మానవత్వం ఉంటే చాలు
🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀
ఒక వ్యక్తి రాత్రి బాగా అలసిపోయి నిద్రపోతున్నాడు. ఉన్నట్టుండి ఏదో చప్పుడైతే తలుపు తీసుకుని బయటికి వచ్చాడు. అక్కడ ఒక దేవదూత కూర్చోని ఏదో వ్రాసుకుంటూ ఉంది. ఆమె దగ్గరకి వెళ్ళి "అమ్మా! ఏమి వ్రాస్తున్నారమ్మా!" అని అడిగాడు. దానికి ఆమె ఇలా అంది. "దేవుడంటే ఎంతమందికి ప్రేమ భక్తి ఉన్నాయో తెలుసుకుని ఈ పుస్తకంలో వ్రాస్తున్నాను. " వెంటనే ఆతురతగా ఆ వ్యక్తి ఇలా అడిగాడు. " మరి ఆ పుస్తకంలో నా పేరు ఉందా? ఒకసారి చూసి చెప్పమ్మా!" బాగా వెతికి లేదని సమాధానం చెప్పింది ఆ దేవదూత... తనపేరు లేదని చెప్పగానే బాధపడకుండా నవ్వుతూ ఇలా అన్నాడు. "నా తోటి మనుషులకు సహాయాన్ని అందిస్తూ ఉంటాను. మానవత్వం అనే పుస్తకంలో నాపేరు ఖచ్చితంగా ఉండి ఉంటుంది " అని అన్నాడు. దానికి దేవదూత నవ్వుతూ వెళ్ళిపోయింది, మరుసటి రోజు ఆ దేవదూత మళ్ళీ వచ్చింది.
*" తప్పక చూస్తాను తల్లీ! " అని ఆతృతగా ఆ పుస్తకాన్ని అందుకున్నాడు ఆ వ్యక్తి. పుస్తకాన్ని తెరిచి చూశాడు. ఆశ్చర్యంగా ఆ పుస్తకంలోని మొదటిపేజీలో మొదటి పేరు తనదే ఉండటాన్ని గమనించాడు. ఆనందంతో తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజలా రాలసాగాయి. మనం ఎందుకు ఈ ప్రపంచానికి వచ్చామో ముందు తెలుసుకోగలగాలి. తోటివారిలో దేవుడిని చూడగలగాలి... ఎదుటి వ్యక్తిని హింసించి... చివరికి చంపడానికి కూడా మనిషి వెనుకంజ వేయడం లేదు. కొందరైతే ఎదుటివారి నాశనాన్ని దేవుడి దగ్గరికి వచ్చి మరీ వరం అడుగుతుంటారు.*
దేవుడికి ఇష్టమైన వారిగా మనం మారాలంటే మనలో కాస్త మానవత్వం ఉంటే చాలు. వేలకు వేలు దేవుడికి సమర్పించక్కరలేదు. చేతనయినంతవరకు ఇతరులకు సహాయాన్ని చేయండి. చేసిన సహాయాన్ని మరచిపోకండి దేవుడు గుర్తుపెట్టుకుని మిమ్మల్ని రక్షిస్తాడు.
సమయానికి తగ్గట్టుగా మనకు ఆశీస్సులు అందజేస్తాడు... అంటే దేవుణ్ణి అమితంగా ఇష్టపడి, పూజలు, ఆరాధనలు, భజనలు చేస్తే దేవుడు ఆనందించడు, మానవత్వం కలిగిన ఏ కొద్దిభక్తి, ఇష్టత అయినా దేవుడు అమితంగా ఇష్టపడి, మనలను అనుగ్రహిస్తాడు.*
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment