Wednesday 30 August 2023

హయగ్రీవ జయంతి (31-Aug-23, Enlightenment Story)

 శ్రీహయగ్రీవ స్వామివారీ జయంతి

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

” జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్‌

   ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే “


యుగయుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణువు అనేక అవతారాలను దాల్చాడు. అలాంటి అనేక అవతారాల్లో దశావతారాలు ప్రసిద్ధి. వాటిల్లో ముఖ్యమైనవి నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి ఈ అవతారాల్లో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. అయితే తన భక్తుల కోసం విష్ణువు దాల్చిన అవతారల్లోకి ఒకటి ‘హయగ్రీవావతారం’ ఒకటి.

జ్ఞానం, ఆనందం, మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారరం. హయగ్రీవుడిని పూజించిన భక్తులకు విద్యనే కాదు అన్యాయం జరిగినవారికి న్యాయం జరుగుతుంది. భూవివాదాలు ఏమైనా ఉంటే అవి త్వరలో పరిష్కరించ బడుతాయి. శత్రు వినాశనం కూడా జరుగుతుంది. ఇలా ప్రతి సమస్యను పరిష్కరించి హయగ్రీవుడు మానవులందరినీ చల్లగా చూస్తాడు.

హయగ్రీవ ప్రస్థావన

దేవీ పురాణం, స్కాంధ పురాణం, శ్రీమద్భాగవతంతోపాటు ఆగమ శాస్త్రాల్లో కూడా హయగ్రీవుని ప్రస్తావన ఉంది. వేద విద్యాభ్యాసాన్ని కూడా హయగ్రీవ జయంతినాడే ప్రారంభిస్తారు. హయగ్రీవ జయంతి రోజున స్వామిని షోడశోపచారాలతో, అష్టోత్తరాలతో పూజించాలి.

హయగ్రీవునికి యాలకులు ప్రీతికరమైనవి. యాలకుల మాలను ధరింపజేసి శనగలు, గుగ్గుళ్ళను తయారుచేసి నివేదించాలి. తెల్లపూవులతో పూజించాలి. శ్రావణ పౌర్ణమినాడు హయగ్రీవ పూజ చేయడం సర్వశ్రేష్ఠం.సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని హయగ్రీవ స్తోత్రంలో దేశికాచార్యులు పేర్కొన్నారు.

శ్రావణ మాసం పౌర్ణమినాడు హయగ్రీవ జయంతి. శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడు గా అవతరించిన రోజు. హయగ్రీవుడు జ్ఞానానికి, వివేకానికి, బుద్దికి, వాక్కుకు దేవుడు అని కొలుస్తుంటారు. హయగ్రీవుడంటే గుర్రం ముఖం కలవాడని అర్థం. ఆయన తెల్లని శరీర ఛాయతో ఉంటాడు. నాలుగు చేతులలో శంఖం, చక్రం, పుస్తకం, అభయహస్తం ధరించి ఉంటాడు. జ్ఞానందమయం దేవం నిర్మల స్పటికాకృతిమ్ ఆధారం సర్వవిద్యానాం-- హయగ్రీవ ముపాస్మహే ఇది హయగ్రీవ ధ్యానశ్లోకం. విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం. మధు- కైటభులు అనే రాక్షసులను పాతాళలోకంలో సహరించిన రూపమే హయగ్రీవం. అగస్త్య మహర్షి కంచిలో తపస్సు చేయగా హయగ్రీవుడు ప్రత్యక్షమై లలితా సహస్రనామ స్తోత్రాన్ని, శ్రీవిద్యను అనుగ్రహించాడు.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...