Friday 5 April 2024

సీతారాం - రాజారాం (06-Apr-24, Enlightenment Story)

 సీతారాం - రాజారాం*
🌺🍀🌺🍀🌺🍀🌺


ఒక తల్లి కొడుకుని ఒక స్వామి దగ్గరకు తీసుకువెళ్ళింది. స్వామి చదువుకున్నవాడు. జ్ఞాని. 
 స్వామీ! నా కొడుకు తెలివైన వాడే కానీ మాట వినడు. చదువు తప్ప అన్ని విషయాల్లోనూ ఆసక్తి వున్నది
 వాడికేదైనా చెప్పి మార్చండి" అన్నది.

 "ఏం చెప్పను? దేని గురించిచెప్పను?" అని స్వామి చిరునవ్వుతో అడిగాడు.అక్కడ ఒక తారు రోడ్డు 
 కొత్తగా వేస్తున్నారు.

కొంటె కుర్రవాడు అటు చూపిస్తూ "దాని గురించి చెప్పండి" అన్నాడు. పక్కనే పడివున్న ఒక తారుముద్దని 
 తీసుకు రమ్మని "ఈ తారు ఉండ ఖరీదు ఎంత వుంటుందో ఉజ్జాయింపుగా చెప్పగలవా?" అని అడిగాడు 
 స్వామి.

 *అయిదు నుంచి పది రూపాయలు*

 కానీ ఇందులోని పెట్రోలియంని సింధెటిక్ వైరుగా మారుస్తే, అది గుండె ఆపరేషన్లో పదివేలు ఖరీదు చేసే 
 దారంగా పనిచేస్తుంది. ఈ ముద్దలోంచి వెయ్యి వైర్లు తయారు చేయవచ్చు. మరోలా చెప్పాలంటే ఈ పది 
 రూపాయల తారుని మరొక రకంగా ప్రోసెస్ చేస్తే, దాని విలువ కోటి రూపాయలు అయివుండేది."

 వింటూన్న కుర్రవాడు నిశ్చేష్టుడయ్యాడు. అతడి కళ్ళలోని కుతూహలం గమనించి స్వామి  
 కొనసాగించాడు.వర్తమానాన్ని ఎలా ప్రోసెస్ చేసుకుంటే నీ భవిష్యత్తు అలామారుతుంది.

 నీవిప్పుడు ఇంటర్మీడియెట్ స్టేజిలోవున్నావు. ఇంటర్ అంటే 'మధ్యలో' అని అర్థం. అదొక రైల్వే జంక్షన్. 
 రకరకాల రైళ్ళు అక్కడికి వస్తూ వుంటాయి. ఒక రైలు నిన్ను కాశ్మీరుకి, మరొకటి జైసల్మీర్ ఎడారికీ 
 తీసుకెళ్తుంది. పూలవనానికి వెళ్తావా, ఇసుక ఎడారికి వెళ్తావా అన్నది నీవే నిర్ణయించుకోవాలి. ఒక సారి 
 రైలు ఎక్కిన తరువాత మారటం కష్టం. లక్షరూపాయల ఉద్యోగంతో ప్రారంభిస్తే కోటికి చేరుకోవటం 
 సులభం. పదివేలతో మొదలు పెడితే లక్షకు చేరుకోవటం కష్టం." వింటున్న కుర్రవాడు అర్థమైనట్టుగా 
 వినమ్రతతో నమస్కరించాడు.
  🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩

 🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

 🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

 🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

 ☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

 *ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

 *క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, 
 యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
 దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

ఓర్పు - మార్ష్ మెల్లో సిద్ధాంతం (03-May-24, Enlightment Story)

  ఓర్పు !!! 🌺🍀🌺🍀 🌺 ఒక పరీక్ష:: స్కూల్లో క్లాస్ టీచర్ తన క్లాసులోని పిల్లలందరికీ కమ్మని స్వీట్స్ పంచి, ఒక విచిత్రమైన షరతు పెట్టాడు.  విన...