రక్త సంబంధం
🌺🍀🌺🍀🌺🌺
ఒకరోజు తమ్ముడు తన అక్కకు ఫోన్ చేసాడు.అక్కా నీ మరదల్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని.అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క వంటగది అంతా వెతికింది. వారికోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని, పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు.రెండే రెండు ఆరంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో రెండు గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది.
బెల్ మోగింది, తమ్ముడు వచ్చేసాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తమ్ముడు, మరదలు, మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది. అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది.వంట గదిలోకి వెళ్ళింది. రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని ఒక గ్లాసు లో నీళ్లు తెచ్చింది. మరదలు ముందు ఆమె తల్లి ముందు ఆరంజ్ జ్యూస్ ఉంచింది. తమ్ముడి ముందు మాత్రం నీళ్ళ గ్లాసు ఉంచింది. తమ్ముడికి 7up అంటే ఇష్టం అని చెబుతూ.*తమ్ముడి అది తాగి నిజం తెలుసుకున్నాడు.
తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి, చేతులు పట్టుకుని "అక్కా.! జాగ్రత్త. వంటగదిని శుభ్రంగా తుడిచేయి. లేదంటే చీమలు వచ్చేస్తాయి" అని చేతిలో కొంత డబ్బును చేతిలో పెట్టాడు. భార్యకు, అత్తగారికి కనిపించకుండా డబ్బులను, అక్కకు తెలియకుండా... కంటి నీరుని దాచుకుంటూ, అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ.*
ఇక నుంచి తరచూ పనుల మీద ఈ ఊరు రావలసి వస్తుంది. వచ్చినపుడల్లా నీ చేతి వంట రుచి చూడాల్సిందే అన్నాడు. భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ ఆలోచించుకుంటూ!*
సోదరులంటే ఇలా ఉండాలి కదా ! బంధం అనే కాదు, కష్టాల్లో ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సహాయం, ప్రయత్నం చేయాలి.
ఏదైనా విభేదాలు ఉన్నా మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపు కోవడంలో తప్పు లేదు. ఏమంటారు ?
ఇలాంటి ఆత్మీయతలను అనుబంధాలను నేడు మనం కోల్పోతున్నాం
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment