ఆనంద సృష్టి
🌺🍀🌺🍀🌺🌺
పువ్వులను మనం సృష్టించలేం. వాటికవే పుష్పించి, వికసించి అందరికీ ఆనందం కలగజేస్తాయి. నవ్వులను మనం సృష్టించుకోగలం. ఆ నవ్వుల్లో మునిగి ఆనంద డోలికల్లో తేలియాడగలం. కొన్ని మన చేతుల్లో ఉంటాయి. పెద్ద పనుల్ని మనం చెయ్యలేకపోయినా చిన్నచిన్న పనులను పెద్ద హృదయంతో చెయ్యాలి. గొప్ప పనులు చెయ్యలేకపోతున్నామని బాధ పడకూడదు. ఆ సందర్భం వస్తే అనుకోకుండా అద్భుతమైన పనుల్లో మనం భాగస్వాములమవుతాం.
ఆనందం, మనం చేస్తున్నది చిన్నపనా పెద్దపనా అని కొలతలు వెయ్యదు. ఎంతగా మనసు పెట్టి, హృదయపూర్వకంగా పసివాడిలా ఆ పని చేస్తున్నామా అని చూస్తుంది. ఆనందానికి మనం చిరునామా అయిపోవాలి. బాధలు కిటికీ తెరలు. మహాద్వారం మన అంతులేని సంతోషమే. దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ గృహంలో నిత్యం గంతులు వేస్తూ ఉత్సవం. చేసుకోవాలి. చెట్టును, పిట్టను, కొంగను, కోడిని చూసి మురిసిపోవాలి. కూడా ప్రతీ దృశ్యం సూర్యోదయంలా ఉండదు. ప్రతి సందర్భం పడమట సంధ్యారాగంలా సంగీతాన్ని ఆలపించదు. చేతిలో చిన్న వెదురుముక్క కూడా, నాలుగు రంధ్రాల్లో చక్కటి వేణుగానం వినిపిస్తుంది. హృదయంలో సంతోషం సంతకాలుండాలి. మనసులో మంచి జ్ఞాపకాల మంచు కురుస్తూ ఉండాలి. ప్రేమ లేకుండా మనిషిని భగవంతుడు సృష్టించలేదు. ఆనందం లేకుండా అతడిని జీవించమని చెప్పలేదు. మనిషి ఆనందిస్తుంటే మురిసిపోయేవాడు ఆ దేవదేవుడే.ఉదయం లేవగానే రెండే రెండు అవకాశాలు మన ముందుంటాయి. రోజంతా సంతోషంగా ఉండాలా, లేదంటే వేదనతో కాలం గడపాలా అని. ఆనందం మన హక్కు ఆనందంగా ఉండటం మన స్వభావంపుట్టుకతో బాధలు అందరికీ ఉండవుమధ్యలో వచ్చేవి మధ్యలోనే పోతాయి. ఆనందాన్ని సృష్టించు. అపరిమితంగా సృష్టించు. గడ్డిపువ్వుల్లోనూ మానస సరోవర బ్రహ్మకమలాన్ని చూడగలిగే మనసును తయారుచేసుకోవాలి. బతకడానికి సిరులు-సంపదలు కాదు కావాల్సింది. పెద్ద హృదయంలో చిన్ని చిన్ని ఆనందాలు సృష్టించుకోవడం తెలిసిన నేర్పరితనం కావాలి. బృందావనంలో ప్రవేశించినంతనే శ్రీకృష్ణ దర్శనం కాదు. కాని, బృందావన దర్శనం అవుతుంది. అది పరమాత్మ తిరిగిన ప్రదేశం. ప్రతి మొక్క, ప్రతి పూవు, గాలి, నీరు మాట్లాడతాయి. మనసును తెరచి ఉంచుకోవాలి. అంతే!మనలోపల శ్రీకృష్ణుడు వ్యాపిస్తే, కళ్లకు విశ్వమంతా కృష్ణమయంగా అనిపిస్తుంది. భావంతో దైవాన్ని మనం లోపల సృష్టించకపోతే బాహ్యప్రపంచంలో ఆయన ఎలా కనిపిస్తాడు... నిత్య సంతోషికి దూరంగా దేవుడు ఉండగలడా? కొంత సంతోషం ఇతరుల మీద చల్లగలిగితే మనకు అది రెట్టింపై తిరిగి వస్తుందిజీవితాంతం నవ్వుతూ ఉండటం జీవన రహస్యం తెలిసినవాడికి మాత్రమే సాధ్యమవుతుంది. అతడే జ్ఞానిఅతడే తనకు చాలా ఇష్టమైనవాడు అంటాడు గీతాచార్యుడు. బాధలు, బాధ్యతలు అందరికీ ఉంటాయి. ప్రపంచం భూతంలాగా కనిపిస్తుందిసంసారం సముద్రంలాగా అనిపిస్తుంది. వైరాగ్యంతో మనసు చేదెక్కిపోయి ఉంటుంది. అక్కడే మనిషి తన భావాన్ని మార్చుకుని చిరునవ్వు నవ్వగలిగి ఉండాలివెంటనే మరిచిపోయి, కళ్లు తుడుచుకున్న చిన్నపిల్లాడిలాగా జీవితాన్ని ఆహ్వానించాలి. ప్రపంచాన్ని కౌగిలించుకోవాలి. నవ్వుతూ అందరినీ పలకరించాలి.
*|సర్వేజనా సుఖినోభవంతు|*
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment