దేవుడే దిక్కు
🌺🍀🌺🍀🌺🌺🍀
ఒక గ్రామంలో తల్లీ కుమారులు జీవిస్తూ ఉండేవారు. కుమారుడు పుట్టిన తరువాత తండ్రి చనిపోయినాడు. వారిద్దరికీ జీవించడానికి ఎట్టి ఆధారము. లేకపోయింది. తల్లి కష్టపడి పనిచేస్తూ, పిల్లవానిని చదివించింది. ఆమె తన ఆశలనన్నింటినీ కుమారుని పైననే పెట్టుకొన్నది. కుమారుడు కూడ చురుకుగ చదువుతూ 10వ తరగతికి వచ్చాడు. పరీక్షలు దగ్గరపడినవి. పరీక్ష ఫీజు 50 రూపాయలు కట్టవలసి వచ్చింది. ఆ అబ్బాయి "అమ్మా! పరీక్షఫీజు కట్టాలి" అని తల్లితో అన్నాడు. ఆమెకు ఏమీ తోచలేదు. కష్టపడి పనిచేస్తే వచ్చే ఆదాయము వారిద్దరూ ఒకపూట భుజించడానికి మాత్రమే సరిపోతుంది. ఆమె హెడ్మాస్టర్ను కలిసి తమ పరిస్థితిని వివరించినది. హెడ్మాస్టర్ ఆమెతో "అమ్మా! నేను చేయగలిగినది ఏమీలేదు. ఇవి గవర్నమెంటు రూల్స్" అన్నాడు.
ఆమె ఇంటికి తిరిగివచ్చి తన కుమారుని భవిష్యత్తును గురించి చింతించసాగింది! కుమారుని భవిష్యత్తు యీ పరీక్షమీద ఆధారపడి వుంది. కానీ నేనేమీ చేయలేని పరిస్థితులలో వున్నానే, అని చెట్టుక్రింద కూర్చుని ఏడవసాగింది.
ఆ సమయంలో కుమారుడు పరిగెత్తుకొని వచ్చి 'అమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు?' అని అడిగాడు. “ఏమీలేదు నాయనా! రా! భోజనం చేసి మాట్లాడుకుందాం" అన్నది. కానీ పిల్లవాడు ఊరుకోలేదు. "నాయనా! నీ పరీక్షఫీజు కట్టే శక్తి నాకులేదు. రేపటినుంచి నీవుకూడా నాతోపాటు వచ్చి పనిచేయవలసి వస్తుందే అని దుఃఖిస్తున్నాను" అని కుమారునితో అన్నది. "అమ్మా! నేను చదువుతాను. పరీక్ష వ్రాస్తాను. ప్రస్తుతానికి ఎవరిదగ్గరయినా అప్పు తీసుకొని ఫీజుకట్టు. పరీక్షలు అయిన తర్వాత కూలిపని చేసి అప్పు తీరుస్తాను" అని ఆ అబ్బాయి అన్నాడు. ఆమె, "మనకు అప్పు ఎవరు ఇస్తారు నాయనా! దిక్కులేని వారికి దేవుడే దిక్కు" అంటూ యింట్లోకి వెళ్లింది. కుమారుడు అమాయకంగా "అమ్మా! ఆ దేవుడు ఎక్కడ వుంటాడమ్మా" అని ప్రశ్నించాడు. ఆమె "నాయనా! అతడు మహాశక్తి సంపన్నుడు. సకలైశ్వర్యసంపన్నుడు, అందరికీ అన్నీ యిచ్చేది ఆయనే!" అని తన ధోరణిలో చెప్పుకుంటూ పోయింది.
ఆ అబ్బాయి "ఆ దేవుడు అసలు ఎక్కడ వుంటాదో చెప్పమ్మా! అతని కాళ్లు పట్టుకొని, బ్రతిమాలి డబ్బులు తెస్తాను" అన్నాడు అమాయకంగా, తల్లి నిట్టూరుస్తూ "అందరికీ దిక్కు వైకుంఠంలో ఉండే నారాయణుడే" అన్నది. ఆ అబ్బాయి తన జేబు తడుముకుంటూ పోస్ట్ ఆఫీసుకి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. జేబులో సరిగ్గా పోస్ట్కార్డుకు సరిపోయేటంత డబ్బులు వున్నాయి.
