Sunday 7 April 2024

నామస్మరణ - అంతఃకరణ చతుష్టయం (08-Apr-24, Enlightenment Story)

నామస్మరణ  - అంతఃకరణ చతుష్టయం

🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


ఇంద్రియం, మనస్సు, బుద్ధి, అహంభావం  ఈ నాల్గింటిని "అంతఃకరణ చతుష్టయం" అంటారు. వీటిని  విడివిడిగా చెప్పబడినా ఇవి, 'మనసు' అనే ఒకే పదం.

*అంటే, మనసు పేరుతోనే ఇవన్నీ పనిచేస్తాయి.*


మనసు చంచల స్వభావం కలది. మనసును నిశ్చలస్థితికి తేగలగాలి. అది తనంత తానుగా పని చేయలేదు. మనసుకు ఒక ఆధారం చూపించాలి. దానితో కలిసిపోయే ఆధారం కన్నా, దానిని నిలువరించే ఆధారం కావాలి. ఆ ఆధారమే శాశ్వతమైన *భగవన్నామ_స్మరణ!*

నామస్మరణ మొదలు పెట్టినప్పుడు మనసు పారిపోతుంది, ఆపాలని చూస్తుంది. గోల చేస్తుంది.నామస్మరణను వదలకుంటే మనసు తానే వచ్చి చేరుతుంది, నిలిచిపోతుంది. ఎలా అంటే
ఒక రేవులో ఓడ ఆగి ఉంది. దాని జెండాపై ఒక కాకి వాలింది.*

ఇంతలో నౌకను వదిలారు. నౌక సముద్రంలో ప్రయాణిస్తున్నది. దానితోనే కాకికూడా కాకికి లేచి తిరగడం, కొత్త ప్రదేశంలో వాలడం అలవాటు కదా... కాకి లేచింది.  కానీ, వాలడానికి ఒక జెండా తప్ప ఆ సముద్రంలో మరో చోటు ఏదీ దానికి కనపడలేదు.

కనుక, తిరిగి అదే ఏ ఆధారం లేక జెండా మీదే వాలింది. ఇలా మరలా చేసి, చేసి చివరకు.ఏ ఆధారం లేదు, కాబట్టి జెండా మాత్రమే ఆధారం అని తెలుసుకొని కదలకుండా కూర్చుండిపోయింది.
దీనినే "నౌకాగ్రకాక న్యాయం" అంటారు.

అలానే మనసుకు కూడా "భగవన్నామ స్మరణ"నే ఆధారంగా చేసి వేరే పదార్థం జోలికి పోనీయకుంటే అదే మన ధ్యేయ వస్తువైనపుడు. పరమాత్మ తత్త్వాన్ని మనలో భాసింపజేస్తుంది.*


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

ఓర్పు - మార్ష్ మెల్లో సిద్ధాంతం (03-May-24, Enlightment Story)

  ఓర్పు !!! 🌺🍀🌺🍀 🌺 ఒక పరీక్ష:: స్కూల్లో క్లాస్ టీచర్ తన క్లాసులోని పిల్లలందరికీ కమ్మని స్వీట్స్ పంచి, ఒక విచిత్రమైన షరతు పెట్టాడు.  విన...