విధి
🌺🍀🌺ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది. ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు.ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లి..!
మీరేంచేస్తారో నాకు తెలియదు నా చిలుకకు బ్రతికించండి. లేదంటే నేనూ చనిపోతాను" అని కన్నీరుపెట్టుకుంది..! దానికి ఇంద్రుడు.దీనికే ఇంత ఏడవడం ఎందుకు.!? అందరి తలరాతలు వ్రాసేది *బ్రహ్మ* కదా..! నేను వెళ్ళి ప్రార్ధిస్తాను.నువ్వేం దిగులు పడకు..!" అని *బ్రహ్మ* దగ్గరికి *ఇంద్రుడు* వెళ్ళాడు.
ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న *బ్రహ్మ* ..!నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను. దాన్ని అమలు పరిచేది *మహావిష్ణువు* ..! కావున మనం *విష్ణువు* దగ్గరికి వెళదాం పద.!" అంటూ బయలుదేరారు.
వీరిరాకను గమనించిన *విష్ణువు* వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు.
"నిజమే ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే..! కానీ..! చిలుక ప్రాణం చివరి దశలో ఉంది..! మళ్ళీ ఊపిరి పోయాలంటే *శివునికే* సాధ్యం..! మనం ముగ్గురం *శివుని* ప్రార్థిస్తాం పదండి..! " అన్నారు.
ముగ్గురూ *శివుని* దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. *శివుడు* ఇలా అన్నారు.
" ఆయుష్షు పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని *యమధర్మరాజు* కు అప్పచెప్పాను..! మనం వెళ్ళి *యమధర్మరాజు* ను అడుగుదాం పదండి..! " అంటూ అందరూ బయలుదేరారు.
*ఇంద్ర,బ్రహ్మ,విష్ణువు,శివుడు
"అయ్యో..! అదేమి పెద్ద పనికాదు. మాములుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను,వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకుమీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడ తీస్తాము. ఏ ఆకు రాలి క్రిందపడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు. పదండి వెళ్లి ఆ ఆకుని తొలగించి చిలుకకు కాపాడుదాం..! " అని అన్నాడు .
*యముడు* , అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది.ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసిందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం వ్రాసి ఉంది ఇలా..!
*ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది..!* అని వ్రాసి ఉంది.
ఇదే విధి..! విధిని ఎవ్వరూ మార్చలేరు. జీవించి ఉన్నప్పుడే ఇతరులమీద ప్రేమను చూపండి. ద్వేషించకండి. మన సహాయాన్ని ఇతరులకు అందివ్వడం నేర్చుకుందాం..!
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment