Wednesday 7 February 2024

కాశీకి వెళ్ళితే కాయ (10-Feb-24, Enlightenment Story)

 * కాశీ కి వెళ్ళితే కాయ (కాయాపేక్ష) - పండు (ఫలాపేక్షా)*

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀

అసలు శాస్త్రం లో ఎక్కడ కూడా.. కాశీ కి వెళితే కాయో, పండో వదిలేయాలి అని చెప్పలేదు. శాస్త్రం చెప్పిన విషయాన్ని.. కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానం తో కొంచం వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు.

కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రము చెప్తున్నది ఏమిటి అంటే... కాశీ వెళ్లి గంగలో స్నానం చేసి  *కాయాపేక్ష మరియు ఫలాపేక్ష" ను గంగలో వదిలి, ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని.*


*ఇక్కడ కాయ (కాయాపేక్షా) 🍅 🍆పండు(ఫలాపేక్షా) 🍊 🍎అన్నారు. అంటే ఈ కాయము పై (శరీరము పై ఆపేక్షని), ఫలాపేక్షా (కర్మ ఫలము పై ఆపేక్ష ని) పూర్తిగా వదులుకొని... కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు.*

*కాలక్రమేణా అది కాస్తా, కాయ - పండు గా మారిపోయిందిఅంతే కానీ కాశీ వెళ్లి ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగ లో వదిలేస్తే...మనకు వచ్చు భక్తి కానీ, అందులో నిజమైన పుణ్యం ఎం ఉంటుంది.*

*కనుక.... శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అర్థం చేసుకొని... ఆ క్షేత్ర దర్శనము, ఆ సంప్రదాయం పాటిస్తే..నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది... అంతే కాని మామిడి పండుని,  వంకాయ ని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు.*

*కనుక...ఈసారి మీరు కాశీ వెళితే... ఈ శరీరం పై ఎక్కువ ప్రేమని, మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫల ఆపేక్ష ని మాత్రమే వదులుకొని....ఆ విశ్వనాథ దర్శనం చేయడం చేయాలి.*..🙏🌹

*🔱🚩ఓం నమ: శివాయ🔱🚩*


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...