Saturday 20 January 2024

*రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులతో* (21-Jan-24, Enlightenment Story)

 *రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులతో*

🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోనుపెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి...*

*1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?*   వాల్మీకి 

*2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?* : నారదుడు.

*3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?* : తమసా నది.

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి? : 24,000.

*5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?* : కుశలవులు.

*6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?* : సరయూ నది.



*7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?* : కోసల రాజ్యం.

*8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?* : సుమంత్రుడు.

*9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?* : కౌసల్య, సుమిత్ర, కైకేయి.

*10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?* : పుత్రకామేష్ఠి.

*11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?*  : కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.

*12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు?* : జాంబవంతుడు.

*13. వాలి ఎవరి అంశతో జన్మించెను?* : దేవేంద్రుడు.

*14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?* : హనుమంతుడు.

*15. కౌసల్య కుమారుని పేరేమిటి?* : శ్రీరాముడు.

*16. భరతుని తల్లి పేరేమిటి?* : కైకేయి.

*17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?* : లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.

*18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?* : వసిష్ఠుడు.

*19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?* : 16 సంవత్సరములు.

*20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?* : మారీచ, సుబాహులు.

*21.  రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?*  : బల-అతిబల.

*22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?* : సిద్ధాశ్రమం.

*23. తాటక భర్త పేరేమిటి?* : సుందుడు.

*24. తాటకను శపించిన మహర్షి ఎవరు?* : అగస్త్యుడు.

*25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?* : భగీరథుడు.

*26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?* : జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.

*27. అహల్య భర్త ఎవరు?*  : గౌతమ మహర్షి.

*28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?* : శతానందుడు.

*29. సీత ఎవరికి జన్మించెను?* : నాగటి చాలున జనకునికి దొరికెను.

*30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?* : దేవరాతుడు.

*31. శివధనుస్సును తయారు చేసినదెవరు?* : విశ్వకర్మ.

*32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?* : మాండవి, శృతకీర్తి.

*33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?*  : జనకుడు.

*34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?* : కుశధ్వజుడు.

*35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?* : వైష్ణవ ధనుస్సు.

*36. భరతుని మేనమామ పేరు ఏమిటి?*  : యుధాజిత్తు.

*37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?*  : మంధర.

*38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?* : గిరివ్రజపురం, మేనమామ యింట.

*39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?* : శృంగిబేరపురం.

*40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?* : గారచెట్టు.

*41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?* : భారద్వాజ ముని.

*42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?* : మాల్యవతీ.

*43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?*  : తైలద్రోణములో.

*44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?*  : జాబాలి.

*45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?*  : నందిగ్రామము.

*46. అత్రిమహాముని భార్య ఎవరు?* : అనసూయ.

*47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?* : విరాధుడు.

*48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?* : అగస్త్యుడు.

*49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?* : గోదావరి.

*50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?* : శూర్ఫణఖ.

*51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?* : జనస్థానము.

*52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?* : మారీచుడు.

*53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?* : బంగారులేడి.

*54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?* : జటాయువు.

*55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?*: దక్షిణపు దిక్కు.

*56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?* : కబంధుని.

*57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?* : మతంగ వనం, పంపానదీ.

*58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?* : ఋష్యమూక పర్వతం.

*59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?*  : హనుమంతుడు.

*60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?* : అగ్ని సాక్షిగా.

*61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?* : కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.

*62. సుగ్రీవుని భార్య పేరు?* : రుమ.

*63. వాలి భార్యపేరు?* : తార.

*64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?* : కిష్కింధ.

*65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?* : మాయావి.

*66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?*  : దుందుభి.

*67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?*  : మతంగముని.

*68. వాలి కుమారుని పేరేమిటి?* : అంగదుడు.

*69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?*  : ఏడు.

*70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?* : ప్రసవణగిరి.

*71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు "తూర్పు" దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?* : వినతుడు.

*72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు "దక్షిణ" దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?* : అంగదుడు.

*73. సుగ్రీవునికి,  సీతాన్వేషణ కోసం  "పశ్చిమ" దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?* : మామగారు, తార తండ్రి.

*74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు "ఉత్తర" దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?*  : శతబలుడు.

*75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?* : మాసం (ఒక నెల).

*76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?* : దక్షిణ దిక్కు.

*77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?* : తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.

*78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?* : స్వయంప్రభ.

*79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?*: సంపాతి.

*80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?* : పుంజికస్థల.

*81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?* : మహేంద్రపర్వతము.

*82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?* : మైనాకుడు.

*83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?* : సురస.

*84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?* : సింహిక.

*85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?* : నూరు యోజనములు.

*86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?* : లంబ పర్వతం.

*87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?* : అశోక వనం.

*88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?* : పన్నెండు

*89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?* : త్రిజట.

*90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?* : రామ కథ.

*91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?*  : చూడామణి.

*92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?* : ఎనభై వేలమంది.

*93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?* : ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.

*94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?* : విభీషణుడు.

*95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?*  : మధువనం.

*96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?* : మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.

*97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?*  : ఆలింగన సౌభాగ్యం.

*98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?* : నలుడు

*99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?* : నికుంభిల.

*100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?* : అగస్త్యుడు.

*101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?* : ఇంద్రుడు.

*102.  రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?* : మాతలి.

*103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?* : కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!

*104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?*  : హనుమంతుడు.

*105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?* : శత్రుంజయం.

*106.  శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?* : స్వయంగా తన భవనమునే యిచ్చెను.

*107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?* : బ్రహ్మ.

*108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?* : తన మెడలోని ముత్యాలహారం.


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే (16-May-24, Enlightment Story)

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర వున్నాడు అనుకొం...