ఒక కార్డుకొని తన ప్రార్ధన వ్రాసి, 'టు, శ్రీమన్నారాయణ, వైకుంఠం' అని అడ్రసు వ్రాసి పోస్ట్బక్సు వద్దకు వెళ్ళాడు. పోస్ట్బక్సు ఒక ఎత్తయిన స్తంభానికి కట్టివుంది. కార్డు బాక్సులో వెయ్యాలంటే ఆ అబ్బాయికి అంత ఎత్తు అందలేదు. ఎగిరి ఎగిరి బాక్సులో జాబు వేయాలని ప్రయత్నిస్తున్నాడు. పోస్ట్ మాస్టరు కిటికీలో నుండి అబ్బాయి అవస్థను గమనించాడు. బయటకు వచ్చి, "ఆ జాబు నాకు యివ్వు నేను బాక్సులో వేస్తాను" అన్నాడు. ఆ అబ్బాయి "ఈజాబు చాలా అర్జెంట్గా చేరాలి. సార్, నేను పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బు రావాలి సార్! ఈ జాబు తొందరగా చేరే మార్గం చూడండి సార్" అని ప్రార్ధించాడు. పోస్ట్ మాస్టరు కార్డుపైన అడ్రసు చదివాడు. పోస్ట్ మాస్టరు "నాయనా! అడ్రసు నీకు ఎవరిచ్చారు?" అని అడిగాడు. " మా అమ్మ సార్, నాకు చదువుకోవాలని చాలా ఆశ. మా వద్ద డబ్బులేదు. ఈ నారాయణగారు చాలా డబ్బుగల వాడట సార్, దిక్కులేని వారికి సహాయం చేస్తాడట! అని మా అమ్మ చెప్పిందండి" అని ఆ అబ్బాయి సమాధానం చెప్పాడు. పోస్ట్ మాస్టరు హృదయం ద్రవించిపోయింది. "ఆహా! ఈ పిల్లవాడు ఎంత నిర్మల హృదయుడు. తల్లిమాటలపై ఎంత విశ్వాసం" అని తనలో తాను అనుకుంటూ, "నాయనా! ఈ జాబు అర్జంటుగా చేరే మార్గం నేను చూస్తాను. నీవు ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఇక్కడకు రా! నీ డబ్బు తప్పకుండా వస్తుంది" అని అన్నాడు..
ఆ అబ్బాయి పట్టలేని ఆనందంతో యింటికి తిరిగి వెళ్ళి "అమ్మా! నేను ఫీజు కట్టేస్తాను. పరీక్ష వ్రాసేస్తాను" అన్నాడు తల్లితో, తల్లి ఏమీ అనలేక నవ్వి పూరుకుంది. ఆ రెండు రాత్రులు ఆ అబ్బాయి ఎట్లా గడిపాడో! పోస్ట్ మాస్టరు చెప్పిన ప్రకారం మూడవ రోజు ఉదయం 9 గంటలకు పోస్టాఫీసుకి వెళ్ళాడు. వెళ్ళి పోస్ట్ మాస్టరుతో "సార్! నేను 10 గంటలకు ఫీజు కట్టాలి. అక్కడనుంచి ఏమయినా డబ్బు వచ్చిందా!" అని ఆ అబ్బాయి అడిగాడు. పోస్ట్ మాస్టరు "వచ్చింది నాయనా! ఇదిగో కవరు!" అని ఒక కవరును ఆ అబ్బాయికి అందించాడు. ఆ కవరును. అందుకొని యింటికి పరిగెత్తుకొని వెళ్ళి "అమ్మా! డబ్బు వచ్చింది!" అని ఆ కవరును తల్లికి అందించాడు. తల్లి కవరులో గల 50 రూపాయల డబ్బును చూసింది. ఆమెకు ఆశ్చర్యం, భయం కలిగాయి. వీనికి ఈ డబ్బు ఎలా వచ్చింది. దొంగలించాడా? ఎవరినైనా అర్థించాడా? గుట్టుగా జీవిస్తున్న నాకు వీని మూలంగా ఎంత అప్రతిష్ఠ! అని ఆలోచించసాగింది.

కొంతసేపటికి కోపంగా "ఎవరు నీకు యీ డబ్బు యిచ్చారో వారి వద్దకు నన్ను తీసుకొనిపోరా!" అని కుమారుని చేయి పట్టుకొని బయలుదేరింది. "అమ్మా! నీవు చెప్పినట్లు నారాయణగారికి జాబు వ్రాసాను. ఆయనే పంపించాడు యీ డబ్బు, పద! పోస్ట్ మాస్టరు గారిని అడుగు" అని అబ్బాయి అన్నాడు. పిల్లవానిని బయటనే నిలబెట్టి. ఆమెలోనికి వెళ్ళింది. తల్లి పోస్ట్ మాస్టరుతో "అయ్యా! ఈ పిల్లవాడు చెప్తున్నదంతా నిజమేనా!" అని అడిగింది. పోస్ట్ మాస్టరు ఆమెతో "అవునమ్మా! భగవంతుడే. పంపించాడు! మొన్నటిదినం యీ పిల్లవాడు వ్రాసిన జాబుచూసి, నా హృదయం కరిగింది. నా మనస్సులో భగవంతుడు ప్రవేశించి, నాచేత యీ డబ్బు యిప్పించాడు. అమ్మా! దయచేసి యీ డబ్బు వాపసు యివ్వకండి. ఆ పసివాని విశ్వాసం దెబ్బతింటుంది. నిర్మల హృదయులైన పిల్లలు ప్రార్థిస్తే, భగవంతుడు ఆ ప్రార్ధనను తప్పక అలకిస్తాడు. ఏదో ఒకవిధంగా ఆదుకుంటాడు. నేను నిమిత్తమాత్రుణ్ణి" అన్నాడు.
ఈ కథనుండి మనము తెలుసుకోవలసినది ఏమిటి? నిర్మల హృదయంతో, సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థిస్తే, భగవంతుడు ఏదో ఒక రూపంలో మనం కోరిన దానిని అందిస్తాడు.
ఈ కథనుండి మనము తెలుసుకోవలసినది ఏమిటి? నిర్మల హృదయంతో, సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థిస్తే, భగవంతుడు ఏదో ఒక రూపంలో మనం కోరిన దానిని అందిస్తాడు.
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment