Thursday 18 January 2024

ఆకలి వేస్తుంది (19-Jan-24, Enlightenment Story)

 ఆకలి వేస్తుంది

🌺🍀🌺🍀🌺🍀

అందరికీ అన్నిటికి దప్పిక కలుగుతుంది  ఆకలి వేస్తుంది. కానీ ఎప్పుడూ కూడా భక్తి కలుగదు.భగవంతుని యొక్క ఆకలి కలగాలి.

ఆకలి వేస్తే మనిషికి తప్పకుండా అన్నం తినవలసి వస్తుంది, దాహం వేస్తేతప్పకుండా నీరు త్రాగ వలసి వస్తుంది. అదేవిధంగా భక్తి కలిగితే, భగవంతుడు ఈ సృష్టిని ఎలా నిర్మాణం చేసినాడు అనే అలోచవస్తుంది, కానీ  భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు?

వాస్తవానికి భక్తి కలగాలి  భగవంతుడు వ్యవస్థను ఏర్పాటు చేసినాడు. కానీ మనకు ఆ వ్యవస్థ తెలియదు. ఆకలిని భగవంతుడు మీకు ఇచ్చాశక్తిని ఇచ్చినాడు. దానిని మీరు మీఇష్టానుసారం ఉపయోగించేటంత శక్తిని ఇచ్చినాడు. అయితే మీ కోరికలుఏనాడు పూర్తి కావు. కానీ వాటిని తీర్చుకొనుటకు అనేక రెట్లుప్రయత్నించాలని మనిషి మనసుకు అనిపిస్తుంది. మీరు కోరికలను ఎంతలాగినా, ఎంత బలంగా మనసులో కోరుకున్నా ఆ కోరికలు ఎన్నటికిపూర్తి కావు.

అందుకే ఆ కోరికలు పూర్తి కావడానికి మనిషి జీవిత నావఊగిసలాడే నీవే తరింప జేయుము, కన్నయ్య నీవే ఆధారము' అనిపాడవలసి వస్తుంది. అసలు కోరికలు పుట్టనే కూడదు, కోరికలు అనుచుకున్న ప్రమాదమే, కోరికలను తీర్చుకున్న ప్రమాదమే

కోరికలను అనుచుకుంటే ఎన్నటికైనా తీర్చుకోగలను అనే నమ్మకం తోనే జీవిస్తాడు. ఇక కోరికలు అనుభవిస్తే అనుభవించిన కొద్దీ ఇంకా ఇంకా తీర్చుకోవాలి అనే తాపత్రయపడతాడు కనక అసలు కోరిక పుట్టనే కూడదు, ఒకవేళ భగవంతుని చేరాలి  అని కోరిక పుడితే ఆ మనిషి ధన్యజీవి అయినట్లే..


గ్రామాలలో రహదారులు తినంగా ఉండక బాగా గోతులతో అధ్వాన్నముగా ఉండేవి . అటువంటి గోగులలో బండి నడకకు అవరోధము గా ఉన్నాప్పుడు ఆ గోతులలొ నల్లేరును పడేసేవారు. ఆ తీగలను వేయడం ద్వారా బండి నడక సాఫీగా సాగిపోవడము వల్ల ... అనాయాసం గా జరిగే కార్యాలకు ఆవిధంగా " నల్లేరు పై బండి నడక " అంటారు.

నీలో ఉన్న అజ్ఞానాన్ని ఎవరు తొలగిస్తారు. అసలు నీకు అజ్ఞానం ఉన్నదన్న సంగతి తెలియదు నీకు, ఇక దానిని తొలగించుకునే ప్రయత్నం ఎలా చేస్తావు. మొట్టమొదట చేసే పని ఏమిటి అంటే నీలో అజ్ఞానం ఉన్నదాని గుర్తించడం. ఇక దానిని తొలగించుకునే ప్రయత్నం చేయడమే జీవితాంతం మీ పని ఇదే
.
అజ్ఞానం తొలగించుకోకపోతే ఏమవుతుంది, లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు, ఇదంతా శాశ్వతమే అన్నట్లు కనబడుతుంది భ్రమలో బ్రాంతిలో ఉంచుతుంది నిత్యం. దేహం నిలబడాలంటే ఆహారం తప్పనిసరి అవసరం ఆరోగ్యాన్నిచ్చే ఎలాంటి ఆహారమైన సరే

మనసుకు ఆహారం కావాలి  మరి దానికి ఆహారం ఏది ? అంటే మనసుకు విషయ వాంఛలే ఆహారం

మరి దేహంలో ఉన్న దేవుడికి ఆహారం ఏది ? దేహంలో ఉన్న దేవుడికి ఉచ్ఛ్వాస నిచ్చ్వాస ( సో - హం ) అనేది ఆహారం...

మర్యాద, నాగరికత, సంస్కారం గల మాట తీరుతో పాటు విశాలమైన స్వచ్ఛమైన, ఉదారమైన హృదయమూ గల వ్యక్తి ఇతరుల మనస్సు మీద గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటాడు. మూలంతో లేదా మూలాధారంతో అనుసంధానమై ఉన్న పవిత్ర హృదయం నుండి ప్రేమ, ఉదారత, ఔన్నత్వం సహజంగా పొంగి ప్రవహిస్తాయి. అది తనదైన ముద్రను వెంటనే వేస్తుంది. క్రమేణా అందరి మనసుల్లో లోతుగా తనకు తాను  స్థాపించుకుంటుంది. అస్పష్టత, సందిగ్ధతలను ప్రోత్సహించకూడదు.

మానవ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మొదటిగా మర్యాద గల మాట తీరు ఎంతైనా అవసరం. సంస్కారవంతమైన మాట తీరు హృదయ సామ్రాజ్యాన్ని పాలిస్తుంది. మెరుగైన మాట తీరు ప్రవచనంలో గాని, సంభాషణలో గాని మానవళిని ప్రభావితం చేసి గొప్పగా పరిపాలిస్తుంది...

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే (16-May-24, Enlightment Story)

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర వున్నాడు అనుకొం...