Wednesday, 6 March 2024

హైదరాబాద్ లోని A. S. R. Nagar (07-Mar-24, Enlightenment Story)

 మీరు ఈసారి హైదరాబాద్ లోని A. S. R. Nagar కు వెళితే......

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🍀🌺🌺🍀 

బహుశా 2000 వ సంవత్సరం అనుకొంటా, ఒక ముసలాయన హైదరాబాద్ సిటీ బస్సులో టికెట్ కొనుక్కొంటూ కండక్టర్ తో  " A.S.R నగర్ వస్తే చెప్పండి  " అన్నాడు. కాసేపయ్యాక బస్ ఆగితే ఆయన కండక్టర్ తో " ఇది ASR నగరేనా? " అని అడిగితే అపుడు కండక్టర్ విసుగ్గా " ఏమయ్యా, నీకు ASR నగర్ ఎక్కడుందో, ఎప్పుడొస్తుందో తెలియదా? " అన్నాడు.

అపుడు పక్క సీట్లో వున్న మరో వ్యక్తి కండక్టర్ తో  "ఆయనే A. S. R. గారు " అన్నపుడు  కండక్టర్ తో పాటు అది విన్న ఇతర ప్యాసెంజర్లు కూడా ఆశ్చర్యపోయారుట. అంత నిరాడంబరత A. S. Rao గారిది. అయ్యగారి సాంబశివరావు గారికి 1960 లో పద్మశ్రీ, 1974లో పద్మభూషణ్ అవార్డులు వెతుక్కొంటూ వచ్చాయి.



కానీ ఆయన కారు వాడేవాడు కాదు. 'ఎందుకండీ, ఇంకా చేతనౌతుంది, నడచి పోవచ్చు. చాలా దూరం అనుకోండి సిటీ బస్సులు వున్నాయి కదా! ' అనేవారు ఆయన.


ఎవరు ఈ A. S. Rao గారు?

1914 సెప్టెంబర్ 20 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్లు గ్రామం లో జన్మించిన రావు గారికి elementary మరియు middle school లో చదువుకోవడానికి డబ్బులు లేకపోతే ఆయన తల్లి, ఆమె పెళ్లప్పుడు అమ్మ నాన్న లు పెట్టిన ఒక చీరను పాతగుడ్డలు కొనుక్కొనేవారికి అమ్మి, ఆ డబ్బును రావుగారికి ఇచ్చిందట. ఎంతనో తెలుసా?2 రూపాయలు !

అప్పులు చేసి, పస్తులుండి చదువే ఆయుధంగా ముందుకు నడచి రావు గారు కాశీ లోని ప్రఖ్యాత Benaras Hindu University లో MSc physics చేరారు. హాస్టల్ సౌకర్యం దొరక్కపొతే, వాళ్ళను వీళ్ళను పావలా, అర్ధరూపాయ అడుక్కోంటూ 8 రూపాయలు అయితే దానితో రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసి MSc పూర్తీ చేసారు.

అపుడు అమెరికా (క్యాలిఫోర్నియా ) లోని Stanford University లో Masters చేయాలని రావు గారి కోరిక. పేదరికం వెక్కిరించింది. కానీ ఆయన ప్రతిభ ఎవరినో ఆకర్షించింది. ఎవరు వారు?  TATA సంస్థ  40 000 రూపాయలను ఆయనకు ఇచ్చి Stanford University కి పంపింది.

అక్కడ ఆయన మేధస్సుకు అమెరికన్ శాస్త్రవేత్తలు, ఇతర పరిశోధకులు ఎంత ఇంప్రెస్ అయ్యారంటే, Masters తరువాత వాళ్ళు "ఇండియా వెళ్ళకండి. ఇక్కడే ప్రొఫెసర్ గా వుంటూ మా వాళ్ళను గైడ్ చేయండి, " అని ఆయనకు నెలకు పెద్ద జీతం ఆఫర్ చేసారు. ఎంతనో తెలుసా?  1,50,000 రూపాయలు.

కానీ రావు గారు దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ, "క్షమించాలి. నేను నా మాతృదేశం ఋణం తీర్చుకోవాలి, నన్ను ఇక్కడికి పంపిన TATA సంస్థ కు నా సేవలు అందించాలి" అన్నారట. భారత్ తిరిగిచ్చాక టాటా వాళ్ళు Tata Institute of Fundamental Research (TIFR ) Mumbai లో ఉద్యోగం ఇచ్చారు. అపుడు ఆయన జీతం ఎంతనో తెలుసా?  300రూపాయలు! ఎక్కడ 1,50 000? ఎక్కడ 300?

ఈ కాలం లో అయితే ఆయన నిర్ణయాన్ని మనం పిచ్చి అంటాం. అవును మనకు డబ్బు పిచ్చి, పదవి పిచ్చి, ప్రతిష్ట పిచ్చి, సుఖాల పిచ్చి ! ఆయనకు దేశమంటే పిచ్చి, కర్తవ్యం అంటే పిచ్చి, కృతఙ్ఞత అంటే పిచ్చి, నైతిక విలువలంటే పిచ్చి!

ముంబై లో రావు గారి పరిశోధనలు ఏ స్థాయిలో వుండేవంటే, సాక్షాత్తూ Father of Indian Nuclear Programme అని పిలవబడిన Dr. Homi Zahangir Bhabha తానే స్వయంగా ముంబై వెళ్లి రావు గారిని అభినందించి వచ్చారట.

తరువాతి రోజుల్లో ఆయన ఎన్నో విభాగాల్లో దేశానికి, సైన్స్ టెక్నాలజీ రంగాల్లో సేవలు అందించి, హైదరాబాద్ లో Electronics Corporation of India Ltd (ECIL) ను కూడా స్థాపించారు.

2003 లో హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రి లో చేరినప్పుడు ఒక డాక్టర్ గారు ఆయనకు ఆక్సిజన్ మాస్క్, వెంటిలేటర్ అమరుస్తూ వున్నారు. ఆయనకు తెలుసు రావు గారు ఇక కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతారని. అపుడు రావు గారు డాక్టర్ ను దగ్గరికి పిలిచి "నాకు ట్రీట్మెంట్ ఇచ్చి నీవు పైకి లేచేటప్పుడు జాగ్రత్త, పైన వున్న మానిటర్ నీ తలకు తగిలే ప్రమాదముంది" అని అన్నారట.

చివరి శ్వాస వరకూ ఇతరుల కష్టం, ఇతరుల బాధ తనవిగా భావించే సున్నితత్వం, మానవత్వం వారిది.ఇవే కదా ఒక మనిషి character ను నిర్ణయించేది ! ఈసారి హైదరాబాద్ లోని ASR నగర్ వెళితే ఆ మహనీయుడిని గుర్తు చేసుకోండి.

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...