Monday, 1 April 2024

గ్రానైట్ ముక్కలు - గజదొంగలు (02- Apr-24, Enlightenment Story)

గ్రానైట్ ముక్కలు - గజదొంగలు

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀

శ్రీమఠం మకాం కార్వేటినగరంలో ఉంది. కారులో చెన్నై నుండి వచ్చిన ఒక కుటుంబం ఆరోజు సాయింత్రానికే తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు. అంతా సిద్ధం చేసుకున్నారు. మహాస్వామి వారు వెళ్ళమని చెప్పగానే బయలుదేరివెళ్ళడానికి నిర్ణయించుకున్నారు.

మహాస్వామివారు ఒక బిల్వవృక్షం కింద కూర్చున్నారు. సబేసన్ కుటుంబం స్వామివారికి నమస్కరించి ప్రసాదం కోసం వేచియున్నారు. ప్రసాదం తీసుకుని కారు వద్దకు వెళ్తుండగా స్వామివారు చిటికేసిన శబ్ధం వినపడడంతో ఆత్రుతగావెనక్కు వచ్చారు. కొద్దిదూరంలో ఉన్న విరిగిపోయిన గ్రానైట్ రాళ్ళముక్కల గుట్టవైపు చూపిస్తూ “వీటిని కొన్ని ఒక చిన్న గోనెసంచిలో తీసుకుని, గట్టిగా కట్టి ఇంటికి తీసుకుని వెళ్ళు” అని చెప్పారు.



అందరూ అయోమయంగా చూశారు. విరిగిపోయిన గ్రానైట్ రాళ్ళని కార్వేటినగరం నుండి చెన్నై తీసుకుని వెళ్ళడం ఎందుకు?ఆ రాళ్ళకున్న ప్రత్యేకత ఏమిటీ? ఎవరూ స్వామివారిని అడిగే ధైర్యం చెయ్యలేదు. కాబట్టి సబేసన్ కొన్ని రాళ్ళని గోనెసంచిలో తీసుకుని గట్టిగా ముడివేసి, దాన్ని కారువెనుక భాగంలో పెట్టి బయలుదేరాడు.

పుత్తూర్ రోడ్డు ఇరువైపులా రాళ్ళ గుట్టలతో ఉంటుంది. ఆ రాత్రి సమయంలో నలుగురైదుగురు మగవారు రోడ్డు మధ్యలో నిలబడి కారుని ఆపారు. వారు హైవే దొంగలని తెలుస్తోంది. కారులోనుండి అందరిని బయటకు తోసి లోపల దేనికో వెతకనారంభించారు. కాని ఏమి దొరకలేదు. కోపంతో కారు వెనుకభాగాన్ని తెరవగా అక్కడ ఉన్న మూట కనపడింది.

“ఒరే! అది ఇక్కడుంది రా” అరిచాడు వాళ్ళల్లో ఒకడు.

మరొకడు దాన్ని తీసుకొవడానికి ప్రయత్నించాడు కాని చాలా బరువుగా ఉండడం వల్ల కుదరలేదు. అందరూ కలిసి దాన్ని కిందకు దింపారు. “వెళ్ళిపోండి వెళ్ళిపోండి” అని సబేసన్ కుటుంబాన్ని తొందరపెట్టారు. సబేసన్ ఎక్కడాఆగకుండా కనీసం వెనుకకు చూడకుండా చాలా వేగంగా కారుని నడుపుతూ ఏదో ఒక చిన్న ఊరు కనపడడంతో కారు ఆపి ఊపిరి పీల్చుకున్నారు.

”నాకు చాలా భయమేసింది. ఖచ్చితంగా వళ్ళు మన నగలను అడుగుతారు అనుకున్నాను” అంది అతని భార్య. ”అదృష్టం! మనందరిని కలిపి కట్టెయ్యలేదు” అని అన్నాడు కొడుకు. ”దేవుడా కృతజ్ఞతలు. వాళ్ళు మా కారుని ధ్వంసం చెయ్యలేదు” అన్నది కూతురు. సబేసన్ కార్వేటి నగరం వైపుకు తిరిగి చేతులెత్తి స్వామివారికి నమస్కరించాడు.

ఆ దొంగలు ఆ బరువైన సంచిలో చాలా డబ్బుందని భ్రమపడి ఇతరములపై దృష్టి పెట్టలేదు. రెండురోజుల సబేసన్ ఒక్కడే పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చి భక్తితో, ఆశ్చర్యంతో జరిగిన విషయమంతా చెప్పాడు.

”భగవంతుడు నిన్ను రక్షించాడు” అని చెప్పారు మహాస్వామి వారు.

అవును నిజమే. సబేసన్ కి తెలుసు తనను రక్షించిన భగవంతుడు ఎవరో. అప్పటి నుండి విరిగిపోయిన గ్రానైట్ ముక్కల్ని పనికిరానివాటిగా చూడలేదు.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం .
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...