శాశ్వతమైన సంపద
🌺🍀🌺🍀🌺🌺
ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం చేసే సాధన పేరు అంతర్యాగం.ఎంత సంపాదించినా అది కుటుంబం కోసం, దాచిన ధనం దొరలు పాలు లేదా దొంగల పాలు! దోచుకోలేనిది విద్య అయితే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద.అది ఎన్ని జన్మలు అయినా నీవెంట వస్తుంది.
నిత్య కర్మలు ఆచరిస్తూ మీ బాధ్యతలు కర్తవ్యం నిర్వహిస్తూ ధర్మ బద్దమైన జీవితం గడుపుతూ దైవ స్మరణ విడువ కుండా సాధన మార్గంలో సాగిపోవాలి. ఏ ఉపాసనా చేయకున్నా నీ రోజు పూర్తి అవుతుంది. ఉపాసన చేస్తూ చేస్తే నీ రోజు సారవంతంగా పూర్తి అవుతుంది.నీ కుటుంబ కోసం నువ్వు పాటు పడక తప్పదు! అదేదో భగవంతుడు ని స్మరిస్తూ చేస్తే నువ్వు చేసేది ఉపాసన అవుతుంది, మరింత ఫలితాన్ని ఇస్తుంది.
ఇద్దరు వ్యక్తులు రోజు కూలి పనులకు వెళ్తున్నారు రోజు కూలి తెస్తే కానీ వారి ఇల్లు గడవని పరిస్థితి.. అయితే ఒక అతను ‘నేను కూలి చేస్తే కానీ నా ఇల్లు గడవటం లేదు ఇందులో దేవుడు చేసింది ఏముంది? నా కష్టం నాకు తప్పడం లేదు కదా!’ అని దేవున్ని తలవను కూడా తలవడు.
ఇంకో వ్యక్తి ‘దేవుని దయ ఉండబట్టే ఈ పని అయినా దొరికి నాకుటుంబాన్ని పోషించుకోగలుగు తున్నాను ఆ దేవుడికి నేను కృతజ్ఞతతో ఉండాలి,నేను ఎలాగో రోజంతా కష్టపడి పని చేయక తప్పదు ఆ సమయంలో నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని నిద్ర లేచిన దగ్గర నుండి నారాయణ స్మరణ చేస్తూ కష్టం చేసుకునే వాడు. పొద్దు పోయి సరికి అతనికి రావాల్సిన కూలి డబ్బుతో పాటు కొన్ని వేల సార్లు నామ జపం చేసిన పుణ్యం కూడా అతని ఖాతాలో పడేది. ఆ నామ స్మరణ వల్ల అతనిలో ఆత్మ వివేకం కలిగింది, ఉన్నతంగా ఆలోచించడం ప్రశాంతంగా ఉండటం ధ్యానం చేయడం అలవాటు అయ్యింది.
ఇంకో వ్యక్తి ఆ చాకిరి తలుచుకుటూ ‘గాడిద చాకిరీ’ అని ఎప్పుడూ గాడిదను తలుచుకుంటూ కుటుంబంలోని వారిని తిడుతూ పని చేయించిన యజమానిని తిట్టుకుంటూ రోజు ముగిసి పోయేది.
చివరికి ఇద్దరి జీవితం ముగిశాక దైవభక్తి గల వ్యక్తి తను సంపాదించిన దైవ స్మరణ అనే నిధితో ధనికుడి అయిన ఆసామి ఇంట్లో పుట్టాడు.ఎప్పుడూ తిట్టుకుంటూ ఒకరిని దూషిస్తూ ఆ పాపం అకౌంట్ లో వేసుకున్న వ్యక్తి గాడిదగా చాకలి వాళ్ళ ఇంట్లో గాడిదకు పుట్టాడు. ఇప్పుడు గాడిద చాకిరి తప్పదు.
చేసే పని ఎలాగో తప్పదు అదేదో ఎవరినీ దూషించ కుండా దైవ స్మరణతో చేస్తే స్వామి కార్యం, స్వకార్యం రెండూ దక్కుతుంది. ఉండే బాధలు పనులు ఎప్పుడూ ఉంటుంది అది తప్పదు. ఎంత నెత్తిన పెట్టుకొని చూసినా ఒక వయసుకి ఎవరి దారి వాళ్ళు చూసుకోకుండా ఉండరు.
ఎంత అందంగా అలంకరించిన దేహానికి అయినా వృద్ధాప్యం రాక తప్పదు.సంపాదన పిల్లలు పంచుకుంటారు కానీ అనారోగ్యాన్ని ఎవ్వరూ తీసుకునే వీలు ఉండదు, అది అనుభవించాల్సిందే! అందుకే మీకంటూ మిగిలే సంపద మీవెంట వచ్చే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద మటుకే! ఇది మరువకండి. ఈ మార్గం విడువకండి.
జీవితం అనే పాలలో, భక్తి అనే పెరుగుని బాధ్యత అనే కవ్వంతో చిలికి కష్టం అనే వేడి పైన కాచి నెయ్యి అనే ఆత్మ సాక్షాత్కారమే మనసుతో చేసే అంతర్యాగ సాధన.మనసు లగ్నం చేసి చేసే ఉపాసన
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment