కదా మరి ఈ ముక్తి ఏ విధముగా విశిష్టమైనది ఈశ్వరుడు మరియు ఆత్మలకి సంబంధించిన చర్చలను మననము చేసుకొంటే ఆత్మకు సంకల్పము చేసే స్వేచ్ఛ మరియు పరిమిత జ్ణానము వున్న వని మనము నిర్ధారణకు వచ్చాము ఎప్పడెప్పుడు ఈ ఆత్మ సంకల్పబలమును సరిగ్గా వుపయెాగించి అజ్ణానాన్ని పారద్రోలుతుందో అప్పుడది యింకా ఎక్కువ అమితానంద మును పొందుతూ ఈ సృష్టి ఉద్దేశముతో ప్రయెాజనము తో సారూప్యము చెందు తుంది అందుచేత ఏ మార్గములో వీలైతే అందులో ఈశ్వరుడిని అనుకరిస్తూ ఈ సృష్టి యెుక్క సంపూర్ణ ప్రయెాజనముతో అనగా ఉద్దేశముతో సహ కరించే విధముగా నడచుకోవలెనని ఈ ఆత్మకు సూచించబడినది.

జీవిత లక్ష్యము ఏమిటంటే ఈ ఆత్మను ఈ సృష్టి యెుక్క ఉద్దేశముతో సారూప్యాన్ని వచ్చేందుకు అనువైన పనులు చేయుటకు సంసిద్ధ ము చేయటమే అనువైన పనులు చేయుటకు సంసిద్ధము చేయటమే ఈ సారూప్యత ఒకఅత్యున్నత చరమ స్థాయికి చేరిన తరువాత యిక ఒక ఆత్మకు మరల జన్మించేందుకు ఎటు వంటి అవసరమూ వుండదు

ఆవిధముగా అది ఈ జనన మరణ చక్రము నుండిసుఖ దుఃఖా లనుండిస్వేచ్ఛను పొందిఅత్యంత అమితానందము పొందు తుందికనుక ముక్తి అంటే మన అన్నికర్మలనుఈ సృష్టి ప్రయెాజనము వుద్దేశముతో సారూప్యత కలిగేలా చేయటమే ఈశ్వరుడు మనలను ఎల్లప్పుడు వుత్తేజ పరస్తూ స్ఫూర్తి నిస్తూమన వెంటేవుండటమే కాక మన యందు కూడా వున్నాడుకాని ఎప్పుడూ మనము ఈ విషయాన్ని తెలుసుకొని తదను గుణముగా నడచు కుంటామెా అప్పుడు మనకు ముక్తి లభిస్తుంది.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

1 comment:

  1. జనన మరణ చక్ర జాడ్యమనేశక్తి
    నిత్య తలపు మలుపు నీడ మల్లె
    న్యాయ ధర్మ మార్గ నానుడి మాత్రము
    సర్వ సృష్టి వినయ సమర బుద్ధి

    ReplyDelete

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...