Sunday 13 August 2023

తిరుమల దర్శనం (16-Aug-23, Enlightenment Story)

   * తిరుమల దర్శనం*

🌹🌹🌹🌹🌹🌹🌹

తిరుమల చేరిన తర్వాత మొదటిగా శ్రీ వరాహ స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. వేంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహ స్వామిని ఎందుకు దర్శించుకోవాలి తెలుసుకోండి.


కలియుగ వైకుంఠమైన తిరుమలకు వేంకటాచలం అనే పేరు కూడా ఉన్నదని చాలా మందికి తెలుసు కానీ తిరుమలను ఆది వరాహ క్షేత్రం అంటారని తెలిసిన వారు తక్కువే.  

అంతే కాదు  శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామి వారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకుంటుంటారు , కానీ ఎందుకలా చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకోవడం మన కనీస ధర్మం. పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడడానికి మునుపే శ్రీనివాసుడు తిరుమల చేరుకుని వకుళా మాత ఆశ్రమంలో ఉండేవారు. అప్పటికే అక్కడ తపస్సు చేసుకునే వరాహ స్వామి వారిని కలిశారు శ్రీవారు. అమ్మవారిని కల్యాణం చేసుకున్నాక తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోదలచి వరాహ స్వామి వారి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు.

 తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవ్వగా, అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతంమై ఉండేది. అప్పటిలో వరాహ స్వామి వద్ద శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వరస్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి. 

అదేమిటంటే… తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.

 తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహ స్వామి ఆలయం వుంది. వెంకటేశ్వరస్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం (రాగిరేకు) పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి

ఈ రాగిరేకును ఇది వరకు హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారు.ఇప్పుడు రద్దీ పెరగడం వలన వరాహ స్వామి విశిష్టతను , ఆ రాగి రేకును చూపించే సమయం లేదు. భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరమల నుండి వస్తే, ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహ స్వామి దర్శనం సంపూర్ణసిద్ధిని కలిగిస్తుంది.


ఇక స్వామి వారి ప్రధాన ద్వారం నుండి బయటకు వచ్చే వరకు దేవాలయంలో వీటి నన్నిటిని దర్శించుకొని బయటకు రండి. వరుస క్రమంలో రాశాను..

1. మహాద్వార గోపురం

2. శంఖనిధి - పద్మనిధి

3. కృష్ణరాయ మండపం

4. అద్దాల మండపం

5. రంగనాయక మండపం

6. తిరుమలరాయ మండపం

7. తులాభారం ( తులా దండం)

8. రాజా తోడరమల్లు

9. ధ్వజస్తంభ మండపం 

10. ధ్వజస్తంభం

11. బరి పీఠం

12. క్షేత్రపాలకశిల (గుండు)

13. సంపంగి ప్రదక్షిణం

14. నాలుగుకాళ్ల మండపాలు

15. శ్రీవేంకటరమణస్వామి కల్యాణమండపం

16. ఉగ్రాణం

17.విరజానది

18. పడిపోటు

19. పూల అర

20. పూలబావి

21.వగపడి అర

22. వెండివాకిలి

23. విమానప్రదక్షిణం

24. శ్రీరంగనాథుడు

25. శ్రీ వరదరాజస్వామిఆలయం

26. ఘంటామండపం

27.గరుడమందిరం

28.జయ విజయులు

29. బంగారువాకిలి

30. స్నపన మండపం

31.రాములవారి మేడ

32.శయన మండపం

33.కుల శేఖరపడి

34.శ్రీస్వామివారి గర్భాలయం

35.శ్రీ వేంకటేశ్వరస్వామి(మూలవిరాణ్మూర్తి)

36. భోగ శ్రీనివాసమూర్తి

37. కొలువు శ్రీనివాసమూర్తి

38. ఉగ్ర శ్రీనివాసమూర్తి

39. శ్రీ మలయప్పస్వామి

40. శ్రీ సుదర్శనచక్రత్తాళ్వారు 

41. శ్రీ సీతారామ లక్ష్మణుల

42. రుక్మిణీశ్రీకృష్ణులు

43. సాలగ్రామాలు

45. వకుళాదేవ

46. బంగారుబావి

47. అంకురార్పణ మండపం

48. యాగశాల

49. నాణేలపరకామణి

50. నోట్ల పరకామణి

51. చందనపు అర

52. ఆనందనిలయ విమానం

53. విమాన వేంకటేశ్వరస్వామి

54. రికార్డుల గది (సెల్)

55. వేదపారాయణలు

56. సభ అర

57. సంకీర్తన భండారం

58. సన్నిధి భాష్యకారులు

59.శ్రీవారి డాలర్లు

60. శ్రీ యోగనర సింహస్వామి

61. శంకుస్థాపన స్తంభం

62. పరిమళం అర

63. శ్రీవారి హుండీ (కొప్పెర)

64. బంగారువరలక్ష్మి

65. కటాహతీర్థం

66. శ్రీ విష్వక్సేనులవారు

67. ముక్కోటి ప్రదక్షిణం

68. సాష్టాంగనమస్కారాలు

🌻సర్వేజనా సుఖినోభవంతు|🌻

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...