Friday, 19 April 2024

రెండు గంటల నిరీక్షణ (20-Apr-24, Enlightenment Story)

 రెండు గంటల నిరీక్షణ

🌺🍀🌺🍀🌺🌺🍀

నాన్నగారికి ఆరోగ్యం సరిగ్గా లేదు. చాలా జ్వరంగా ఉంది. మా కుటుంబ వైద్యులు రామమూర్తి గారు కొన్ని మందులు రాసిచ్చి, “సంపూర్ణంగా విశ్రాంతి అవసరం. మంచం నుండి కదలడానికి వీల్లేదు” అని చెప్పి వెళ్ళిపోయారు.

ఆ సమయంలోనే శ్రీమఠం నుండి స్వామివారి ఆజ్ఞతో ఒకరు ఇంటికి వచ్చారు. “పరమాచార్య స్వామివారి దర్శనానికి హింది పంతుల్ని ( మానాన్న) రమ్మంటున్నారు” అని.

అవును అది పరమాచార్య స్వామివారి ఆదేశం. మనస్సు సిద్ధమయ్యింది కాని వెళ్ళడానికి శరీరం సహకరించడం లేదు. మా నాన్నగారి పరిస్థితి చూసి, అతను సానుభూతి తెలిపి వెళ్ళిపోయాడు. ఒక గంట తరువాత శ్రీమఠం నుండి గుర్రపు టాంగా వచ్చి మా ఇంటి ముందు నిలబడింది. బహుశా చాలా ముఖ్యమైన విషయం అయ్యుంటుంది. ఈ సమయంలో హింది పండితుడు ఉండాలి అని మహాస్వామి వారు అనుకుని ఉంటారు.



నాన్నగారు వెళ్ళాల్సిందే. నాలుగైదు రోజులుగా నాన్న అన్నంగంజి తప్ప ఏమి తీసుకోవడం లేదు. రసం అన్నం కూడా తినవద్దని డాక్టరు గారు ఖండితంగా చెప్పారు. అయిష్టంగానే కొంత గంజి తాగి శ్రీమఠం సేవకుని సహాయంతో టాంగా ఎక్కారు. మఠం చేరగానే చాలా కష్టంగా కిందకు దిగారు. అ సేవకుని సహాయంతో మహాస్వామివారి వద్దకు వెళ్ళారు.

నాన్నని కూచోమన్నట్టుగా స్వామివారు ఆదేశించారు. స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు వచ్చారు. ఎన్నో సూచనలు చేశారు, పత్రాలను చదివి పంపారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు;

అలా రెండుగంటలు గడిచిపోయింది. నాన్నకు ఆకలిగా అనిపించింది. తనలో తనే, “స్వామివారు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నాకు ఆరోగ్యం కూడా బాలేదు. ఇక్కడకు వచ్చి ప్రయోజనం ఏమిటి?” అనుకున్నారు. అక్కడే ఉన్న స్వామివారి అంతేవాసులను చూసి మౌనంగా తన బాధను చెప్పుకున్నారు.

వెంటనే అతను, “హింది పండితునికి ఆరోగ్యం బాగోలేదు. చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చున్నారు” అని చెప్పాడు.
మరునిముషంలోనే స్వామివారు ప్రసాదం ఇచ్చారు. వెంటనే నాన్నగారు స్వామి ఇచ్చిన విభూతిని నుదుటన రాసుకున్నారు. స్వామివారికి ప్రణామాలు సమర్పించి బయలుదేరుతుండగా శ్రీమఠం సేవకులు సహాయం చెయ్యడానికి రాగా, ”అవసరం లేదు. నేను నడవగలను” అని ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచి వెళ్ళి టాంగా ఎక్కి కూర్చున్నారు.

ఇంటికి చేరగానే నాన్న గట్టిగా, “నాకు ఆకలేస్తోంది. చాలా ఆకలేస్తోంది. ఏమి చేశారు ఇంట్లో?” అని అడిగారు. “డాక్టరు మిమ్మల్ని కేవలం గంజి మాత్రమే తీసుకోమని చెప్పారు” అని అన్నాము.

“అతను చెప్పనీ. . . నాకు భోజనం పెట్టండి” అన్నారు. నాన్న ఆరోజు సుష్టుగా కమ్మని భోజనం చేశారు. సాయింత్రం నాన్నని పరీక్షీంచడానికి డాక్టర్ వచ్చారు. “అసలు జ్వరం లేదు. నేను ఇచ్చినది కాక ఇంకే ఔషధం తీసుకున్నారు?” అని అడిగారు.

“మీరు ఇచ్చినదే తీసుకున్నాను. లేదు.. లేదు.. మీరు ఏదో వేరే చేశారు”

అప్పుడు నాన్నగారు తను శ్రీమఠానికి వెళ్ళడం దాదాపు రెండుగంటలు స్వామివారి సన్నిధిలో ఊరికే కూర్చోవడం మొత్తం జరిగినదంతా డాక్టరుకు చెప్పారు. ఆయన ఆశ్చర్యపోతూ,

“అది సంగతి. నేను చెప్పలేదా మీరు ఇంకా ఏదో చేశారని.. నేను సరిగ్గానే ఊహించాను. రెండుగంటల పాటు స్వామివారి అనుగ్రహ వీక్షణం మీమీద పడి, మొత్తం మీ ఆనారోగ్యాన్ని పారద్రోలింది. పరమాచార్య స్వామివారు డాక్టర్లకే పెద్ద డాక్టర్. నా వైద్యం మీకు త్వరగా బాగుచేయదు కాబట్టి, వారి వైద్యాన్ని కృపాకటాక్ష వీక్షణాల ద్వారా మీమీద ప్రసరించడానికే మిమ్మల్ని మఠానికి రమ్మన్నారు” అని చెప్పారు.

ఏమి కరుణ!! ఎంతటి కరుణాసముద్రులు!! మహాస్వామివారు ఉన్నవైపు తిరిగి మా కుటుంబ సభ్యులమందరమూ చెయ్యెత్తి వేవేల నమస్కారాలు చేశాము.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...