ప్రయత్నలోపం పనికిరాదు
🌺🍀🌺🍀🌺🌺🌺🍀🌺జీవితం అందరికీ పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎదురవుతుంటాయి.వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలిచేవారు విజేత అవుతారు. గెలుపు పిలుపు వినబడేవరకు పురుష ప్రయత్నం చేయాలి. ‘గెలుపు కోసం ఎన్ని సార్లు ప్రయత్నించినా గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోవద్దు ’అన్నారు స్వామి వివేకానంద.
కార్యసాధనలో మానవ ప్రయత్నం ముఖ్య పాత్ర పోషిస్తుంది. మానవ ప్రయత్నం లేనిదే దేవ సహాయం లభించదని,ఎంత బలంగా ప్రయత్నిస్తే అంతే బలంగా దైవానుకూలత ఉంటుందని తెలిపే ఒక కథ చదువుదాం.
ఒక రైతు బండి మీద సరుకులు వేసుకుని సంతకు వెళుతున్నాడు.దారిలో అతని బండి చక్రాలు బురదలో కూరుకుపోయాయి. అతడు నేల మీదకు దిగి బురద లోతుని అంచనా వేసాడు. ఒక్కడే ఆ బండిని బయటకు తీయడం సాధ్యం కాదని అనుకున్నాడు. కాసేపు ఆలోచిస్తే అతడికొక ఆలోచన వచ్చింది. అదేమిటంటే అతడి ఇష్టదైవమైన ఆంజనేయుడుని పిలిస్తే ఆయన వచ్చి సాయం చేస్తే బండిని ఆయనకున్న బలంతో సులువుగా ఒడ్డెక్కించవచ్చు అనుకున్నాడు.అలా అనుకున్నదే తడువుగా ఆంజనేయుడిని స్తోత్రం చేస్తూ బండిని బురద నుండి బయటకు లాగమని ప్రార్ధన చేసాడు రైతు. కానీ ఆంజనేయుడు కనికరించలేదు.
అయితే ఆ రైతు ఆంజనేయుడుకి మహా భక్తుడు. ఆయన మహిమలు చదివి ఉన్నాడు.అందుకే ఆయన వచ్చి సహాయం చేస్తాడన్న దృఢమైన విశ్వాసంతో పట్టు విడువకుండా చాలా సేపు స్తోత్రం చేసాడు .
ఆయనకు నమస్కరించి “స్వామీ! ఎంతగా నీ కోసం ప్రార్ధించానో తెలుసా? పోనీ ఇప్పటికైనా వచ్చావు. నా బండి బయటపడేందుకు సాయం చెయ్యు” అనడిగాడు రైతు .
“నీ ప్రయత్నం చేయకుండా దేవుడి మీద భారం వేసే నీలాంటి సోమరులకు సాయపడను. నీలా పనికి వెనకంజ వేసేవారికి సాయం చేస్తే ప్రపంచమంతా సోమరులతో నిండిపోతుంది. భగవత్ సాయం పొందాలంటే నీ వంతు ప్రయత్నం ముందుగా చేయాలి. అప్పుడే దైవ సహాయం లభిస్తుంది. నువ్వు బండిని బురదలో నుంచి బయటికి లాగే ప్రయత్నం చెయ్యకుండా నా కోసం ప్రార్ధించడం తప్పు. ముందుగా నువ్వు బురదలో దిగి నీ భుజాలను చక్రాలకు మోపి అవి బయటపడేలా శక్తి నుపయోగించు. ఆ ఎద్దులను కూడా బండి లాగమని ప్రోత్సహించు. అప్పుడే నీ ప్రయత్నానికి నా సాయం తోడవుతుంది. నీలో నా బలాన్ని ప్రవేశపెట్టి ఆ బండి కదిలిస్తాను” అన్నాడు ఆంజనేయుడు. ఆయన చెప్పినట్టే చేసాడు రైతు.
అప్పుడు బురద నుండి బండిని బయటకు రప్పించగలిగాడు రైతు.ఆంజనేయుడికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు రైతు.
సీతను రావణుడు ఎత్తుకు పోవడం చూసిన జటాయువు రావణుడితో యుద్ధం చేసాడు. రావణుడు మహాబలవంతుడని, ఎదిరించడం తన శక్తికి మించిన పని అని జటాయువుకి తెలుసు.అయినా రావణుడిని అడ్డగించాలన్న ప్రయత్నం మానలేదు. ఆ ప్రయత్నంలో జటాయువు మరణించాడు కానీ తగిన కీర్తి పొందాడు. రాముడి చేతుల మీదుగా అంత్యక్రియలు చేయించుకునే భాగ్యం కూడా దక్కింది.
అందుకే కార్యాలను తలపెట్టే వారు తమ వంతు ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో చేయాలి. ఎవరైతే గట్టి ప్రయత్నం చేస్తారో వారికి భగవంతుడి సాయం కూడా దొరుకుతుంది. చేయించేది భగవంతుడు. చేసేది మాత్రం మానవులే. అది గ్రహించి నిజ జీవితంలో ప్రయత్నం చేయాలి జనులు.
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment