అధర్మం – అనారోగ్యం
🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺రెండు కిడ్నీలు పనిచెయ్యడం లేదు. బ్రతకడం చాలా కష్టం. చాలా మంది నిపుణుల వద్ద చూపించుకున్నాడు. ఎంతో ధనం ఖర్చు చేశాడు, వాళ్ళు చెప్పిన మందులన్నీ వాడాడు. కాని ఏమి ఉపయోగం లేదు.
అతను మహాస్వామి వారి వద్దకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు. మామూలుగా అటువంటి బాధలతో వచ్చే వారిపై స్వామివారు చాలా కరుణ దయ చూపిస్తారు. వారితో ఎంతో అనునయంగా మాట్లాడుతారు. కాని ఆరోజు స్వామివారు తమ పలుకుల్లో కొంచం కాఠిన్యం వహించారు.
”మనుషులు లెక్కలేనన్ని తప్పులు, అధార్మికమైన పనులు చేసి వాటికి ప్రతిఫలం అనుభవించాల్సి వచ్చినప్పుడు ఇక్కడకు వస్తారు. వారు చేసిన తప్పులను మాత్రం తెలుసుకోరు. అందుకు నేనేమి చెయ్యగలను?” అని అన్నారు.
హఠాత్తుగా ఎందుకు మహాస్వామివారు ఇలా అంటున్నారో ఎవరికి అర్థం కావడంలేదు.
కొద్దిసేపటి తరువాత పరమాచార్య స్వామివారు మాట్లాడుతూ, “ఇతని పూర్వీకులు ధర్మాచరణకోసం, మంచిపనులు చెయ్యడం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అందుకోసం మంచి ఆదాయం వచ్చే భూమిని వదిలివెళ్ళారు. మంచినీటి బావులు తవ్వించడం కోసం, ధార్మికమైన పనులకోసం ఈ పని చేశారు. కాని ఇతను ఆ భూమిని అమ్మి వచ్చిన ధనాన్నంతా దాచుకున్నాడు” అని అన్నారు.
కిడ్నీ సమస్యతో వచ్చిన ఆ వ్యక్తి ఇదంతా విని తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. “ఇప్పటినుండి నేను కూడా మంచినీటి బావులు తవ్వించి ధార్మికమైన పనులు చేస్తాను. నన్ను మన్నించి అనుగ్రహించండి పెరియవ” అని వేడుకున్నాడు.
మహాస్వామివారు వెంటనే కరుణాసముద్రులై “వసంబు(వస) తెలుసా నీకు? మూలికలు అమ్మే దుకాణాల్లో దొరుకుతుంది. దాన్ని బాగా నూరి రోజూ కడుపుకింది భాగంలో పూయి” అని సెలవిచ్చారు.
పది పన్నెండు రోజుల తరువాత అతను మరలా వచ్చాడు. మహాస్వామివారు అడగక ముందే అతను స్వామివారితో, ”ఇప్పుడు ఏ బాధా లేదు” అని చెప్పాడు.
ధన్వంతరీ స్వరూపమైన ఆ సర్వేశ్వరుడే మందిచ్చిన తరువాత ఇంకా ఆ జబ్బు ఉంటుందా? అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం. శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం .
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment