గౌరవం కథ
🌺🍀🌺🍀🌺🌺🍀20 ఏళ్ళ క్రితం Hyderabad Branchmanager గా Transfer అయ్యాక మా పాప పెళ్ళికి, మా office staff అందరిని ఆహ్వానించాను. వచ్చిన వాళ్లందరూ తలో కానుక ఇచ్చి ఆశీర్వదించి వెళ్లారు నవ వధూవరుల్ని
పెళ్లి హడావిడి అంతా తగ్గాక, తిరిగి office కి వెళ్ళాక మా office watchman వెంకట్రాముడుని పిలిపించి అడిగాను,వెంకట్రాముడు గారు,మీరు సతీసమేతంగా మా కూతురు పెళ్ళికి రావడం, ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. .కానీ కానుకగా మీరు ఇచ్చిన 10గ్రాముల బంగారు గొలుసు ఇవ్వడం మీకు తలకు మించిన భారం అవ్వలేదా? అసలు అంత విలువైన కానుక మీకు ఎందుకు ఇవ్వాలనిపించింది అని అడిగాను తాను కానుకగా ఇచ్చిన బంగారు గొలుసును తనకే తిరిగి ఇచ్చివేస్తూ…
కానీ వెంకట్రాముడు, నా చేతినుండి దూరంగా తన చేతిని తీసుకుంటూ, అయ్యా, కానుకను తిరిగి ఇచ్చి నన్ను అవమానపర్చొద్దు. నా ముప్పయి ఏళ్ళ service లో నన్ను “గారు” అని కానీ “మీరు” అని కానీ పిలిచిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్క మీరు తప్ప! !కానీ, పొద్దున్న మీరు office కి enter అయ్యేప్పుడు ప్రతీ రోజూ పలకరిస్తారు నన్ను Good morning వెంకట్రాముడు గారు, బాగున్నారా? అని .మీ పలకరింపు వినడానికే నేను ,మీకన్నా ముందే వచ్చి gate దగ్గర నిలబడుతాను. ..
మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు. కానీ, మా ఆత్మగౌరవం నిలబెట్టే మీలాంటి మర్యాదస్తులకోసం ప్రాణమైనా ఇచ్చేస్తాం సార్ .దయచేసి కాదనకండీ అంటూ దండం పెట్టి
కళ్ళనీళ్లతో వెళ్ళిపోయాడు.
ఒక మనిషికి గౌరవం ఇస్తే, ఇంత ప్రేమిస్తారా, అభిమానిస్తారా? అని నాలో నేను ఆలోచనలో పడ్డాను. అవును, నిజమే కదా, వేంకటరాముడు చెప్పింది .మనిషి వృత్తిని బట్టి కాదు, సాటి మనిషిని మనిషిగా గౌరవిస్తే చాలు. ప్రేమిస్తే చాలు ఖచ్చితంగా లక్షలరెట్ల ప్రేమ తిరిగి మన పైన వర్షిస్తారు. మీరుకూడా దయచేసి గౌరవించండి,
మనం సాటిమనిషిని ఎవరి నైనా గౌరవించాలి.గౌరవం హోదాని బట్టీ ఇచ్చేది కాదు అని నా ఉద్దేశ్యం.
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment