బౌద్ధబిక్షువు
🌺🍀🌺🍀🌺🌺ఒక రోజు అశోకుడు తన రాజ్యాన్ని చుట్టి వస్తుండగా ప్రజలంతా నమస్కారం చేస్తూ గౌరవిస్తున్నారు
అటుగా వచ్చిన బౌద్ధ బిక్షువు కూడా ఆయన రథానికి దారి ఇవ్వగా, ఆ బిక్షువును చూసిన అశోకుడు రథాన్ని ఆపమని చెప్పి ఆ బౌద్ధ బిక్షువు దగ్గరకు వెళ్లి ఆయన కాళ్లపై పడి నమస్కారం చేయగా
అశోకుడి తల ఆయన పాదాలు తాకగా బిక్షువు రాజును ఆశీర్వాదించాడు.
అటుగా వచ్చిన బౌద్ధ బిక్షువు కూడా ఆయన రథానికి దారి ఇవ్వగా, ఆ బిక్షువును చూసిన అశోకుడు రథాన్ని ఆపమని చెప్పి ఆ బౌద్ధ బిక్షువు దగ్గరకు వెళ్లి ఆయన కాళ్లపై పడి నమస్కారం చేయగా
అశోకుడి తల ఆయన పాదాలు తాకగా బిక్షువు రాజును ఆశీర్వాదించాడు.
ఇదంతా గమనించిన మంత్రికి మంచిగా అనిపించలేదు ఒక రాజ్యం ఏలే రాజు ఒక బిచ్చగాడి కాళ్లపై పడడం బాలేదు అని చింతించాడు అదే విషయాన్ని రాజ్యం చేరుకున్నాక రాజుకు చెప్పాడు
రాజు చిన్నగా నవ్వి, నాకు వెంటనే ఒక మేక తల, ఒక పులి తల, ఒక మనిషి తల తెప్పించండి అన్నాడు
అర్థం కాని మంత్రి రాజు అజ్ఞను ఎదిరించలేక ఆజ్ఞ జారిచేసాడు. రాజా ఇదిగోండి మీరు అడిగినవి
మేక తల ఒక మాంసపు కొట్టులో సులభంగా దొరికింది. కాస్త ప్రయత్నించగా ఒక వేటగాడి దగ్గర పులి తల దొరికింది ఇక మనిషి తల కోసం అన్ని చోట్ల వెతికించగా ఒక శవం తల దొరికింది అన్నాడు
మళ్ళీ నవ్విన అశోకుడు, ఇవన్నీ తీసుకెళ్లి బజారులో అమ్ముకుని రండి అన్నాడు. మంత్రి మనిషి తలతో తిరిగివచ్చాడు. రాజా మేక తల త్వరగా అమ్ముడుపోయింది. పులి తల ఆలస్యం అయింది అందరు వింతగా చూసి వెళ్లారు చివరకు ఒక వ్యక్తి తన ఇంటి ముందు ఉంచడానికి అని కొనుకున్నారు
ఈ మనిషి తల ఎవరూ కొనుక్కోవడం లేదు అన్నాడు. ఉచితంగా ఇచ్చేయకూడదా ఎవరికైనా అన్నాడు రాజు అలా కూడా ఎవరూ తీసుకోలేదు రాజా అన్నాడు
చూసావా మంత్రి.. మనిషికి విలువ ప్రాణం ఉన్నంత వరకే ఆ తరువాత ఊరికే ఇస్తామన్నా ఎవరూ తీసుకోరు. ఇది తెలియక మనిషి ఎంత అహంకారంతో ఉంటాడు. ఎన్నెన్ని ఆటలు ఆడుతాడు
దేహం విలువ ఏంటో ప్రాణం ఉన్నప్పుడే తెలుసుకుని బిక్షువులు జ్ఞానం సంపాదించుకుంటారు
ఆ జ్ఞానాన్నే మనకు పంచేది అటువంటి వారి కాళ్లపై పడడంలో తప్పేముంది అన్నాడు అశోకచక్రవర్తి.
బుద్ధుని ఆశ్రయించి వారి సాంగత్యంలో ఉన్న కొందరు సాధకులు సిద్ది పొంది బౌద్ధ బిక్షువులు (గురువు) అయినారు.బుద్ధుని పక్కనే ఉండి అన్ని చూసుకొంటున్న బుద్ధుని బంధువు అయిన ఆనందుడు మాత్రం సిద్ది పొందలేక పోయాడు.ఈ విషయం బుద్ధుని మరణంతర్వాత గ్రహించిన ఆనందుడు విలపిస్తాడు.
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment