Sunday, 28 April 2024

ఎగ దీస్తే బ్రహ్మ హత్య - దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది? (29-Apr-24, Enlightenment Story)

 ఎగ దీస్తే బ్రహ్మ హత్య - దిగ దీస్తే గో హత్య అనే మాట ఎలా వచ్చింది?    

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺                     

పూర్వం, ఒక రాజ్యం లో  సర్వ  సైన్యాధ్యక్షుడు  హటాత్తుగా మరణించాడు. కొత్త  సైన్యాధ్యక్షుని కోసం వచ్చినవారికి రాజు రక రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాడు. విషయం తెలిసిన శత్రు రాజు తన సైన్యంతో  ఆ రాజ్యం పై దండయాత్రకు బయలుదేరాడు. రాజుకి ఈ విషయం తెలిసి ఏమి చేయాలో అర్ధం కాలేదు. రాజ్యాన్ని ఈ సమయం లో ఎలా రక్షించాలి అని రాజుగారు మధన పడుతున్నాడు.


అప్పుడు సుమారు 100 మంది బ్రాహ్మణులు వచ్చి, మహారాజా, మమ్మలిని యుద్దానికి వెళ్లేందుకు అనుమతించండి అని అన్నారు. అప్పుడు మహారాజు గారు, ఓ పండి తోత్తములారా, మీరు వేదాలు చదవ గలరు, కానీ యుద్ధం ఎలా చేయగలరు అని ప్రశ్నించాడు.

మహారాజా, మా శక్తిని శంకించకండి, యుద్దానికి వెళ్లడమే కాదు,  రాజ్యాన్ని రక్షిస్తాం అన్నారు పండితులు. అప్పుడు రాజుగారు మంత్రి వంక చూసాడు. అప్పుడు మంత్రి, మహారాజా, వేదాలలో యుద్ధ విద్యల గురించి కూడా ఉంటుంది, కాబట్టి వాళ్లకి యుద్ధం గురించి తెలుసు, శంకించకుండా, వారిని యుద్ధనికి అనుమతించండి అని సలహా ఇచ్చాడు.

రాజుగారు అంగీకరించి, సరే, మీకు కావలసిన సైన్యాన్ని, గుర్రాలను, ఇంకా మీకు కావలసిన బలగం మీ వెంట తీసుకెళ్లండి అన్నాడు. అప్పుడు పండితులు, అవేమి అవసరం లేదు మహారాజా, మేము ఎంత మంది ఉన్నామో, అన్ని గోవులను మా వెంట పంపండి అన్నారు.

వారి మాటలకు రాజుగారు మొదట అగ్రహించినా, వెంటనే తమాయించుకుని, ఓ పండితోత్తములారా, ఈ కష్ట సమయంలో మీకు పరిహాసం తగునా అన్నారు.  గుర్రాలుకి అయితే యుద్ధం తెలుసు, కాని గోవులు ఎలా శత్రువుల దాడి నుండి  తప్పించుకోగలవు అన్నారు రాజుగారు.

సందేహించకండి మహారాజా, మీకా భయం అక్కర్లేదు అన్నారు పండితులు. వారి అంతరంగం అర్ధం కాని రాజు గారు మరల మంత్రిని సంప్రదించాడు. మంత్రి కూడా ఏమి చెప్పలేక పోయాడు. అప్పుడు ఆస్థాన విదూషకుడు, మహారాజా, అన్నిటికంటే విధి బలీయమైంది, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. మరో ఆలోచన లేకుండా వారు అడిగిన గోవుల్ని వారి వెంట పంపండి అన్నాడు. అతడు అవటానికి విదూషకుడు అయినా, అతని సలహా పాటించి రాజుగారు 100 గోవుల్ని ఆ పండితుల వెంట పంపించాడు.

అప్పుడు బ్రాహ్మణులు ఆ గోవుల్ని తీసుకుని యుద్ధ రంగానికి చేరారు. శత్రు సైనికులు ఒక్కొక్క బ్రాహ్మణుని వద్దకు వచ్చి, కత్తి ఎత్తబోయి, ఆమ్మో బ్రాహ్మణుని చంపితే బ్రహ్మ హత్య పాతకం చుట్టుకుంటుంది అనుకుని, కిందికి చూసారు, గోవు ఉంది. గోవుని చంపితే గోహత్య పాతకం అనుకుని, వారి సైన్యాధ్యక్షునికి పరిస్థితి వివరించారు.

అపుడు శత్రు  సైన్యాధ్యక్షుడు, అవును ఎగ దీస్తే బ్రహ్మ హత్య, దిగ దీస్తే గోహత్య అనుకుని, తన సైన్యాన్ని వెనక్కి మళ్ళించాడుఆలా ఈ సామెత వచ్చింది.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...