Friday, 22 March 2024

అసలైన ఆనందం మనలోనే ఉంది (23- Mar-24, Enlightenment Story)

 అసలైన ఆనందం మనలోనే ఉంది

🌺🍀🌺🍀🌺🌺🍀

బయటి ప్రపంచంలో ఎంత సాధించినా ఎన్ని సాధించినా మరుక్షణమే అవి పాతబడిపోయి సాధించినప్పుడు ఉన్న ఆనందం మరుక్షణమే కనుమరుగైపోతుంది. అంతలా మన చుట్టూ ఉండాల్సిన వాటికంటే ఎక్కువ ఉన్నాయి. అందుకోవాల్సిన వాటికంటే ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. ఫలితం వెంటనే మొహం మొత్తేస్తుంది.



ఇది సాధిస్తే నా జీవితం ధన్యం అనుకుని దానికోసం తీవ్రంగా శ్రమించి సాధిస్తే తీరా మరుక్షణమో లేక మరొకరోజో మరొక లక్ష్యం వచ్చి చేరుతుంది. ఇలా ఎన్నో లక్ష్యాలు ధన్యం అయినట్టే అనుకున్నవి. కాని ఎన్ని సాధించినా వాటి ఆనందం ఈరోజు ఉందా! ఉందా! అంటే లేదనే చెప్పాలి.

 *ఎందుకంటే అసలైన ఆనందం మనలోనే ఉంది. ఇది ఎలా తెలుసుకోవడం?*


ఏదైనా ఉంటేనే కనబడుతుంది. లేకపోతే లేదు. ఇదే కదా సూత్రం. అలానే నీలో ఉన్న భావతరంగాలు అంటే సంతోషం, దుఖం, ఆనందం, బాధ సుఖం, ఇవన్ని నీలోనే ఉన్నాయి. అవి సందర్భాన్ని బట్టి ప్రకటితమౌతున్నాయివస్తువే లేకపోతే తీసుకోవడానికి ఏమీ ఉండదు. ఈ భావాలు నీలో నిగూఢంగా ఉన్నాయి కనుక ఆయా సందర్భాలను బట్టి అవి వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా అనారోగ్యం వస్తే మందులు వేసి ఆరోగ్యం బాగుచేశామని చెప్తారు. నిజానికి ఆరోగ్యం ఉంది. మందు వేసింది అనారోగ్యానికే. వ్యాధి నయం చేశారు అంతే. ఆరోగ్యం చెడిపోవడం బాగుపడటం ఉండదు. శరీరానికి వ్యాధి వచ్చినప్పుడు ఔషదం ఇచ్చి వ్యాధి తగ్గిస్తారు.

నిజానికి ఆనందం నీలో ఉంది. కాకపోతే ప్రాపంచిక వ్యవహారాలతో మనస్సుని మలినం చేసుకొని ఆనందం అంటే ప్రపంచంలో ఫలానా సాధిస్తేనే దొరుకుతుంది అనే ఒక భ్రమలో పడిపోయారు. ప్రపంచంలో ఏమీ లేదు. ఉన్నదంతా నీలోనే ఉంది. ప్రపంచాన్ని చూసి ఇలా ఉంటే సుఖం, ఇలా ఉంటే దుఃఖం, ఇలా ఉంటే సంతోషం, ఇది సాధిస్తే ఫలానా అని లోనే కొలువై ఆనందానికి దూరంగా వెళ్ళిపోతున్నారు.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...