ఆస్తి - యజమాని
🌺🍀🌺🍀🌺🌺🍀
అతను చాలా పెద్ద ధనవంతుడు, కాని ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడు. అలాంటివాడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. తన కుడి చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని చాలా ఉద్వేగంగా మాట్లాడుతున్నాడు. “నాకు చాలా కాలంగా రక్తపోటు, చక్కర వ్యాధి ఉన్నాయి. ఇప్పుడు నాకు క్యాన్సర్ కూడా ఉంది అని తెలిసింది. చాలా బాధ అనుభవిస్తున్నాను. మహాస్వామి వారే ఏదైనా పరిహారం చూపాలి” అని వేడుకున్నాడు.మహాస్వామి వారు ”నేను చెప్పినట్టు చేస్తావా?” అని అడిగారు. ”ఖచ్చితంగా చేస్తాను” అని బదులిచ్చాడు. ”నీకు అది కొంచం కష్టం కావచ్చు” అని అన్నారు.
”పరవాలేదు. నాకు ఈ రోగాలనుండి విముక్తి లభిస్తే చాలు. పెరియవ ఏమి చెప్తే అది చేస్తాను. నాకు కావలసింది కేవలం ఈ రక్తపోటు, షుగర్, క్యాన్సర్ తగ్గితే చాలు” అని అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు.
మామూలుగా మహాస్వామి వారికి ఏ కారణము లేకనే అన్ని ప్రాణులయందు ఆపారమయిన దయ ఉంటుంది. ఇప్పుడు ఇతను బాధలో ఉన్నాడు. మరి స్వామి వారి వదిలేస్తారా?
అతనితో ఇలా అన్నారు, “బావిలో నీళ్ళు ఉంటాయి. కాని ఆ బావి ఎప్పుడు ఆ నీళ్ళు తనవి అని తాగదు”. చెట్లు పళ్ళు కాస్తాయి. కాని అవి ఎప్పుడు “ఇవి నా పళ్ళు నేను మాత్రమే తింటాను” అని అనవు. ఆవు పాలు ఇస్తుంది. కాని తన పాలు తాను ఎప్పుడూ తాగదు. ఎన్నో చెట్లు పాదులు కూరగాయలు ఇస్తాయి. కాని తమ్ అకోసం అని ఎప్పుడు దాచుకోవు.” నువ్వు చూసినట్లయితే ఎన్నో చెట్లు, ప్రాణులు ఇంత పరోపకారం చేస్తున్నాయి. మరి ఇంత విభూతి కలిగిన మనిషి ఎంత ఉపకారం చెయ్యాలి?
“నీ దగ్గర చాలా ధనం ఉంది. కాని నువ్వు దాన్ని నీకోసం కాని, ఇతరుల కోసం కాని ఖర్చు చెయ్యడంలేదు. ఎటువంటి ధర్మము(మంచి పనులు) చెయ్యడం లేదు. నీ పూర్వజన్మ పాపం నీకు ఇప్పుడు వ్యాధిగా వచ్చింది. నీవు ఆ పాపములనుండి బయటపడాలంటే మంచి పనులు చెయ్యడం ఒక్కటే దారి”
“ఇష్ట పూర్తం అనే ధర్మం గురించి ఎప్పుడైనా విన్నావా? ధనాన్ని బావులు తవ్వించడం, దేవాలయాల పునరుద్ధరణకు సహాయం చెయ్యడం , పేదలకు సహాయం చెయ్యడం, ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టడం వంటి మంచి పనులకోసం ఖర్చు పెట్టాలి. అంతే కాకుండా పేదవారికి అన్నథ పిల్లలకు మందులు కొనివ్వు, ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అడిగితే వారిని వట్టి చేతులతో పంపించవద్దు. ఇదంతా అర్థమైందా?” అని అడిగారు.
”నీ దగ్గరున్న ధనానికి నువ్వు కేవలం సంరక్షకుడివి మాత్రమే. దానికి యజమానివని నువ్వు ఎన్నటికి అనుకోకు” అని చెప్పారు.
ఇదంతా విని ఆ ధనవంతుడు భోరున విలపించాడు. ఎన్నో ధర్మకార్యాలను చేస్తూ చాలా కాలంపాటు సుఖంగా జీవించాడు.
తల్లి గర్భమునుండి ధనము దేడెవ్వడు, వెళ్ళిపోయెడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణ మన్న మెకాని, మెరుగు బంగారంబు మ్రింగబోడు, విత్తమార్జనజేసి విఱ్ఱవీగుటె కాని, కూడబెట్టిన సొమ్ము గుడువబోడు,
పొందుగా మఱుగైన భూమిలోపలబుట్టి దానధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగలకిత్తురో? దొరల కవునో? తేనె జుంటీ గ లియ్యవా తెరువరులకు? భూషాణవికాస! శ్రీధర్మపురనివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment