శ్రీ తిరుమల వెంకన్న ముందు ఆంజనేయస్వామి కి బేడీలేసి నిలబెట్టారు... ఎందుకు..?
🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🍀🌺🌺సాధారణంగా తప్పు చేసిన వారికి జైలుశిక్ష వేస్తుంటారు. నిందితులను బేడీలేసి తీసుకెళుతుంటారు. ఇది ఇప్పటిది కాదు... ఎన్నో యేళ్ళుగా దేవుళ్ళ నుంచి వస్తున్న ఆచారమని పురాణాలే చెబుతున్నాయి. అందుకు నిదర్శనమే తిరుమలలోని ఆంజనేయ స్వామి. తిరుమలలో అల్లర చిల్లరగా ఆంజనేయ స్వామి తిరుగుతుంటే ఆయన తల్లి అంజనాదేవి కాళ్ళకు బేడీలను కట్టి శ్రీవారి ముందు నిలబెట్టిందట. మీరే ఆంజనేయుడిని చూసుకోవాలని కూడా అంజనాదేవి శ్రీవారిని ప్రార్థించిందని పురాణాలు చెబుతున్నాయి. క్రీ.శ.1841 సంవత్సరం కంటే ముందు ఈ సంఘటన జరిగినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. అసలు ఆంజనేయస్వామి తిరుమలకు వచ్చి అల్లర చిల్లరగా తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే యాత్రికు లకు, శ్రీవారికి అనుసంధానకర్తగా తొలిగా అందరికీ దర్శనమిచ్చేది రామభక్తాగ్రేసరుడైన శ్రీ బేడి ఆంజనేయస్వామి. తిరుమల శ్రీనివాసుని సన్నిధి వీధిలో శ్రీ వేంకటేశ్వరునికి అభిముఖంగా అంజలి ఘటిస్తున్న భంగిమ లో చేతులకు కాళ్ళకు బేడీలు తగిలించుకుని నిలిచి ఉన్న శ్రీ బేడీ ఆంజనేయస్వామి దర్శనమిస్తారు. ఇక్కడ అంజనాద్రిలో అల్లర చిల్లరగా తిరుగుతూ నానారభస చేస్తున్న హనుమంతుడి కాళ్ళకు, చేతులకు బేడీలు తగిలించి ఎక్కడికి కదలకుండా శ్రీవారికి ఎదురుగా నిలబెట్టిందట అంజనాదేవి. అందువల్లే ఈయనను బేడీ ఆంజనేయస్వామి అంటారు.
కానీ క్రీ.శ.1841 ప్రాంతంలో దేవస్థానం అధికారులైన మహంతు వల్ల ఉత్తరదేశమైన పూరీ జగన్నాథం నుంచి వచ్చిన సంప్రదాయ మే ఈ బేడీ ఆంజనేయస్వామి అని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆంజనేయ స్వామి ఆలయం ముఖ మండపం, గర్భాల యం అని రెండు భాగాలుగా నిర్మింపబడింది. గర్భాలయంలో గోడవరకూ మధ్యలో సుమారు 6 అడుగుల నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
గర్భాలయంపై ఏక కలశ గోపురం నిర్మింపబ డింది. గోపురానికి నాలుగు మూలల్లో ఆనంద నిలయానికి వలెనే సింహాలు ఉన్నాయి. ఇటీవలే ఈ ఆలయానికి ప్రదక్షిణ మండపం కూడా నిర్మింపబడింది.
ప్రతిరోజు మూడుపూటలా శ్రీ వేంకటేశ్వరుని నివేదనానంతరం భక్త శిఖామణియైన శ్రీ బేడీ ఆంజనేయస్వామికి నైవేద్యం జరుగుతోంది. ఈ నివేదన శ్రీ స్వామివారి ఆలయం నుండే పంపబడుతున్నది. ప్రతి ఆదివారం ఈ మూర్తికి పంచామృతాభిషేకం పూజా నివేదనాలు జరుగుతున్నాయి. ప్రతినెలా పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతారామలక్ష్మ ణులు ఊరేగుతూ ఇక్కడకు వస్తారు. శ్రీ సీతారామలక్ష్మణులకు ఇచ్చిన శేషహారతిని ఆంజనేయస్వామి వారికి ఇస్తారు. శ్రీరాముల వారి మెడలోని పుష్పహారాన్ని ఈ బేడీ ఆంజనేయస్వామికి సమర్పిస్తారు.
ప్రతి బ్రహ్మోత్సవంలో గరుడోత్సవం ఏపీ ప్రభుత్వం ఈ బేడీ ఆంజనేయస్వామి వారి ఆలయం నుండే ఊరేగింపుగా తీసుకెళ్ళి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి పట్టుపస్త్రాలను సమర్పిస్తారు.
శ్రీ బేడీ ఆంజనేయ స్వామి గోవిందా...! గోవిందా..! గోవింద..!
బేడీ ఆంజనేయస్వామి రెండు చేతులు అంజలి ఘటించి వేంకటేశ్వరస్వామి వారికి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడు. చిన్నతనంలో తిరుమల వదిలి పారిపోతుంటే అంజనీ దేవి (ఆంజనేయుని తల్లి) చేతులకు బేడీలు తగిలించిందట. అందుకనే ఈయనను బేడీ ఆంజనేయస్వామి అంటారు. ఈయన విగ్రహం చేతులకు బేడీలు తగిలించి వుంటాయి.
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment