భగవంతుడు - భక్తుడు
🌺🍀🌺🍀🌺🌺🍀
భగవంతుని గుర్తించి మనము స్వీకరిస్తే ఆయన ఉంటాడు, కనబడుతాడు...ఆయనను తిరస్కరిస్తే ఆయన ఉండడు, కాక కనబడడు కూడా హిరణ్యకశిపుడు హరి ఎక్కడా లేడన్నాడు, కనుక ఎక్కడా కనబడలేదు, అతనికి...అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు విశ్వసించాడు. కాబట్టి స్తంభము నుండి వెలిసి, ప్రహ్లాదుని విశ్వాసం సత్యమని నిరూపించాడు... అంతే కానీ, హిరణ్య కశిపుని సవాలు ఎదుర్కోవడం కోసమని స్తంభములో ప్రవేశించడం కాదు...
*ఆయన కర్తవ్యాలు మూడు...!!!*
- వేద రక్షణ,
- ధర్మ రక్షణ,
- భక్త రక్షణ...
నిశ్చలమైన విశ్వాసము, నిర్భయం, నిరహంకారం, సద్గుణం, ఇవి లేకుండా, ఆడంబరంగా పూజ చేస్తే, వ్యర్థమే... కాలము, శక్తీ, అన్నీ వృధా అవుతాయి... ఇలాంటి సందర్భంలో మనము పవిత్ర గ్రంధాల నుండీ, పురాణముల నుండి, ఉపనిషత్తులనుండి, ప్రసంగాల నుండీ మనము పొందుతున్న లాభమేమిటి?...
వీటి మూలంగా మనమైనా బాగు పడ్డామా? లేక చదివితేనే పుణ్యము వస్తుంది, అనుకొంటే మనకన్నా ముందు టేబురికార్డులకు, మన సెల్లులకు ముందుగా పుణ్యం వస్తుంది, అవి నిత్యం పటిస్తున్నాయి కాబట్టి...
భగవంతుని దర్శన భాగ్యం పొందిన మనము ఎంతవరకు పురోగమించాము? దర్శనమాత్రమునే పుణ్యము వస్తుంది, మోక్షానికి అర్హత వస్తుంది అనుకుంటే, మనకన్నా ముందు, నిత్యం ఆయన కోవెలలో ఉన్న చీమలకు, దోమలకు, కీటకాలకు వస్తుంది. ఎందుకనగా అవి నిత్యం ఆయనను అంటిపెట్టుకుని ఉంటున్నాయి కాబట్టి...
ఆయన దగ్గర నుంచి పారమార్థిక జీవిత రహస్యం , తెలుసుకున్న దానికి నిదర్శనంగా మన జీవన సరళిలో ఏదైనా మంచి మార్పు కన పడాలి.
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment