Tuesday, 12 March 2024

అన్నం విలువ (13-Mar-24, Enlightenment Story)

 *అన్నం విలువ*

☘️☘️🌼🌼🌼🌻☘️☘️

ఒక స్కూల్లో చిన్న పిల్లవాడు భోజన సమయంలో తన మిత్రులతో పాటు తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేవాడు. ఆ అబ్బాయి తాను తెచ్చుకున్న అన్నాన్ని ఒక్క మెతుకు కూడా క్రింద పడకుండా, పదార్థాలను వృధా చేయకుండా తినేవాడు. అతని స్నేహితుల్లో చాలా మంది ఇంటి నుండి తెచ్చుకున్న అన్నాన్ని సరిగ్గ తినకుండా, క్రింద పైన వేసుకుంటూ తినేవారు. మరికొందరైతే గొడవపడుతూ కోపంతో ఆహారాన్ని విసిరిపారేస్తుంటారు. కానీ ఈ అబ్బాయి మాత్రం ఒక్క మెతుకు కూడా పారేయకుండా తినేవాడు.

ఒకవేళ తాను తెచ్చుకున్న బాక్స్ కు ఎక్కడైనా రెండు మెతుకులు అతుక్కుని ఉన్నాకూడా వాటిని కూడా తినేవాడు. అది చూసి మిగతా పిల్లలు ఈ అబ్బాయిని ఎగతాళి చేసేవారు. " అరే! వీడొక తిండిపోతు రా! ఒక్కమెతుకుకూడా వదలకుండా తింటాడు"అని ఎగతాళి చేసినా ఈ అబ్బాయి పట్టించుకునేవాడు కాదు. ఈ అబ్బాయి స్నేహితుడు ఇవన్నీ రోజూ గమనిస్తూ ఉండేవాడు, ఒకరోజు తన మిత్రున్ని ఇలా అడిగాడు.

"నువ్వు ప్రతిరోజూ ఇలా నీవు తెచ్చుకున్న ఆహారాన్ని వృధా చేయకుండా ఇంత చక్కగా తింటున్నావు కదా!  మిగతావాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నా నీకు బాధ అనిపించదా? " దానికి ఈ అబ్బాయి ఇలా సమాధానం ఇచ్చాడు.


"ఏదో వారికి తెలియకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకేం బాధలేదు. ఇక నేను అలా తినడానికి కారణం చెప్పనా? అలా తినడం అన్నది. నా తల్లిదండ్రులకు నేను ఇచ్చే మర్యాదకు చిహ్నం.

అమ్మ ఉదయాన్నే లేచి నాకు ఇష్టమైన పదార్థాలను అడిగి వండి ప్రేమతో బాక్స్ లో పెట్టి పంపిస్తుంది,
వండటానికి కావలసిన వస్తువులను నాన్న ఎంతో కష్టపడి పనిచేసి ఆ సంపాదనతో సాయంత్రానికి తెస్తాడు. ఇద్దరి ప్రేమతో పాటు వారి కష్టంకూడా నా భోజనంలో ఉంది. అలాంటప్పుడు నేను ఒక్క మెతుకును వృధా చేసినా వారికి అగౌరవ పరచినట్లే!

అంతేకాదు ఒక రైతు తన చెమటను చిందించి పంటను పండిస్తాడు. అతన్ని కూడా నేను అవమానపరిచినట్లే కదా! అందుకే నేను ఎవరు  నవ్వుకున్నా ఒక్క మెతుకును కూడా వృధా చేయను

అంతేకాదు ఎంతోమందికి రెండుపూటలా కడుపునిండా అన్నం దొరకడం లేదు. నాకు దొరికింది.
నా తల్లిదండ్రుల పుణ్యమా అని, అమ్మ ఎప్పుడూ చెపుతుంది. ఆహారాన్ని వృధా చేయకూడదని "
అని చాలా చక్కగా చెప్పాడు.

ప్రతి ఉపాధ్యాయుడూ, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటివి చెప్పి వారిలో ఆలోచనా విధానంలో మార్పుతేవలసిన అవసరం ఎంతైనా ఉంది.

🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...