Thursday 17 August 2023

మూగజీవాల ఆవేదన తెలుసుకునే జగద్గురువులు (21-Aug-23, Enlightenment Story)

 🌹మూగజీవాల ఆవేదన తెలుసుకునే జగద్గురువులు🌹

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


ఒకసారి శృంగేరిలోని ఒక కుటుంబం శృంగేరీ వస్తూ మార్గమధ్యంలో  అక్కడి అడవిలో  కొంతమంది  వేటగాళ్ళు ఒక జింకను పట్టుకోవడాన్ని చూశారు. మాంసం కోసం వేటగాళ్ళు యువ జింకలను చంపేస్తారని తెలిసి, వారు ఆ జింక పిల్ల కోసం కొంత డబ్బు చెల్లించి ఇంటికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ జింక చేష్టలకు భరించ లేకపోయారు. గెంతడం, పరిగెత్తడం. వారి ఇంటి వద్ద ఉన్న అన్ని ఆస్తులను విచ్ఛిన్నం చేసింది ఆ జింక. 

దాని గొడవ పడలేక వారు ఆ జింకను శ్రీ నరసింహవనం(జగద్గురువుల నివాసం,సందర్శన స్థలం) వద్దకు తీసుకువచ్చారు. శ్రీ గురు చరణుల నిర్ణయం /సలహా మేరకు ఆ జింకపిల్లను వారి చెంత వదిలి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు. శ్రీ గురువులు దానికి "సీత" అని పేరు పెట్టారు. ప్రతి జింక సీత వలె అదృష్టవంతురాలు కాదు. పూర్వకాలంలో ఋషులు నెమళ్ళు మరియు జింకలను వారి సన్యాస ఆశ్రమంలోనే పెంచుకునేవారని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ రోజు, మేము (ఇక్కడ మేము అంటే ఈ విషయం చెప్పిన వారు) ఆ అదృష్ట జింకను జగద్గురువుల చెంత దానిని శృంగేరిలో చూడగలుగుతున్నాము. దాని పూర్వజన్మ సుకృతం.

ప్రతి రోజు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు సీత (ఆ జింక పేరు) శ్రీ గురు సమక్షంలోనే గడిపేది. ఎంతోతపః శక్తి కలిగిన  ఈ పవిత్ర ప్రదేశం లో ఉన్నప్పటికీ, సీతను తన కర్మ ఫలాల నుంచి తప్పించకూడదని విధి నిర్దేశించింది కాబోలు. ఒక రోజు, సీత నుండి కొత్తగా జన్మించిన దాని బిడ్డ  ఆ ప్రదేశము నుండి కనిపించకుండా పోయింది.  అది ఎక్కడికి వెళ్ళి వుంటుందో ఎవరూ గమనించలేదు, ఆలోచన లేదు. మఠ్ సిబ్బంది పిల్ల జింక కోసం ఎక్కడ వెతికినా ఫలించలేదు. సీత (తల్లి జింక) ఆ ప్రదేశం నుంచి ఎక్కడికీ వెళ్లడానికి నిరాకరించింది. సీత తనను తాను శ్రీ గురు చరణుల పాద పద్మములకు పరిమితంచేసుకున్నది. ఆ జింక నిత్యం గురువు గారిని చూడగానే విపరీతంగా కన్నీరు కార్చేది. తప్పిపోయిన తన పిల్ల కోసం ఆమె ఎంతో ఆరాటపడుతోందని స్వామివారు అర్థం చేసుకున్నారు. 

జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహా స్వామి వారు తప్పిపోయిన బిడ్డను దాని తల్లి చెంతకు తిరిగి వచ్చేటట్లు శ్రీ శారదాచంద్రమౌళీశ్వరులను, శ్రీ తోరణ గణపతిని అర్చించి ప్రార్థించారు. మరుసటి రోజు ‘పిల్ల జింక’ ను ఎవరో అజ్ఞాతులు నరసింహావనం లోపల విడిచి వెళ్లారు. అలా ఆ పిల్ల జింక  తిరిగి తల్లి చెంతకు చేరినది. 

సీతకు ఎంతో పారవశ్యం కలిగింది. నిత్యానుష్టాలను చేసుకుంటున్న జగద్గురువుల చెంతకు సీత తన పిల్లతో వచ్చి  జగద్గురువుల ఎదురుగా కూర్చుని తనపిల్ల తనదగ్గరకు వచ్చింది అన్నట్లు ఎంతో సంతోషంతో స్వామివారి పాదాలను నాలికతో నాకింది..పిల్లను నోట కరుచుకుని స్వామి వారి పాదాలకు తగిలేలా తాకించింది

మరుసటి రోజు, స్వామివారు సీతను, ఆమె చిన్నపిల్లను శ్రీ తోరణ గణపతి, శ్రీ శారదాంబ ఆలయాలకు  తీసుకెళ్ళి, శ్రీ గణపతికి 1008 తీపి కుడుములు, అమ్మవారికి సీత పేరుమీద అర్చన నివేదన చేసినారు. సీతకు మరియు ఆమె బిడ్డకు ప్రసాదం ఇచ్చి, “గణపతికి శ్రీ శారదాంబకు మీరు నమస్కారాన్ని తెలియజేయండి, వారు మీ బిడ్డను తీసుకొనిరాలేదా ? అని అన్నారు. సీత సంతోషంగా అమ్మవారికి, గణపతికి నమస్కరించింది. శృంగేరిలోని శ్రీ తోరణ గణపతి,శ్రీ శరదాంబా మందిరాల్లో మేమందరమూ ఇవన్నీ చూశాము.🙏🙏🙏🪷🕉️🌸💐

సర్వం శ్రీ గురుచరణ పాదారవిందార్పణమస్థు.🙏🌸.



🌻సర్వేజనా సుఖినోభవంతు|🌻

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...