Tuesday 20 June 2023

పూరీ జగన్నాథ స్వామి ఆలయం. ఒడిషా (25-June-23, Enlightenment Story)

 జూన్ 20 న పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥🌹🔥

పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో  అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిస్టరీయే. అందుకే పూరీ జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధిస్తారు. ఇంతకీ పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న మిస్టరీలేంటో ఓసారి తెలుసుకొండి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే స్తంభాలు, గోడలు.. అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే.

జెండా 

ఈ ఆలయ గోపురం పైన ఉండే జెండాకు కూడా ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే.. గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతుంది. కానీ.. ఇక్కడి జెండా మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా.. వ్యతిరేక దిశలో ఊగుతుంది.

చక్రం

పూరీ జగన్నాథ్ ఆలయం చాలా ఎత్తులో ఉంటుందని తెలిసిందే. ఆ గోపురం పైన ఓ సుదర్శన చక్రం ఉంటుంది. మీరు పూరీలో ఎక్కడ ఉండి అయినా సరే.. ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే.. అది మీ వైపే తిరిగినట్టు కనిపిస్తుంది. అది ఆ చక్రం ప్రత్యేకత.

అలలు 

సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమి వైపునకు ఉంటుంది. పగటి పూట అలా వీస్తుంది. సాయంత్రం పూట భూమి వైపు నుంచి సముద్రం వైపునకు వీస్తుంది. కానీ.. పూరీలో మాత్రం అంతా రివర్స్. దానికి విభిన్నంగా గాలి వీస్తుంది.

పక్షులు 

జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు. ఆలయం పైకి పక్షులు వెళ్లవు. పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు.. అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. ఎంతో మంది దీనిపై అధ్యయనం చేసినా కనుక్కోలేకపోతున్నారు.

గోపురం నీడ 

జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు. సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు. పగలు అయినా.. సాయంత్రం అయినా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు. దీని నిర్మాణం అలా ఉంటుందా? లేక దేవుడి మహిమ వల్ల ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదా? అనేది మాత్రం అంతు చిక్కడం లేదు.

ప్రసాదం వృథా చేయరు 

పూరీ జగన్నాథ్ ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని కొంచెం కూడా వృథా చేయరు. మొత్తం తినేస్తారు.

అలల శబ్దం 

సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక అడుగు గుడి లోపలికి పెట్టగానే.. సముద్రంలో నుంచి వచ్చే శబ్దం వినిపించదు. కానీ.. అడుగు బయటపెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది

రథ యాత్ర

పూరీ జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైంది ఇదే. పూరీ రథ యాత్ర. ఈ రథ యాత్రలో రెండు రథాలు ఉంటాయి. శ్రీమందిరం, గుండిజా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్లాలి. అందుకే రెండు రథాలను ఉపయోగిస్తారు. మొదటి రథం నది ఇవతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ మూడు చెక్క పడవల్లో దేవతలు నది దాటుతారు. అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండిజా ఆలయానికి తీసుకెళతారు.

రథాలు 

పూరీ వీధుల్లో శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. ఆ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి.

బంగారు చీపురు 

రథ యాత్రకు ముందు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చుతారు. ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు.

విగ్రహాలు 

ఈ గుడిలోని శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేశారు.

గుండీజా ఆలయం

ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో విశిష్టత ఏంటంటే.. గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే.. రథం తనంతట తానే ఆగిపోతుంది. దాన్ని ఎవ్వరూ ఆపరు. ఇది కూడా ఇప్పటికీ ఓ మిస్టరీలాగానే ఉండిపోయింది.

దేవుడికి ప్రసాదం 

పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ ప్రసాదాలకు కూడా విశిష్ట చరిత్ర ఉంది. ఆలయ సంప్రదాయం ప్రకారం.. వాటిని మట్టి కుండల్లో వండుతారు. దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదాల్లో ఎటువంటి వాసన ఉండదు. రుచి కూడా ఉండదు కానీ.. దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలు ఘుమఘుమలాడుతాయి. ఎంతో మధురంగా ఉంటాయి ప్రసాదాలు.

జగన్నాథ రథచక్రాలు కదిలాయి

భారతీయ సంస్కృతిలో అదో అద్భుతం. పౌరాణిక- చారిత్రిక ప్రాధాన్యం కలిగిన పుణ్యక్షేత్రం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒకానొక దివ్యయాత్రా ధామం. అక్కడ విగ్రహం నుంచి ప్రసాదం వరకూ అంతా విశిష్టమే. ఆషాడ మాసంలో జరిగే జగన్నాథ రథయాత్ర మహిమ ఏమిటి? మన సంస్కృతీ- సంప్రదాయాలకూ ఇక్కడి యాత్రకూ సంబంధమేంటి? జగన్నాథుడు దేవేరులతో కాక సోదర- సోదరీ మణులతో దర్శనమిస్తాడు ఎందుకు..

వైష్ణవాలయాల్లో పూరీ జగన్నాథ్ కి విశిష్ట స్తానముంది. ఆదిశంకరుల వారి దృష్టిలో ఈ క్షేత్రానికి విశేష ప్రాముఖ్యత వుంది. 17వ శక్తి పీఠంగా ఇక్కడి విమలాదేవి పూజలందుకుంటోంది. శివకేశవ తత్వానికి ప్రతీక. వైష్ణవ శక్తికి కేంద్రంగా భక్తుల నీరాజనాలందుకుంటోన్న వైభవ క్షేత్రం పూరీ. ప్రతి హిందువూ తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించి తీరాలనుకునే ఒకానొక దివ్యధామం. చార్ ధామ్ క్షేత్రాల్లో అత్యంత ప్రధానమైంది.

జగన్నాథ రథయాత్ర విశేషాల సమాహారం. అందులో ప్రతిదానికీ ఓ వైశిష్ట్యం వుంది. రథయాతల్రో జగన్నాథుని రథాన్ని 'నందిఘోష్‌' గా  వ్యవహరిస్తారు. ఎరుపు, పసుపు రంగులతో చేయబడిన దివ్య వస్త్రాలతో అలంకరించబడిన ఈ రథం 45 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దీనికి  పదహారు చక్రాలుంటాయి. బలభద్రుడి రథాన్ని 'తాళ్‌ధ్వజ్‌'  పేరుతో పిలుస్తారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న దివ్య వస్త్రాలతో దీన్ని అలంకరిస్తారు. దీని ఎత్తు 44 అడుగులు. తాళ ధ్వజ్ కు 14 చక్రాలు ఉంటాయి. అదేవిధంగా సుభద్రాదేవి రథాన్ని 'దర్ప దళన' అంటారు. ఈ రథానికి 12 చక్రాలుంటాయి.  జగన్నాథుడు ఎన్ని ఆటంకాలనైనా దాటుకుని తన భక్తజనాన్ని కలుసుకోడానికి పెద్ద పెద్ద చక్రాలను రథానికి పూన్చుకుని అంగరంగ వైభవంగా వస్తాడు.  అందుకే వాటికి 'జగన్నాథ రథచక్రాల్' అన్న పేరొచ్చింది. 

పూరీ జగన్నాథ ఆలయ గోపురపు అంచు మీద.. సుదర్శన చక్రం దర్శనమిస్తుంది. ఇది నారాయణ రూపంలో నాలుగోది. దీనిపై ఒక పసుపు జెండా ఎగురుతూ కనిపిస్తుంది. దీనిలోని ఎరుపు గుర్తు జగాన్నాథుడు ఆలయంలోనే వున్నాడని సూచిస్తుందని భావిస్తారు. 

పూరీ ఎంతటి ప్రసిద్ధ క్షేత్రమంటే, ఇప్పటి వరకూ ప్రతి హైందవ మతాచార్యుడూ ఈ క్షేత్ర దర్శనం చేశారు. ఒక్క మాధవాచార్యులు తప్ప.. ఈ క్షేత్రాన్ని ప్రముఖ ఆచార్యులందరూ దర్శించారు. 

ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించారు. అలాగే రామానుజాచార్య, నింబర్కాచార్యలతో పాటు గుడియ వైష్ణవ మతానికి చెందిన అనేక మఠాలను ఇక్కడ చూడవచ్చు. శ్రీపాద వల్లభాచార్య కూడా పూరీని సందర్శించినప్పుడు.. ఇక్కడ తన భైఠకాన్ని ఏర్పరుచుకున్నారు. గురునానక్, కబీర్, తులసీదాస్ లు కూడా ఈ స్థలాన్ని దర్శించిన ఆధారాలున్నాయి

జై జగన్నాథ్ 🙏🏻

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥



No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...