Sunday 11 June 2023

శాశ్వత- అశాశ్వతాలు -2 (13-June-23, Enlightenment Story)

 *శాశ్వత మరియు అశాశ్వతాలు - 2*

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹 

*మనిషి జీవిస్తున్నప్పుడే నేర్చుకోవాలి - నేర్చుకుంటూ జీవించాలి. బతకడం జీవించడం కోసమే కాదు - జ్ఞాన సముపార్జన కోసం కూడా*

*జీవిస్తూ ఏం నేర్చుకుంటున్నాం అన్నది ముఖ్యం-మనల్ని అతి వేగంగా ఆకర్షించేవి అజ్ఞానం,మోహం. ఆ రెండింటినీ తప్పించుకుని ముందుకు వెళ్తేనే జ్ఞానోదయం అవుతుంది *

*ఈ లోకంలో శాశ్వతమైనది ఏదనే విషయం ముందు తెలుసుకోవాలి. శాశ్వతమైనది తెలిస్తే మనల్ని ఎప్పట్నుంచో వెంటాడుతున్న మరణ భయం తొలగిపోతుంది. శాశ్వతమైనది తెలిస్తే ఏది అశాశ్వతమైనదో కూడా తెలుస్తుంది‌. ఈ రెండింటినీ పూర్తి అనుభూతిలోకి తెచ్చుకున్నవాడే నిజమైన మానవుడు. అతడే జ్ఞాని. అతడే యోగి శ్రీకృష్ణుడు చెప్పిన ఉత్తమమైన యోగి అతడే *

అనాశ్రీతః కర్మఫలం,కార్యం కర్మ కరోతియః,స సన్యాసీచ యోగీ చ, న ని రగ్ని నచా క్రియః" (6-1)
*భావం*
ఎవడు చేయవలసిన కర్మములను.ఫలాపేక్ష లేకుండ చేయునో *ఆతడే సన్యాసియూ, యోగియు* నగును * అంతియే కాని, అగ్ని కార్యమును వదలినవాడు కాని, కర్మలను విడిచినవాడు కాని సన్యాసియు, యోగియు ఎన్నటికినీ కానే రడు* (6-1) *
*శాశ్వతంగా ఉండేది ఏదీ కళ్లకు కనిపించదు - అంతా అశాశ్వతంగా అనిపిస్తుంది. ఈవేళ ఉండి రేపు కనిపించకుండా పోయేవి ఎన్నోమరి శాశ్వతంగా ఉండేది మనకు ఎలా తెలుస్తుంది ?శాశ్వతంగా ఉండేది ఆత్మ. అది నీలోనే ఉంది - నువ్వు పుడతావు, మరణిస్తావు *
*కాని నీ ఆత్మకు చావు పుట్టుకలు లేవు - అది శాశ్వతంగా ఉంటుంది - దాన్ని ఎవరూ చంపలేరు. ఇది తెలుసుకుని జీవించేవాడే తనకు ఆప్తుడని. పరమాత్మ భగవద్గీతలో విశదీకరించాడు. దీన్ని ఎలా నమ్మాలి ? అర్జునుడికి చాలా సందేహాలు కలిగాయి నమ్మకం కుదరలేదు. కాని చెప్పినవాడు శ్రీకృష్ణుడు. ఏం చెయ్యాలి ? చూస్తేనే గాని నమ్మదు మనసు *
*ఆత్మను మామూలు కళ్లతో చూసే అవకాశం లేదు అది జ్ఞానంతోనే చూడగలం *
*అటువంటి జ్ఞాననేత్రం కావాలి అది అందరికీ ఉంటుంది కాని, మూసుకుని ఉంటుంది దాన్ని తెరిపించాడు శ్రీకృష్ణుడు *
భగవద్గీత చదివితే మీకూ అర్ధమవుతుంది మీ జ్ఞాననేత్రాలు తెరుచుకుంటాయి *
భగవద్గీత చదివితే కదా జ్ఞాన నేత్రాలు తెరుచుకునే అవకాశం దీపం వెలిగించకుండా చీకటి పోతుందా ?
ఈ భూమ్మీదకు మనం వచ్చింది రెండు విషయాలు తెలుసుకోవడానికి. ఒకటి శాశ్వతమైనదాని గురించి రెండోది అశాశ్వతమైనదాని గురించి. ఈ రెండూ తెలిస్తే సర్వమూ తెలిసినట్లే *
*శాశ్వతమైనది ఆత్మ, అశాశ్వతమైనది శరీరం ఆత్మ కనిపించదు. శరీరం కనిపిస్తుంది *
కనిపించనిది ఎప్పుడూ ఉండేది, కనిపించేది ఎప్పుడూ ఉండనిది,అదే గమ్మత్తు! దాన్నే ఇలా చెప్పాడు పరమాత్మ *
*అవ్యక్తాదీని భూతాని, వ్యక్త మధ్యాని భారత, అవ్యక్త నిధనా న్యేవ, తత్ర కా పరిదేవనా!"(2-28) *
భావం*

ప్రాణికొట్లన్నియు పుట్టుకకు, ముందు కనబడక ( అవ్యక్తముగానుండి ) పుట్టిన పిదప కనబడుచూ ( వ్యక్తమగుచూ) తిరిగి అంతరించి పోవు ( అవ్యక్తమగుచున్న ) భ్రాంతి రూపములైన ఈ దేహములకొరకై దుఃఖపడనేల అని భావం*
జీవించడానికి ( మానవులకు) తిండి, నిద్ర, గాలితోపాటు. శుద్ధ జ్ఞానం కూడా కావాలి *
ఏ కాలుష్యం లేని అసలు సిసలైన సత్యస్వరూప జ్ఞానం వల్లనే ఆత్మ ఉనికి తెలుస్తుంది *
ఆత్మ తెలిస్తే, ఇక రెండోది తెలుసుకోవడానికి ఏమీ మిగలదు, శాశ్వతమైన ఆత్మలో జగత్తు ఉంది ఆత్మకు పూచిన పువ్వు వంటిది ఈ ప్రపంచం *
ఆత్మాన్వేషణే జీవితం, తెలిసో తెలియకో ప్రతి ఒక్కరూ చేసే పని. తమ ఆత్మను తాము వెదుక్కోవడమే *
ఇదే బతుకు *
శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, శరీరం ఉపకరణం, ఉపాధి. దీన్ని ఆధారం చేసుకునే ఆత్మను చేరుకోవాలి.శరీరం ఖలు ధర్మ సాధనం* గదా *
శరీరం నేను కాదు, ఈ శరీరంలో నేను నివసిస్తున్నాను, అనేది అర్థం చేసుకోవాలి. అశాశ్వతమైన దానిలో శాశ్వతమైనవాడు* ఉంటున్నాడు *వాడు * సర్వ జీవుల్లో ఉంటున్నాడని తెలుసుకోవాలి *
ఎవరైతే మానవసేవను మాధవసేవగా భావిస్తారో, వారు ,శరీరాన్ని పరులకోసం వినియోగిస్తారు‌ *పరోపకారమే పరమార్థంగా భావిస్తారు *
శాశ్వతమైన ఆత్మకోసం, అశాశ్వతమైనదాన్ని తృణప్రాయంగా భావిస్తారు, అటువంటివారే లోకానికి ఆదర్శప్రాయులై వెలుగొందుతారు *
కరుణామయుడైన శ్రీకృష్ణ పరమాత్మ* అర్జునుణ్ణి నిమిత్త మాత్రంగా చేసుకుని. భగవద్గీత ను బోధించి *
లోకానికి మహోపకారం చేశాడు *

నిత్యా -నిత్య వస్తు వివేకాన్ని వివరించాడు పరమాత్మ భగవద్గీత లో •••భగవద్గీత చదవండి *
యధార్ధం తెలుసుకోండి మీమీ జన్మలు చరితార్థం చేసుకోండి కృష్ణం వందే జగద్గురుమ్‌ *

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...