Saturday, 20 April 2024

సాధన అనగా నేమి??? సమచిత్తమే సాధన..!! (24-Apr-24, Enlightenment Story)

 సాధన అనగా నేమి??? సమచిత్తమే సాధన..!!

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🍀🌺🌺🍀

రమణ మహర్షి ఆశ్రమంలో ఒకసారి భక్తుల మధ్య వివాదం వచ్చింది. చాలా కాలంగా అక్కడికి వస్తున్న భక్తులకూ, అప్పుడప్పుడే ఆశ్రమాన్ని సందర్శిస్తున్న భక్తులకూ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి...

ఈ నేపథ్యంలో భక్తుల్లో రెండు వర్గాలు బయల్దేరి, ఒకరంటే మరొకరికి పడని పరిస్థితి ఏర్పడింది.
పాతభక్తులు, కొత్తభక్తులు అంటూ విభజనను సృష్టించుకుని, రెండు వర్గాలుగా విడిపోయారు.

సమయం చిక్కినప్పుడల్లా ఒకరిపై మరొకరు అసహనం ప్రదర్శించడం, పరస్పరం దూషించుకోవడం సాగుతోంది.
 


ఇది రమణులు గమనించారు!!...

ఓ రోజు సాయంత్రం మహర్షి గిరి ప్రదక్షిణకు బయల్దేరారు, భక్తులు ఆయనను అనుసరిస్తున్నారు.
ఆశ్రమంలో ఎప్పటి నుంచో ఉంటున్న కొన్ని కుక్కలు, ఆశ్రమం గేటు బయట ఉన్న కుక్కల్ని చూసి మొరగసాగాయి. ఆ దృశ్యాన్ని చూసిన రమణులు ‘పాపం కుక్కలు కదూ! తామంతా ఒకటేనని తెలియక మూర్ఖత్వంతో పాతవి, కొత్తవిగా విడిపోయి అరుచుకుంటూ అలసి పోతున్నాయి’ అంటూ ముందుకు సాగారు.అంతే ఆ రోజు నుంచి ఆశ్రమంలో భక్తుల నోళ్లు మూతపడ్డాయి.

‘భజగోవిందం’ ప్రబోధంలో ఆదిశంకరాచార్యుల వారి శిష్యుడు మేధాతిథి ‘వేరొకరితో విభేదాలను పెంచుకోవటం; తమవారు, పరాయివారు- అంటూ పక్షపాత వైఖరి చూపడం సరికాదు.

*సర్వాంతర్యామి అయిన పరమాత్మను చేరుకోవాలంటే అందరిపై సమదృష్టిని చూపాలి’ అన్నారు*. రమణులు కూడా ‘సమచిత్తమే పారమార్థిక సాధన’ అంటూ చెప్పేవారు...!!



🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...